– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

పలుకుబడి, హోదాలు కలిగిన వ్యక్తుల పరిచయం. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు సఫలం. వ్యాపారులకు తగినంత లాభాలు అందుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులకు అనూహ్యమైన అవకాశాలు. 23,24 తేదీలలో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

రాబడి కొంత నిరాశ పర్చినా అవసరాలు తీరతాయి.  కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు నేర్పుగా అధిగమిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఒత్తిడులు తొలగుతాయి. 20,21 తేదీల్లో శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు.గణేశ్‌ ‌స్తోత్రం  పఠించండి..


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ఆదాయం క్రమేపీ అనుకూలిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడి ఊరట లభిస్తుంది. ముఖ్య కార్యక్రమాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు లభించవచ్చు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. వ్యాపారులకు క్రమేపీ లాభాలు అందుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు అనుకున్న అవకాశాలు దక్కుతాయి. 21,22 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. ఆదిత్య హృదయం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు సహాయసహకారాలు అందిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 23,24 తేదీల్లో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

కుటుంబంలో ఒత్తిడుల నుంచి విముక్తి. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఓర్పుతో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. రాబడి మరింత ఉత్సాహాన్నిస్తుంది. స్వల్ప శారీరక రుగ్మతలు. .రావలసిన బాకీలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో ఊరట లభిస్తుంది.  ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు దక్కే అవకాశం.  25,26 తేదీల్లో ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. శివపంచాక్షరి పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

కొన్ని కార్యక్రమాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. వివాహయత్నాలు కలసివస్తాయి.ఆదాయం ఆశించినంతగా ఉంటుంది భూములు, వాహనాలు కొనుగోలు చేసేవీలుంది.22,23 తేదీల్లో బంధువిరోధాలు. ఆరోగ్యసమస్యలు. అంగారక స్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

శుభవార్తలు అందుతాయి. రాబడి కొంత పెరిగి అవసరాలు తీరతాయి. శుభకార్యాలరీత్యా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.  వ్యాపారులు మరింత లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది.  21,22 తేదీల్లో శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆత్మీయులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. రావలసిన బాకీలు సకాలంలో అందుతాయి.  కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు.  ఉద్యోగులకు ఉన్నత హోదాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు గందరగోళం తొలగుతుంది. 23,24 తేదీల్లో దుబారా వ్యయం. అనుకోని ప్రయాణాలు. శివాష్టకం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు నెలకొనే అవకాశం. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు నిరాశ పరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బందికరంగా మారవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు ఆచితూచి ముందుకు సాగాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. 24,25 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ముఖ్య కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సమాజంలో విశేష గౌరవం పొందుతారు. ఆశించినంత ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు నూతనోత్సాహం. 25,26 తేదీల్లో మానసిక ఆందోళన. కుటుంబంలో సమస్యలు. గాయత్రీ ధ్యానం చేయండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

విద్యార్థులకు ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితల యత్నాలు సఫలం. 20,,21 తేదీల్లో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. శారీరక రుగ్మతలు. ఆంజనేయ దండకం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

పనులు సకాలంలో పూర్తి అవుతాయి. పట్టుదల, నేర్పుతో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. రాబడి పెరుగు పడుతుంది.స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు.  నిరుద్యోగులు అవకాశాలు దక్కుతాయి.  వ్యాపారులకు పెట్టుబడులు ఊరటనిస్తాయి. ఉద్యోగస్తులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. 24,25 తేదీల్లో దుబారా ఖర్చులు. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి.

About Author

By editor

Twitter
Instagram