– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకున్న కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థు లకు కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. తీర్థయాత్రలు చేస్తారు.  గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు.  వ్యాపారాలు సంతృప్తికరంగా ఉండిలాభాలు ఆర్జి స్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రచయితలు, కళాకారులకు నూతన అవకాశాలు. 4,5 తేదీల్లో బంధువులతో వివాదాలు. అనారోగ్యం. విష్ణుధ్యానం చేయండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

నూతన వ్యక్తుల పరిచయాలు.  ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వారితో ఉత్తరప్రత్యుత్తరాలు.  నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వాహనయోగం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహ వంతంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలు, క్రీడా కారులకు ఆకస్మిక విదేశీయానం. 7,8 తేదీల్లో ఖర్చులు. ఇంటాబయటా ఒత్తిళ్లు. నృసింహస్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

పనులలో పురోగతి కనిపిస్తుంది.  మీ సేవలతో గుర్తింపు పొందుతారు. నిరుద్యోగులకు భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహన సౌఖ్యం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు.  వైద్యులు, రాజకీయవర్గాలకు శుభసందేశాలు, విదేశీయానం. 9,10 తేదీల్లో ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థికంగా మరింత అభివృద్ధి కనిపిస్తుంది. మిత్రులతో విభేదాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. గృహ, వాహన యోగాలు.వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రచయితలు, వైద్యులకు ఆహ్వానాలు అందుతాయి. 5,6 తేదీల్లో అనుకోని ధనవ్యయం. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. దుర్గాస్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

కార్యక్రమాలలో ఊహించని విజయాలు.  ఆస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి.  ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. నూతన ఉద్యోగాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు ఉండవచ్చు. సాంకేతిక నిపుణులు, రాజకీయవర్గాలకు విజయాలు వరిస్తాయి.4,5తేదీల్లో ఆరోగ్యసమస్యలు. మిత్రులతో విభేదాలు. గణేశో స్తోత్రాలు పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ఈతిబాధలు తొలగుతాయి. రచయితలు, క్రీడాకారుల ఆశయాలు నెరవేరతాయి. 8.9 తేదీల్లో శ్రమాధిక్యం. బంధు వర్గంతో మాటపట్టింపులు. అనారోగ్యం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

కార్యక్రమాలలో అవాంతరాలు. కష్టిస్తే గానీ ఫలితం కనిపించదు.  ఆస్తి వివాదాలు నెలకొని ఇబ్బందిపడతారు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపా రాలలో కొద్దిపాటి ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొంత గందరగోళం. రాజకీయవర్గాలకు, వైద్యులకు ఒత్తిడులు ••. 7.8 తేదీల్లో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. గణేశాష్టకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తితో ఉత్సాహంగా గడుపు తారు. స్థిరాస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించు కుంటారు.వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. కళాకారులకు సన్మానాలు. రచయితలు, వైద్యుల యత్నాలు సఫలం. 9,10 తేదీల్లో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఒక ఆహ్వానం సంతోషం కలిగి స్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగు తాయి. 6,7తేదీల్లో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. లక్ష్మీస్తుతి మంచిది.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ఇంటాబయటా ఎదురులేని పరిస్థితి ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మా ణాలలో అవాంతరాలు తొలగుతాయి.ఆధ్యాత్మిక కార్య క్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆటు పోటు. ఉద్యోగాలలో హోదాలు దక్కే అవకాశం.  రాజకీయ, పారిశ్రామిక వేత్తలకు కొత్త ఆశలు చిగు రిస్తాయి. 9,10 తేదీల్లో వ్యయ ప్రయాసలు. ఆరోగ్య భంగం. శ్రమతప్పదు. ఆదిత్యహృదయం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

పలుకుబడి మరింత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. . నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబసభ్యుల చేయూతతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. రచయితలు, కళా కారులకు మరింత ఉత్సాహం. 7,8 తేదీల్లో మిత్రు లతో విభేదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆంజనేయ దండకం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సమయానికి పూర్తి చేస్తారు.జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది.  విద్యా, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు ఆర్జిస్తారు.  క్రీడాకారులు, వైద్యుల సేవలు విస్తృతమవుతాయి. 4,5 తేదీల్లో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. అంగారక స్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE