– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ఆదాయం గందరగోళంగా ఉన్నా అవసరా లకు లోటు రాదు. ఆరోగ్యం కొంత మెరుగుపడు తుంది. విద్యార్థులకు శ్రమకు ఫలితం కనిపిస్తుంది. ఆస్తి వివాదాలను ఎట్టకేలకు పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.  రచయితలు, క్రీడాకారులకు శుభవార్తలు. 1, 2 తేదీల్లో అనుకోని ఖర్చులు. కుటుంబసభ్యులతో విభేదాలు. మేధా దక్షిణామూర్తి స్తోతాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక• రుణాలు తీరే సమయం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు స్నేహితులుగా మారి చేయూతనిస్తారు.  వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగాలలో ఒడుదొడుకులు తొలగుతాయి. కళాకారులు, పరిశోధకుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. 3,4 తేదీల్లో బంధువిరోధాలు. ఆస్తి వివాదాలు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

చేపట్టిన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. బాల్య స్నేహితులనుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆదాయం మరింత మెరుగుపడుతుంది. ఆస్తుల కొనుగోలులో అవాంతరాలు అధిగమిస్తారు. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. రచయితల ఆశలు ఫలిస్తాయి. 5,6 తేదీల్లో అనుకోని ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఆదాయవ్యయాలు సమానంగా ఉంటాయి. రుణ దాతలు ఒత్తిడులు తప్పకపోవచ్చు.  నిరుద్యోగుల యత్నాలలో కొన్ని ఆటంకాలు. ధార్మిక కార్యక్రమా లలో పాల్గొంటారు.  ఆరోగ్య సమస్యలతో కొంత ఇబ్బందిపడతారు. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కొత్త సమస్యలు. కళాకారులు, పరిశోధకుల ఆశలు ఫలిస్తాయి. 6,7 తేదీల్లో ఆకస్మిక ధనలబ్ధి. వాహనయోగం. శుభ వార్తలు. ఆంజనేయ దండకం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

రాబడి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. మీ సమర్థతను చాటుకునేందుకు తగిన సమయం. నూతన ఉద్యోగావకాశాలు లభించవచ్చు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. రచయితలు, క్రీడాకారులు ప్రతిభ చాటుకుంటారు. 4,5 తేదీలలో స్నేహితులతో అకారణ విరోధాలు. మానసిక ఆందోళన. శ్రీ సూర్యాష్టకం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

అనుకున్న కార్యక్రమాలు సకాలంలో చక్కదిద్దు తారు. ఆదాయం సమకూర్చుకోవడంలో గందర గోళం తొలగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. క్రీడాకారులు, పరిశోధకులకు ఒత్తిడులు తొలగుతాయి. 1,2 తేదీలలో ఆరోగ్య సమస్యలు. మానసిక అశాంతి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఆదాయం నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారుల శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగులకు విధుల్లో వివాదాలు, తొలగుతాయి. రాజకీయవేత్తలకు మరింత అనుకూల సమయం. 4,5 తేదీల్లో ఖర్చులు. ఇంట్లో ఒత్తిడులు. అనారోగ్యం. ఆదిత్య హృదయం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసేవరకూ విశ్రమించరు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఆదాయానికి ఇబ్బందులు తొలగు తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు మరింత అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామిక వేత్తలకు అనుకోని శుభవార్తలు. పరిశోధకులు, కళాకారులకు మంచి గుర్తింపు. 4,5 తేదీల్లో మానసిక అశాంతి. మహాలక్ష్మీ అష్టకమ్‌ ‌పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

పట్టుదలతో అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విదేశీ అవకాశాలు దక్కవచ్చు. కోర్టు వివాదాలు కొన్ని పరిష్కారమవుతాయి. వ్యాపా రస్తులకు లాభాలు. రచయితలు, పారిశ్రామికవేత్తలకు లక్ష్యాలు నెరవేరతాయి. 1,2తేదీల్లో ఆరోగ్య సమస్యలు. కష్టానికి ఫలితం ఉండదు. బంధువర్గంతో విరోధాలు. నృసింహస్తోత్రం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

 ముఖ్యమైన కార్యక్రమాలు దిగ్విజయంగా సాగు తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.  వివాహయత్నాలు కలసివస్తాయి. గృహ నిర్మాణ యత్నాలలో ముందడు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు. కళాకారులు, రచయితలకు ఆహ్వానాలు అందుతాయి. 2, 3 తేదీల్లో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. గణేశాష్టకం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం.  భూ వివాదాలు క్రమేపీ తొలగుతాయి. కొత్త కాంట్రా క్టులు దక్కుతాయి. ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారులకు విస్తరణ యత్నాలు సఫలం.  కళా కారుల•, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు శుభ వార్తలు. 4,5 తేదీల్లో కుటుంబంలో కొన్ని సమస్యలు. దూరప్రయాణాలు. రాఘవేంద్రస్తుతి మంచిది.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కొత్త కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు  పరిష్కారం. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. నిరు ద్యోగుల ఆశలు ఫలిస్తాయి. వ్యాపారులకు లాభాలు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు, వైద్యులకు అన్ని విధాలా కలసివచ్చే కాలం. 6,7తేదీల్లో వృథాఖర్చులు. ఆప్తులతో విభేదాలు. లలితాదేవి స్తుతి పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram