అమ్మకు ప్రేమతో..

అమ్మకు ప్రేమతో..

మే 13 మాతృ దినోత్సవ ప్రత్యేకం

సృష్టిలో అన్నిటికన్నా కమ్మనైన పిలుపు అమ్మ.. అమ్మ లేదని కొందరికి బాధ. అమ్మ ఉందని మరికొందరికి వ్యధ. ఎంతటి వ్యత్యాసం ఎంతటి దౌర్భాగ్యం.. అమ్మలేని కొందరి జీవితాలను పరిశీలిస్తే కళ్లలో నీళ్లు ఘనీభవించి కళ్లు మసకబారి పోతాయి. అమ్మ ఉన్నప్పటికీ సరిగ్గా చూసుకోని కొందరి ఉన్మాదుల జీవితాలను చూస్తే గుండె రగిలి పోతుంది. ఇంతటి ఘోరాతి ఘోరమా అని రక్తం ఉడికిపోతుంది. అయినప్పటికీ అంతటి ఉన్మాదిని కూడా ప్రేమతో లాలిస్తుంది తల్లి. అందుకే అంటారేమో కఠినాత్ముడైన కొడుకు ఈలోకంలో ఉంటాడేమో కానీ కఠినాత్ములైన తల్లులు మాత్రం ఉండరు అని. అమ్మ అనే పదానికి నిర్వచనం చెప్పాలని అనుకోవడం అవివేకమే అవుతుంది. బిడ్డ పుట్టినప్పటి నుంచి వారిని సంస్కారమంతులుగా తీర్చి దిద్దేంతవరకూ తల్లి పాత్ర అమోఘం. 

About Author

By ganesh

Twitter
YOUTUBE