– డా. వినుషా రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా, ఆం.ప్ర.

భద్రతకు సంబంధించిన ఏ సమస్య తలెత్తినా ప్రజలు పోలీసుల కోసం చూస్తారు. ప్రజలను రక్షించే పనిలో అనేక మంది మన పోలీసులు సర్వం త్యాగం చేశారు. అలాంటిది ప్రజలను రక్షించాల్సిన ఒక పోలీసు మత కలహాల్లో భాగమైపోయి, పోలీసు స్టేషన్‌పై దాడులకు తెగబడితే ప్రజలు ఇక ఎవర్ని నమ్మాలి?

ఎలాంటి అనుమతులు లేకుండా సాగుతున్న అక్రమ మసీదు నిర్మాణం గురించి ఆంధప్రదేశ్‌లోని ఆత్మకూరులో ఈ  జనవరి ఎనిమిదవ తేదీన మత కలహాలు చోటు చేసుకున్నాయి. పద్మావతి స్కూల్‌ ‌వద్ద మసీదు అనధికార నిర్మాణంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. సంబంధిత అధికారులకు 2021 సంవత్సరం ఆగస్టు మాసంలో ఈ సంగతి తెలియజేశారు. 2022 సంవత్సరం జనవరి ఎనిమిదవ తేదీన ఉన్నపళంగా వందలాదిగా వ్యక్తులు ఆయుధాలతో గుమిగూడారు. తాత్కాలిక ప్రాతిపదికన మసీదు నిర్మాణానికి పూనుకున్నారు. స్థానికులు పోలీసులను ఆశ్రయించినప్పటికీ మసీదు నిర్మాణం కొనసాగింది. చివరకు, స్థానికులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీ‌కాంత్‌ ‌రెడ్డిని ఆశ్రయిం చారు. ఇదే అంశంపై డీఎస్పీతో ఆయన మాట్లాడారు. చర్చలకు రావాల్సిందిగా డాక్టర్‌ శ్రీ‌కాంత్‌ని డీఎస్పీ ఆహ్వానించారు. ఎలాంటి ఆయుధాలు లేకుండానే మసీదు నిర్మిస్తున్న చోటుకు ఆయన చేరుకున్నారు. పోలీస్‌ ‌స్టేషన్‌లో ఒక ఫిర్యాదు దాఖలు చేయవలసిన దిగా స్థానికులకు ఆయన సూచించారు. దీంతో ఆత్మకూరులో బీభత్సం చోటు చేసుకుంది. నిమిషాల వ్యవధిలో వేలాది మంది గుమిగూడారు. శ్రీకాంత్‌ ‌రెడ్డితో పాటుగా స్థానిక హిందువులపై దాడికి తెగబడ్డారు. ఆయన కారును తగులబెట్టారు. స్థానికులు, శ్రీకాంత్‌ ‌రెడ్డి పోలీస్‌ ‌స్టేషన్‌లో ఉండి పోయారు. విధ్వంసకర మూక పోలీస్‌ ‌స్టేషన్‌పై దాడి చేసింది. రాళ్లు రువ్వింది. పోలీసు వాహనాలను తగులబెట్టింది. ఎంత దుండగీడుతనమంటే  హతమార్చడం కోసం శ్రీకాంత్‌ ‌రెడ్డిని, స్థానికులను అప్పగించాలని విధ్వంసకులు పట్టుబట్టారు. మత నినాదాలను చేశారు. పోలీసులు లైట్లు ఆఫ్‌ ‌చేశారు. ఎస్పీ, అదనపు బలగాలను వచ్చేంతవరకు అర్థరాత్రి ఒంటి గంట దాకా వేచి చూశారు. అల్లరి మూకను చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరిపారు.

 మత కలహాలు చోటు చేసుకోవడానికి ముందు ఉగ్రవాద సంస్థ ఎస్‌డీపీఐ ఆత్మకూరులో శిక్షణా శిబిరాలు నిర్వహించిందని ఎస్పీ వెల్లడించారు. మత కలహాల్లో ఎస్‌డీపీఐ సభ్యులు పాల్గొన్నారని తెలిపారు. ఈ మత కలహాల్లో హెడ్‌ ‌కానిస్టేబుల్‌ ‌షేక్‌ ఎస్‌ఎమ్‌డీ అథవుల్లా ప్రమేయం ఉండటం మరింత ప్రమాదకర మైనదిగా వ్యాకులపరిచే అంశంగా మారింది. ఏపీ స్పెషల్‌ ‌పోలీస్‌ ‌బెటాలియన్‌లో హెడ్‌ ‌కానిస్టేబుల్‌గా అథవుల్లా విధులు నిర్వర్తిస్తున్నాడు. అమరావతి పరిధిలోని తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ ‌కార్యాలయం వద్ద ట్రాన్స్‌పోర్ట్ ‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రికి అనారోగ్యంగా ఉందనే కారణంతో జనవరి ఏడవ తేదీన అతడు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. జనవరి ఎనిమిదవ తేదీన ఆత్మకూరులో జరిగిన మత కలహాల్లో అతడు పాల్గొన్న వైనాన్ని వీడియో ఫుటేజీ బైటపెట్టింది. తాడేపల్లికి తిరిగి వచ్చిన అతడు రెండు రోజుల తర్వాత రెండు రోజులు సెలవు తీసుకు న్నాడు. మత కలహాలు చోటు చేసుకున్న సమయంలో పోలీసులు వినియోగించిన డ్రోన్లు షేక్‌ అథవుల్లా అక్కడ ఉన్న వైనాన్ని రికార్డు చేశాయి. షేక్‌ అథవు ల్లాను రక్షించడానికి కొందరు పోలీసులు ప్రయత్నిస్తు న్నారని, ఆ దిశగా బెటాలియన్‌కు సమాచారం అందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఏపీ స్పెషల్‌ ‌పోలీస్‌ ‌బెటాలియన్‌ ‌కమాండెంట్‌ ‌రవిశంకర్‌ను అడుగగా ఈ విషయమై తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని, ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఒక రాతపూర్వకమైన ఫిర్యాదు అందిన తర్వాత మాత్రమే తాము చర్యకు ఉపక్రమిస్తామని ఆయన చెప్పారు. కానీ మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత సంఘటన చోటు చేసుకున్న 47 రోజులకు షేక్‌ అథవుల్లాను అరెస్టు చేశారు.

ఈ విషయమై తలెత్తిన సందేహాలు

– పోలీసులు వారి దర్యాప్తు మొదట్లోనే అతడిని ఎందుకు గుర్తించలేకపోయారు? గుర్తించిన పక్షంలో వారెందుకు చర్య తీసుకోలేదు?

– కానిస్టేబుల్‌ ‌ప్రమేయం ఉన్నట్టుగా చూపుతున్న వీడియోను పోలీసులు మొదట్లోనే ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు?

– పోలీసులు మొదట్లోనే ఒక ఫిర్యాదును ఎందుకు దాఖలు చేయలేదు?  తర్వాత 47 రోజులకు కాని ఎందుకు అరెస్టు చేయలేదు?

– మీడియాలో వార్తలు రాని పక్షంలో ఎలాంటి అరెస్టు లేకుండా షేక్‌ ‌డ్యూటీలో కొనసాగుతూ ఉండేవాడా?

– అథవుల్లాను కాపాడేందుకు పాలనా యంత్రాంగం ప్రయత్నిస్తున్నదా?

– సెక్షన్‌ 144 అమల్లో ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎం అమ్జాద్‌ ‌బాషా, పాలక పక్ష నేతలు ఆత్మకూరును సందర్శించారు. సమావేశాలు నిర్వహించారు. పోలీసు స్టేషన్‌ను ధ్వంసం చేసిన విధ్వంసకర మూకపై అభియోగాలను పలచన చేసేందుకు రాజకీయ వత్తిడి చోటు చేసుకుంటు న్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేత, స్థానిక హిందువుల్లో కొందరిపై సెక్షన్‌ 307 ‌కింద హత్యాయత్నం లాంటి తీవ్రమైన అభియోగాలు మోపారు. వేలాదిగా ముస్లింల ప్రమేయం ఉన్నప్పటికీ 100 మంది కన్నా తక్కువ ముస్లింలపై అంత తీవ్రం కాని అభియోగాలు మోపారు.

– మీడియాలో వార్తలు రాకముందు ఈ విషయమై తమకేమీ తెలియదని ఏపీ స్పెషల్‌ ‌పోలీస్‌ ‌బెటాలియన్‌ ‌కమాండెంట్‌ ‌స్పష్టం చేశారు. కానీ మీడియాలో వార్తలు వచ్చిన మరునాడే.. అతడు నిందితుడని, కనిపించకుండా పోయాడని పోలీసులు తెలిపారు. కానీ మీడియాలో వార్తలు వచ్చిన మరుక్షణమే అరెస్టు చేశారు. మొదట్లోనే ఎందుకు అరెస్టు చేయలేదు?

– వరుసగా జరిగిన ఘటనలు షేక్‌ అథవుల్లాను కాపాడుతున్న వైనాన్ని తేటతెల్లం చేశాయి. ప్రజలను కాపాడాల్సిన పోలీసులు, పాలనా యంత్రాంగమే ఇలా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్న పక్షంలో సమస్యలు ఎదురైన పక్షంలో వాటికి పరిష్కారం కోసం ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి?

– దేశం కోసం పనిచేస్తానని రాజ్యాంగంపైన ప్రమాణం చేసిన ఒక ప్రభుత్వ పోలీసు ఒక మతానికి చెందిన కుట్రలో భాగమై పోలీసు స్టేషన్‌పై దాడికి పాల్పడితే ఇక నైతికత ఎక్కడ ఉంటుంది?

ఆంధప్రదేశ్‌లో ప్రభుత్వం కచ్చితంగా బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పోలీస్‌ ‌స్టేషన్‌పై దాడి ఘటనలో ముస్లింలపై కేసులను ఎత్తివేసింది. మౌజాన్లు, ఇమామ్‌లు, పాస్టర్లకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వేతనాలను చెల్లిస్తోంది. ప్రజా ధనంతో ప్రభుత్వం చర్చ్‌లు కట్టిస్తోంది. హజ్‌, ‌జెరుసలేమ్‌ ‌యాత్రలను నిర్వహిస్తోంది. దేవాలయా లపై జరుగుతున్న దాడులను ఉపేక్షిస్తున్నది. ఇప్పటి వరకు ఒక కేసునూ పరిష్కరించలేదు. న్యాయం కోరుతున్న హిందువులను అరెస్టు చేస్తున్నది. ఇలాంటి చర్యలు సమాజంలో విధ్వంసకర శక్తుల్ని పెంచి పోషిస్తున్నాయి. ఈ కారణంగానే షేక్‌ అథవుల్లా మత కలహాల్లో పాల్గొని పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి ఉంటాడు. మీడియాలో అత్యధిక భాగం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. లౌకికవాదం అంటే అర్థం ఒక నిర్దేశిత మతానికి చెందినవారు చేస్తున్న నేరాలను సహేతుకమని అనడం కాదు. ప్రభుత్వాలు, మీడియా ఇలాంటి ఒక కుహనా లౌకికవాద పంథాను అనుసరిస్తున్న పక్షంలో అంతిమంగా అది ఒక ప్రమాదకరమైన, వినాశ కరమైన పరిస్థితులకు దారి తీస్తుంది. యావత్‌ ‌దేశానికి హాని చేస్తుంది. ‘‘సర్వ ధర్మ సమ భావ’’ నానుడిని అనుసరించాల్సిన సమయం ఆసన్నమైంది.

‘ఆర్గనైజర్‌’ ‌నుంచి

 అను: మహేష్‌ ‌ధూళిపాళ్ల

By editor

Twitter
Instagram