– కె. మురళీకృష్ణం రాజు

‘ఏకాత్మతా మానవదర్శనం’ దీనదయాళ్‌ ఉపాధ్యాయ చేతులలో రూపుదిద్దుకున్నది. 1965వ సంవత్సరంలో విజయవాడలో జరిగిన భారతీయ జనసంఘ్‌ ‌మహాసభలలో దీనిని లాంఛనంగా ఆమోదించారు. అంతటి ఉత్కృష్టమైన భావనను అలనాడు ఆమోదించిన విజయవాడలోనే ఏకాత్మ మానవదర్శనానికి సంబంధించిన రచనలను 15 గ్రంథాలుగా ప్రచురించి ఆవిష్కరించడం ఒక చారిత్రక ఘట్టం. దుర్గమ్మ తల్లి వేంచేసిన నగరం బెజవాడలో దీనదయాళ్‌ ‌పర్యటించారు. ఇలాంటి నేపథ్యం ఉన్నది కాబట్టే ఆ పుస్తకాల ఆవిష్కరణను ఒక విశేష సందర్భంగా చెప్పుకోవాలి.

తుమ్మలపల్లివారి కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా పుస్తకావిష్కరణ సభ జరిగింది. విశిష్ట అతిథి•గా హాజరైన తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ, రీసెర్చ్ అం‌డ్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌ఫౌండేషన్‌ ‌ఫర్‌ ఇం‌టిగ్రల్‌ ‌హ్యూమనిజం కార్య క్రమంలో పాల్గొనే అవకాశం తనకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ (గతంలో జనసంఘ్‌) ‌తత్వవేత్త, సిద్ధాంతకర్త దీనదయాళ్‌జీ 107వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించే కార్యక్రమంలో తనను భాగస్వామురాలిని చేసినందుకు ఆమె నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంకలనాలు డాక్టర్‌ ‌మహేశ్‌ ‌చంద్ర శర్మ సంపాదకత్వంలో రూపుదిద్దుకున్నాయి. దీనదయాళ్‌ ఉపాధ్యాయ ప్రతిభను కొనియాడుతూ, ఆ పుస్తకాలను స్పృశించడాన్నే అదృష్టంగా భావిస్తున్నానని తమిళిసై అన్నారు. ఉపాధ్యాయను ఒక మేధావిగా, తత్వవేత్తగా, దూరదృష్టి గల రాజకీయ నాయకుడిగా సమాజం పరిగణించింద న్నారు.

 తాను రాజకీయాల్లోకి రాకముందు, వైద్య వృత్తిలో ఉన్నప్పుడు, నలుగురు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌స్వయం సేవకుల నుంచి ఓ రోగికి అవసరమైన రక్తాన్ని ఎలా సేకరించారో, ఆ సమయంలో వారు ప్రదర్శించిన నిరాడంబరతలను ఆమె వివరించారు. తాము చేసిన పనికి క్రెడిట్‌ ‌తీసుకునేందుకు వారు నిరాకరించారని, ఇది తనను ఆకట్టుకుందని తమిళిసై ప్రస్తుతించారు.

తన తండ్రి, ఇతర సన్నిహితులు కాంగ్రెస్‌ ‌పార్టీ నుండి ఎన్నికైన పదవులలో ఉన్నప్పటికీ, తాను మాత్రం ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తల నిస్వార్థ సేవ నుంచి ప్రేరణ పొందానని, ముఖ్యంగా ఉపాధ్యాయ రచనలు చదివిన తర్వాత, బీజేపీలో చేరాలని నిర్ణయించు కున్నానని తెలంగాణ గవర్నర్‌ ‌తన అనుభవాలను వివరించారు.

సనాతన ధర్మం సారాంశాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. పాశ్చాత్య సంస్కృతి, సైన్స్ ‌రెండు వేర్వేరు విషయాలు. మనం కొన్ని పాశ్చాత్య భావనలను స్వీకరించవచ్చు. కానీ పాశ్చాత్య సంస్కృతిని కాదన్నారు. మనం ఆధునీకరణను స్వాగతించవచ్చు, కానీ పాశ్చాత్యీకరణను కాదు అని ఆమె ఉద్ఘాటించారు. మన దేశం అన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తూ, త్వరలో 5 ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని ఆమె వివరించారు. దీనదయాళ్‌ ఉపాధ్యాయ దార్శనికతే దిక్సూచిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వల్లే ఇదంతా సాధ్యమైందని ఆమె అన్నారు.

ఇతర దేశాల నుంచి వేటిని స్వీకరించాలి, ఏది అనుసరించకూడదు అనే విషయంలో మన యువత జాగ్రత్తగా ఉండాలని ఆమె హితవు పలికారు.

కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ పివిఎన్‌ ‌మాధవ్‌ అధ్యక్షత వహించారు. మాధవ్‌ అతిథులను , సభికులకు పరిచయం చేశారు. రీసెర్చ్ అం‌డ్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌ఫౌండేషన్‌ ‌ఫర్‌ ఇం‌టిగ్రల్‌ ‌హ్యూమనిజం ట్రస్ట్ ‌ఛైర్మన్‌ ‌మహేశ్‌ ‌చంద్ర శర్మ మాట్లాడుతూ, పాశ్చాత్య భావజాలం, వ్యక్తివాదం అంటే ఏమిటి అనేదే ప్రశ్న? అన్నారు. పాశ్చాత్య భావజాలంలో మతం అన్నది కేంద్రీకృతమైంది. వారికి మతం వేరు, ధర్మం వేరు అని చెప్పారాయన. భారతదేశంలో ధర్మమే ప్రధానం. అంటే అది మానవతావాదపు సమగ్ర పరిధిని చెబుతుందని గుర్తు చేశారు.

పాశ్చాత్యదేశాలు వ్యక్తి కేంద్రితమైన భావజాలాన్ని కలిగి ఉండడంతో, వారి ఇజంలో సమాజానికి ప్రాధాన్యం శూన్యం. మన ధర్మమంత విశాల పరిధి, దృక్పథం వాటికి లేకపోవడం, అన్యుల ఆరాధనా పద్ధతులను, జీవన విధానాలను స్వీకరించే ఔదార్యం పాశ్చాత్య మతాలలో లేకపోవడం వల్లనే లౌకికవాదం అనే భావన పుట్టుకువచ్చింది. అలాగే, మార్క్సిజం, సోషలిజం వంటి భావనలు కూడా అని డాక్టర్‌ ‌శర్మ వివరించారు. భారతీయులు బ్రిటిష్‌ ‌పాలన నుండి విముక్తి పొందినా, సోషలిజం, వ్యక్తివాదం వంటి భావనలు పట్టుకునే ఇంకా ఎందుకు వేళ్లాడుతున్నామో ఆలోచించాలని ఆయన కోరారు. ఏ భావజాలంలో లేని ప్రత్యేకత భారతీయతలో ఉంది, అది శాశ్వతమైనదని చెప్పారు.

ముఖ్యఅతిధిగా పాల్గొన్న సహ క్షేత్ర ప్రచారక్‌ ‌భరత్‌జీ ప్రసంగిస్తూ, పండిట్‌ ‌దీనదయాళ్‌జీ జీవితం విశేషాలను సవివరంగా చెప్పారు. దీనదయాళ్‌ ఉపాధ్యాయ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని చెప్పారు. బిర్లా పిలిచి ఉద్యోగం ఇచ్చినా వద్దని, దేశ సేవకే ప్రాధాన్యం ఇచ్చారు. సమాజ సేవ చేయడానికి ఆయన తీసుకున్న నిర్ణయం అసామాన్యంగా పరిగణించాలని అన్నారు.

26 యేళ్ల వయసులో భరతమాతకు తన జీవితం అంకితం చేశారని, జన సంఘ్‌ను ముందుకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించారని భరత్‌జీ చెప్పారు. ఆయనకు రాజకీయం అంటే ఆసక్తి లేదు, పదవిపై వ్యామోహం లేదు. ఇచ్చిన పని పూర్తి చేయడమే ఆయనకు తెలిసిన విద్య అని భరత్‌జీ వివరించారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే రచనా వ్యాసంగాన్ని చేపట్టారని, అత్యంత సాధారణమైన జీవితం గడిపారని కొనియాడారు.

శ్యామాప్రసాద్‌ ‌ముఖర్జీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారన్నారు. మానవతే జీవన విధానంగా జీవించిన దీనదయాళ్‌ ఉపాధ్యాయ ఏకాత్మతా మానవ దర్శనంను ప్రతిపాదించారని చెప్పారు. ప్రకృతిలో మనిషి అంతర్భాగం అనే భారతీయ జీవన పద్ధతిని ఆయన రచనలు గుర్తు చేస్తాయన్నారు. మనిషితో సత్సంబంధాలు కొనసాగిస్తూ లక్ష్యం సాధించారు. మన సంస్కృతి, మనిషి వికాసం వల్లే అభివృద్ధి సాధ్యం అని దీనదయాళ్‌ ఉపాధ్యాయ అభిప్రాయపడేవారు. 750 కోట్ల ప్రపంచ జనాభాను కలుపుకుని వసుధైక కుటుంబం అని చెప్పగలిగే ఏకైక దేశం భారతదేశం. దేశంతో పాటు, ప్రపంచ శ్రేయస్సును కాంక్షిస్తూ అందరూ ముందుకు సాగాలి అని భరత్‌ ‌పిలుపునిచ్చారు.

ఆంధప్రదేశ్‌ ‌బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ భావాలు ఈ సంకలనాల రూపంలో మళ్లీ మన ముందుకు వచ్చాయని, ఆయన ఆలోచనల గొప్పదనం ఏమిటో ఈ పుస్తకాలు అవగాహన కల్పిస్తాయన్నారు. నేటితరం ఈ పుస్తకాలు చదవాలని హితవు పలికారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి కాబట్టి ఎన్నో సంఘటనలు తట్టుకుని నిలబడ్డారు. భారతీయ ముద్దు బిడ్డగా ఆయన్ను మనం గుర్తుంచుకోవాలి. మేధావి దీనదయాళ్‌ ఉపాధ్యాయ వంటి మహనీయుల ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఇచ్చే నివాళి అని అన్నారు. దీనదయాళ్‌ ఉపాధ్యాయ గొప్పతనం, ఆయన మార్గ నిర్దేశం గురించి అందరూ తెలుసుకోవాలని, మహేష్‌ ‌చంద్ర శర్మ ద్వారా దీనదయాళ్‌ ఉపాధ్యాయ ఆలోచనలు మనం తెలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.

మణిపూర్‌ ‌రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సురేష్‌ ‌బాబు, పారిశ్రామికవేత్త, విశ్వహిందూ పరిషత్‌ ‌జాతీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు తదితరులు ప్రసంగించారు. మువ్వల సుబ్బయ్య, చిగురుపాటి నరేష్‌, అడ్డూరి శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram