– తురగా నాగభూషణం

తెలుగు రాష్ట్రాల్లో పీఎఫ్‌ఐ ‌ముఠా అరెస్టులు, వెల్లడించిన సమాచారంతో శాంతిభద్రతలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన వేర్పాటువాద ఉగ్రవాదం ఉనికి ఇప్పుడు ఆంధప్రదేశ్‌కూ పాకింది. దీనికంటే ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటంటే, ఉగ్రవాదులను అణచివేయాల్సిన రాష్ట్ర పోలీసులు చూసీ చూడనట్లు వదిలేయడం. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ (ఈడీ)లు సోదాలు చేసి నిందితులను పట్టుకోకుంటే అసలు ఈ అంశం గురించి ఎవరికీ తెలిసేదే కాదు. తెలిసినా పోలీసు లను కట్టడి చేసే శక్తులు ప్రభుత్వాల్లో ఉన్నాయి. ఏడెనిమిది నెలల క్రితం ఉగ్రవాదుల ఉనికి రాయల సీమలో కనిపించినా ఉప ముఖ్యమంత్రి సహా కొందరు ఎమ్మెల్యేలు దర్యాప్తును ముందుకు సాగ నీయలేదు. పోలీసుల అదుపులో ఉన్న నిందితులు ఉగ్రవాద చర్యలకు శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిసినా వారిపై చిన్న చిన్న కేసులు నమోదు చేసి వదిలేశారు. అంతెందుకు నాలుగేళ్ల క్రితం గుంటూరు పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన ముస్లిం యువతను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుంటే, నిందితులు నిరుద్యోగులని, ఏమీ తెలియని వారని చెప్పి వత్తిడి తెచ్చి బయటకు తీసుకువచ్చిన పర్యవసానం ఇది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ముందస్తు జాగ్రత్తతో సోదాలు చేయబట్టి తెలిసింది లేకుంటే పెద్ద ప్రమాదాలు జరిగి భారీగా ప్రాణ, ఆస్తినష్టాలు సంభవించేవి.

దాడులు.. అరెస్టులు

 అతివాద ఇస్లామిక్‌ ‌సంస్థ పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా (పీఎఫ్‌ఐ) ఉ‌గ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలతో ఎన్‌ఐఏ, ఈడీ బృందాలు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో దాని కార్యాలయాలు, ఆ సంస్థ సభ్యుల ఇళ్లపై దాడులు చేపట్టడమే ప్రజలలో ఇంతటి అందోళనకు కారణం. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాద శిక్షణ శిబిరాల నిర్వహణ, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడం, నిషేధిత సంస్థల్లో చేరేలా ప్రజలను ప్రోత్సహించడం వంటి అభియోగాలతో 98 చోట్ల దాడులు నిర్వహించి 109 మందిని ఆ బృందాలు అరెస్టు చేయగా వారిలో ఆంధప్రదేశ్‌ ‌నుంచి అయిదుగురు ఉన్నారు. ఈ సోదాల్లో పలు పత్రాలను, ఆయుధాలను, ఇస్లామిక్‌ ఉ‌గ్రవాద సాహిత్యాన్ని, కంప్యూటర్లను, లాప్‌టాప్‌ ‌లను, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఓటుబ్యాంకు రాజకీయం ప్రమాదం

ఆంధప్రదేశ్‌లో ఓటుబ్యాంకు రాజకీయాలు అతివాద సంస్థలకు మద్దతిచ్చేలా సాగుతున్నాయి. హిందూయేతర మతాల మద్దతుకోసం, వారి ఓట్ల కోసం ఎంతో ప్రేమను కురిపిస్తున్నాయి. వారిని సంతృప్తిపరచేందుకు బీజేపీ మినహా అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ఓట్ల శాతం పెంచుకునేందుకు పలు దేవాలయాల భవన సముదాయాల్లో వీరికి దుకాణాలు, శ్రీశైలం వంటి ఆలయ పరిసరాల్లో  పీఎంఏవై ఇళ్లు కేటాయించారు. పార్టీలిచ్చిన ఈ ప్రోత్సాహంతో హిందూయేతర మతాలు మత ప్రచారం, మత మార్పిడులపై దూకుడును ప్రదర్శిం చారు. హిందూ ధర్మాన్ని అవమానించడం, హిందూ ఆలయాలను, విగ్రహాలను ధ్వంసం చేయడం, హిందువుల ధర్మం, సంస్కృతిని అవమానపరచి రెచ్చగొట్టడం, అనుమతి లేకుండా అన్యమత ప్రార్ధనా మందిరాలు నిర్మించడం, అడ్డువచ్చినవారిపై దాడులకు దిగడం, అక్రమ గోవధకు ప్రయత్నం, హిందువులను ఊచకోత కోసిన టిప్పుసుల్తాన్‌ ‌విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నించడం వంటివి చేశారు. చర్చిలో క్రిస్మస్‌ ‌వేడుకలను నిర్వహించి, వినాయక చవితి మండపాలపై ఆంక్షలు విధించింది. ఈ అన్ని కార్యక్రమాలను అడ్డుకోవాల్సిన ప్రభుత్వాలు చూసి చూడనట్లు వదిలేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహాన్ని పీఎఫ్‌ఐ ‌తన కార్యకలాపాలకు అన్ని విధాల అనుకూలంగా ఉన్నట్లు భావించింది. రాయలసీమలో ముస్లింల జనాభా ఎక్కువ కాబట్టి అక్కడ ఆశ్రయం పొందింది. స్ధానిక యువతకు స్వయం ఉపాధి, శారీరక శిక్షణ ఇస్తున్నట్లు నటిస్తూ వారికి ఉగ్రవాద కార్యకలాపాల్లో తర్ఫీదు ఇచ్చింది. ఆత్మకూరులో అనుమతి లేని మసీదు నిర్మాణాన్ని ఆపడానికి ప్రయత్నించిన బీజేపీ నాయకుడిపై ఈ ఉగ్రవాద శిక్షణ తీసుకున్నవారు దాడికి దిగారని పోలీసు విచారణలో తేలింది. కర్నూలు జిల్లా ఎస్‌పి ఈ విషయాన్ని విలేకరులకు చెప్పినా దర్యాప్తు ముందుకు వెళ్లలేదు. నిందితులను వదిలేయడానికి కడప ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌భాషా, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సహకరించినట్లు బీజేపీ ఆరోపిం చింది. వీటన్నిటికీ ఓటుబ్యాంకు రాజకీయాలే కారణం. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం అతివాదులకు, వేర్పాటువాదులకు ప్రోత్సాహం ఇస్తే అది ఆ ప్రభుత్వం మెడకే చుట్టుకుంటుందని, పూర్వం జమ్ముకశ్మీర్‌, ‌మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన దాడులను బట్టి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆంధప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. వేర్పాటువాదులు, అతివాదులు ఏ మతం, కులం వారైనా వారు సంఘద్రోహులే. వారిని కట్టడి చేయకుంటే సమస్యలు తప్పవు. వారంతా ఫలానా మతం, కులం వారని, వారిని శిక్షిస్తే ఆయా వర్గాల ఓట్లు పోతాయని భావించడం వల్లే ఈ పరిస్థితి. పైగా ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే నిందితులను రక్షిస్తుంటే ఇక ప్రజాస్వామ్యం, శాంతిభద్రతలు ఏ రకంగా అమలౌతాయి?

About Author

By editor

Twitter
Instagram