రాజేంద్రసింగ్‌ ‌హుడా అశోక్‌ ‌గెహ్లోత్‌ ‌మంత్రివర్గ సభ్యుడు. ఈ కాంగ్రెసు మంత్రిని కాంగ్రెస్‌ ‌వారే పిడిగుద్దులతో హింసించారు. మంత్రి పదవి నుండి తొలగించారు. పార్టీ నుండి గెంటేశారు. జూలై 27న రాజస్తాన్‌ అసెంబ్లీలో ఈ అసాధారణ ఘటన జరిగింది. ఆ దృశ్యాలు ఎలక్ట్రానిక్‌ ‌మీడియాలో దేశమంతా చూసింది.

ఇంతకూ హుడా చేసిన పాపం ఏమిటి? ఇతడు ముఖ్యమంత్రి గెహ్లోత్‌కు సన్నిహితుడు. అందుకే తన అక్రమ ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్‌ ‌డైరెక్టరేటు దాడులు నిర్వహించినప్పుడు, దాచి పెట్టవలసిందిగా గెహ్లోత్‌ ఒక ఎర్ర అట్ట డైరీని రాజేంద్రసింగ్‌కు ఇచ్చాడని కథనం. ఈ డైరీలో కాంగ్రెసు పార్టీ ఎవరెవరిని కొనుగోలు చేసేందుకు ఎన్నెన్ని కోట్లు ఇచ్చిందో వివరాలూ, పద్దులూ ఉన్నాయి. ఈ డైరీని హుడా అసెంబ్లీలో స్పీకర్‌ ‌ముందు పెట్టడానికి ప్రయత్నించగా కాంగ్రెసు సభ్యులు లాక్కొని చింపివేశారు. ఐనా డైరీలో కొంత రాజేంద్రసింగ్‌ ‌చేతిలో మిగిలిపోయింది. అసలు కాంగ్రెస్‌ ‌చరిత్ర మొత్తం ‘ఎర్రడైరీ’ సరుకే కదా!

హత్యాచారాలు, అత్యాచారాలలో రాజస్తాన్‌, ‌బెంగాల్‌, ‌ఛత్తీస్‌గఢ్‌ ‌ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు మణిపూర్‌ ఆ ‌జాబితాలో చేరింది. ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. దానిని ఇరుకున పెట్టే నిమిత్తం కాంగ్రెసు పార్టీ పార్లమెంటు లోపల, బయటా గడబిడ చేస్తోంది. మణిపూర్‌లో జరుగు తున్నది జాతుల మధ్య, హిందూ, క్రైస్తవ మతాల మధ్య ఘర్షణ. చైనా, మయన్మార్ల నుండి కాందిశీ కులు, గూఢచారులు ప్రవేశిస్తుంటారు. మాదకద్రవ్యాల వ్యాపారం భారీస్థాయిలో ఉంది. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకోకుండా, జాతీయ సమైక్యతపై దృష్టి సారించకుండా ప్రధాని నరేంద్ర మోదీపై కక్ష సాధించేందుకు రాహుల్‌ ‌బృందం మణిపూర్‌ ‌సమస్యను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు.

మరి రాజస్తాన్‌ ‌మాటేమిటి? ఇక్కడ లోగడ భ్రామరీదేవి అనే అమ్మాయిని ఎందుకు సజీవ దహనం చేశారు? ఎందుకంటే అక్కడి కాంగ్రెసు నేతలతో ఆమె లైంగిక సంబంధాలు బయటపడ తాయని!

మొన్న కర్ణాటకలో కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది. వెంటనే నిషేధిత పీపుల్స్ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా (పీఎఫ్‌ఐ) ‌కార్యకర్తలపై ఉన్న వందలాది కేసులను ఎత్తివేసింది. మత మార్పిడులకు అభ్యంతరం లేదు అని చట్టం చేసింది. పాఠ్యగ్రంథాల నుండి డాక్టర్‌ ‌కేశవరావు బలీరాం హెడ్గేవార్‌, ‌స్వతంత్ర వీర సావర్కర్‌ ‌పేర్లను తొలగించింది. కర్ణాటకలో బజరంగదళ్‌ను నిషేధిస్తానని ముఖ్య మంత్రి సిద్ధరామయ్య అంటున్నాడు. ఇలా ఎందుకు? అది నైజం!

పాకిస్తాన్‌ ఉ‌గ్రవాదులు ముంబాయిలో జరిపిన బాంబు పేలుళ్లలో వందలాది మంది ప్రాణాలు కోల్పోతే కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలు బహిరం గంగా నిందితులకు మద్దతు ప్రకటించాయి.

ఇప్పుడీ సమస్యను మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే కాంగ్రెసు పార్టీ చరిత్రను విశ్లేషించవలసి ఉంటుంది. పనిలో పనిగా ఈ సంస్థను స్థాపించిన వాడు ఏవో హ్యూమ్‌ అనే పాశ్చాత్యుడన్న సంగతీ గుర్తు చేసుకోవాలి. ‘ఇండియాలో హిందువుగా పుట్టడం కన్నా ఒక గాడిదగా పుట్టడం మంచిది’ అన్నాడు మోతీలాల్‌ ‌నెహ్రూ. ‘మతవిశ్వాసాల దృష్ట్యా నేను ముస్లిమును. విద్యావిధానం ద్వారా నేను క్రైస్తవుణ్ణి. యాదృచ్చికంగా (యాక్సిడెంటల్లీ) హిందువును’ అన్నాడు పండిత జవహార్లాల్‌ ‌నెహ్రూ. 1975లో ఇందిరాగాంధీ భారతదేశం మీద ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని పక్కన పెట్టింది. ఢిల్లీకి సూట్‌కేసులు ఎలా పంపాలో మాకు తెలుసు అన్నది మార్గరెట్‌ ఆల్వా (కర్ణాటక కాంగ్రెసు నాయకురాలు).

ప్రస్తుతం ఈ సంస్థను నడుపుతున్నది ఆంటో నియో మైనో. ఇటలీ వనిత. ఈమెను మతం మార్పిడుల కోసం పోప్‌ ‌పంపారంటారు. వీరు రోమన్‌ ‌కాథలిక్‌ ‌క్రైస్తవ వర్గానికి చెందినవారు. 1947లో భారతదేశాన్ని మూడు ముక్కలు చేసింది కాంగ్రెసు పార్టీయే. దీనికి కమ్యూనిస్టులు మద్దతునిచ్చారు. నెహ్రూను అడ్డం పెట్టుకొని భారత జాతీయవాదాన్ని ఎదగకుండా చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మీద మూడుసార్లు నిషేధం విధించారు. సావర్కర్‌ను రాహుల్‌ ‌గాంధీ అవమానించడం ఇటీవలి సంఘటనే. నడిచే దైవం సావర్కర్‌ను ఈ దొంగ బ్రహ్మచారి ఎందుకు తిడుతున్నాడు? తిలక్‌, ‌మాలవీయా, ప్రకాశం, నేతాజీ వంటి నాటి త్యాగధనుల పార్టీ ఇదేనా?

ప్రణాళికాబద్ధంగా కాంగ్రెసు పార్టీలో కమ్యూ నిస్టులు ప్రవేశించి పార్టీని చేజిక్కించుకున్నారు. టిబెట్టును చైనా అక్రమించుకుంటే ఆమోదముద్ర వేశారు. లద్దాక్‌ ఇతర ఈశాన్య ప్రాంతాలను మావో సేటుంగ్‌ ఆ‌క్రమించుకుంటే అది గడ్డిపోచ కూడా మొలవని భూమి అని నెహ్రూ లోక్‌భలో ప్రకటిం చారు. 1962లో హిందూ చీనీ భాయిభాయి అంటూ నినాదాలిచ్చారు. సరిగ్గా అదే సమయంలో ఇండియాపై చైనా యుద్ధం ప్రకటించింది.

 రాజ్యాధికారం కోసం కాంగ్రెసు పార్టీ ప్రధానంగా దేశంలోని ఉగ్రవాద సంస్థల ఓట్ల మీద ఆధారపడి ఉంది. సిమి అనే ఉగ్రవాద సంస్థను నిషేధిస్తే అది తప్పు అని కాంగ్రెసు నాయకుడు సల్మాన్‌ ‌ఖుర్షీద్‌ ‌కోర్టుకు వెళ్లాడు. అర్బన్‌ ‌నక్సలైట్లకు బాహాటంగా కాంగ్రెసు పార్టీ మద్దతునిచ్చింది. కేరళ కాంగ్రెసు పేరుతో ఎ.కె. ఆంటోనీ అక్కడి ఉగ్రవాద ముఠాలకు మద్దతునిచ్చాడు. ఆంధప్రదేశ్‌లో వై.ఎస్‌. ‌రాజశేఖర్‌ ‌రెడ్డి కాలంలో తిరుపతి ఏడు కొండలను జోడు కొండలుగా చిత్రీకరించి అక్కడ రిసార్టుల నిర్మాణాన్ని ప్రారంభించారు. 0.5 శాతం ఉన్న క్రైస్తవ జనాభా నేడు (2023) 25 శాతానికి చేరింది. ఛత్తీస్‌గఢ్‌లో వందలాదిమంది భారత వీర జవాన్లు నక్సలైట్ల చేతిలో చనిపోతుంటే అక్కడి కాంగ్రెసు ప్రభుత్వం ఉగ్రవాదులో చేతులు కలిపింది.

‘ఇండియాలో మోదీ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం మీ సైనిక సహాయం మాకు అవసరం’ అని 2019లో మణిశంకర్‌ అయ్యర్‌ ‌కరాచీలోని దునియా టీవీలో ఐ.ఎస్‌.ఐ. ఉ‌గ్రవాదులతో ఇంటర్వ్యూ ఇచ్చాడు.

‘భారతదేశం నుండి కశ్మీరును విడగొట్టండి (ఆజాదీ)’ అంటూ జెఎన్‌యులో ఉగ్రవాదులూ, ఏచూరి సీతారాం, కన్హయకుమార్‌ ‌వంటి టెర్రరిస్టులు ఉద్యమం నడుపుతుంటే రాహుల్‌ ‌గాంధీ, అరవింద్‌ ‌కేజ్రీవాలాలు వెళ్లి వారికి మద్దతు ప్రకటించి వచ్చిన సంఘటన మరిచిపోయారా?

మొన్న పాట్నాలో, నిన్న బెంగళూరులో. కొందరు దొంగలు చేరారు. అందులో అర్బన్‌ ‌టెర్రరిస్టు అరవింద కేజ్రీవాలా, దాణా అవినీతిలో జైలుకు పోయిన లాలూప్రసాద్‌యాదవ్‌, అవినీతి కుమారుడు, వంకరబుద్ధి శరద్‌పవార్‌, ‌టింకర బుద్ధి స్టాలిన్లు లెనిన్లు ఉన్నారు.

దేశంలో నిరుద్యోగం ఉంది. ద్రవ్యోల్బణం ఉంది. ఉగ్రవాదం, అవినీతి ఉంది. 60 సంవత్స రాలు పాలించిన కాంగ్రెసుకు బాధ్యత ఏమీ లేదా?

ఖలిస్తాన్‌ ‌వేర్పాటువాదులకు కాంగ్రెసు మద్దతు నివ్వటమేమిటి? కాంగ్రెసు పార్టీ పనిచేస్తున్నది ఇండియా కోసమా? పాకిస్తాన్‌ ‌కోసమా?

ఉత్తరప్రదేశ్‌లో వృద్ధిరేటు గణనీయంగా (10%) పెరగడానికి యోగి ఆదిత్యనాథ్‌ ‌కారణం కాదా? ఏపీ తెలంగాణ, ఢిల్లీ ప్రభుత్వాలు ఎందుకు దివాలా తీశాయి? బెంగాల్‌ ఎం‌దుకు శవాల దిబ్బగా మారింది?

ఇండియాలో బూటకపు ప్రజాస్వామ్యం ఉంది అంటారు కమ్యూనిష్టులు. మరి చైనా, మయన్మార్‌ ‌లాగా నియంతృత్వం మంచిదా? ఒక సంవత్సరం పెగాసస్‌ అన్నారు- మరొక సంవత్సరం ఆదాని అన్నారు, ఎప్పుడూ ఏదో ఒక అల్లరి -పార్లమెంటు నడవదు-ప్రజల ధనంతో విమానాలలో తిరుగు తుంటారు. డెమోక్రసీ – మాబోక్రసీ ఈ రెండింటికీ తేడా ఉంది. మనం బ్రిటీషు వాడిచేత పాలింపబడడా నికే పుట్టాము అనుకునేవారు నేటికీ ఉండటం విచిత్రంగా లేదూ?! భారతీయులు స్వాతంత్య్రాన్ని నిలుపుకోలేరు అన్నది ఎవరు? చర్చిల్‌ ‌కదూ!

జాతీయ సమైక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనం, నిర్మాణాతక దృక్పథం కాకుండా పరస్పర నిందారోప ణలు, ఆత్యహత్యా సదృశం అని నాయకులూ, మీడియా గుర్తించాలి.

 అండమాన్స్ ‌వెళ్లి స్వతంత్ర వీరసావర్కర్‌ ‌స్మారక చిహ్నాన్ని బద్దలుకొట్టి తన ఘనకార్యాన్ని సోనియా గాంధీకి విన్నవించి మెప్పు పొందాడు మణిశంకర్‌ అయ్యర్‌ అనే తమిళనాడు కాంగ్రెసు నాయకుడు.

మరో కాంగ్రెసు నాయకుడు పి. చిదంబరం, ఆయన కొడుకు కార్తి చిదంబరం దేశాన్ని దోచి మొత్తం ధనం వర్జిన్‌ ఐలెండ్స్ ‌వంటి చోట్లకు తరలించారు. వీరు క్రైస్తవులు. అందుకని సోనియా గాంధీకి సన్నిహితులు హితులు. తర్వాతి కాలంలో వీరిని అరెస్టు చేసి జైలులో ఉంచారు. నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కుంభకోణంలో మోతీలాల్‌ ఓరా, సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీ వంటివారు ప్రధాన ముద్దాయిలు. ఓరా చనిపోగా సోనియా, రాహుల్‌ ‌గాంధీలు బెయిల్‌ ‌మీద తిరుగుతున్నారు. ఇదీ నేటి కాంగ్రెస్‌ ‌పార్టీ కథ!

‘సోనియా హయాంలోనూ 20 లక్షల కోట్లు విలువైన ఆర్థిక స్కాంలు జరిగాయి’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బోఫోర్స్, ‌బొగ్గు, హెలికాప్టర్‌లు, సబ్‌ ‌మెరీన్‌ ‌కొనుగోళ్లు… ఇలా ఒకటేమిటి భూమి, పాతాళం, ఆకాశం అన్నీ అవినీతిమయమే. రాహుల్‌ ‌గాంధీకి లండన్‌ ‌హౌజ్‌ ఎవరు బహూకరించారు? ఎందుకు? ఇదొక రక్షణ శాఖలోని కొనుగోళ్ల స్కాం. ఇదిగో ఈ నేరాల నుండి తప్పించుకొనే నిమిత్తం దాణా అవినీతి చేసిన లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌, ‌శారదా చిట్‌ఫండ్‌ 20 ‌లక్షల కోట్లు కుంభకోణంలో నేరస్థురాలు మమతా బెనర్జీ వంటి వారంతా జతకట్టారు. ఎందుకు? తమ పాపాల పుట్టలను అవినీతి చిట్టాలను దాచుకోవడం కోసం.

చైనాతో రాహుల్‌ ‌గాంధీ రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాడు (2006). ఫలితంగా రాజీవ్‌ ‌గాంధీ ఫౌండేషన్‌ ‌నిధులు సంపాదించుకోవడంతో బాటు టిబెట్టు స్వతంత్ర దేశంగా ప్రకటించాలని ఇండియాలో బౌద్ధులు ఆందోళన చేస్తే వారిని అణచి వేయాలి అని చైనాతో ఒప్పందం చేసుకున్నాడు. ఇదీ ఈ రాహుల్‌ అనే అమూల్‌ ‌బేబీ నిజస్వరూపం. ఇతని పేరు రాహుల్‌ ‌విన్సీ. రోమన్‌ ‌కాథలిక్‌ ‌క్రిస్టియన్‌. ‌నేతాజీ సుభాష్‌ ‌చంద్రబోస్‌, ‌దీనదయాళ్‌ ఉపాధ్యాయ, శ్యామప్రసాద్‌ ‌ముఖర్జీ, రాజేశ్‌ ‌పైలట్‌, ‌వై.ఎస్‌. ‌రాజశేఖర్‌ ‌రెడ్డి, లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రివి సహజ మరణాలు కావు. మరి ఆ అదృశ్య హస్తం ఎవరిది?

ఇప్పుడు చెప్పండి!

కాంగ్రెసు పార్టీని ప్రజలు నిషేధించాలా? వద్దా? 1980వ దశకంలో రాంలాల్‌ అనే గవర్నర్ను అడ్డంపెట్టుకొని చట్టబద్ధంగా ఎన్నికైన ఎన్‌.‌టి. రామారావు ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ బర్తరఫ్‌ ‌చేయించడం గుర్తుందా? ఇదీ వీరి ప్రజాస్వామ్య అభిమానం.

1947 నుండి 2023 వరకు గల కాంగ్రెసు చరిత్ర మొత్తం అవినీతి భరితంగా విదేశీ సంతుష్టీకరణ విధానాలతో సాగింది. వీరికి మాఫియా గాంగ్స్, ‌స్మగ్లర్లు, అంతర్జాతీయ ఉగ్రవాదులు, రెడ్‌ ‌డైరీ కాడర్లు మద్దతునిస్తున్నారు.

భారత ప్రధాని నరేంద్రమోదీ 28 జులై రాజస్తాన్‌లోని ఒక సభలో మాట్లాడుతూ ‘‘రెడ్‌ ‌డైరీ చిట్టా విప్పితే గెహ్లోత్‌ ‌ప్రభుత్వం వీధిన పడుతుంది’’ అన్నాడు. ఇప్పుడు ఎర్రడైరీ నుంచి వాస్తవ చరిత్రలోకి వద్దాం.

2014 మేలో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు గార్డియన్‌ ‌పత్రిక (లండన్‌) ‌సంపాదకీయంలో ఈ వాక్యాలు రాసింది.

‘‘1947 నుండి ఇప్పటి వరకు భారతదేశాన్ని పరోక్షంగా మనమే పాలిస్తూ వచ్చాం. ఇప్పుడు భారతీ యులు పాలించుకోవడం మొదలుపెట్టారు’’.

– ప్రొ. ముదిగొండ శివప్రసాద్‌, ‌విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram