– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

పనులు విజయవంతంగా సాగుతాయి. విద్యార్థులకు ఉన్నత శ్రేణి విజయాలు.వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు పొందుతారు. రాజకీయవేత్తలకు మరింత ప్రోత్సాహం. రచయితలు, క్రీడాకారుల యత్నాలు సఫలం. 23,24 తేదీల్లో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. మిత్రులతో కలహాలు. విష్ణ్యుధ్యానం చేయండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. నిరుద్యోగులు ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు  క్రమేపీ పుంజుకుంటాయి. వైద్యులు, సాంకేతికవర్గాలకు అనుకూల సమయం. 22,23 తేదీల్లో బంధువిరోధాలు. అనారోగ్యం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ఉత్సాహంగా పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. రచయితలు, వైద్యులకు విశేష గౌరవం.  18,19 తేదీల్లో ఆరోగ్యభంగం. బంధువిరోధాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

మరింత ఉత్సాహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి.  విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. కళాకారులకు నూతనోత్సాహం. క్రీడాకారులు,  సాంకేతిక నిపుణులకు వివాదాలు తీరతాయి. 19,20 తేదీల్లో మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ముఖ్యమైన పనులు సజావుగా సాగి ఊరట చెందుతారు.  ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలు కొంత నిదానిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు అధిగమిస్తారు. రాజకీయవేత్తలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వైద్యులు, వ్యవసాయదారులకు కొత్త ఆశలు. 21,22 తేదీలలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ధనవ్యయం. శివాష్టకం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

కొత్త పనులకు శ్రీకారం చుడతారు.విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. క్రీడాకారులు, వైద్యులకు ఉత్సాహం పెరుగుతుంది. 22,23 తేదీలలో ఆరోగ్య,కుటుంబసమస్యలు. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

పనులు దిగ్విజయంగా పూర్తి కాగలవు. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది.సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు.  విద్యార్థుల కృషి మంచి ఫలితాలు ఇస్తుంది. ఇంటి నిర్మాణాలు లేదా కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. 18,19 తేదీల్లో చికాకులు. మానసిక అశాంతి. అనారోగ్యం. గణేశ్స్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

 బాకీలు వసూలై ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు.నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి.  వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు పొందుతారు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వైద్యులు, సాంకేతిక నిపుణులకు అనుకోని అవకాశాలు. 18,19 తేదీల్లో వృథా ఖర్చులు. అనారోగ్యం. శ్రమాధిక్యం. గాయత్రీ ధ్యానం చేయండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  పోటీపరీక్షల్లో నిరుద్యోగులు విజయం స్యాధిస్తారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. నేర్పుగా కొన్ని వ్యవహారాలు చక్కదిద్దుతారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు పొందుతారు. కళారంగం వారికి మరిన్ని అవకాశాలు దక్కుతాయి.20,21 తేదీల్లో వ్యయప్రయాసలు. అనారోగ్య సూచనలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడవచ్చు. మీ నిర్ణయాలు తరచూ మార్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఆస్తుల వ్యవహారాలలో వివాదాలు నెలకొంటాయి.  అనారోగ్య సూచనలు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. వ్యవసాయరంగం వారికి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. 21,22 తేదీల్లో శుభవార్తా శ్రవణం. ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. దేవీస్తుతి మంచిది.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

వీరికి అన్ని విధాలుగా అనుకూల సమయం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.   వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో చిక్కుల నుంచి బయటపడతారు. రాజకీయవేత్తలకు మరింత ఊరట లభిస్తుంది.  23,24 తేదీల్లో ఆరోగ్య, కుటుంబసమస్యలు. బంధువిరోధాలు. దేవీఖడ్గమాల పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగుపడతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది.  గృహ, వాహనయోగాలు కలిగే అవకాశాలు. ప్రముఖులు పరిచయమవుతారు.  వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళాకారులు, రచయితలకు అవకాశాలు మరింత పెరుగుతాయి. 19,20 తేదీల్లో ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE