మన దేశానిది పోరాట స్ఫూర్తి. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ముందుకు సాగడమే తరతరాల రివాజు. ఈ రెండింటికీ ప్రబల ఉదాహరణ తేదీలు – మొన్నటి జులై 14, రానున్న ఆగస్ట్ 23. ‌భారత రోదసి సంస్థ (ఇస్రో) చేపట్టి ఫలప్రదం చేసిన మహాపక్రియ… చంద్రయాన్‌-3 ‌ప్రయోగం.  అగ్రదేశాలు మూడూ (అమెరికా, రష్యా, చైనా) ఇదివరకే ల్యాండర్లను చందమామ మీద దించినా, ఏకంగా ‘దక్షిణ ధ్రువానికి చేరడమన్నది’ భారతీయ శాస్త్రవేత్తల ఘనాతిఘన విజయం కానుంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ‌ధవన్‌ అం‌తరిక్ష శోధన కేంద్రం వేదిక నుంచి వాహన నౌక ద్వారా ప్రయోగించగానే జాతి పులకించింది.  చంద్రయాన్‌-2‌లోని ల్యాండర్‌ ‌వైఫల్యాన్ని ఇప్పుడు అధిగమిస్తూ భారత్‌  ‌విజయకే తనం ఎగురవేయనుంది. చంద్ర ఉపరితలంపైన సురక్షిత ల్యాండింగ్‌, అక్కడ రోవర్‌ ‌సంచార సామర్థ్యాల గమనింపు, శాస్త్రీయ పరిశీలనల వేగవంతంతో ఆ ‘కూర్పు’ను మరింత అవగతం చేసుకోవడం ప్రధాన లక్ష్యాలు. మూడు కీలక భాగాలైన ప్రొపల్షన్‌ ‌మాడ్యూల్‌, ‌ల్యాండర్‌, ‌రోవర్‌లలో మొదటిది అతి పెద్దసోలార్‌ ‌ప్యానెల్‌తో నిండిన పేటికా నిర్మాణం. రెండోది (ల్యాండర్‌) ‌కూడా విశ్లేషణ పరికరాలను తరలించే పెట్టె ఆకారమే. మూడోది రోవర్‌ ‌దీర్ఘ చతురస్రంగా ఉండే చట్రం. ఉపరిత•ల పయనం సాగించాలన్నా, నమూనాలన్నింటినీ సమీకరిం చాలన్నా, చందమామ రసాయన, భౌగోళిక కూర్పును సమగ్రంగా విశ్లేషించాలన్నా అదే. అంటే ఒక విధంగా సంచార ప్రయోగశాల అన్నమాట. ఆ రోవరే దేశంలోని ల్యాండర్‌ – ‌గ్రౌండ్‌ ‌కంట్రోల్‌ ‌బృందంతో కమ్యూనికేషన్‌ ‌కొనసాగిస్తుంటుంది. భూమి, చంద్రుడి మధ్య దూరమైన లక్షలాది కిలోమీటర్ల మేర ప్రయాణం. రెండింటి నడుచ సమీపస్థితిని పరిపూర్తిగా గణించిన తర్వాతే, ప్రయోగ తేదీని నిశ్చయించుకుంది భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ.

ఇదే సందర్భంలో ‘ఒక మహిళాశక్తి’ యావత్‌ ‌జాతి దృష్టిని ఆకర్షిస్తోంది. రాకెట్‌ ‌విమెన్‌గా ఆమెను సంభావిస్తూ, ప్రాజెక్టు ఇన్‌ఛార్జి (బాధ్యురాలు)గా గౌరవిస్తూ జేజేలు పలికింది. ఆమే రీతూ శ్రీవాత్సవ. లక్నో విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్‌సీ, బెంగళూరు కేంద్రంగా ఎంటెక్‌. ఇ‌స్రోలో పాతికేళ్లుగా మంగళ యాన్‌ ‌మిషన్‌ ‌సహా అనేక రూపకల్పనల్లో తానూ ప్రధాన భాగస్వామిని. దీక్షా దక్షతలకు గుర్తుగా పదిహేనేళ్ల క్రితమే యువశాస్త్రవేత్తగా అవార్డు విజేత. చిన్న నాటి నుంచీ రాత్రిళ్లు జాబిల్లిని చూసి ఎంతగానో మురిసేది. ఆ వెన్నెల రాజ్యంలో ఉన్నవాటిని శోధించి తెలుసుకోవాలని కలలు కనేది. ఎలాగైనా  సరే నెలరాజు ప్రాంతమంతటినీ అవగాహనకు తెచ్చుకోవాలని – ఎక్కడ ఏ సమాచారం కనిపించినా దరిచేర్చుకుని పదిలపరుస్తుండేది. సంస్థలో పలు ‘ఆపరేషన్స్’‌కు సంచాలిక బాధ్యతలు వహించి, ప్రాచుర్యాన్ని సొంతం చేసుకున్న మేటి వనిత.

చంద్రయాన్‌ -2 ‌వైఫల్యాన్ని విశ్లేషించుకుని అంతర్మథనం చేసుకున్న ఇస్రో ,ఇప్పటి ప్రయోగంలో మార్పు చేర్పులెన్నో  చేసింది. చంద్ర ఉపరితలాన్ని బలంగా తాకినా గట్టిగా నిలిచేలా ల్యాండర్‌ అం‌చుల డిజైన్‌ను సరిచేసింది. అనువైన అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను జోడించింది. ఆర్బిటర్‌, ‌మిషన్‌ ‌కంట్రోల్‌తో అన్వయానికి దీటుగా కెమెరాల సంఖ్యను పెంచింది. ఇంధన పరిమాణ హెచ్చింపు, సౌర ఫలకాల పెంపుదల, సెన్సర్ల ఆధునికీకరణ..మరెన్నో ముందు జాగ్రత్తలు తీసు కుంది.  ప్రత్యామ్నాయాల ఏర్పాట్లను సైతం ముందుగానే సంసిద్ధపరచుకుంది. ఆగస్ట్ 23, ఆ ‌తర్వాత ప్రొపల్షన్‌ ‌మాడ్యూల్‌ ‌నుంచి ల్యాండర్‌, ‌రోవర్‌ ‌మిళిత రూపం విడిపోయి; చంద్రుని ఉపరితలం దిశగా తరలుతుంది. సంబంధిత ఇంజిన్ల అండదండలతో వేగాన్ని తనకు తానుగా ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుంటుంది. వీటన్నింటినీ, ఈ ముఖ్య అంశాల పరంపర అంతటిని రీతూ సంపూర్ణగా అధ్యయనం చేయగలిగారు. తిరుపతి జిల్లాలో స్పేస్‌ ‌సెంటర్‌ ‌వద్ద రాకెట్‌ ‌కౌంట్‌డౌన్‌ ‌పక్రియ మొదలయ్యే ముందువరకు నరాలు తెగేంత ఉత్కంఠ. ప్రతీ శాస్త్రవేత్త, సాంకేతిక సిబ్బందిలోనూ ఎంతెంతో ఉద్విగ్నత. చంద్ర యాన్‌-3‌తో నిండిన ఎల్‌వీఎం-3 పీ4 వాహక నౌక అది. ఇస్రో ఛైర్మన్‌, ‌సంబంధిత శాఖల – విభాగాల – బృందాల నిర్వాహకులు, ఇంకా ఎందరెం దరిలోనూ అనుక్షణ ఉద్వేగ తీవ్రత. దక్షిణ ధ్రువానికి చేరువలోని నిర్ణీత అక్షాంశం వద్ద ఎంచుకున్న ప్రాంతంలో ల్యాండింగ్‌ ‌జరగాలంతే•! అదే అందరి, అక్కడి ప్రతి ఒక్కరి ఏకైక ప్రగాఢ కోరిక. అప్పుడే విశ్వరహస్యాలెన్నింటినో వెలికితీసే సావకాశం భారత్‌ ‌వశమవుతుంది. పురాతన  శిలలపరంగా శోధనల ముమ్మరం తోనే, విశ్వ ఆవిర్భావ విశేషాలనేకం ఇంకా వెలికివస్తాయి. అందుకే ఉపగ్రహ ప్రాజెక్టు డైరెక్టర్లతోపాటు మిషన్‌, అసోసియేట్‌ ‌మిషన్‌ ‌డైరెక్టర్ల, వెహికల్‌ ‌రంగ సంచాలకుల్లో అత్యంత ఉత్సుకత. వీరందరి నడుమ రీతూ మదిలోనూ భావనా సంచలనం. ఆమెది తొలి నుంచీ శాస్త్రీయ అధ్యయన కోణం. సకల మానవాళికీ ముఖ్య ఆకర్షణగా మారిన చంద్రుడి పరిణామ క్రమాన్ని ఇంకెంతో తెలుసుకుని తీరాలన్న జీవితకాల పట్టుదల.

పట్టుదలలో మేటి

సీనియర్‌ ‌శాస్త్రవేత్తగా రీతూకి పలు అనుభవాలున్నాయి. మార్స్ ఆర్చిటర్‌ ‌మిషన్‌తో ఎంతో పరిణతి పొందగలిగారు ఇప్పటికే. రాకెట్‌ ‌విమెన్‌గా ప్రస్తుతం ఇంత పేరు సాధించారంటే – ప్రధాన నాయకత్వ బృందంలో తనూ ఒకరు కావడమే కారణం. ఏళ్లగా సర్వశక్తులనీ వినియోగిస్తూ వస్తున్నారు. ఇదే చంద్రయాన్‌-3 ‌మిషన్‌లో దరిదాపు అరవైమంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నప్పటికీ; పలు కేంద్రాల సిస్టమ్స్ అసోసియేట్స్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ… రీతూలో ప్రత్యేకత నిత్య పరిశ్రమ. మిషన్‌ ‌నాయకురాలిగా ఫలితాలను స్వీకరించగలిగిన వ్యక్తిత్వ ప్రతిభ. ఏరోస్పేస్‌ ఇం‌జనీరుగా అపార అనుభవం. స్వరాష్ట్రం ఉత్తర్‌‌ప్రదేశ్‌. ‌మధ్య తరగతి కుటుంబం. సోదరీ సోదరులు నలుగురి మధ్య ఆత్మీయతతో పెరిగారు. తాను ఫిజిక్స్‌లో డాక్టరేట్‌. అప్పట్లో యంగ్‌సైంటిస్ట్ ‌పురస్కృతిని నాటి రాష్ట్రపతి అబ్దుల్‌ ‌కలాం నుంచి అందుకున్నారు. మరింత సమున్నత గౌరవంగా ఆ సందర్భాన్ని నేటికీ ప్రస్తావిస్తుంటారామె. తను అనేకానేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పరిశోధన పత్రాలు సమర్పించారు. ఇస్రో టీమ్‌అవార్డుతో సొసైటీ ఆఫ్‌ ఇం‌డియా ఏరోస్పేస్‌ ‌టెక్నాలజీ పురస్కారాన్నీ స్వీకరించారు.

సంకల్పశక్తికి చిరునామా

ఆమె మాటల్లోనే…. ‘సైన్స్ అనేది నా దృష్టిలో కేవలం ఒక పాఠ్యాంశం మాత్రమే కాదు. అదొక జీవన దృక్పథం. అంతరిక్ష శోధన గురించే బాల్యం నుంచీ పరితపించాను. ఇస్రోలో నాకు ఉద్యోగం వచ్చినట్లు  లేఖ అందుకు న్నప్పుడు నా సంతోషం ఆకాశమంత! మా కుటుంబం ఉండేది రాజాజీ పురంలో. ఒక్కసారిగా పేరూ ప్రఖ్యాతులు వరించాయి.  ఇదంతా గర్వకారణమే. అన్నింటికీ  మించి, అంతరిక్ష అన్వేషణ రంగంలో ప్రస్తుతం  మనదొక అపురూప ఘనత. ప్రయోగిత వ్యోమనౌక చంద్రకక్ష్యకు చేరేది ఆగస్ట్ 23‌వ తేదీన. మూడేళ్ల  వెనక్కిళ్లి చూద్దాం. అప్పుడు చంద్రయాన్‌-2 ‌ప్రయోగం ఎక్కడ ఎలా అయిందో గుర్తుచేసుకుంటే బాధగానే ఉంటుండేది. నాటి విక్రమ్‌ ‌ల్యాండర్‌ ఏమైంది? చందమామ దక్షిణ ధ్రువం వద్ద భద్రంగా దిగడంలోనే సఫలం కాలేకపోయింది. ఇప్పుడైతే అక్కడే, సరిగ్గా ఆ చోటనే మన చంద్రయాన్‌-3 ‌ల్యాండర్‌ ‌రోవర్‌ను అదేచోట దింపుతుందన్నది ప్రధాన విషయం. నాటి వైఫల్యాన్ని అరికట్టేలా సరిపడా సాంకేతికతను నేటి ల్యాండర్‌లో అమర్చారు మా శాస్త్రవేత్తలు. మన చంద్రలోక పయనం ఇది మూడోది. అక్కడి వాస్తవికతను పరిశీలించగలిగితే, భూమి మొట్టమొదట ఏ విధంగా ఉండేదో సులువుగానే తెలిసిపోతుంది. ఇటు వంటి శాస్త్రీయ ప్రయోగాల పరంపరాలన్నీ జాతికి ఉత్తేజం పెంచేవే! ఒక వనితా శాస్త్రవేత్తగా అన్ని విధాలా సంతోషిస్తున్నాను’.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram