– సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆస్తుల వివాదాలు ఇబ్బంది కలిగించ వచ్చు. బంధువులు, స్నేహితులతో కొన్ని వివాదాలు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొం టారు. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. వ్యాపా రులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు పర్యటనలు వాయిదా. 14,15 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. లక్ష్మీస్తుతి మంచిది.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
నిరుద్యోగుల యత్నాలు నత్తనడక సాగుతాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఇంటి నిర్మాణాలు ముందుకు సాగవు. ఆరోగ్య సమస్యలు బ్యాధిస్తాయి. వ్యాపారులు పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. పరిశోధకులు, రాజకీయవేత్తలు, కళాకారులకు అవకాశాలు నిరుత్సాహపరుస్తాయి. 9,10 తేదీల్లో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. సోదరుల నుంచి పిలుపు. కనకధారాస్తోత్రాలు పఠించండి.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రాబడి మరింత పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం.. సోదరులు, స్నేహితులతో ఉల్లాసంగా గడుపు తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు భాగస్వాములతో వివాదాలు పరిష్క రించుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. 13,14 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. గణేశాష్టకం పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. బంధువులనుంచి శుభవార్తలు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. దేవాలయ దర్శనం. యత్నాలు సఫల మవుతాయి, లాభాలు మరింత దక్కుతాయి. ఉద్యోగు లకు విధుల్లో అనుకూల పరిస్థితులు. రాజకీయ వేత్తలు, క్రీడాకారులు, పరిశోధకులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. 11,12 తేదీల్లో అనారోగ్యం, దూరప్రయాణాలు. ఆదిత్య హృదయం పఠించండి.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
నిరుద్యోగుల ప్రయత్నాలు నత్తనడకన సాగు తాయి. కాంట్రాక్టులు కొన్ని చేజారవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులకు ఒడిదుడుకులు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు విదేశీ పర్యటనలు. 13,14 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు నెలకొంటాయి. పెద్దల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సాగవు. స్వల్ప ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు చికాకులు. ఉద్యోగులకు మార్పులు సంభవం. రాజకీయవేత్తలు, క్రీడాకారులు, పరిశోధకులకు అంచనాలు తప్పు తాయి. 10,11 తేదీల్లో ధనప్రాప్తి. విందువినోదాలు. నృసింహస్తోత్రాలు పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. కాంట్రాక్టులు తృటిలో తప్పిపోవచ్చు. ముఖ్య నిర్ణయాలు మార్చుకుంటారు. ఆదాయం కొంత తగ్గి అప్పులు చేస్తారు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు జరిగే సూచనలు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచ యితలకు కొన్ని వివాదాలు. 12,13 తేదీలలో శుభవార్తలు. వాహన యోగం. ఆహ్వానాలు అందు తాయి. శ్రీరామ రక్షాస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
వాహనాలు, భూములు కొంటారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, రచయితలు, క్రీడాకారులకు విదేశీయానం. 11,12 తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధు వులతో తగాదాలు. ఆంజనేయ దండకం పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
కొన్ని కార్యక్రమాలను శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆస్తుల ఒప్పందాలలో ఆటంకాలు. ఆరో గ్యంపై శ్రద్ధ వహించండి. అనుకున్న కాంట్రాక్టులు నిరాశ పరుస్తాయి. వ్యాపారులు స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు. రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు ఒత్తిడులు.13,14 తేదీలలో విందు వినోదాలు. ఆకస్మిక ధనలబ్ధి. హనుమాన్ ఛాలీసా పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు
చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడు••తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారులు మరింత పుంజుకుంటారు. ఉద్యోగులకు ఊహించని హోదాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారుల యత్నాలు సఫలమవు తాయి. 10,11 తేదీల్లో వివాదాలు. వృథా ఖర్చులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు అందుకుం టారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహన, గృహయోగాలు. వ్యాపారులు పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో మరింత అనుకూలత. రాజకీయవేత్తలు, క్రీడాకారులు, రచయితలకు విశేష సన్మానాలు జరిగే వీలుంది. 14,15 తేదీల్లో వివాదాలు. శారీరక రుగ్మతలు. మానసిక ఆందోళన. శివపంచాక్షరి పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కార మవుతాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. స్నేహితులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారులు లాభాలు అందుకుని ఊరట. ఉద్యోగవర్గాలకు ప్రమో షన్లు దక్కవచ్చు. క్రీడాకారులు, రచయితలు, పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 9,10 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. సుబ్రహ్యణ్యాష్టకం పఠించండి.