జాగృతి – సంపాదకీయం

శాలివాహన 1941 శ్రీ శార్వరి వైశాఖ బహుళ చవితి 11 మే 2020, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌

————————————————————————————————————

కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తే వార్త అని పత్రికా ప్రపంచంలో నానుడి. నేరస్తుడు ముస్లిమైతే వార్త కాదు, బాధితుడు ముస్లిమైతేనే వార్తగా ఆ నానుడిని మార్చుకున్నట్లు నేటి మీడియా ధోరణి సాగుతోది! ఒకడు తన సంచీలో జంతు మాసాన్ని దాచుకుని రైల్లో వెళ్తూడగా చూసి అది ఆవు మాసమని అనుమానించిన మరో ప్రయాణికుడు వాణ్ణి చితకబాదాడు. దేశంలో మైనారిటీలకు రక్షణ కరవైందంటూ మీడియా పెట్టిన గగ్గోలు ఇకా మన చెవుల్లో మార్మోగుతూనే ఉంది కదా! ఇటీవలే మహారాష్ట్రలో కాషాయం ధరించి వెళ్తూన్న ఇద్దరు సాధువులను వామపక్ష ప్రేరేపిత గూండాలు కొట్టి చంపారు. కాగ్రెస్‌ ఏలుబడిలోని పోలీసు యంత్రాగం ఆ ఘాతుకాన్ని చూస్తూ ప్రేక్షక పాత్ర వహించింది. ఈ ఘటన తాలుకు వీడియో సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ ‌కావడంతో విధి లేక మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వార్తకు మీడియాలో స్థానం దక్కలేదు. ఇలాంటిదే మన హైదరాబాద్‌లో జరిగిన తాజా సంఘటన. చాదర్‌ఘాట్‌ ‌ప్రాంతానికి చెందిన షకీల్‌ అనే ముస్లిం యువకుడు ఓ దళిత మైనర్‌ ‌బాలికపై అత్యాచారం జరిపాడు. అతనికి మజ్లిస్‌ ‌పార్టీ అండదండలున్నాయట! అత్యాచార వార్త సోషల్‌ ‌మీడియాలో వచ్చాక, బిజెపి నేతలు జోక్యం చేసుకున్న తరువాత పోలీసులు కేసు నమోదు చేస్తే మీడియా పట్టించుకున్నది! ప్రజల్లో రాజ్యాగ నిష్ఠను, దేశభక్తిని పెంచే స్ఫూర్తిదాయక వార్తలకు ప్రచారం కల్పించాలి కానీ విభేదాలు సృష్టించే వార్తలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వదని సుద్దులు చెప్పే మేధావి ముసుగుదాల్చిన మీడియా గుటనక్కల నైజం దాచినా దాగట్లేదు.

దేశం మొత్తం కరోనా కష్టాల్లో విలవిల్లాడుతుంటే పంజాబ్‌, ఒడిషాలలో స్ఫూర్తిదాయక సంఘటనలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ ‌నెలలో పంజాబ్‌ ‌ప్రభుత్వానికి ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి దాపురించింది. ఈ ఏప్రిల్‌ ‌నెలలో గోధుమ కోతల సమయం వచ్చే సరికి కరోనా, లాక్‌డౌన్‌ ‌కష్టాలు వచ్చి పడ్డాయి. వలస కూలీలు రాలేరు. రాష్ట్రంలోని కూలీలను, రైతులను కోత పనులకు అనుమతిస్తే గుంపులు గుంపులుగా కోత పనుల్లో దిగి కరోనా మరింతగా వ్యాప్తి చెంది తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. త్వరలో కోతలు పూర్తి చేసి గోధుమను మార్కెట్లకో, గోదాములకో తరలించకపోతే అకాల వర్షాలు వచ్చిపడితే అన్నదాతల ఏడాది కష్టం నేలపాలవుతుంది, ప్రజలకు తిండి కరవు తప్పదు.

పంజాబ్‌లో ఇప్పుడు కెప్టెన్‌ అమరీందర్‌ ‌సింగ్‌ ‌నేతృత్వంలో కాగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలో ఉది. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉంది. ఈ క్లిష్ట పరిస్థితులో పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి ప్రధానికి ఓ లేఖ రాశారు. కేద్ర హోం మంత్రి అమిత్‌షాకు, ప్రధాని మోదీకి స్వయంగా ఫోన్‌ ‌చేసి పరిస్థితిని వివరించి సాయం కోరారు. ‘మీరేమీ దిగులు పడకండి. మీ పని పూర్తవుతుది’ అని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు వివిధ మంత్రిత్వ శాఖలు రంగంలోకి దిగాయి. ఏప్రిల్‌ 15 ‌నుంచి పని ప్రారంభించి 24లోపు పూర్తి చేయాలని లక్షిచారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యవేక్షణలో వివిధ శాఖల మంత్రులు, అధికారులు, కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసు యంత్రాగం సమన్వయంతో పని చేశారు. పెద్ద పెద్ద కోత మిషన్లు పంజాబ్‌కు చేరుకున్నాయి. అదరూ ఇరవై నాలుగ్గటలూ కష్టపడి పనిచేశారు. కోతలు, నూర్పిడి, మార్కెట్లకు, గోదాములకు, ఇతర రాష్ట్రాలకు రవాణాతో సహా జరగాల్సిన పనులన్నీ చకచకా పూర్తయ్యాయి. గతేడాది ఏప్రిల్‌, ‌మే నెలల్లో కలిపి 1.3 మిలియన్‌ ‌టన్నుల గోధుమను సేకరిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో కేవలం తొమ్మిది రోజుల్లో 2.8 మిలియన్‌ ‌టన్నుల గోధుమను సేకరించారు.

ఈ నెల ఆరంభంలో ఒడిషాకు ఓ చిక్కు వచ్చి పడింది. ముంబై నుండి భువనేశ్వర్‌కు రావలసిన కరోనా కిట్లు ముబై-నాసిక్‌ ‌రోడ్డు మార్గంలో చిక్కుపడి పోయాయి. కరోనా కట్టడికి అవసరమైన ఆ కిట్లను ఇప్పుడు రప్పించగల వారెవరు? ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ ‌పట్నాయక్‌ ఆ ‌రోజు అర్ధరాత్రి ప్రధాని మోదీకి ఫోన్‌ ‌చేశారు. తమ ఇబ్బందిని వివరించారు. పట్నాయక్‌ ‌చెప్పేంది వింటూనే ఆయన ఆరోగ్యం గుంరించి కుశల ప్రశ్నలు వేశారు ప్రధాని. ఇంత సీరియస్‌ ‌విషయం చెపుతూటే కుశల ప్రశ్నలకు ఇదా సమయం అన్నట్లు పట్నాయక్‌కు ఒకింత అసహనం కలిగింది. మోదీజీ దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకోండి అన్నారు. ‘మీరేమీ కంగారు పడకండి. మీకు కావలసిన కిట్లు నేరుగా ఢిల్లీ నుండి విమానంలో భువనేశ్వర్‌కు పంపే ఏర్పాటు చేస్తా. మీరు నిద్ర లేచేసరికి కిట్లు మీ ముందుంటాయి.’ అని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ. రాజకీయ నాయకులు సహజంగా చెప్పే చిలుక పలుకుల కిదం మోదీ హామీని భావించారు పట్నాయక్‌. ‌కానీ నిద్ర లేచే సరికి ఢిల్లీ నుండి కరోనా కిట్లు నేరుగా భువనేశ్వర్‌కు వచ్చాయని తెలిసి విస్తుపోయారాయన. ఈ రెండు వార్తలకు మీడియాలో స్థానం లభించలేదు. మీడియాకో, మీడియాలో తిష్ట వేసిన దుష్టశక్తులకో పట్టిన ఈ పక్షవాత రోగానికి వాతలే తగిన చికిత్స. ప్రజలే అందుకు సమర్థులైన వైద్యులు!

About Author

By editor

Twitter
YOUTUBE