జనవరి 12న – ఇద్దరు కారణజన్ముల పుట్టుక ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మత లను రూపుమాపింది. ఇందులో ఒకరు భారతీయుల మనోమస్తిష్కాన్ని పట్టిపీడిస్తున్న ఆత్మవిస్మృతిని, జడత్వాన్ని వదలగొట్టి నరనరాన జాతీయవాదాన్ని నింపి ‘ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్‌ ‌నిబోధత’ అంటూ చికాగోలో కొలంబస్‌ ‌హాలు వేదికగా గర్జించి భారతదేశ సనాతన ధర్మ శంఖారావాన్ని పూరించిన స్వామి వివేకానంద. కాగా మరొకరు అనేక ప్రాణాంతక వ్యాధులకు మందుల ద్వారా శాశ్వత పరిష్కారాన్ని చూపి, మానవుడు ప్రకృతిని శోధించి పరిశీలించే శక్తిని తనకు తానుగా ఉద్ధరించుకునే మేధస్సును సాధించగలగా లంటూ అమెరికాలోని లెడర్లే ప్రయోగశాల వేదికగా ఎన్నో ఔషధాలను రూపొందించిన మందుల మాంత్రికుడు, వైద్య, జీవరసాయన శాస్త్రరంగానికే ధృవతారగా నిలిచిన యల్లాప్రగడ సుబ్బారావు.

‘రాబోయే పదిహేను వందల సంవత్సరాల వరకూ నా వాణి వినిపిస్తూనే ఉంటుంది’

– స్వామి వివేకానంద.

మన రుషులు అందించిన వేదాంత విజ్ఞానాన్ని, సంస్కృతిని, ప్రపంచానికి చాటిచెప్పిన ఆధునిక రుషివర్యుడు స్వామి వివేకానంద. ‘నేను హిందువుని’ అని సగర్వంగా చాటుతూ విశ్వవేదికపై విశ్వమతాన్ని బోధించిన మహనీయుడు. 15 వందల సంవత్సరా లకే కాదు ఈ యుగానికి అవసరమైన అన్ని విషయాలను బోధించిన ఆ యుగాచార్యుడు స్పృశించని అంశం అంటూ ఏదీ లేదు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో విడమర్చి చెప్పిన ఆయన బాటలో పయనించినపుడే ఈ దేశం విశ్వగురువుగా అవతరించగలదు. ‘ఆధ్యాత్మికతే ఈ దేశానికి జీవగర్ర’ అని అంటారు వివేకానందులు. ఒకప్పుడు ఆధ్యాత్మిక భూమిగా ఖ్యాతిగడించిన భారతావనిలో హేతువాదం, భౌతికవాదం పేరుతో నిర్వీర్యమవుతున్న భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని పునర్జీవింపజేయటానికి ఆయన పాశ్చాత్య దేశాలలో పర్యటించారు. వివేకానందుడు ప్రతి మాట ఒక అగ్నికణమే. అలాంటి ఆ మహనీయుని మాటలు వక్రీకరించి తమ మతానికి అన్వయించుకుంటూ కొన్ని క్రైస్తవ మిషనరీ సంస్థలు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నాయి.

 మత స్వేచ్ఛ పేరుతో స్వామి వివేకానంద బోధించిన అంశాలలో కొన్నింటిని క్రైస్తవానికి అన్వయిస్తూ ప్రచారం చేసుకోవటం అతి హేయం. వివేకానందుడు బోధించిన ‘ముక్తి, మోక్షం’ అనే అంశాలను తీసుకుని క్రైస్తవ మిషనరీ సంస్థలు క్రీస్తు మార్గంలో పయనిస్తే వాటిని చేరుకోవచ్చు అని నిస్సిగ్గుగా కరపత్రాలు వేసుకుని ప్రచారం చేశాయి, చేస్తున్నాయి కూడా. ఆ కరపత్రాలలో స్వామి వివేకా నంద ఫోటోను సైతం వేసి ఆ యుగాచార్యుడు బోధించిన భారతీయ సనాతన ధర్మ ప్రచారానికి తూట్లు పొడుస్తున్నాయి.

తిరుచిరాపల్లి (తమిళనాడు) క్రైస్తవ మిషనరీ సంస్థలు కొన్నేళ్ల క్రితం చేసిన ప్రచారం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. ఈ ప్రచారం చేసే వ్యక్తులకు ఇసుమంతైన ఆధ్యాత్మిక పరిజ్ఞానం లేదనుకోవాలి. ‘అన్ని మతాలు ఒక్కటే. అన్నీ ఒకే గమ్యానికి చేరువ చేస్తాయని’ వివేకానందుడు చెప్పిన మాటలను వక్రీకరిస్తూ, ‘స్వర్గం, దేవుని రాజ్యం అనే పడికట్టు పదాలను ఉపయోగిస్తూ వాటిని వల్లిస్తూ హిందువులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. క్రైస్తవం తీసుకుంటే స్వర్గద్వారాలు తెరుచుకుని దేవుని రాజ్యంలోకి వెళ్లవచ్చునని చెబుతున్నాయి.

వివేకానందుడు ఏమి బోధించారు? తామరాకు మీది నీటి బొట్టులా నిస్సంగత్వంతో ఉంటేనే మనిషి ఆధ్యాత్మిక మార్గం వైపు పయనించ గలడన్నారు. భగవంతుడి సాన్నిధ్యం పొందాలనే తీవ్రమైన కోరికను పెట్టుకుంటే మనసు పవిత్రమై మోక్ష మార్గం వైపు పయనించగలమని నమ్మా రాయన. ప్రపంచంలోని ప్రతి అంశాన్ని దైవ స్వరూపంగా భావించి సేవ చేయండని చెబుతూ ఆయన తన గురువు పేరుతో రామకృష్ణ మిషన్ను స్థాపించారు. ‘ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయచ’ అనే వేదోక్తిని నినాదంగా చేశారు. వివేకానందుడు ప్రతి మనిషిని ‘అమృతపుత్ర’ అని సంబోధించారు. ఏ కొండ గుహల్లోకో వెళ్లి తపస్సు చేసి సిద్ధి (మోక్షం, ముక్తి)ని పొందక్కర్లేకుండా ఆధ్యాత్మిక సాధకుడు ‘కర్మ, రాజ, జ్ఞాన, భక్తి యోగాలను అభ్యసిస్తూ, జనారణ్యంలోనే ఉంటూ ఆత్మసాక్షాత్కరం పొంద వచ్చని బోధించారు. ఈ నాలుగు యోగాలలో ఏది అనుసరించి చేయగలవో దాన్ని ఎంచుకుని ముక్తిని పొందమని ఉద్భోదించారు.

స్వామి వివేకానందుడు బోధించిన ఇలాంటి జ్ఞాన సంపద ‘వాయిస్‌ ఆఫ్‌ ‌స్వామి వివేకానంద, జ్ఞానదీపం’ అనే పుస్తకాల్లో ప్రచురించారు. దీనిని వక్రీకరించే ప్రయత్నం జరిగింది. కాని క్రైస్తవ మిషనరీ సంస్థలు స్వామీజీ ఫోటోతో స్వర్గం, దేవుని రాజ్యం, దేవుడితో ఉండటం అనేవీ మోక్షంతో సమానమని చెబుతూ కరపత్రాలతో ప్రచారం చేస్తున్నాయి. కానీ వక్రీకరణలతో హిందువులు తమ గొప్ప ఆదర్శాన్ని ఎన్నటికీ మర్చిపోరు. సంసారం, స్వర్గం వంటి వాటికోసం అర్రులు చాచకుండా చింతనతో అసాధారణమైన ఆనంద బ్రహ్మాన్ని పొందుతారు.

‘‘సత్‌ ‌చిత్‌ ఆనందమే (సచ్చిదానందం) సమస్త చైతన్యానికి, మానవ జన్మ పరిపూర్ణతకు మూలమని విశ్వసిస్తూ.. ఆ మార్గంలోనే జీవిత పర్యంతం ప్రయాణించి ఆధ్యాత్మిక అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటారు. అలా చేయని మానవ జన్మ వ్యర్థం. కుక్క చావు కన్నా హీనం’’ అన్నారు వివేకానంద.ఈ సందేశం ఎంతో శక్తిమంతమైంది. మానవ జన్మ అంతిమ లక్ష్యం ముక్తి అని ఆయన నొక్కి వక్కాణించారు. అంతేకాని స్వర్గానికి వెళ్లటం, దేవుడి రాజ్యంలోకి ప్రవేశించటం అనేవి మోక్షానికి మార్గం అని ఆయన తన సందేశంలో పేర్కొనలేదు. ఇలాంటి శక్తిమంతమైన సందేశాన్ని అల్పమైన ‘స్వర్గానికి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశం’ అంటూ క్రైస్తవ మిషనరీ సంస్థలు వక్రీకరిస్తున్నాయి. మన హిందూ మతంలో కూడా స్వర్గం గురించి ప్రస్తావన ఉన్నది. పుణ్యం ఉన్నంతవరకు స్వర్గానికి వెళ్లి స్వర్గసుఖాలు అనుభవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. రంభ, ఊర్వశీలతో నృత్యాలు చేసి, పుణ్యం అయిపోగానే వెళ్లిపోయే పర్యాటక ప్రాంతం స్వర్గం. అంతేకాని స్వర్గానికి వెళ్లటమే అంతిమ లక్ష్యం కానేకాదు. ఎవరైతే నైతిక జీవనాన్ని ఆచరిస్తూ పుణ్య కార్యాలు చేస్తారో వారు స్వర్గతుల్యమైన జీవితాన్ని పొందుతారు.

బైబిల్‌ ‌చెప్పేదేమిటంటే.. స్వర్గంలో దేవుడే నివశిస్తుంటాడు. మానవులకు చోటు లేదు. ఎవరైతే దేవుని కృపకు (ఆయన ఇచ్చే తీర్పు ఆధారంగా) పాత్రులవుతారో వారు దేవుడు నివశించే స్వర్గానికి వెళతారు. ఎవరైతే జీసస్‌ ‌ను నమ్మరో, ఆయనను అనుసరించరో వారు దేవుని తీర్పు ప్రకారం నరకానికి వెళతారు. వారి శరీరాలను మంటల్లో కాల్చుతారు. జీసస్‌ను నమ్మనివారిని పదే పదే మంటల్లో వేసి కాల్చుతారు అని బైబిల్‌ ‌చెబుతుంది. ఇలా మంటల్లో వేసి హింసించేందుకు కాల్చేసిన శరీరాన్ని బతికించి మళ్లీ కాల్చుతారు.

ఎవరైతే జీసస్‌ను నమ్ముతారో, అనుసరిస్తారో వారు సరాసరి స్వర్గానికి వెళతారు. భూమిపై జీవించిన శరీరమే ఆత్మ సహా స్వర్గానికి చేరు కుంటుందని బైబిల్‌ ‌వివరిస్తోంది. కాని ఆ శరీరాలు స్వర్గంలో ఏమి చేస్తాయో బైబిల్లో చెప్పలేదు. బహుశా వారు స్వర్గంలోని బాల్కనీలో నిలబడి నరకంలో కాలుస్తున్న పాపాత్ములను చూస్తుంటారు అనుకుంటా.

ఇక తరువాత ఎపిసోడ్లో దేవుని రాజ్యం వెనుక ఉన్న మనోహరమైన కల్పనను చూద్దాం.

జెరూసలేం దేవుడు సృష్టించిన రాజ్యం! దేవుని రాజ్యం అంటే దేవుడే కొత్తగా జెరూసలేం అనే పట్టణాన్ని నిర్మించాడు. ఇక్కడే దేవుడు స్వర్గాన్ని ఏర్పాటుచేశాడు. 12 తెగలకు చెందిన 1,44,000 మంది యూదులు ఈ స్వర్గంలో దేవుడితో పాటు శాశ్వతంగా నివశించటానికి ఎంపికయ్యారు (source: revelation 7:4-8, 21: 4 Holy Bible, The Gideons).

జెరూసలేం అనే పట్టణాన్ని, బైబిల్‌ ‌దేవుడి ఆలయాన్ని బాబిలోన్‌ ‌రాజు నెబుచాడ్నెజార్‌ 586 ‌బీసీలో ధ్వంసం చేశాడు. అపుడు దేవుడు కూడా రక్షణ పొందాడు. (Source:Ezekiel 10: 4, 18, 19 and 11:23). ఈ సందర్భంగా దేవుడు, ‘యూదులను ఈ రాజ్యానికి మళ్లీ తీసుకువస్తానని’ వాగ్దానం చేసినట్లు ఒక కథనం ఉంది. తదనంతరం మరో కల్పిత గాథ కూడా వెలుగులోకి వచ్చింది. (source:Zechariah 8: 3,7,8). ఈ రాజకీయ వాగ్దానం వాస్తవమేనని నమ్మించే క్రమంలో మరో కల్పిత కథ తీసుకువచ్చారు. అదేమిటంటే .. ‘దేవుడు దేవుని రాజ్యాన్ని స్వర్గంలో నిర్మించాడు. దేవుడు ఇచ్చిన తీర్పు రోజునే ఆ స్వర్గం భూమి మీదకు వస్తుంది. ఎవరైతే జీసస్‌ను నమ్ముతారో వారిని దేవుని రాజ్యంలోకి తీసుకువెళతాడు’. వినోదం కలిగించే ఈ కథ వివేకానందుడు ఒక దెబ్బతో కూల్చివేశాడు. స్వర్గం, దేవుని రాజ్యం అనే ఈ రెండూ కూడా పదార్థం కిందకు వస్తాయి. రూపం, స్థానం కలిగిన ఈ రెండింటిని సృష్టించటం, అభివ్యక్తీకరించటం, రద్దు చేయటం అనేవి విశ్వ నియమాల కిందకు వస్తాయి. కాబట్టి ‘స్వర్గం, దేవుని రాజ్యం’ శాశ్వత మైనవి కాదని వివేకానందుడు తేల్చిచెప్పారు. ఏసుక్రీస్తు జీవితాన్ని పాశ్చాత్య ప్రజలు విభిన్న విధాలుగా పేర్కొంటారు. ఒక వ్యక్తి ఆయనను గొప్ప రాజకీయవేత్తను చేస్తాడు. మరొకరు సైనిక జనరల్‌ ‌గానూ, ఇంకొకరు గొప్ప దేశభక్తి కలిగిన యూదుడు అని కూడా అంటారు. ఏసు పుట్టిన ఐదు వందల సంవత్సరాలలోపు కొత్త నిబంధన రాశారా లేదా అనేది ముఖ్యం కాదు. ఆ జీవితం ఎంత వరకు నిజం? క్రీస్తు కేవలం చారిత్రక వ్యక్తి అనే బైబిల్‌లో ఉంది. జీసస్‌ అనే పేరుతో ఒక వ్యక్తి పుట్టాడనే వివాదం కూడా ఉంది. కొత్త నిబంధనలతో వెలువడిన నాలుగు పుస్తకాలలో (బైబిల్‌) ‌సెయింట్‌ ‌జాన్‌ అనే వ్యక్తి రాసిన పుస్తకంలో ఆయన ఇవన్నీ అవాస్తవాలని పేర్కొనటం గమనార్హం. మిగిలిన మూడు పుస్తకాలలోని సారాంశం ప్రాచీన పుస్తకాల నుంచి సంగ్రహించిందే. దేవుని తీర్పు అనేది కూడా ప్రాచీన గ్రంథాల నుంచి సంగ్రహించి దీనిని జీససు ఆపాదించటం గమనార్హం. (C.w. Vol Vll p 370)

ఏసు యూదులలోనే జన్మించాడని అంతా విశ్వసిస్తున్న కాలంలోనే మరో ఇద్దరు చరిత్రకారులు జన్మించారు. వారు జోసెఫ్‌, ‌ఫిలో. వీరు యూదుల లోని చిన్న చిన్న వర్గాలను సైతం విపులంగా పేర్కొన్నారు గానీ ఎక్కడా జీసస్‌ ‌లేదా క్రిస్టియన్స్ ‌గురించి ప్రస్తావించలేదు. రోమన్‌ ‌జడ్జిని క్రాస్‌ ‌మీద ఉరితీసినట్లు ఒకే ఒక వాఖ్యంలో జోసెఫ్‌ ‌తన గ్రంథంలో పేర్కొన్నారు. దీనిని నిరూపించారు కూడా (c.w. Vol VII p 370). మరొక క్లిష్టమైన అంశం ఏమిటంటే కొత్త నిబంధనలలో బోధించే సూక్తులు, సూత్రాలు క్రైస్తవ శకానికి ముందే యూదులలో ఉనికిలో ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన హిల్లేలు, తదితరులు వీటిని బోధించారు (c.w. Vol Vll p 370-371).

‘పిరికితనానికి మించిన పాపం లేదు’ అని వివేకానంద తన బోధనలలో అంటారు. బైబిల్‌ ‌బోధించే కొన్ని అంశాలకు ఆయన ముక్కు సూటిగా సమాధానం ఇచ్చారు. ఎవరైనా వచ్చి, ‘మీరు నా రక్తం ద్వారా రక్షించబడతారు’ అంటే.. నేను వెంటనే ఇలా చెబుతా.. ‘సోదరా వెళ్లిపో.. నేను నరకానికే వెళతాను. ఎందుకంటే స్వర్గానికి వెళ్లడానికి నేను ఇతరుల రక్తాన్ని తీసుకునేంత పిరికివాడిని కాను, నేను నరకానికి వెళ్లటానికి సిద్ధంగా ఉన్నాను’ అని నిర్భయంగా చెబుతాను. స్వామీజీ పలికిన ఈ మాటలు ఆనాడు యూదుల దేశమైన ఇజ్రాయిల్లో ప్రబలంగా ఉన్న మరణశిక్షలకు సంబంధించినవే. ఎందుకంటే ఇజ్రాయిల్లో ప్రబలంగా ఉన్న సాంప్ర దాయ మరణశిక్ష ప్రకారం ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి తాడుతో చెట్టుకు ఉరితీసి వేలాడదీసేవారు. ఏసును ఉరితీశారని బైబిల్‌ ‌ధృవీకరిస్తోంది. ఈ విషయాన్ని బైబిల్లో స్పష్టంగా చెప్పారు. జెరూసలెంలో ఏసు చేసిన అన్ని పనులకు మేము సాక్షులం. ఇజ్రాయిల్‌ ‌ప్రజలు చెట్టుకు ఉరివేసి చంపారు (source: Acts 10:39 Holy Bible, the Gideons, International editioin, page 1075).

కానీ ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల నాటకకర్త, నోబెల్‌ అవార్డు గ్రహీత జార్జ్ ‌బెర్నార్డ్ ‌షా ఏసును ఉరి తీశారు అని చెప్పటాన్ని ఎగతాళి చేశాడు. ‘మానవత్వాన్ని రక్షించేందుకు ఏ వ్యక్తి అయిన సిలువ ఎక్కాడంటే అతనిని కచ్చితంగా మానసిక వైద్యుడి వద్దకు తీసుకువెళ్లి అతని తలని పరీక్షించాల్సిందే’ అని ఆయన అంటారు. జీసస్‌ను శిక్షించటానికి ఉరితీసి చంపారు. సిలువ వేయడం ద్వారా అతను తన జీవితాన్ని త్యాగం చేశాడనే ప్రశ్న తలెత్తదు. కాని మానవత్వాన్ని రక్షించేందుకు ఆయన తన రక్తాన్ని చిందించాడు అంటే మాత్రం అది కట్టుకథే. ఓ పెద్ద మోసం. మానవత్వాన్ని రక్షించడమన్న పేరుతో తప్పుదోవ పట్టించడానికి పలికిన అబద్ధాలు.

About Author

By editor

Twitter
Instagram