సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌ ఆషాడ  బహుళ పంచమి – 18 జూలై 2022, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


మతాల వారీగా జనాభా పెరుగుదలలో అసమతౌల్యం ఉంటే అరాచక పరిస్థితులు తలెత్తుతాయని ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌వ్యాఖ్యానించారు. రెండు వారాల క్రితం లక్నోలో జనాభా స్థిరీకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ దూరదృష్టి, వాస్తవికతల కలబోతతోనే ఈ మాటలన్నారు. ప్రపంచ జనాభా వంద కోట్లకు చేరడానికి లక్షల ఏళ్లు పట్టి ఉండవచ్చు. ఆ వంద ఐదు వందల కోట్లకు చేరడానికి 183 నుంచి 185 ఏళ్లు చాలునని యోగి చెప్పడం శాస్త్రీయమే. ఉదాహరణ మన జనాభాయే! 1901లో జనాభా దాదాపు 238 మిలియన్‌. 1951‌కి అది 361 మిలియన్‌. 1991 ‌నాటికి 843 మిలియన్‌. 2001 ‌నాటికి 1.027 మిలియన్‌. 2011‌లో చూస్తే 1210 మిలియన్‌. ఇం‌తకీ యోగి వ్యాఖ్య హఠాత్తుగా అందరినీ ఆకర్షించడానికి కారణం ఏమిటి? అదే సమయంలో ఈ జన విస్ఫోటన వార్తలన్నీ ‘సంఘీల’ కల్పనలనీ, ప్రపంచ జనాభా దినోత్సవం కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ అల్లిందనీ ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ శరవేగంతో స్పందించడానికి కారణం ఏమిటి? ఆ రెండూ తెలుసుకోవలసినవే.

ప్రపంచ జనాభా దినోత్సవం (జూలై 11) సందర్భంగా ఐక్యరాజ్య సమితి భారత్‌ ‌నెత్తిన పెద్ద బాంబే పడేసింది. జనాభా విషయంలో భారత్‌ అతి తొందరలోనే చైనాను మించిపోనున్నది. అది కూడా వచ్చే ఏడాదికే. సమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల శాఖ ఇచ్చిన ఆ అంచనా ప్రకారం ఈ నవంబర్‌ 15 ‌నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంటుంది. 2030 నాటికి 850 కోట్లకు పరుగు తీస్తుంది. 2050 నాటికి 907 కోట్లను తాకుతుంది. 2080 నాటికి 1,004 కోట్లను చూస్తుంది. 2037 కల్లా ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాలుగా మధ్య ఆసియా, దక్షిణాసియాలు ఆవిర్భవిస్తాయని కూడా ఆ నివేదిక చెబుతోంది. కానీ తూర్పు ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో 2030 నాటికి జనాభా తగ్గడం మొదలవుతుంది. సమితి నివేదిక ప్రకారం 2022 సంవత్సరానికి ఆసియాలో తూర్పు, ఆగ్నేయ ఆసియా ప్రాంతాలు 203 కోట్లతో అత్యధిక జనాభా కలిగి ఉన్నాయి. ఇది ప్రపంచ జనాభాలో 29 శాతం. భారత్‌ ‌జనాభా ఈ ఏడాదికి 141.2 కోట్ల దగ్గర నిలిచి ఉంది. చైనా జనాభా 142.6 కోట్లు. కానీ 2050 నాటికి భారత జనాభా 166.8 కోట్లకు పాకుతుందని అంచనా. అప్పటికి చైనా జనాభా మాత్రం 131.7 దగ్గర ఆగి ఉంటుంది. ప్రపంచంలో జనాభా పెరుగుదల రేటు 1965 తరువాత సగానికి తగ్గిపోయింది. కారణం సంతానోత్పత్తి సామర్ధ్యం పతనం కావడమేనని సమితి నివేదిక చెప్పింది. మంచో చెడో ఆసియాకు ఈ బాధ లేదు.

సమితి నివేదిక చెప్పిన మరొక కీలక అంశం ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల జనాభాలో (మతాలు, వర్గాలవారీగా) వచ్చిన అసమతౌల్యానికి అంతర్జాతీయ వలసలు కారణమవుతున్నాయి. 2010-2021 మధ్య పది దేశాలలో ఇలాంటి వలసల వెల్లువ కనిపిస్తుంది. ఇవన్నీ పది లక్షలకు పైబడిన వలసలే. ఇందులో భారత్‌ ఒకటి. తాత్కాలిక కార్మికులుగా వీరంతా వెళుతున్నారు. ఇలా భారత్‌ ‌నుంచి వెళ్లిన వారి సంఖ్య 30.5 లక్షలు. కానీ రకరకాల పేర్లతో భారత్‌లోకి చొరబడుతున్న వారి వివరాలు లేవు. అవి ఇంకా ముఖ్యం. గమనించాల్సినదేమిటి అంటే, ఈ జన విస్ఫోటన వార్తలన్నీ బూటకాలేనని ఒవైసీ ఆలస్యం లేకుండా ప్రకటన ఇవ్వడం. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని అడ్డం పెట్టుకుని ఆర్‌ఎస్‌ఎస్‌ ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసే పని పెట్టుకున్నదని ఆయన అన్నారు. అంటే ఐక్య రాజ్యసమితి కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చెప్పుచేతల్లో ఉన్నదనే ఒవైసీ నమ్ముతున్నారా?

జన నియంత్రణను విజయవంతంగా నిర్వహించాలని యోగి అభిప్రాయపడడం వెనుక పెద్ద హేతువే ఉంది. జనాభాలో అసమతౌల్యం, వివిధ మతాల జనాభా పెరుగుదల రేటులో హెచ్చుతగ్గులు దేశంలో సంక్షోభానికి కారణమవుతాయని ఆయన చెప్పడం భవిష్యత్తుకు అద్దం పట్టేదే. కుటుంబ నియంత్రణ లేదా జనాభా స్థిరీకరణల గురించి మనం ప్రస్తావించినప్పుడు జనాభా నియంత్రణ పథకాన్ని విజయవంతం చేయడం మీద కూడా దృష్టి పెట్టాలని అన్నారాయన. ఇలాంటి విధ్వంసకర అసమతౌల్యాన్ని నివారించాలనీ చెప్పారు. కాబట్టి భారత్‌ ‌లేదా ప్రపంచం నిజంగా కలత పడవలసినది జన విస్ఫోటనాన్ని చూసి కాదు, అందులో వస్తున్న, తెస్తున్న అసమతౌల్యం గురించే.

ఒవైసీ ఉలికిపాటు ఇందుకే. ముస్లిం జనాభా మిగిలిన మతాల జనాభా కంటే నానాటికీ పెరుగుతున్న వాస్తవం బయటపడడం, అది చర్చకు తావివ్వడం ఆయనకు ఇష్టం ఉండదు. చాప కింద నీరులా సాగాలన్నదే వారి వ్యూహం. ఏ దేశంలో అయినా నేడు ముస్లిం జనాభాను పెంచుకోవడం, లేకుంటే దిగుమతి చేసుకోవడం జరుగుతున్నది. దీని కారణంగా భారత్‌తో పాటు చాలా పాశ్చాత్య దేశాల జనాభాలో మతాల వారీగా అసమతౌల్యం వచ్చిన మాటను దాచలేరు. ముస్లిం జనాభా పెరగడం, నిజానికి పెంచుకోవడం పథకం ప్రకారమే జరుగుతున్నది. ముస్లిం జనాభా ముస్లిం రాజ్యాలలోకి వెల్లువెత్తకుండా ముస్లిమేతర లేదా సెక్యులర్‌ ‌దేశాలకి వలస రావడం వెనుక పెద్ద పథకం ఉందన్నదీ నిజమేనని ప్రపంచ వ్యాప్తంగా చాలా సంఘటనలు ఇప్పటికే రుజువు చేశాయి. మన దేశంలోనే కొన్ని రాష్ట్రాలలోని కొన్ని మారుమూల ప్రాంతాలలో ముస్లిం జనాభా రాత్రికి రాత్రే పెరిగిపోవడం, అక్కడి నుంచి మిగిలిన వర్గాలు ఖాళీ చేయడం దేశం గమనించింది. దీనికి కొన్ని రాజకీయ పక్షాల అండ నిజం. ఈ నేపథ్యంలోనే యోగి ఆదిత్యనాథ్‌ ‌చెబుతున్న జనాభా స్థిరీకరణ పథకం గురించి ఆలోచించడం అవసరం. లేకుంటే, వచ్చే అనర్థాకు అంతే ఉండదు.

About Author

By editor

Twitter
Instagram