విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా రంగంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందింది. విద్యుత్‌పైనే అన్ని వర్గాలు ఆధారపడి ఉన్నాయి. అందువల్ల డిమాండ్‌ ‌మేరకు విద్యుత్‌ను సరఫరా చేయవలసి ఉండగా రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్ల నాలుగు నెలల్లో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, భవిష్యత్‌ ‌డిమాండ్‌లపై చొరవ, ఆసక్తి చూపలేదు. పైగా నిర్ల్యక్ష ధోరణి కనబరచింది. ఉన్న థర్మల్‌ ‌ప్లాంట్లలో ఉత్పత్తిని పరిమితం చేసి, బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ను అధిక ధరలకు కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజల నెత్తిన వేసి వసూలు చేస్తోంది. అధిక ఛార్జీల భారం మోస్తున్నా విద్యుత్‌ ‌పూర్తి స్థ్ధాయిలో లభిస్తుందా?అంటే రోజుకు నాలుగైదు గంటల విద్యుత్‌ ‌కోతతో ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు వర్షాలు పడక బోర్లపైనే ఆధారపడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర రైతులు విద్యుత్‌ అ‌ప్రకటిత కోతలతో పైరును కాపాడు కోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు. ఉమ్మడి రాయలసీమ జిల్లాల్లో వరి, వేరుశనగ పైర్లు ఎండి పోతున్నాయి. ఇక ఆక్వా రైతుల పరిస్థితి మరింత దీనంగా తయారైంది. ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్‌ ‌రాయితీలు ఇవ్వకపోగా ఈ కోతలను అదనపు బహుమతిగా ఇస్తుండటంతో వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రోజుకు సగటున డీజిల్‌కు మూడు వేల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని, విద్యుత్‌ ‌కోతలు ఇలాగే కొనసాగితే ఆక్వా సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కోతలతో పరిశ్రమలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గత ఏడాది పవర్‌ ‌హాలిడే ప్రకటించిన ప్రభుత్వం ఈ ఏడాది కూడా అప్రకటిత హాలిడేకు ఆదేశాలిచ్చిందంటున్నారు. దీంతో కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడింది. షిఫ్టులవారీ పని కల్పించే పరిశ్రమలు ఈ కోతల ధాటికి ఒక షిప్టునకే కార్మికులను విధుల్లోకి తీసుకుం టున్నాయి. దీనివల్ల ఆదాయంపై సగానికి సగం కోత పడి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం కొత్తగా ఉపాధి కల్పించకపోగా ఉన్న ఉపాధిపై చావుదెబ్బ కొడుతోందని వారు మండి పడుతున్నారు.

రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాలను తీర్చడంపై వైసీపీ ప్రభుత్వం ఏనాడూ దృష్టి పెట్టలేదు. 23 మిలియన్‌ ‌యూనిట్ల విద్యుత్‌ ‌లోటుతో రాష్ట్రం ఏర్పడింది. 2014లో కేంద్రంలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్‌ ‌కొరత లేకుండా పలు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా 24×7 విద్యుత్‌ ‌సరఫరా చేసేందుకు ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఆంధప్రదేశ్‌ ‌కూడా ఒకటి. దాంతో అయిదేళ్లపాటు కరెంటుకు సమస్యలు ఏర్పడలేదు. 2014-2019 మధ్యకాలంలో విద్యుత్తు పంపిణీ సంస్థలు సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తి సంస్థలతో యూనిట్‌ ‌రూ.4.64 వరకూ ఒప్పందాలు చేసుకున్నాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక సమస్యలు ప్రారంభమయ్యాయి. కరెంటు అవసరాలు, ఉత్పత్తిపై ఏనాడూ దృష్టి పెట్టలేదని, సమీక్షలు చేయలేదని నిపుణులు విమర్శిస్తున్నారు. ఇవి కాక గత ప్రభుత్వం చేసుకున్న పవన, సౌరవిద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను (పీపీఏ) ఈ ప్రభుత్వం రద్దుచేసింది.ఆ సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సగం ధర చెల్లిస్తోంది. కరెంటు కొనుగోలు చేయకుండానే ఏటా దాదాపు రూ.4000 కోట్ల మేర చెల్లింపులు జరిపినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఉత్పత్తిని అయినా పెంచిందా? అంటే అదీ లేదు. మరలా బయటి కంపెనీల నుంచే విద్యుత్‌ను కొంటోంది. ఒకానొక దశలో పీక్‌ అవర్స్ ‌కాలంలో యూనిట్‌ ‌రూ.25 కొన్న ప్రభుత్వం కేందప్రభుత్వ ఆంక్షలతో ఇప్పుడు రూ.10లకు కొంటోంది. గత ఏడాది ఇదే సమయానికి విద్యుత్‌ ‌వినియోగం రోజుకి 196 మిలియన్‌ ‌యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 235 నుంచి 240 మిలియన్‌ ‌యూనిట్లు ఉంటోందం టున్నారు. ఏపీలో అత్యధికంగా విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే థర్మల్‌ ‌విద్యుత్‌ ‌కేంద్రాల్లో తొలిస్థానంలో ఉండే విజయవాడ ఎన్టీటీపీఎస్‌లో 2550 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి గాను, ప్రస్తుతం సగం మాత్రమే ఉత్పత్తి అవు తోంది. దీని తర్వాత స్థానంలో ఉన్న నెల్లూరు కృష్ణపట్నం విద్యుత్‌ ‌కేంద్రంలో 2400 మెగావాట్ల ఉత్పత్తి సామర్థానికి కేవలం 30 శాతం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మూడో స్థానంలోని రాయలసీమ థర్మల్‌ ‌విద్యుత్‌ ‌కేంద్రంలో 1650 మెగావాట్ల సామర్థ్యానికి గాను 60 శాతం మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి అవుతోందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రోజుకి 240 మిలియన్‌ ‌యూనిట్ల విద్యుత్‌ ‌వినియోగం అవసరం కాగా, రాష్ట్రంలోని థర్మల్‌ ‌విద్యుత్‌ ‌కేంద్రాల ద్వారా 103 మిలియన్‌ ‌యూనిట్లు, జల విద్యుత్‌ ‌ద్వారా 9.61, పవన విద్యుత్‌ 11.95, ‌సౌర విద్యుత్‌ 11.35, ఇతర వనరుల నుంచి 2.71 మిలియన్‌ ‌యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. ఇదిగాక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏల ద్వారా 44.38 మిలియన్‌ ‌యూనిట్లు, డిస్కంల ద్వారా సుమారు 50 మిలియన్‌ ‌యూనిట్లు బహిరంగ మార్కెట్‌ ‌నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని నిపుణులు చెబు తున్నారు. మొత్తంగా ఉత్పత్తి, వినియోగానికి మధ్య రోజుకి సుమారు 5 మిలియన్‌ ‌యూనిట్ల విద్యుత్‌ ‌కొరత ఏర్పడుతోంది. దీంతో లోడ్‌ ‌రిలీఫ్‌ ‌పేరుతో గ్రామాల్లో, పట్టణాల్లో ఒక్కోసారి నాలుగైదు గంటలు వరుసగా కోతలు విధిస్తున్నారు.

ప్రణాళిక లేమి

రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాలు తీర్చడంలో ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేకపోగా, నిర్లక్ష్య ధోరణి వహిస్తోంది. థర్మల్‌, ‌జల, పవన, సోలార్‌ ‌విద్యుత్‌ ‌ప్లాంట్లను ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. వీటిని నడపడం కంటే, బయట కరెంటు కొనడమే చౌక అనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. బహిరంగ మార్కెట్లో కొనడం కంటే థర్మల్‌ ‌విద్యుత్‌ ‌కేంద్రాల్లో ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉంటుం దనే నెపంతో కృష్ణపట్నం దామోదరం సంజీవయ్య, విజయవాడ నార్ల తాతారావు థర్మల్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం, రాయలసీమ థర్మల్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని కుదించేసింది. 45 శాతం విద్యుత్తును ప్రైవేటు కంపెనీల నుండి కొనుగోలు చేస్తోంది. ఇది కాకుండా ప్రతిరోజు స్వల్పకాలిక కొనుగోళ్లు చేస్తున్నారు. పవర్‌ ‌మార్కెట్‌ ‌నుంచి అత్యవసరాల మేరకు విద్యుత్‌ను యూనిట్‌ ‌రూ. 10 నుంచి రూ. 20 వరకు కొనుగోలు చేశారు. బొగ్గు కొనుగోళ్లు ఆపేయడంతో పాటు, బకాయిలు చెల్లించకపోవడంతో మహానది, తెలంగాణలోని సింగరేణి కాలరీస్‌,‌గత ఏడాది బొగ్గు సరఫరాను దాదాపు నిలిపి వేయడంతో తీవ్ర విద్యుత్‌ ‌కొరత ఏర్పడింది. పవర్‌ ‌హాలిడేను ప్రకటించడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. థర్మల్‌ ‌కేంద్రాల నిర్వహణకు అవసరమైన బొగ్గును నాలుగు నెలలకు సరిపడా ప్లాంట్లలో నిల్వచేసుకోవాలి. కనీసం నెల రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలనే నిబంధనను 15 రోజులకు మార్చారు. అయితే, ప్రస్తుతం థర్మల్‌ ‌కేంద్రాల్లో రెండు, మూడు రోజులకు మాత్రమే బొగ్గు నిల్వలున్నా యంటున్నారు. కృష్ణపట్నం ప్లాంట్‌ ‌రోజుకు 19000 మెట్రిక్‌ ‌టన్ను (ఎంటి)ల బొగ్గు అవసరం కాగా, 6,33,47 ఎంటీ•లు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది కేవలం మూడు రోజులకు మాత్రమే వస్తుంది. రాయలసీమ ప్లాంట్‌కు రోజు 21వేల ఎంటీ•లు అవసరం కాగా ప్రస్తుతం 46670 ఎంటీ•లు (అంటే రెండు రోజులకు సరిపడ) మాత్రమే ఉంది. వీటీపీఎస్‌ ‌ప్లాంట్‌కు రోజుకు 28500 ఎంటీల బొగ్గు అవసరంగా కాగా ప్రస్తుతం అక్కడ 71,313 ఎంటిలు అంటే రెండున్నర రోజులకు సరిపడ మాత్రమే ఉంది.

సంక్షోభంలో పారిశ్రామికరంగం

రాష్ట్రంలో కరెంట్‌ ‌కోతలు, విద్యుత్‌ ‌ఛార్జీల పెంపుతో ప్రజలు, పారిశ్రామిక రంగం, రైతాంగం, ఆక్వారంగం తీవ్ర సమస్యల్లో ఇరుక్కున్నాయి. అసలే ట్రూ అప్‌ ‌ఛార్జీలు, విద్యుత్‌ ‌సుంకం, సర్దుబాటు ఛార్జీల భారం మోస్తున్న పారిశ్రామిక రంగం కరెంటు కోతలతో పనులు సాగక ఉత్పత్తులను నిలిపివేయాల్సి వస్తోంది. ఇది లక్షలాది మందికి జీవనోపాధిపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా చిన్నతరహా పరిశ్రమలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా ఛార్జీలు పెంచకుండా వివిధ రూపాల్లో ఛార్జీల మోత మోగిస్తోందని పారిశ్రామిక వర్గాలు వాపోతున్నాయి. ఒక మోస్తరు పరిశ్రమపై ప్రతి నెలా రూ.4 లక్షల భారం పడిందంటున్నారు. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు యూనిట్‌కు 6 పైసలుగా ఉన్న విద్యుత్‌ ‌సుంకాన్ని 2022 మే నుంచి ఏకంగా రూపాయికి పెంచారు. వాటిని భరించే స్థితిలో పరిశ్రమలు లేవని, సుంకాన్ని తగ్గించాలని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేదు. 2022 ఆగస్టు నుంచి ట్రూఅప్‌ ‌పేరుతో యూనిట్‌కు 22 పైసలు, 2021-22లో వినియోగించిన విద్యుత్‌కు ఇంధన సర్దుబాటు ఛార్జీ (ఎపీపీపీసీఏ)ల కింద 2023 ఏప్రిల్‌ ‌నుంచి యూనిట్‌కు 63 పైసల అదనపు భారం వేశారు. 2023-24లో ఎఫ్‌ ‌పీపీసీఏ కింద యూనిట్‌కు రూ.1.10 వంతున వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంలు రాష్ట్ర విద్యుత్‌ ‌నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతి పాదించాయి. అందులో యూనిట్‌కు 40 పైసల చొప్పున గత ఏప్రిల్‌ ‌నుంచి వసూలు చేస్తున్నాయి. మిగిలిన 70 పైసలు ఏడాది చివర్లో ట్రూఅప్‌ ‌కింద వసూలు చేసే అవకాశం ఉంది. ఇలా ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో పరిశ్రమలపై యూనిట్‌కు రూ.2.89 భారాన్ని వేసింది. ట్రూప్‌, ఎఫీ పీపీసీఏల పేర్లతో ప్రభుత్వం వేసిన విద్యుత్‌ ‌ఛార్జీల భారాలు ఉత్పత్తి వ్యయంపై పడ్డాయి. విద్యుత్‌ ‌వాడకం ఖర్చు ఇంజినీరింగ్‌, ‌తయారీ వంటి పరిశ్రమల్లో ఉత్పత్తిపై 20 శాతం, మెల్టింగ్‌ ‌చేసే ఫౌండ్రీలు, స్పిన్నింగ్‌ ‌మిల్లులు వంటి వాటిలో 40%, ఫెర్రో ఎల్లాయిస్‌ ‌పరిశ్రమల్లో 60% వరకు ఉంటుంది. ప్రభుత్వం వేసిన అదనపు భారాలతో ఈ తరహా పరిశ్రమలన్నీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఇప్పటికే ఫెర్రో ఎల్లాయిస్‌ ‌పరిశ్రమలు మూతపడ్డాయి.

విద్యుత్‌ ‌కోతలతో ఎండుతున్న పైర్లు

విద్యుత్‌ ‌కోతలతో నీరు అందక బోర్లు, బావులు కింద సాగు చేసే పైర్లు ఎండిపోతున్నాయి. వ్యవ సాయానికి 9 గంటలు విద్యుత్‌ ‌సరఫరా విధానం అమలు కావడంలేదు. ఫలితంగా వరి పొలాలు ఎండి పోతున్నాయి. రెండు రోజుల నుంచి రెండు గంటలు మాత్రమే విద్ముత్‌ ఇస్తున్నారు. అదీ దశలు వారీగా ఇస్తుండటంతో పొలం తడవడం కష్టంగా మారింది. ప్రతి జిల్లాలోనూ విద్యుత్‌పై ఆధారపడి వేలాది ఎకరాల్లో సాగుకు రైతులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి ఉన్నారు. ఒకవైపు వర్షాలు కురవక, మరోవైపు కాల్వల్లో సాగునీరు లేక.. ఇంకోవైపు విద్యుత్‌ ‌కోతలతో పంటలను కాపాడుకోలేక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కొంతమంది రైతులు పంటలను కాపాడుకునేందుకు ఆయిల్‌ ఇం‌జన్లను ఆశ్రయిస్తున్నారు. ఇందుకు ఎకరాకు రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు ఖర్చు చెయ్యాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. అన్ని జిల్లాల్లో రైతులు విద్యుత్‌ ‌సబ్‌స్టేషన్ల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం వారికి సర్దిచెప్పి సమస్య పరిష్కరించాల్సింది పోయి జగ్గయ్యపేట, పులివెందుల్లో రైతులపై కేసులు పెట్టింది.

ప్రజల ఆందోళన

పంటలు ఎండిపోయి రైతులు, కరెంటు లేక గ్రామాలు, పట్టణవాసులు అల్లాడుతున్నారు. ప్రజలు గగ్గోలు పెడుతున్నా ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా దీనిపై సమీక్ష నిర్వహింవిద్యుత్‌ ‌కోతలతో నీరు అందక•లేదు.వైసీపీ ప్రభుత్వ అసమర్థత, అవగాహన లేమి, చేతగానితనం వల్లే కరెంటు కోతలు విపరీ తంగా పెరుగుతున్నాయని ప్రజలు, వ్యాపారులు, పారిశ్రామికవర్గాలు, రాజకీయపార్టీలు విమర్శి స్తున్నాయి. రాష్ట్రం అంతా చీకట్లో మగ్గుతుంటే తాడేపల్లి ప్యాలెస్‌ ‌మాత్రం దేదీప్యమానంగా వెలుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. రైతులకు తొమ్మిది గంటలు నిరంతరాయంగా కరెంటు ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఇప్పుడు సగం కూడా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. కరెంటు ఛార్జీలు పెంచడంపై ఉన్న ఉత్సాహం ‘కోతలు’ లేకుండా చేయడంలో లేదని ఆక్షేపిస్తున్నారు. వర్షా కాలంలో కూడా కరెంటు కోతలు వైసీపీ హయాంలోనే మొదలవడం అసమర్ధతగా పేర్కొంటు న్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్‌ ‌మంత్రి అనే విషయం కూడా చాలా మందికి తెలీదు. ఆయనకు గనులపై గల ఆసక్తి తాను చూస్తున్న శాఖపై లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ, ఛైర్మన్‌,‌సెంట్రల్‌ ‌లేబర్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram