1857 నాటి మొదటి స్వాతంత్య్రోద్యమాన్ని బ్రిటిషు ప్రభుత్వం దారుణంగా అణిచివేసింది. ఆ ఉద్యమాన్ని రాచరికానికి సవాలుగా భావించింది. దాంతో ఈస్ట్ ఇం‌డియా కంపెనీ నుంచి ఇండియాను స్వాధీనం చేసుకుంటూ ఆగస్టు 2, 1858న ఓ చట్టాన్ని తెచ్చింది. ఇక పాలన అంతా మహారాణి పేరున సాగుతుందని ప్రకటించింది. ఇది ఆయా ప్రాంతాల్లో ఉన్న యువరాజులకు ఆగ్రహం కలిగిస్తుందని భయపడి వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే క్వీన్‌ ‌విక్టోరియా నవంబరు1, 1858న సుదీర్ఘ ప్రకటన చేశారు. ‘‘స్థానిక ప్రభువుల హక్కులను, గుర్తింపును, గౌరవాన్ని కాపాడతాం. ఇతరుల అధీనంలో ఉన్న భారత భూభాగాలను ఆక్రమించుకునే ఉద్దేశం మాకు లేదు’’ అని పేర్కొన్నారు. తప్పు చేసే అలవాటు ఉన్న వ్యక్తి హఠాత్తుగా పట్టుబడినప్పుడు, మళ్లీ అలాంటి పనిచేయనని ఎలా ప్రాధేయపడతారో అలాగే ఈ ప్రకటన సాగుతుంది.

మరోసారి 1857 పునరావృతం కావటం ఆంగ్లేయులకు ఇష్టం లేదు. ఇలాంటి స్థితి ఎదురు కాకుండా భారతీయులను దువ్వటం మొదలు పెట్టారు. తమ ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చు కోవటానికి భారతీయులకు ఓ దారి చూపించాలని భావించారు. ఇదే ఇండియా నేషనల్‌ ‌కాంగ్రెస్‌ ఆవిర్భావానికి దారితీసింది. స్వయంగా బ్రిటిషర్ల ప్రోద్బలంతో వారి మార్గదర్శకత్వంలోనే అది సాగింది.

కాంగ్రెస్‌ ‌తొలి అధ్యక్షుడు డబ్ల్యు సీ బెనర్జీ మాటల్లో చెప్పాలంటే, ‘‘చాలా మందికి ఈ విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇండియన్‌ ‌నేషనల్‌ ‌కాంగ్రెస్‌కు మొట్టమొదట పునాది పడింది .. మార్వ్కిస్‌ ఆఫ్‌ ‌డఫరిన్‌ అం‌డ్‌ అవా భారతదేశ గవర్నర్‌ ‌జనరల్‌గా ఉన్నప్పుడు. 1885 తొలిరోజుల్లో అలెన్‌ ‌రిటైర్డు ఐసీఎస్‌ అధికారి ఆక్టావియన్‌ ‌హ్యూమ్‌ ‌సిమ్లాలో డఫరిన్‌ను కలిశాడు. బ్రిటన్‌లో రాచరి కానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం ఎలాంటి పనులు చేపడుతుందో అదే విధంగా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించటానికి ఇండియన్‌ ‌నేషనల్‌ ‌కాంగ్రెస్‌ను ప్రారంభించమని ఈ సందర్భంగా డఫరిన్‌ ఆయనకు సూచించాడు’’. అదే సమయంలో కాంగ్రెస్‌కు సంబంధించినంత వరకూ తన వ్యూహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టవద్దని డఫరిన్‌ ‌సూచించాడని బెనర్జీ చెప్పుకొచ్చారు. ఈ లక్ష్యాలకు అనుగుణంగానే కాంగ్రెస్‌ ‌ప్రారంభమై పనిచేయటం ప్రారంభమైంది. రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంలో 1886లో దాదాభాయ్‌ ‌నౌరోజి అధ్యక్షోపన్యాసం చేస్తూ ‘‘మనం ఈ రకంగా కలవటానికి వీలయ్యే ప్రభుత్వ పాలనలో ఉండటం చాలా అదృష్టం. క్వీన్‌ ‌నాగరిక పాలన, ఇంగ్లండ్‌ ‌ప్రజల చలవ వల్లనే మనం ఏ ఆటంకాలు లేకుండా ఇక్కడ కలవగలుగుతున్నాం, ఎలాంటి భయాలు, సందేహాలు లేకుండా స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగు తున్నాం’’ అని ప్రకటించారు. ‘‘ఈ సందర్భంగా నాలో రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్‌ ‌రాజద్రోహం, తిరుగుబాటు కోసం ఏర్పాటు చేసిన శిశువిద్యాలయమా? (కాదు కాదు అని సభికుల అరుపులు)లేదా ఆ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునాది రాయినా (అవును.. అవును)… ఈ రెండింటిలో ఏదో ఒకటి అయ్యుంటుంది. దీనికి సమాధానం మీరు చెప్పేశారు. కాబట్టి కాంగ్రెస్‌ ‌పేరుతో ప్రభుత్వం మనకు అందించిన వరాలను అందుకుని దాని ప్రకారం పనిచేద్దాం’’ అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ ‌విధివిధానాలను ఎ.ఒ. హ్యూమ్‌, ఏ‌ప్రిల్‌ 30, 1888‌లో ప్రకటించారు. అన్ని తారతమ్యాలను వ్యత్యాసాలను విడిచి భారతదేశ ప్రజలంతా ఒకే జాతిగా మసలటం, మానసిక, నైతిక, సామాజిక, రాజకీయ కోణాల్లో ప్రజలంతా పునరుజ్జీవం పొందటం, ఇంగ్లండు, భారత ప్రభుత్వం మధ్య ఏకీకరణ సాగటం.. అంటూ కాంగ్రెస్‌కు మూడు లక్ష్యాలను నిర్దేశించారు. అలాగే కాంగ్రెస్‌ ఏ ‌రీతిగా తన కార్యకలాపాలను నిర్వహించాలో కూడా నిర్దేశించారు. దేశంలో ప్రజలందరికీ ప్రాథమికమైన రాజకీయ అవగాహన కలిగేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించటం తద్వారా బ్రిటిషర్ల పాలనలో తాము ప్రయోజనాలు పొందుతున్నామని, ప్రభుత్వానికి తాము రుణపడాలన్న భావన పెంపొందించటం, ప్రశాంతమైన ఆ పాలన కొనసాగితే దేశం సుసంపన్నం అవుతుందన్న అభిప్రా యాన్ని బలపరచటం అని సూచించారు.

హ్యూమ్‌ ‌ద్వారా కాంగ్రెస్‌ను ప్రారంభించిన బ్రిటిషర్లు అదే విధానాన్ని అడుగడుగునా కొనసాగిస్తూ వచ్చారు. నవంబరు 1888లో తన ప్రసంగం మినిట్స్‌లో డఫరిన్‌ ‌కాంగ్రెస్‌ ‌వ్యక్తిత్వం గురించి వివరించారు. ‘‘కాంగ్రెస్‌ అనేది ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా గానీ యూరోపియన్‌ ‌విద్యావిధానం, యూరోపియన్‌ ‌రాజకీయ దృక్పథం, యూరోపియన్‌ ‌సాహిత్యంతో మమేకమై రూపొందిన పదార్థం. అందులో భారతీయ సమాజంలో సంపన్న కుటుంబా లకు చెందిన వారు లేరు. జనాభాలో సానుభూతి కలిగేంతగా వాళ్లకు ఎక్కువమందితో సాన్నిహిత్యం లేదు’’.

కాంగ్రెస్‌కు బ్రిటిష్‌ ‌నిధులు

కాంగ్రెస్‌ ‌కార్యకలాపాల నిర్వహణకు ఆంగ్లేయులు నిధులు అందించేవారు. ఐసీఎస్‌ అధికారి సి.డబ్ల్యు బోల్టన్‌, ‌బెంగాల్‌ ‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో రాసిన లేఖలో ఈ నిధుల ప్రస్తావన చేశారు. ‘‘లండన్‌లోని బ్రిటిష్‌ ‌కమిటీ కలకత్తా స్టాండింగ్‌ ‌కమిటీ నుంచి ఏటా రూ. 8వేల చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. జనరల్‌ ‌సెక్రటరీ ఎ.ఒ.హ్యూమ్‌ ‌నుంచి లేఖ అందినా పైసా రాలేదు. 1897లో బేరార్‌ ‌సదస్సులో ఒక స్మారక స్తూపం నిర్మాణం నిమిత్తం వెయ్యి పౌండ్లు వసూలు చేయాలని, అందులో 500 పౌండ్లు బెంగాల్లోనే పోగు చేయాలని నిర్ణయించారు. అది కూడా వీలు పడలేదు. జాతీయ నిధి నుంచి కాంగ్రెస్‌ ఏటా ఇచ్చే రూ.500లు కూడా గత మూడేళ్లలో ఇవ్వలేదు.

గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షుడయిన సందర్భంగా, డిసెంబరు25, 1905లో కాంగ్రెస్‌ ‌సిద్ధాంతాల గురించి చెబుతూ, ‘‘మనం ఏ రకంగా ముందుకెళ్లినా అది రాచరికం పరిధిలో ఉండాలి’’ అని పేర్కొన్నారు.

కాలగమనంలో, బాలగంగాధర తిలక్‌ ‌వంటి జాతీయవాదులు ప్రవేశించి, స్వతంత్ర, స్వదేశీ నినాదాలను ప్రవేశపెట్టి విదేశీవస్తువులను బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు. దాంతో గోఖలే వెంటనే రంగంలో దిగారు. ‘బహిష్కరణ’ అన్నమాటకు ప్రతికూ•ర్ధం వస్తోందని చెప్పి దాన్ని తొలగించాలని సూచించారు.

కాంగ్రెస్‌ ‌ప్రతి కదలికపైనా బ్రిటిష్‌ ‌ప్రభుత్వం దృష్టి పెట్టేది. అది బ్రిటన్‌ ‌ప్రతిపక్షం.. హౌస్‌ ఆఫ్‌ ‌కామన్స్ ‌వలె వ్యవహరించకుండా తన పరిధిని అతిక్రమించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకునేది. కొత్తగా ఎంపికయ్యే అధ్యక్షులు తమ కనుసన్నల్లో నడుచుకునేటట్టు చూసేది. తమకు నచ్చని వారు వచ్చినప్పుడు వాళ్లను పదవీచ్యుతుల్ని చేయటానికి సిద్ధమయ్యేది. కాంగ్రెస్‌లో తిలక్‌ ఎదిగినప్పుడు వెంటనే బ్రిటిష్‌ ‌స్పందించింది. దీనిపై మింటో నవంబరు 4, 1906లో జాన్‌ ‌మోర్లేకు లేఖ రాశారు. ‘‘తిలక్‌ ‌గానీ అతని వర్గం గానీ కాంగ్రెస్‌లో పట్టు సాధిస్తే బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి చాలా కష్టం. గోఖలే లేఖలను చూడండి. తనెంత నిజాయతీతో ఉంటు న్నాడో? భారతదేశంలో మన పాలన గొప్పతనాన్ని ఘనంగా చాటుతున్నాడు. తమ దేశంలో పౌరుల బలహీనతనూ చెబుతున్నాడు’’. నవంబరు4, 1906లో రాసిన లేఖలో మోర్లేకు మింటో ఇంకో హెచ్చరిక కూడా చేశారు. ‘‘ వాళ్ల విజయం అంటే బ్రిటిషు యంత్రాంగం మాయంకావటం, మరుసటి రోజు నుంచి వినాశనాన్ని కొని తెచ్చుకోవటమే’’. బ్రిటిష్‌ ఈ ‌రకమైన వ్యూహాలతో గోఖలే ద్వారా తిలక్‌ను అడ్డుకోవటానికి ప్రయత్నించి, 1907లో సూరత్‌లో కాంగ్రెస్‌ ‌చీలికకు కారణమైంది.

బి.జి. తిలక్‌, ఎం.‌కె.గాంధీ, ఎన్‌.ఎస్‌.‌సి.బోస్‌ ‌వంటి వ్యక్తులు కాంగ్రెస్‌కు ఖ్యాతి సంపాదించి పెట్టారు. దాన్ని ప్రజా ఉద్యమంగా మలిచారు. దానిని నెహ్రూ లాంటి వ్యక్తులు హైజాక్‌ ‌చేసి ఆంగ్లీకరించారు. తాము ఎక్కువ కాలం భారత్‌లో ఉండలేమని బ్రిటిషర్లకు తెలుసు. అందుకే వీలయినంత వరకూ లూటీ చేయటానికి ప్రయత్నించారు. వీలయినంతగా ఎదగటానికి, అదే సమయంలో ప్రశాంతంగా బయటకు రావటానికి కాంగ్రెస్‌ను ఒక మార్గంగా ఎంచుకున్నారు.

తన మోసపూరిత ఎత్తుగడలకు బ్రిటిషర్లు ఇండియన్‌ ‌నేషనల్‌ ‌కాంగ్రెస్‌కు కృతజ్ఞత చూపారు. అందులో భాగంగానే ముక్కలు చేసిన భారత్‌ను వాళ్లకు బహుమతిగా ఇచ్చారు. బ్రిటిష్‌ ‌ప్రధాని సి.ఆర్‌.అట్లీ, జులై10, 1947న, ఇండియన్‌ ఇం‌డిపెండెన్స్ ‌బిల్లును ప్రవేశపెడుతూ గొప్పగా ఓ మాట చెప్పారు. ‘‘ఎప్పుడూ అంతగా పట్టించుకోని ఓ విషయాన్ని గురించి ఇక్కడ చెప్పదలుచు కున్నాను. బ్రిటిషు దురాక్రమణ నుంచి విముక్తికి భారత్‌ ‌కట్టుబడినట్టే, ఇండియన్‌ ‌నేషనల్‌ ‌కాంగ్రెస్‌ అనేది మన జాతి ప్రేరణతో స్థాపించబడింది, ప్రేరణ పొందింది’’.

ఇండియన్‌ ‌నేషనల్‌ ‌కాంగ్రెస్‌ ‌పుట్టుక, దాని జన్యువుల గురించిన వివరాలివి. ఇలాంటి పార్టీకి సోనియా అధ్యక్షురాలు కావటం ఆశ్చర్యం కలిగించదు. ఒక విత్తనం నాటితో మరోరకం చెట్టు మొలకెత్తటం సాధ్యం కాదు. ఇది దాని ఆత్మకు దగ్గరగా ఉండే పరిణామం అని చెప్పక తప్పదు.

-ఎం.సుందరరామిరెడ్డి

(న్యాయవాది)

అను: డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు

About Author

By editor

Twitter
Instagram