– వి.భాగయ్య, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సహసర్‌ ‌కార్యవాహ

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజా జీవితాలను పూర్తిగా స్తంభింపచేసింది. అయితే భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఎంతో జాగృతతో ప్రజలకు సేవ చేస్తున్నాయి. అనేక సంస్థలతో పాటు సామాన్య ప్రజలు సైతం ఆత్మీయంగా తోటి ప్రజలకు సేవలందిస్తున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌స్వయంసేవకులు సమాజ సహకారంతో తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పంజాబ్‌లో చదువుకోసం వెళ్లిన తెలుగు విద్యార్థులు నలభై రోజులుగా అక్కడే చిక్కుకు పోయారు. అందులో నుండి పదిమంది విద్యార్థులు సికింద్రాబాద్‌లోని సంఘ్‌ ‌కార్యకర్తతో మాట్లాడి తమ పరిస్థితిని వివరించారు. అరవైమంది తెలంగాణ, ఆరువందలమంది ఆంధప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు ఉన్నట్లు వాట్సాప్‌ ‌ద్వారా వివరాలు తెలిపారు. వెంటనే స్పందించిన సంఘ కార్యకర్తలు భాజపా రాష్ట్ర అధ్యక్షులు, కరింనగర్‌ ఎం‌పీ బండిసంజయ్‌ ‌సహాయం కోరారు. ఆయన కేందప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేకంగా ఒక రైలు వేయించారు. ఆ విద్యార్థు లందరూ వరంగల్‌, ‌విజయవాడకు క్షేమంగా చేరుకొన్నారు. సత్వరం స్పందించే ప్రభుత్వం, ఎదుటివారి బాధలను అర్థం చేసుకొనే సామాజిక కార్యకర్తల కృషి ఫలితంగా ఇలాంటి ఆపత్కాలంలో ప్రజలకు మేలు జరుగుతోంది. సుభద్ర అనే సోదరీమణి హైదరాబాద్‌లో గత యాభై రోజులకు పైగా వేలాదిమందికి భోజనం అందిస్తోంది. ఆవులకు గ్రాసం వేస్తోంది. స్వయంగా తాను ప్రతీరోజు నిర్విరామంగా పన్నెండుగంటలు సేవ చేస్తోంది. యువకులైన ఎంతోమంది స్వయంసేవకులు ధైర్యంగా అన్నిచోట్లకు తిరుగుతూ సేవలంది స్తున్నారు. వారి తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు ఏ మాత్రం భయపడకుండా సేవ చేసేందుకు స్వయంసేవకులను ప్రోత్స హిస్తున్నారు. ధైర్యంగా బయటకు వెళ్లడానికి అనుమతినిస్తున్నారు. కరువు, వరదలు, తుఫానులు సంభవించినపుడు సేవలు చేయడం పూర్తిగా వేరు. ఆ సమయంలో ప్రాణ భయం లేదు. వ్యాధి సంక్రమణ జరుగుతుందని భీతి ఉండదు. కానీ, కరోనా విజృంభణ అందుకు పూర్తిగా భిన్నమైంది. ఇది తెలిసినప్పటికి ప్రజా సేవలో నిమగ్నమైన వారందరూ అభినందనీయులు. సమాజమే దైవం అనే సంస్కారం సంఘం మనకు ఇచ్చింది. దేశ వ్యాప్తంగా నాలుగు క్షలమంది స్వయం సేవకులు పని చేస్తున్నారు.
అనేక మంది వలస కార్మికులు తమ స్వంతగ్రామాలకు నడచి వెళ్తున్నారు. అలా వెళ్లేవారికి భోజనం, మంచినీళ్లను సంఘ కార్యకర్తలు ప్రతీచోట సమకూరుస్తున్నారు. మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లోని సంఘ్‌ ‌కార్యకర్తలు వైద్య సేవలను కూడా అందిస్తున్నారు. కార్మికులకు చెప్పులు తువ్వాళ్లు ఇస్తూ, సరిహద్దు ప్రాంతాల వరకు కార్మికులను ప్రైవేట్‌ ‌వాహనాల ద్వారా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయడం, వారికి బస్తీ ప్రజలు ఉదయం అల్పాహారం ప్రేమతో అందించడం, డాక్టర్లు, నర్సులుగా పనిచేసేవారిని సన్మానించడం, వైద్యసిబ్బందికి కావలసిన సదుపాయాలు సమకూర్చడం, రక్తదానం ఇలా ఏది అవసరమైనా ప్రతీది చేసేందుకు స్వయంసేవకులు సిద్ధమవు తున్నారు.
లోకహితం మమ కరణీయం అంటూ ప్రజలందరికి మేలు చేయడమే తమ కర్తవ్యంగా భావిస్తూ జనుల కష్టాలను అర్థం చేసుకొనే కేందప్రభుత్వం, వివిధ సామాజిక సంస్థలు, ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగం బాధ్యతాయుతంగా కలిసి పనిచేయడం వలన ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతోంది. అయితే ఈ విపత్తును ఎదుర్కోవడానికి ఇంకా చాలాకాలం పోరాటం చేయాలి. అందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కషాయం తాగడం, వైద్య సిబ్బంది, ప్రభుత్వం విధించిన అన్ని నియమాలను సక్రమంగా పాటించడం రాబోయే రోజుల్లో చేయవలసిన పని. నేడు అందరమూ అజ్ఞాత భయంలో ఉన్నాం. ఈ మహమ్మారిని తరిమేసేందుకు ప్రతీఒక్కరి సహకారం అవసరం. అప్పుడే విజయం సాధ్యమవుతోంది. కాబట్టి నేడు కుటుంబాలను పరామర్శిస్తూ, కౌన్సెలింగ్‌ ‌చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లాక్‌డౌన్‌ ‌విధించిన నాటి నుండి చాలా కుటుంబాలు ఇంట్లో ధార్మికమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అందరూ నియమితంగా వ్యాయామం చేస్తూ, సరైన భోజనం చేస్తూ రోగనిరోధక శక్తిని పెంచుకుంటున్నారు. భారతీయ భోజనంలోని ఆరోగ్యపరమైన విషయాలు, శాస్త్రీయ అంశాలు అందరికి అర్థమవుతున్నాయి. హిందూ జీవన విధానమే శ్రేయోదాయకమని గుర్తిస్తున్నారు. రాబోవు రోజుల్లో ఇదే అందరికి ఆచరణీయ మైన మార్గమవుతుందనడంలో అతిశయోక్తి లేదు.
కరోనా మహమ్మారి భయోత్పాతాన్ని సృష్టిస్తున్న వేళ ఎందరో సంఘ స్వయం సేవకులు, అనుబంధ సంస్థల కార్యకర్తలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజమే దైవంగా భావిస్తూ సేవలందిస్తు న్నారు. వాటిన్నిటిని తెలియచేసేందుకు జాగృతి ప్రత్యేక సంచిక వెలువరించడం ఆనంద దాయకం. అయితే ఈ సంచిక ప్రచారం కోసం కాదు. సంఘం చేసిన కార్యకలాపాల నివేదిక అంతకంటే కాదు. సంఘ స్వయంసేవకులతో పాటు సమాజంలోని అనేక సంస్థలు చేసిన ఈ సేవా కార్యక్రమాల ద్వారా మరొకరికి ప్రేరణ లభించి సమాజ పరమేశ్వరుని సేవిస్తే చాలు. ప్రత్యేక సంచిక లక్ష్యం నెరవేరినట్లే. ఈ లక్ష్యసాధనలో జాగృతి సఫలికృతం అవు తుందని ఆశిస్తూ… అందరికి అభినందనలు.
శుభం..

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram