ప్లానింగ్‌, డిజైన్‌, క్వాలిటీ కంట్రోల్‌, ఆపరేషన్‌ మెయింటినెన్స్‌ విషయాలలో వైఫల్యం మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడానికి కారణమని ఆనకట్టల రక్షణ జాతీయ ఆధారిటీ నివేదికలో వెల్లడిరచినట్టు మీడియా ఘోషిస్తున్నది. ఈ పరిణామం ఇంత ప్రజాధనం వృథా కావడానికీ, ఇంత విపత్తుకీ కారణమైనప్పటికీ కేంద్రం కోరిన వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం మరొక కోణం.  మేడిగడ్డ బ్యారేజీ లేదా ఆనకట్ట భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరం. ఆనకట్ట పునర్నిర్మాణమే పరిష్కారమన్న వాదన కూడా వినిపిస్తున్నది. దీని  గురించి వెదిరె శ్రీరామ్‌ (జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు, భారత ప్రభుత్వం) జాగృతి పాఠకులకు వివరిస్తున్నారు.

ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు కింద నిర్మించిన ఆనకట్టల విషయం హఠాత్తుగా తెర మీదకు వచ్చింది. ఆ అంశాల గురించి కొంచెం వివరిస్తారా?

తెలంగాణలో కాళేశ్వరం వద్ద గోదావరిపై నిర్మించిన బహుళార్థ సాధక నీటిపారుదల ప్రాజెక్టు`కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లేదా కేఎల్‌ఐపీ. దాదాపు 500 కిమీల దూరం విస్తరించి, 13 జిల్లాలలో 1,800 కిమీల నీటి కాలువల నెట్‌వర్క్‌ను ఉపయోగించే ఈ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించారు. కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు మొత్తం నిర్మాణ వ్యయం రూ.1,07,190.46 కోట్లు (దీని పునః అంచనా రూ.1.3 లక్షల కోట్లు). వడ్డీల చెల్లింపులు సహా వార్షిక నిర్వహణ వ్యయం సుమారు రూ.13,923 కోట్లు. ఈ ప్రాజెక్టుతో, నూతన ఆయకట్టు కింద దాదాపు 18.3 లక్షల ఎకరాలకు నీటి పారుదల సౌకర్యాన్ని, ఉపయోగంలో ఉన్న మరొక 18.7 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని యోచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 3 ఆనకట్టలు ఉన్నాయి. ఒకటి మేడిగడ్డ ఆనకట్ట. దీని నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీ (శతకోటి ఘనపుటడుగులు). రెండోది అన్నారం, దీని సామర్ధ్యం 10.87 టీఎంసీ. మరొకటి సుందిళ్ల, దీని సామర్థ్యం 8.83 టీఎంసీ. ఇప్పుడు వివాదంలో నిజానికి ప్రమాదంలో పడిన లక్ష్మీ ఆనకట్ట లేదా మేడిగడ్డ ఆనకట్ట జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో, మహదేవపూర్‌ మండలంలో ఉంది. 2019`20లో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది అంతర్భాగం. ప్రాణహిత సంగమానికి 22 కిమీల దిగువన గోదావరి నదిపై 85 బేలను (68 స్పిల్‌వే బేలు, 17 కాలువలు లేదా తూములు) కలిగి ఉంది. నీ ఆనకట్ట పొడవు 1625 మీ. వెడల్పు (కాంక్రీట్‌ బల్లకట్టు) 110 మీ. వెడల్పు (యాప్రాన్లతో) 259 మీ. బిలాల (వెంట్‌) సంఖ్య (గేట్లు) 85 (8 బ్లాకులలో).

ఇప్పుడు తెలంగాణ ప్రజలను కలవరపరుస్తున్న పరిణామం ఏమిటి?

21.10.2023న మేడిగడ్డ లక్ష్మీ ఆనకట్ట కింద గేట్ల నుంచి పెద్ద శబ్దం వినిపించింది. ఆరుస్తంభాలు కొన్ని అంగుళాల మేర భూమిలోకి దిగిపోయాయి. అందరినీ దిగ్భాంతికి గురి చేస్తూ 7వ బ్లాకు వద్ద 20వ నెంబర్‌ వారథి స్తంభంలో పెద్ద పగులు కనిపించింది. ఆనకట్టలో ఉండే నీటిమట్టం 16 టీఎంసీలు కాగా, ఘటన జరిగిన సమయంలో 10 టీఎంసీలు ఉంది. దీనిని గమనించిన వెంటనే, అధికారులు నిల్వ ఉంచిన 10 టీఎంసీల నీటిని ఆనకట్టకు గల 85 గేట్ల ద్వారా దిగువన ఉన్న హెచ్‌ఒ కేంద్రాలు/ ప్రాజెక్టులకు వదిలారు. నీటిపారుదల, తాగునీటి కోసం నిల్వ చేసిన ఆ 10 టీఎంసీల నీటిని దిగువన నివసిస్తున్న ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా హఠాత్తుగా విడుదల చేశారు. ఇది ప్రాజెక్టు ప్రయోజనాన్ని ప్రశ్నార్థకం చేసింది.

ఎవరు ఏమన్నా, ఈ పరిణామం పెద్దగా చర్చ నీయాంశం కాకుండా జాగ్రత్త పడ్డారని అనిపిస్తుంది. కేంద్రం స్పందన ఏమిటి?

భారత జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే జాతీయ ఆనకట్ట భద్రతా అథారిటీ వెంటనే స్పందించింది. ఆనకట్ట భద్రతా చట్టం 2021లోని షెడ్యూలు రెండో పేరా,8 ప్రకారం మేడిగడ్డ ఆనకట్ట స్తంభాలు కుంగడానికి కారణాలను పరిశీలించేందుకు ఆరుగురు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ, తెలంగాణ నీటిపారుదల, సీఏడీ విభాగం ఇంజినీర్‌ ` ఇన్‌ ` చీఫ్‌ (ఇఎన్‌సి` జనరల్‌)తో 23 అక్టోబర్‌న హైదరాబాదులో చర్చలు జరిపింది. మరునాడే, 24 అక్టోబర్‌న ఆనకట్టను తనిఖీ చేసింది. ఆనకట్ట పరిధిలోని భాగ్వాములతో మరొక దఫా చర్చలు నిర్వహించింది. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధిం చిన సర్వే, ప్రణాళిక, నమూనా, నిర్వహణ లకు సంబంధించిన సమాచారాన్ని, వివిధ డేటాను అక్టోబర్‌ 29, 2023 నాటికి సమర్పించవలసిందిగా నిపుణుల కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గడువు ముగిసిన తర్వాత, రాష్ట్రం తమకు అందించిన పత్రాలన్నింటినీ ఆనకట్ట భద్రతా కమిటీ విశ్లేషించి, నివేదికను తయారు చేసి నవంబర్‌2, 2023 నాటికి దానిని రాష్ట్రానికి పంపారు.

నివేదిక ఏం చెప్పింది?

ఇది పెద్ద నివేదిక. ఈ పరిణామాన్ని పరిశీలిం చేందుకు నిపుణుల కమిటీ 20 అంశాల జాబితా కోరింది. కానీ తెలంగాణ నీటిపారుదల, సీఏడీ విభాగం కేవలం 11 అంశాలకు సంబంధించిన వివరాలనే అందచేసింది. వారి నుంచి సాధారణ నిర్మాణ వివరాలు, రుతుపవనాల ముందు, రుతుపవనాల తర్వాత చేసిన తనిఖీల నివేదికలు, పూర్తి చేసిన నివేదికలు, నాణ్యత నియంత్రణ నివేదికలు, గేట్ల పరిస్థితి సహా అనేక ఇతర ఇన్‌పుట్లను కోరగా, జాబితాలో కొన్నింటిని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అందించడమే కాకుండా, కమిటీకి ఇన్‌పుట్లను నిరాకరించి ఆనకట్ట భదత్రా చట్టం 2021లోని అంశాలను ఉల్లంఘించింది.

స్తంభాల కుంగుబాటుకు ప్రాథమిక కారణం ఆనకట్ట తెప్ప (రాఫ్ట్‌)ను స్థిరీకరించడంలో వైఫల్యం ఉంది. ఈ స్తంభాలు అస్థిరమై, కదిలి, పగుళ్లు విచ్చాయి. ప్రాజెక్టు ప్రణాళిక, రూకల్పనలోనూ లోపాలు ఉన్నాయి. ఈ ఆనకట్టను తేలియాడే నిర్మాణంగా రూపకల్పన చేశారు కానీ, దృఢమైన దానిగా నిర్మించారు. ఆనకట్ట యజమానులు దీనిని 2019`20లో ప్రారంభించిన తర్వాత సిమెంట్‌ కాంక్రీట్‌ బ్లాకులు లేదా ఆప్రాన్ల ప్రారంభాన్ని తనిఖీ లేదా నిర్వహించడం చేయలేదు. ఆనకట్ట యాజ మాన్య ఈ నిర్వహణా లోపమే క్రమంగా ఆనకట్టను బలహీనం చేసి, అది విఫలమయ్యేందుకు దారి తీసింది. ఇది కార్యాచరణ, నిర్వహణలో ముఖ్యమైన లోపం. ఇప్పుడు కమిటీ ఆనకట్టను పూర్తిగా మరమ్మతు చేసే వరకు నిరుపయోగమైనదిగా పరిగణిస్తున్నది. దెబ్బతిన్న బ్లాకును నిర్మాణాత్మకంగా పునరుద్ధరించాలి. ఎందుకంటే, ఇతర బ్లాకులు కూడా ఈ విధంగానే విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే, ఇది మొత్తం బ్యారేజీని మరమ్మతు చేయవలసిన అవసరాన్ని గుర్తుచేస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వాయర్‌ను నింపడం ఆనకట్టకు హానికలిగిస్తుంది. అన్నారం, సుందిళ్ల కూడా ఇటువంటి నమూనాలు, నిర్మాణ పద్ధతులు ఉండటం వల్ల అవి కూడా ఈ విధంగా విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిని సూచిస్తూ అన్నారం ఆనకట్ట దిగువన సంకేతాలు ఉరకలేస్తున్నట్టు కనిపిస్తున్నది. కనుక ఈ ఆనకట్టలలో కూడా బలహీనపడడం, ఇతర సమస్యలను సూచిస్తున్న సంకేతాల కోసం తక్షణమే పరీక్షించాలి.

ఈ స్థాయి ఆనకట్ట భద్రతకు తీసుకోవలసిన చర్యల గురించి అసలు చట్టాలు ఏం చెబుతున్నాయి?

ఆనకట్ట పరిరక్షణ చట్టంలోని సెక్షన్‌ 31 ప్రకారం ` డ్యామ్‌ నిర్మాణకర్త ప్రతి ఏడాది దాని పరిరక్షణ యూనిట్‌ ద్వారా రుతుపవనాల ముందు, తర్వాత ఇటువంటి ప్రతి డ్యామ్‌ను తనిఖీ చేయాలి. ఇది ఇక్కడా వర్తిస్తుంది. వరదలు వచ్చినప్పుడు, తర్వాత, భూకంపాలు లేదా ఏదైనా ప్రకృతి లేక మానవ తప్పిదాలు జరిగినప్పుడు, ఆనకట్టలో ఏదైనా సమస్యాత్మక లేక అసాధారణ లక్షణం కనిపిస్తోందేమో పరీక్షించాలి. వరదలు వచ్చి కాళేశ్వరం దగ్గర అంత నష్టం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదనే చెప్పాలి. అన్నివేళలా ఆనకట్ట నిజ పరిస్థితిని నిర్ధారించేందుకు రుతుపవనాల ముందు, తర్వాత తనిఖీ చేయడం ప్రతి యజమానిపైన ఉన్న తప్పనిసరి బాధ్యత అయినప్పటికీ, 2019 నుంచి సాధారణ నిర్వహణలో భాగంగా ఎటువంటి తనిఖీ చేయలేదు, నాణ్యతా నియంత్రణ నివేదికలను నిర్వహించడం లేదా, గేట్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడం కూడా జరుగలేదు.

అంటే నిర్మాణం సమయంలోను, నిర్వహణలోను కూడా లోపాలు ఉన్నాయనే అనుకవాలి!

ప్రణాళిక, నమూనా, నిర్మాణం, ఆనకట్ట నిర్మాణంలోని కార్యాచరణ దశల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయని 01.11. 2023న ఇచ్చిన ఎన్‌డి ఎస్‌ఎ తనిఖీ నివేదిక నిర్దిష్టంగా చూపింది. ఇవే తప్పులను నిర్వహణ దశలో కూడా చేయడం వల్ల ఈ ఘటన సంభవించింది. ఈ నిర్దిష్ట ఆనకట్టల కోసం ఒకే రకమైన నమూనా పద్ధతిని, సాంకేతికతను అనుసరించడం వల్ల, ఇప్పటికి ఇతర రెండు ఆనకట్టలలోని ఆందోళనకరమైన సమస్యలపై నివేదించడం వల్ల, భారీ మొత్తంలో నిల్వ చేసిన నీటిని వృధాగా వదిలివేశారు. కనుక, ఈ నీటి పారుదల ప్రాజెక్టు అసలు లక్ష్యం నెరవేరడం లేదు. దానిని ఫలవంతంగా, ప్రయోజనకరంగా మార్చేందుకు తప్పులను సరిదిద్దు కోవలసిన అవసరం ఉంది.

About Author

By editor

Twitter
Instagram