హిందువులు గర్వకారణంగా భావించే ఏ చరిత్ర పురుషుడికీ హిందూ దేశంలో చోటు లేకుండా చేయడం ఇవాళ్టి సెక్యులరిజం లక్షణం కాబోలు. ఇందుకు పోలీసుల, ప్రభుత్వాల సహకారం, స్థానిక నేతల ప్రోద్బలం దండిగా ఉండడమే అత్యంత దురదృష్టం. ఇక ముస్లిం రాజకీయ పార్టీల సంగతి సరేసరి. ఈ పార్టీలకీ, హిందువుల ఓట్లతో గెలిచే ‘సెక్యులర్‌’ ‌పార్టీలకి హిందూ వ్యతిరేకత లో విభజన రేఖ ఏదీ లేదు. తెలంగాణలోని బోధన్‌ ‌పట్టణంలో ఇటీవల ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకు అటంకాలు, ఉద్రిక్తతలకు దారితీసిన పరిస్థితుల వెనుక ఉన్నవి ఇలాంటి కారణాలే. బోధన్‌లో ఛత్రిపతి శివాజీ విగ్రహ ఏర్పాటు యోచన హిందువులలో పెరుగుతున్న జాతీయవాద భావజాలానికి ప్రతీక. శతాబ్దాలుగా స్వీయ విస్మృతికి లోనైన హిందూ సమాజం క్రమంగా తమ సంస్కృతీ వైభవాన్ని, దేశం కోసం తమ పూర్వులు చేసిన త్యాగాలను, వాస్తవాలను గ్రహిస్తూ మేల్కొంటున్న క్రమానికి తార్కాణం కూడా.


అధికారంలో ఉన్న ప్రాంతీయ, కుటుంబ పార్టీలు ఆయా రాష్ట్రాలలో తమను తాము (కుహనా) లౌకికవాదులుగా చిత్రీకరించుకోవాలని పడుతున్న జుగుప్సా కరమైన తపనకు ఇదొక వికృత దృష్టాంతం. బోధన్‌ ‌చరిత్రాత్మక నగరం. ఈ ఏకచక్ర నగరం పాండవులకు ఆతిథ్యం ఇచ్చిందని ప్రసిద్ధి. హిందూ ధర్మ రక్షణకు, హిందువుల ధన, మాన, ప్రాణాలను కాపాడడానికి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి మొగలుల ఆకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు ఛత్రపతి శివాజీ నడచిన నేల.

ఇలాంటి నేపథ్యం కలిగిన ఈ పట్టణంలో ఛత్రపతి విగ్రహం ఏర్పాటు ఉద్రిక్తతలను రేకెత్తిం చింది అనడం కంటే, స్వీయ విస్మృతి నుంచి బయట పడుతున్న హిందూ సమాజంలో వారసత్వ సంస్కృతిని పునరుజ్జీవింప చేయాలనే కాంక్షకు అదొక వ్యక్తీకరణ అని చెప్పడం సబబు.

బోధన్‌లో శివాజీ ప్రతిమ హిందువుల చిరకాల ఆకాంక్ష. విగ్రహ ఏర్పాటుకు శివసేనకు చెందిన పసులోటి గోపీకిషన్‌, ఇతర హిందూ నాయకులు 2021లో విజ్ఞానపత్రంతో స్థానిక ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లారు. ఎమ్మెల్యే విజ్ఞాపన పత్రాన్ని స్వీకరించి అందరి సమక్షంలో ప్రకటన విడుదల చేశారు. హిందూ సమాజం ఆకాంక్ష మేరకు బోధన్‌ ‌మున్సిపల్‌ ‌స్థలంలో ఈ విగ్రహ ఏర్పాటుకు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాననేదీ, తన సంపూర్ణ సహకారం ఉంటుందనేదీ ఆ ప్రకటన సారాంశం.

కానీ స్థానిక ఎమ్మెల్యే రెండు రోజుల తరువాత మరో ప్రకటన చేశారు. బోధన్‌లోని మైనారిటీవర్గం టిప్పు సుల్తాన్‌ ‌విగ్రహం ఏర్పాటుకు సంప్రదించా రన్నదే దాని సారాంశం. ఎమ్‌ఐఎమ్‌ ‌నాయకులు టిప్పు విగ్రహ ఏర్పాటుకు పట్టుబడు తున్నారని చెబుతూనే, ఎమ్‌ఐఎమ్‌ ‌ప్రతిపాదించని సుల్తాన్‌ ‌సలావుద్దీన్‌ ఒవైసీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలంటూ రాజకీయ డ్రామాకి తెరలేపాడు. ఈ డ్రామా పట్టణంలో అలజడి రేపింది. ఆ మరుసటి రోజు ఎమ్మెల్యే ఇంకొక ప్రకటన జారీ చేశారు. ఖురాన్‌కు, షరియాకు వ్యతిరేకం కాబట్టి మైనార్టీ పెద్దల కోరిక మేరకు బోధన్‌లో అన్ని విగ్రహాల ఏర్పాటు ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు కుయుక్తితో ప్రకటించారు.ఈ విషయం మరోసారి చర్చిస్తామని విషయాన్ని నానబెట్టే యత్నం చేశారు.

స్థానిక ఎమ్మెల్యే కుయుక్తిని అర్థం చేసుకొన్న హిందూ సమాజం తన ప్రయత్నాలు తాను ప్రారంభించింది. మున్సిపల్‌ ‌కౌన్సిలర్‌లను, స్థానిక అధికార యంత్రాంగాన్ని సంప్రదించింది. హిందూ సమాజం ఒత్తిడితో మున్సిపల్‌ ‌ఛైర్‌పర్సన్‌ శ్రీ‌మతి పద్మాశరత్‌రెడ్డి శివాజీ విగ్రహంతో పాటు డా।। అబ్దుల్‌కలాం, చాకలి ఐలవ్వ, మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌, ‌బసవేశ్వరుడు విగ్రహాలు ఏర్పాటుచేయాలని కౌన్సిల్‌ అజెండాలో ప్రతిపాదించారు. ఇందుకు అంబేడ్కర్‌ ‌చౌరస్తాలో గ్రీన్‌బెల్టు ఏర్పాటు చేయాలని తీర్మానించడానికి అన్ని పార్టీల కౌన్సిలర్‌లను మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌భర్త, కౌన్సిలర్‌ ‌శరత్‌రెడ్డి సంప్రదించారు. హిందూ కౌన్సిలర్లను పార్టీల కతీతంగా ఏకంచేసి జనవరి29, 2022న తీర్మానాన్ని ఆమోదింపజేసి కలెక్టరుకు పంపారు కూడా.

బోధన్‌లో 52 శాతం ముస్లిం జనాభా, 48శాతం హిందూ జనాభా ఉంది. హిందువులు మైనారిటీలుగా ఉన్న పట్టణంలో హిందూ కౌన్సిలర్లు పార్టీలకతీతంగా శివాజీ విగ్రహ ఏర్పాటుకు తీర్మానం చేయడం చారిత్రక ఘట్టం. తాను లేనప్పుడు జరిగిన ఈ తీర్మానంతో కంగుతిన్న స్థానిక ఎమ్మెల్యే దీనిని ప్రస్తుతానికి ఆపాల్సిందిగా కలెక్టర్‌ను ఆదేశించాడు. హిందూ సమాజం పదే పదే స్థానిక యంత్రాంగం, అధికారులకు, కలెక్టర్‌ను విన్నవించగా కలెక్టర్‌ ‌ఫిబ్రవరిలో దీనిని పరిశీలించి ఆమోదిస్తామని చెప్పారు. ఫిబ్రవరిలో మరలా కలెక్టర్‌, ‌బోధన్‌ ‌పట్టణ ప్రభుత్వ అధికారులను సంప్రదించగా కర్ణాటకలో హిజాబ్‌ ‌వివాదం ఉన్నందున ప్రస్తుతానికి ఆమోదించ లేమని, మార్చిలో పరిశీలిస్తానని తెలిపారు.

మార్చిలో హిజాబ్‌పై తీర్పు వెలువడిన తరువాత మరలా స్థానిక అధికారులను, కలెక్టరును సంప్రదించగా, రంజాన్‌ ‌నెల ఏప్రిల్‌ ‌ప్రారంభమై మే నెలలో ముగుస్తున్నది. కాబట్టి మే 15 తర్వాత పరిశీలిస్తానని చెప్పడంతో విసిగిపోయిన హిందూ నాయకులు కావాలనే కాలయాపన చేస్తూ విగ్రహ ఏర్పాటును జాప్యం చేస్తున్నారని భావించి, తదుపరి కార్యాచరణపై ఆలోచించి మార్చి 19 తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో మున్సిపాలిటీ తీర్మానించిన గ్రీన్‌బెల్ట్ (అం‌బేడ్కర్‌ ‌చౌరస్తా) ప్రాంతంలో, మున్సిపల్‌ ‌స్థలంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

మార్చి 20 ఉదయం విగ్రహాన్ని చూసిన కౌన్సిలర్లు మీర్‌ ‌నజీర్‌ ఆలీ అలియాస్‌ ‌దబ్బు, మహమ్మద్‌ ఇ‌మ్రాన్‌ ‌షరీఫ్‌ (‌టిఆర్‌ఎస్‌), ‌సమీర్‌, ‌షేక్‌ ఇం‌తియాజ్‌ ‌హుస్సేన్‌ (ఎమ్‌ఐఎమ్‌), ‌ముషీర్‌బాబా (కాంగ్రెస్‌, ఓటమి చెందిన కౌన్సిలర్‌) ‌విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు. ఇది గమనించిన హిందూ యువకులు అక్కడికొచ్చి ఆందోళన నిర్వహించారు. క్రమంగా ఉద్రిక్తతలు పెరగడంతో పోలీసులు వారితో సంప్రదించి దూరంగా కూర్చునేలా ఏర్పాటు చేశారు.

కొందరు ముస్లిం యువకులు వెకిలి చేష్టలు, సంజ్ఞలతో రెచ్చగొడుతున్నా హిందూ యువకులు, భారతీయ జనతాపార్టీ, హిందూవాహిని కార్యకర్తలు సంయమనం పాటించారు. పోలీస్‌ ‌కమిషనర్‌ ‌వచ్చి మాట్లాడేవరకు సంయమనం పాటించాలని పోలీసుల సూచన మేరకు హిందూ కార్యకర్తలు ఆ వెకిలి చేష్టలను భరిస్తూ మౌనంగా ఉన్నారు.

క్రమంగా ఈ విషయం సోషల్‌ ‌మీడియా గ్రూపుల ద్వారా బోధన్‌ ‌చుట్టు ప్రక్కల గ్రామాలకు తెలియడంతో పెద్ద ఎత్తున హిందూ యువకులు పార్టీలు, సంస్థలకు అతీతంగా కదలి వచ్చారు. ఇలా ఒక గ్రామం నుంచి వస్తున్న హనుమాన్‌ ‌మాల ధరించిన స్వామి బోధన్‌కు చేరుకున్నప్పుడు పాత బస్టాండ్‌ ‌ప్రాంతంలో ఐదుగురు ముస్లిం యువకులు ఆయనపై దాడిచేసి బైక్‌ని పగులగొట్టి గాయ పరిచారు. మరొక యువకుడితో కలసి ఆందోళన జరుగుతున్న ప్రాంతానికి రావాలనుకోవడమే ఈ హనుమాన్‌ ‌స్వామి చేసిన తప్పు. ఈ విషయం తెలుసుకున్న హనుమాన్‌ ‌స్వాములు అందరూ ప్రదర్శనగా ఘటనా ప్రాంతానికి రాసాగారు. ఆ సమయంలో ముస్లింలు రాళ్ల• రువ్వారు. మొదట రాళ్లదాడి అటువైపు నుంచి రావడంతో అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న హిందూ యువకులలో అలజడి చెలరేగింది. స్వామిని కొట్టారని తెలియడంతో మరింత ఆగ్రహోదగ్రులైనారు.

ముస్లింలు రాళ్లు రువ్విన 10 నిమిషాలకు పోలీస్‌ ‌కమిషనర్‌ అక్కడికి చేరుకొన్నారు. ఈ రాళ్ల దాడితో ఆగ్రహించిన హిందూ యువకుల దగ్గరికి పోలీస్‌ ‌కమిషనర్‌, అడిషినల్‌ ‌కలెక్టర్‌, ఆర్‌.‌డి.ఓ వచ్చి సంయమనం పాటించాలని కోరారు. ముస్లింలతో కూడా అధికారులు మాట్లాడారు. తర్వాత మరలా హిందూ యువకులతో మాట్లాడడానికి రావడంతో ముస్లింలు రాళ్లదాడి ప్రారంభించారు. ఇక సహనం కోల్పోయిన హిందూ యువకులు ప్రతిదాడి ప్రారం భించారు. ఈ దాడిలో పోలీసులకు, అధికారులకు స్వల్పగాయాలు అవడంతో లాఠీచార్జీ, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. హిందూ యువకులే లక్ష్యంగా పోలీస్‌ ‌కమిషనర్‌ ‌లాఠీచార్జీ, బాష్పగోళ వాయువు ప్రయోగం చేయించాడు.

ఈ లాఠీఛార్జీలో నలుగురు హిందూ యువ కులకు తీవ్ర గాయాలైనాయి. 26 మందికి స్వల్పగాయాలైనాయి. ఒక్క ముస్లిం మీద కూడా లాఠీ పడలేదు. పోలీస్‌ ‌కమిషనర్‌ ‌నాగరాజు టిఆర్‌ఎస్‌ ‌నాయకులు, ప్రభుత్వం ఆదేశానుసారంగా కేవలం ఒక వర్గం యువతనే లక్ష్యంగా చేసుకునే విచక్షణారహితంగా కొట్టాడు. హిందువులపై పోలీస్‌ ‌దాడికి నిరసనగా సాయంత్రం 5 గంటల సమయంలో 21, 22 తేదీలలో బోధన్‌ ‌బంద్‌కు పిలుపునిచ్చారు. లాఠీఛార్జీలో గాయపడిన హిందూ యువకులకు సంఘీభావంగా హిందూ వ్యాపారు లంతా బంద్‌కు మద్దతునిచ్చారు. హిందూ సమాజం స్వచ్ఛందంగా తమ వ్యాపార సముదాయాలను మూసి ఉంచారు. హిందువులలో చిన్న వీధి వ్యాపారస్తుడు కూడా ఇది తన పైననే జరిగిన దాడిగా భావించాడు. ఈ బంద్‌ ‌హిందూ ఐక్యతకు నిదర్శనంగా వెలు గొందింది. స్వచ్ఛంద బంద్‌ను చూసి ఆశ్చర్యపోయిన పోలీస్‌ ‌కమిషనర్‌ ‌విలేకరుల సమావేశం పెట్టి బంద్‌కు అనుమతి లేదని, దుకాణాలు తెరిచినవారికి రక్షణ కల్పిస్తామని పత్రికల సాక్షిగా చెప్పినా హిందూ వ్యాపారులు తిరస్కరించారు.

మార్చి 22న శాంతిభద్రతలు పరిరక్షణ పేరుతో 35మంది వివిధ హిందూ సంస్థల కార్యకర్తలపై 147,148,149,153 (ఎ), 307,353,108 వంటి సెక్షన్ల కింద క్రిమినల్‌ అభియోగాలు మోపి రిమాండ్‌కి తరలించారు. సంఘటనతో సంబంధం లేని క్రియాశీలంగా ఉండే ఇతర హిందూ యువకులపై, సంస్థలకు సంబందించిన నాయకులపై కూడా అభియోగాలు మోపడానికి పూనుకొన్నారు. 70 మంది వరకు కేసులలో ఇరికించాలని టిఆర్‌ఎస్‌ ‌నాయకుల ఆదేశాల మేరకు సి.పి. ప్రయత్నం చేశారు. కానీ హిందూ సమాజ ఐక్యతకై కృషిచేస్తున్న వివిధ హిందూ సంస్థలు ఈ చర్యను విజయ వంతంగా అడ్డుకొన్నారు. మార్చి 21వ తేదీన శాంతి చర్చల డ్రామాకి తెరలేపారు. తమకు అనుకూలంగా ఉండే కుహనా సెక్యులరిస్టులతో సమావేశం నిర్వహించారు. కానీ హిందూ సంస్థల నుంచి ప్రాతినిధ్యం లేదని విమర్శలు రావడంతో మరునాడు శాంతి సమావేశం నిర్వహించగా అక్రమ అరెస్టులు ఆపాలని, శివాజీ విగ్రహాన్ని తొలగించరాదని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ముస్లింలలో హింసకు కారకులైన వారిని అరెస్టు చేయాలని స్పష్టం చేశారు.

24 మంది ముస్లింల మీద కేసులు రిజిస్టర్‌ ‌చేసి రిమాండ్‌ ‌పంపిన తర్వాత కూడా జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రి, టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే షకీల్‌ ఆదేశానుసారం క్రియాశీలంగా ఉండే ఇంకొందరు హిందూ యువకులను కేసులలో ఇరికించాలని ప్రయత్నించారు. హిందూ నాయకులు ఈ ప్రయత్నాన్నీ విజయవంతంగా అడ్డుకొన్నారు. రాత్రివరకు హైడ్రామా నడిచింది. ఏ1 నిందితుడు, శివసేన నేత గోపీకిషన్‌ ‌లొంగిపోవడంతో ఆయనను అడ్డం పెట్టుకుని మున్సిపల్‌ ‌తీర్మానానికి కృషిచేసిన ఛైర్‌పర్సన్‌ ‌భర్త తూము శరత్‌రెడ్డిని పోలీసులు ఇరికించాలని ప్రయత్నించారు. కానీ సంఘటన జరిగిన రోజు ఆయన హైదరాబాద్‌ ‌వెళ్లడంతో అది సాధ్యపడ లేదు.

మార్చి 24న స్థానిక ఎమ్మెల్యే బోధన్‌ ‌వచ్చి పత్రికా సమావేశంలో కల్లబొల్లి కబుర్లు చెప్పారు. అసలు అందరం కలసి కోరుకున్న అన్ని విగ్రహాలను వైభవంగా ఏర్పాటు చేసుకునేవారమనీ, ఆవిష్కరణ ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకొనేవాళ్లమని, తొందరపడి ఇలా చేయడం పద్ధతిగా లేదని మొసలి కన్నీరు కార్చారు.

ఏ విధంగా చూసినా టీఆర్‌ఎస్‌ ‌ముస్లిం బుజ్జ గింపు విధానం ఈ ఘటనలో సుస్పష్టం. దీని నుంచి సెక్యులరిస్టులమని చెప్పుకునే హిందువులు, గుళ్లూ గోపురాలు తిరుగుతూ, హిందువుల ప్రయోజనాలను మాత్రం పట్టించుకోని నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలనేది తేటతెల్లం అయింది. మతోన్మాదం నెత్తికెక్కిన ముస్లింలు మెజారిటీ అయితే ఎలా ఉంటుందో ఈ ఘటన ద్వారా అంతా తెలుసుకో వాలని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

About Author

By editor

Twitter
Instagram