– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

కొన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. రాబడి అనూహ్యంగా పెరుగుతుంది.  గృహ, వాహనయోగాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఓర్పు, నేర్పుగా సమస్యల నుంచి గట్టెక్కుతారు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారులకు మరింత లాభాలు అందుతాయి.రచయితలు, పరిశోధకులకు అవకాశాలు మరిన్ని దక్కుతాయి. 9,10తేదీల్లో కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. ఆశించిన ఆదాయం సమకూరుతుంది.వ్యాపారులు పెట్టుబడులు సకాలంలో అందుకుంటారు.   విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి.  . ఉద్యోగులు విధి నిర్వహణలో సమర్థత చాటుకుంటారు. రాజకీయవేత్తలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులకు ఉత్సాహవంతమైన కాలం. 4,5తేదీల్లో శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆదాయం మరింత అనుకూలిస్తుంది. భూవివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు సఫలం. ఉద్యోగులకు పనిఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయవేత్తలకు చిక్కులు తొలగుతాయి. క్రీడాకారులు, పరిశోధకుల ఆశలు ఫలిస్తాయి. తేదీల్లో బంధువిరోధాలు. 6,7వృథా ఖర్చులు. అంగారక స్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

కొత్త కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భూములు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి.  ఉద్యోగులకు కొన్ని మార్పులు సంభవం. రాజకీయవేత్తలకు ఒక కీలక సమాచారం అందుతుంది. 7,8తేదీల్లో శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

ఆదాయం విషయంలో సమస్యలు తీరతాయి. . పరిస్థితులు మరింతగా అనుకూలిస్తాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.  కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.  ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. భూముల విషయంలో అగ్రిమెంట్లు కుదురుతాయి. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. కళాకారులు, రచయితల యత్నాలు ఫలిస్తాయి. 4,5తేదీల్లో అనుకోని ప్రయాణాలు. శారీరక రుగ్మతలు.  శివాష్టకం పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు అధిగమిస్తారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. శారీరక రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగార్థుల యత్నాలు సఫలం. వ్యాపారులు గతం కంటే పుంజుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత సానుకూలం. రచయితలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. 6,7తేదీల్లో ఖర్చులు. కుటుంబబాధ్యత •లు పెరుగుతాయి. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరుతాయి.హనుమాన్‌  ‌హఛాలీసా పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. భూ వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. శుభకార్యాలు నిర్వహిస్తారు.వ్యాపారులకు భాగస్వాముల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగులకు  పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కుతాయి. కళాకారులు, రచయితలకు కీలక సమాచారం అందుతుంది. 6,7 తేదీల్లో సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. నృసింహస్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు అధిగమిస్తారు. అనుకున్న ఆదాయం సమకూరి అప్పులు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యూహాలు ఫలిస్తాయి. వ్యాపారులు  కొత్త భాగస్వాముల సహాయం అందుకుంటారు.   ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటాయి. రాజకీయవేత్తలకు  శుభవార్తలు. పరిశోధకులు, క్రీడాకారులకు అంచనాలు ఫలిస్తాయి. 8,9తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో సమస్యలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

బంధువుల చేయూతతో కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. అయితే శ్రమ తప్పకపోవచ్చు. రాబడి కంటే ఖర్చులు పెరిగి సతమతమవుతాయి. ఇంటి నిర్మాణాలలో జాప్యం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మంచిది. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులకు పనిఒత్తిడులు. కళాకారులకు ఒత్తిడులు తప్పవు. రచయితలు, పరిశోధకులకు పరీక్షాకాలంగా ఉంటుంది. 5,6తేదీల్లో ఊహించని శుభవార్తలు. వాహనసౌఖ్యం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

కొత్త కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.  నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దక్కుతాయి. గృహ నిర్మాణయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు క్లిష్ట సమస్యలు తీరతాయి. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. పారిశ్రామికవేత్తలకు సమస్యల నుంచి విముక్తి. రచయితలు, కళాకారులకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. 4,5 తేదీల్లో బంధువులతో అకారణంగా విభేదాలు. శారీరక రుగ్మతలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆస్తి, కోర్టు వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇంటాబయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు మరింత ఉత్సాహం. వాహన, గృహయోగాలు. శుభకార్యాలలో చురుగ్గా  పాల్గొంటారు. వ్యాపారులకు మరింతగా లాభాలు అందుతాయి.  కళాకారులు, రాజకీయవేత్తల యత్నాలు సఫలం. క్రీడాకారులు, పరిశోధకులకు విశేష గుర్తింపు. 6,7 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. హనుమాన్‌ఛాలీసా పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఆదాయం కొంత తగ్గి కొత్త అప్పులు చేస్తారు. కొన్ని ముఖ్య కార్యక్రమాలలో జాప్యం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమ పెరుగుతుంది.  శారీరక రుగ్మతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.  వ్యాపారులకు సాదాసీదాగా ఉంటుంది. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు. రాజకీయవేత్తలు,  పారిశ్రామికవర్గాలకు కొత్త సమస్యలు. కళాకారులు, రచయితలకు చికాకులు. 7,8తేదీల్లో  శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Twitter
YOUTUBE