ఫిబ్రవరి 15 సంత్‌ ‌సేవాలాల్‌ ‌జయంతి

బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ శ్రీ ‌సేవాలాల్‌ ‌మహరాజ్‌ను హిందూ ధర్మం ఉన్నతిని తెలియచెప్పడానికి జన్మించిన మహానీయుడిగా భావిస్తారు. ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. ధర్మ ప్రచారం, మత మార్పిడుల నివారణ, క్షేత్ర ధర్మ సంరక్షణ కోసం జీవితాంతం కృషి చేశారు. భారదేశ చరిత్రలో 18వ శతాబ్దం ఎంతో క్లిష్టమైనది. గొప్పగొప్ప రాజులు అంతరించారు. మరాఠాలు శక్తివంతులవుతున్నారు. మరోవైపు బ్రిటిష్‌వారు (ఈస్ట్ ఇం‌డియా కంపెనీ) భారత్‌ను తమ అధీనంలోకి తీసుకునే పని మొదలుపెట్టారు. మిషనరీలు క్రైస్తవ మతప్రచారం ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో సేవాలాల్‌ ‌మహరాజ్‌ అవతరించారు. క్రైస్తవీకరణ సాగుతున్న సమయంలో బంజారాలలో హిందూ చైతన్యాన్ని పెంపొందించారు. భక్తిని ప్రేరేపిస్తూ, అది ఆయుధంగా సంస్కరణలు చేపట్టి, సమాజాన్ని సంఘటితపరిచారు. రాబోయే పరిణామాలను ముందుగా పసిగట్టి జాతిని మేల్కొలిపారు.

అనంతపూర్‌ ‌జిల్లా రాంజీనాయక్‌ ‌తండాలో భీమా నాయక్‌, ‌ధర్మిణి భాయి దంపతులకు 1739 ఫిబ్రవరి 15న జన్మించిన సేవాలాల్‌కు చిన్నతనం నుంచే సేవాగుణం ఉండేది. ఆవులు కాయడానికి వెళ్లేటప్పుడు తల్లి కట్ట ఇచ్చిన సద్దిని తాను తినకుండా ఆకలితో ఉన్నవాళ్లకు పెట్టి, తాను బంకమట్టితో రొట్టెలు చేసుకొని తినేవాడు. ఈ వింత ప్రవర్తన తల్లితండ్రులకు, తండాలోని జనాలకు ఆశ్చర్యం కలిగించేది. జాతర్ల సమయంలో జంతుబలిని వ్యతిరేకించారు. ‘ఒకవేళ అమ్మవారికి బలి ఇష్టమైతే నేనే బలై పోతాను’ అని సేవాలాల్‌ అమ్మవారి కాళ్ల దగ్గర తన తలను ఉంచి, ‘నా రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు వరాలు ఇవ్వు’అని ప్రార్థించాడు. కరుణించిన అమ్మవారు, ‘నిజమైన భక్తుడు సమాజానికి సేవకుడు. అతని నాయకత్వంలో ప్రయాణించండి’ అని జగదాంబ ఆశీర్వదించింది. అప్పటి నుంచి జగదాంబనే గురువుగా స్వీకరించాడు.

మహరాజ్‌ ‌మహిమలు

సంత్‌ ‌సేవాలాల్‌ ‌మహరాజ్‌ అద్భుత మహిమలపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పురుషుడిని స్త్రీగా మార్చడం, ఒక ముంత బియ్యంతో పదివేల మందికి భోజనాలు పెట్టడం, చనిపోయిన వ్యక్తిని మూడు దినాల తరువాత బతికించడం, విషం కలిపిన తీపి వంటకాలను నిర్వీర్యం చేయడం. ఉదృతంగా పారే ప్రవాహాన్ని ఆపి తమ తండా ప్రజలను, ఆవులను దాటించడం. వంటివి అందులో కొన్ని. సేవాలాల్‌ను ఆటపట్టించి, అపకీర్తి తీసుకురావాలని జాదూగర్‌ ‌వడితియా ఒక పురుషుడికి ఆడవేషం వేసి తీసుకువచ్చి సంతానం ప్రసాదించాలని కోరతాడు. సేవాలాల్‌ ‘‌త•థాస్తు’అని దీవించడంతో ఆ పురుషుడు నిజంగానే స్త్రీగా మారిపోతాడు.

దర్బారులోనికి ప్రవేశించడానికి  ప్రవేశ మార్గంలో చిన్న తలుపును ఏర్పాటు చేయగా సేవాలాల్‌ ‌తన ఆకారాన్ని కుదించుకుని తలవంచకుండానే ఆ దర్వాజాలో నుండి ప్రవేశిస్తాడు. అలాగే సేవాలాల్‌ ‌బావిలో దిగి సన్నని నూలు పోగు ఆధారంతో పైకి వచ్చి తన భక్తిని నిరూపించారు.

అన్ని విద్యలను నేర్చుకొని బంజారాల సేవలో నిమగ్నమయ్యాడు. ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. వీరిలో ‘పెరిఫర్‌’ ఒకటి. ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులు అరికట్టడం, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం మొదలైనవి ముఖ్యమైనవి. హింస మహా పాపమని, మద్యం , ధూమపానం శాపమని హితవు పలికాడు. అహింస సిద్ధాంతానికి పునాది వేశాడు. అప్పట్లో హైదరాబాదులో మశూచి వ్యాధి ప్రబలినా, సంత్‌ ‌సేవాలాల్‌ ఉన్న బంజారా హిల్స్ ‌ప్రాంతానికి మాత్రం ఆ వ్యాధి సోకలేదు. ఆయన మహిమను గుర్తించిన రాజు, సేవాలాల్‌ ఆశీస్సులతో ఆ వ్యాధిని నిర్మూలించాడని చరిత్ర తెలుపుతోంది.

బంజారా గిరిజనుల గొప్పతనం

బంజారా సమాజ్‌ ‌నిత్యం రామనామాన్ని స్మరిస్తుంది. ‘నమస్తే, హలో’ బదులుగా ‘రామ్‌ ‌రామ్‌’ అని పలకరించుకుంటారు. బంజారాలు ఫృద్వీరాజ్‌ ‌చవాన్‌, ‌రాణా ప్రతాప్‌ ‌సింగ్‌ ‌వంశస్థులని, వీరూ రాజపుత్రుల్లాంటి వారని కల్నల్‌ ‌టాడ్‌ అనే చరిత్ర కారుడు పేర్కొన్నారు.

 లంబాడీలు, బంజారాలు, సుగాలీలు, గ్వార్‌ ‌భాయ్‌ అని వ్యవహారంలో ఉన్న ఈ గిరిజనులు ప్రపంచవ్యాప్తంగా గోర్‌ ‌బంజారాలుగా పేరుపొందారు. మధ్య యుగంలో మహమ్మద్‌ ‌ఘోరీకి వ్యతిరేకంగా పృథ్వీరాజ్‌ ‌చౌహాన్‌ ‌పక్షాన పోరాడిన వీరోచిత చరిత్ర బంజారాల సొంతం. దక్కన్‌ ‌పీఠభూమిలో లంబాడీలు కాకతీయుల కంటే ముందే ఉన్నారని, సంచార జాతివారైనా వీరు రజాకార్లతో పోరాడారని, నవాబులు వారి ధైర్యసాహసాలకు మెచ్చి భూములను ఇనాములుగా ఇచ్చారని చరిత్ర చెబుతోంది. బంజారాలు ఎవరికీ హాని తలపెట్టేవారు కాదని, సహాయ గుణం విరివిగా కలవారని, ధైర్యసాహసాలకు ప్రతీకలనీ చరిత్ర ద్వారా తెలుస్తుంది.

అయితే కొన్ని దశాబ్దాలుగా బంజారా జాతి వివక్షను చవి చూస్తున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బంజారా సమాజాన్ని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ముందుకు తీసికెళ్ల డానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

దేశంలో దాదాపు 14 కోట్ల మంది బంజారా సమాజం మాట్లాడే ‘‘గోర్‌ ‌బోలి’’ భాషను రాజ్యాం గంలో 8వ షెడ్యూల్‌లో చేర్చాలన్న మూడు దశాబ్దాల విన్నపాలు నరేంద్రమోదీ నాయకత్వంలో ఫలవంతం కాలగలదని బంజారాలు నమ్ముతున్నారు.

-గుగులోతు వెంకన్న నాయక్‌

‌బీజేపీ రాష్ట్ర నాయకులు

About Author

By editor

Twitter
Instagram