చైనా ఉత్పత్తులు బహిష్కరిద్దాం

చైనా ఉత్పత్తులు బహిష్కరిద్దాం

ఆర్‌.ఎస్‌.ఎస్‌. దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్‌ ఆలె శ్యాంకుమార్‌ పిలుపు

–     వ్యక్తి నిర్మాణమే ఆర్‌.ఎస్‌.ఎస్‌. పని

–     అందరికీ ఒకే బావి, ఒకే స్మశానం ఉండాలి

–     భారతదేశం మొదటినుండి సెక్యులర్‌ దేశమే

–     చైనా మనకు శత్రుదేశం

–     చివరకు ధర్మమే జయిస్తుంది

–     సంఘ శిక్షావర్గ ముగింపు కార్యక్రమంలో ప్రసంగం

తెలంగాణ ప్రాంత ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రథమవర్ష శిక్షణ శిబిరం (సంఘ శిక్షావర్గ)  ఘట్‌కేసర్‌ దగ్గర గల అన్నోజిగూడ గ్రామంలోని రాష్ట్రీయ విద్యా కేంద్రం పాఠశాలలో జరిగింది. 20 రోజుల పాటు జరిగిన ఈ శిక్షణ శిబిరంలో తెలంగాణలోని 380 స్థలాల నుండి 580 మంది పాల్గొని శిక్షణ పొందారు. ఈ శిబిరం ముగింపు కార్యక్రమం మే 26 సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్‌Iజుచీు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డా||బి.వి.ఆర్‌. మోహన్‌రెడ్డి విచ్చేసారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్‌ ఆలె శ్యాంకుమార్‌ ఈ కార్యక్రమంలో ప్రధాన ప్రసంగం చేశారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. క్షేత్ర సంఘచాలక్‌ వి.నాగరాజు, తెలంగాణ ప్రాంత సంఘచాలక్‌ ప్యాటా వెంకటేశ్వరరావు కూడా వేదికపై ఆసీనులయ్యారు. శిబిర సర్వాధికారి ఉండవల్లి గాయత్రి ప్రసాద్‌ శిబిర నివేదిక సమర్పించారు.

About Author

By ganesh

Twitter
Instagram