– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

తిరుపతిలో వైకాపా నిర్వహించిన ఆత్మగౌరవ ర్యాలీ తమను మోసం చేస్తున్న మరో ఉద్యమంగా సీమవాసులు పేర్కొంటున్నారు. సీమ అభివృద్ధి కోసం 85 ఏళ్లుగా ఉద్యమం జరుగుతోందని పేర్కొన్న ర్యాలీ నిర్వాహకులు ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌నుంచి నేటి వరకు రాష్ట్రాన్ని ఏలిన పార్టీల్లో కాంగ్రెస్‌దే అత్యధిక కాలమనే విషయం మరచిపోయినట్లున్నారు. కాంగ్రెస్‌, ‌తెదేపా, వైకాపా ప్రభుత్వాల కారణంగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్‌ (‌కడప), అన్నమయ్య (రాజంపేట), చిత్తూరు అనే 7 జిల్లాలతో కూడిన రాయలసీమజోన్‌ ఆం‌ధప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది. రాయలసీమపై నిజమైన ప్రేమ ఉంటే వైకాపా మూడున్నరేళ్లలో ఏం చేసిందో బహిరంగంగా ప్రకటించాలంటున్నారు వైకాపా పాలనలో రాయలసీమకు ‘నవమోసాలు’ జరిగాయని విమర్శిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం జిల్లాలో సెయిల్‌ ఆధ్వర్యంలో స్టీల్‌ ‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాల్సి ఉండగా వైకాపా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేక పోయింది.

కడప-రాయచోటి-మదనపల్లి-బెంగళూరు నూతన బ్రాడ్‌ ‌గేజ్‌ ‌రైలు మార్గం రాయలసీమ సర్వోతో ముఖాభివృద్ధి ఎంతో అవసరం. కాని వైకాపా ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వని కారణంగా పనులు నిలిచి పోయాయి. కృష్ణానదిపై గల ప్రాజెక్టులు ప్రధానంగా రాయలసీమలో ఉన్నాయి. అలాంటప్పుడు కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో కాకుండా విజయవాడలో పెట్టాలని చంద్రబాబు, విశాఖలో పెట్టాలని ముఖ్య మంత్రి లేఖలు రాయడం మోసం కాదా? తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడంతో సాగు నీటి, తాగునీటికి అల్లాడాల్సి వస్తోంది. వ్యవసాయం కొనసాగక, కనీసం పశువులకు గడ్డి లభించక కబేళాలకు తరలిపోతున్న సంఘటనలు నేటికి కనిపిస్తున్నాయి. పారిశ్రామికాభివృద్ధి లేక నిరుద్యో గులు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. పది ఎకరాలున్న ఆసామి కూడా బెంగళూరు, చెన్నైలకు వెళ్లి వాచ్‌మన్‌లుగా పనిచేస్తున్నారు.

 తిరుమల తిరుపతి దేవస్థానంలో శాశ్వత ఉద్యోగులను భర్తీ చేయాల్సినవి 8 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని టీటీడీ ప్రకటించింది. ప్రెసిడెన్షి యల్‌ ఉత్తర్వుల ప్రకారం రాయలసీమ వాసులకు 75 శాతం కేటాయించాలి. ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ‌కార్మికులు 16 వేల మందిని తాము అధికారంలోకి వస్తే పర్మినెంట్‌ ‌చేస్తామని పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్‌ ‌రెడ్డి ఇచ్చిన హామీ ఆశగానే మిగిలి పోయింది. జేఎన్‌టియు అనంతపురం, కలి కిరి, పులివెందుల, పద్మావతి, ఎస్వీయూ, అగ్రికల్చర్‌, ‌వెటర్నరీ, సంస్కృత విశ్వవిద్యాలయాలలో బోధనబోధనేతర ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం లేదు. రాయల సీమకు తలమానికమైన స్విమ్స్, ‌రుయా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు లేవు.

 ఇక ఎగువ రాష్ట్రమైన తెలంగాణ నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను నిర్మి స్తోంది. ఇవి పూర్తి అయితే శ్రీశైలం రిజర్వాయర్‌కు చుక్క నీరు దక్కద. దీంతో సీమ ప్రాజెక్టులన్నీ నిరుపయోగం అవుతాయి. ఇంత జరుగుతున్నా వైకాపా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం శోచనీయం. ‘సీమ’లోనే ఎక్కువ వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. వీటికి స్మార్ట్ ‌మీటర్లు బిగించి ఉచిత విద్యుత్‌ ‌సరఫరా పథకాన్ని ఎత్తివేస్తే ఎక్కువగా నష్ట పోయేది రాయలసీమ రైతులే.

రాయలసీమ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోంది బీజేపీయే. కేంద్రంలో ఆ పార్టీ ప్రభుత్వం వచ్చాక ప్రధాని నరేంద్రమోది ఎనిమిదేళ్లుగా ఈ ప్రాంత అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. వాటిలో ఉదాహరణ పూర్వకంగా సమీక్షిస్తే….

తిరుపతిలో అభివృద్ధి

తిరుపతి జిల్లాకు మూడు ప్రముఖ కేంద్ర విద్యా సంస్థలను నరేంద్ర మోదీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇండియన్‌ ఇన్ట్సిట్యూట్‌ ఆఫ్‌ ‌సైన్స్ ఎడ్యుకేషన్‌ అం‌డ్‌ ‌రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్‌), ఇం‌డియన్‌ ఇన్ట్సిట్యూట్‌ ఆఫ్‌ ‌టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్మర్మేషన్‌ ‌టెక్నాలజీ (ఐఐఐటీ) ఏర్పాటయ్యాయి. ఇండియన్‌ ‌కలినరీ ఇన్ట్సిట్యూట్‌ను ఏర్పాటు చేసింది. భారత్‌ ‌మాల ఫేజ్‌ -1 ‌కింద 1863 కోట్ల వ్యయంతో రేణిగుంట – పొయ్య – నాయుడు పేటల మధ్య ఎన్‌ ‌హెచ్‌-71 ఆరు వరుసలుగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయికి అప్‌‌గ్రేడ్‌ అయింది. తిరుపతిని స్మార్ట్ ‌నగరాల జాబితాలోని చేర్చి మొత్తం 87 అభివృద్ధి ప్రాజెక్టులకు  రూ.1695.70 కోట్లు కేటాయించింది. తిరుపతి రైల్వే స్టేషన్‌ను 77 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునికరించింది. శీకాళహస్తి పట్టణంలో 452 తాగునీటి కుళాయిలు కల్పించడంతో పాటు రెండు పార్కుల అభివృద్ధికి రూ.1.87 కోట్ల రూపాయలు కేటాయింపు. పీఎంఏవై-అర్బన్‌ ‌కింద సుమారు 2.15లక్షల ఇళ్లు మంజూరు చేసింది. పీఎం కిసాన్‌ ‌సమాజ్‌ ‌యోజన కింద 4.3 లక్షల మందికి పైగా అబ్ధిపొందారు.

కర్నూలులో అభివృద్ధి

కర్నూలు జిల్లాలో 125 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్రం ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ, డిజైన్‌ అం‌డ్‌ ‌మాన్యుఫేక్చరింగ్‌ ‌సంస్థను ఏర్పాటు చేసింది. కర్నూలు – నందికొట్కూరు – ఆత్మకూరు – దోర్నాల జాతీయ రహదారిని 1254 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. భారత్‌ ‌మాల ఫేజ్‌-1 ‌కింద రూ.91.55 కోట్లతో కర్నూలులోని ఐటీసీ జంక్షన్‌, ‌డోన్‌లోని కంబాలపాడు జంక్షన్‌, ఎన్‌ ‌హెచ్‌-44‌లో డోన్‌ ఎగ్జిట్‌ ‌వద్ద స్లిప్‌ ‌రోడ్లతో పాటు రూ.91,55 కోట్లతో ఆరులేన్‌ల గ్రేడ్‌ ‌సెపరేటెడ్‌ ‌నిర్మాణం జరుగుతోంది.

 రూ.6260 కోట్ల అంచనా వ్యయంతో 626 కిలోమీటర్ల అభోలా-జోన్‌ ‌రైల్వే లైను డబ్లింగ్‌ ‌మంజూరైంది. కర్నూలులో రూ.283 కోట్ల అంచనా వ్యయంతో మిలైఫ్‌ ‌కోచ్‌ ‌ఫ్యాక్టరీ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.జిల్లాకు పీఎం ఆవాస్‌ ‌యోజన కింద 1,54,595 గృహాలు మంజూరయ్యాయి. కర్నూలులో 1000 మెగావాట్ల సోలార్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ఏర్పాటవుతోంది.

నంద్యాలకు కేటాయింపులు

చాలా ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న నంద్యాల – ఎర్రగుంట్ల రైలుమార్గం పనులను కేంద్ర ప్రభుత్వం రూ.967 కోట్లతో పూర్తి చేసింది. అలాగే రూ.39.89 కోట్లతో నంద్యాల – డోన్‌ ‌మధ్యలో రోడ్‌ ఓవర్‌ ‌బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు.

అనంతపురంలో అభివృద్ధి

పాలసముద్రం, గోరంట్లలో 1200 ఎకరాలో దేశంలోనే అతిపెద్ద క్షిపణి వ్యవస్థ, తయారీ, అనుసంధాన కేంద్రం బీఈఎల్‌ ‌స్థాపించారు. అనంతపురంలో సెంట్రల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటైంది. గార్లెదిన్నలోని ఉన్న సదరన్‌ ‌రీజియన్‌ ‌ఫార్మ్ ‌మెషినరీ ట్రైనింగ్‌ అం‌డ్‌ ‌టెస్టింగ్‌ ఇన్స్టిట్యూట్‌ 4000 ‌మంది రైతులు, 100 మంది సాంకేతిక నిపుణులకు శిక్షణనిచ్చింది..

తాడిపత్రి మండలం తలారిచెరువులో 500 మెగావాట్ల సోలార్‌ ‌పవర్‌ ‌ప్లాంటు ఏర్పాటు చేశారు.

 రూ.995 కోట్ల అంచనా వ్యయంతో కర్నాటక సరిహద్దు నుండి గుత్తి వరకు 4 వరుసల ఎన్‌హెచ్‌ 63 అభివృద్ధి, రూ. 345 కోట్లతో గుంతకల్‌- ‌రాయచూర్‌ ‌మధ్య 81కి.మీ రైల్వే లైన్‌ ‌డబ్లింగ్‌ ‌పనులుచేపట్టారు. తాడిపత్రిలో రూ.2.04 కోట్లతో 3 పార్కుల అభివృద్ధి పనులు జరిగాయి. దక్షిణ భారతదేశంలోని మొదటి కిసాన్‌ ‌రైలు అనంతపురం నుండి ఢిల్లీకి ప్రారంభించారు.

సత్యసాయి జిల్లాలో అభివృద్ధి

శ్రీ సత్యసాయి జిల్లాలో రూ. 600 కోట్లతో నిర్మించే నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌కస్టమ్స్, ఎక్సైజ్‌, ‌నార్కోటిక్స్ (ఎన్‌ఎసిఈఎన్‌)‌కు శంకుస్థాపన చేశారు. మేక్‌ ఇన్‌ ఇం‌డియా పథకం కింద రూ.13000 కోట్ల వ్యయంతో దక్షిణ కొరియా కంపెనీ ద్వారా కియా కార్ల తయారీ సంస్థ ఏర్పాటైంది. దీని ద్వారా లక్ష మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించింది. ఎన్‌పి కుంటలో 1500 మె.వా. అల్ట్రా మెగా సోలార్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ‌స్థాపించారు. 714 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన గుత్తి-ధర్మవరం మధ్య 91 కిలోమీటర్ల రైల్వే లైన్‌ ‌డబ్లింగ్‌ ‌పనులు తుది దశలో ఉన్నాయి. ధర్మవరం-పాకాల-కాట్పాడి మధ్య 290 కిలోమీటర్ల రైల్వే లైను డబ్లింగ్‌ ‌రూ.2900 కోటలో మంజూరైంది. ధర్మవరం-యెలహంక మధ్య 304 కిలోమీటర్ల రైలు మారం విద్యుద్దీకరణ పూర్తయింది.

వైఎస్‌ ఆర్‌ (‌కడప) జిల్లాలో అభివృద్ధి

కేంద్ర ప్రభుత్వ ఆస్పిరేషనల్‌ ‌జిల్లాల కింద ఈ జిల్లా ఎంపికైంది. భారత్‌ ‌మాల ఫేజ్‌-1 ‌కింద, కర్నూలు నుంచి కడప ఎన్‌హెచ్‌ – 40 (‌గతంలో ఎన్‌హెచ్‌ 18) ‌రహదారి రూ.835 కోట్లతో, మైదుకూరు-బద్వేల్‌ ‌మధ్య 4 లేన్ల రహదారి అభివృద్ధి చేశారు. ఎన్‌హెచ్‌-716 ‌కడప జిల్లా చిన్న ఓరంపాడు నుంచి నాలుగు లైన్ల అభివృద్ధి పనులు చేపట్టారు. కడప విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ ‌భవనాలు పనులు కొనసాగుతున్నాయి. మైలవరం మండలంలో 1000 మె.వా. ఆల్ట్రా మెగా సోలార్‌ ‌పార్క్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. రూ. 967 కోట్లతో నంద్యాల నుంచి యర్రగుంట్ల వరకు 123 కి.మీ. కొత్త రైల్వే ట్రాక్‌ను పూర్తి చేశారు. కడప-బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్‌ ‌రూ. 3,038 కోట్ల అంచనాతో మంజూరైంది. రూ. 435 కోట్లతో చేపట్టిన 224 కి.మీ రేణిగుంట గుంతకల్‌ ‌విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి.

అన్నమయ్య జిల్లాలో అభివృద్ధి

అన్నమయ్య (రాజంపేట) జిల్లాలో, భారత్‌ ‌మాల ఫేజ్‌-2 ‌కింద మంజూరైన మదనపల్లిపీలేరు – పీలేరు నుంచి ఎన్‌హెచ్‌-71 ‌నుండి చెర్లోపల్లి వరకు 4 లేన్‌ల రహదారి అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. అమృత్‌ ‌పథకం కింద మదనపల్లెలో రూ.1.83 కోట్లతో 5070 నీటి కనెక్షన్లు, 3 పార్కుల అభివృద్ధి పనులు చేపట్టారు. ఓబులవారిపల్లె-కృష్ణపట్నం మధ్య నిర్మించిన 113 కి.మీ. రైల్వే లైన్‌ ‌రూ.1165 కోట్లతో పూర్తయింది. రూ.2900 కోట్ల అంచనా వ్యయంతో ధర్మవరం-పాకాల కాట్పాడి డబ్లింగ్‌ ‌మంజూరైంది..

చిత్తూరు జిల్లాలో అభివృద్ధి

భారత్‌ ‌మాల ఫేజ్‌ -1 ‌కింద చిత్తూరు జిల్లాకు భారీస్థాయిలో కేటాయింపులు జరిగాయి. బెంగుళూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్‌ ‌వేలో బంగారుపాళ్యం – గుడిపాల సెక్షన్‌ ఆరులేన్ల రహదారిని నిర్మించారు. నలగమపల్లి మీదుగా వెళ్లే ఎన్‌ ‌హెచ్‌ 69‌ను 575 కోట్లతో, చిత్తూరు – తాచూర్‌ ‌హైవేను 1500 కోట్లతో అరు వరుసలుగా అభివృద్ధి చేస్తున్నారు. చిత్తూరు – మల్లవరం రహదారిని రూ.1800 కోట్లతో అభివృద్ధి పరుస్తున్నారు. చిత్తూరు జిల్లా కొక్కొరాలకొండలో ట్రెయినింగ్‌ ఆఫ్‌ ‌ట్రూప్స్ అం‌డ్‌ ‌పర్సనల్‌ ‌ఫెసిలిటీ సెంటర్‌ను రూ. 600 కోట్లతో నెలకొల్పారు. అలాగే ఏర్పేడు, సత్యవేడు, రేణిగుంట మండలాలలోని 708.67 ఎకరాలలో 500.96 కోట్ల వ్యయంతో గ్రీన్‌ ‌ఫీల్డ్ ఎలక్ట్రానిక్‌ ‌మ్యాన్యుఫాక్చరింగ్‌ ‌క్లస్టర్‌ అభి వృద్ధి చేస్తున్నారు. కుప్పం – మరికుప్పం మధ్య 25 కిలోమీటర్ల రైల్వే లైన్‌ ‌నిర్మాణానికి రూ.249 కోట్లు, శ్రీనివాసపురం – మదనపల్లిల మధ్య 75 కిలోమీటర్ల నిడివితో మరో రైలు మార్గం నిర్మాణానికి రూ.466 కోట్లు రైల్వే శాఖ చేసింది. అమృత్‌ ‌పథకం కింద 2.43 కోట్ల రూపాయలతో 2575 కుళాయి కనెక్షన్లు, మూడు పార్కులను అభివృద్ధి చేయనున్నారు.

 

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram