– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ఆలోచనలు కుటుంబసభ్యులు, స్నేహితు లతో పంచుకుంటారు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందు తారు. వాహనయోగం. వ్యాపారులకు ఊహించని పెట్టుబడులు. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహం. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం. రచయితలు, పరిశోధకులకు తగినంత గుర్తింపు. 2,3 తేదీల్లో స్నేహితులతో విభేదాలు. మనశ్శాంతి లోపి స్తుంది. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

మీ మనస్సులోని భావాలను కుటుంబసభ్యులతో పంచుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి విముక్తి. కళాకారులకు అవకాశాలు ఊహించని విధంగా దక్కుతాయి.4,5 తేదీల్లో దూరప్రయాణాలు. ఖర్చులు అధికం. దుర్గాస్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

దీర్ఘకాలిక రుణాలు కొన్ని తీరతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి కాగలవు. దేవాలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. ఉద్యోగులు కొన్ని మార్పులు జరిగి ఉత్సాహంగా గడుపుతారు. కళాకారుల శ్రమ ఫలి స్తుంది. క్రీడాకారులు, రచయితలకు మరింత ప్రోత్సాహం. 6,7తేదీల్లో స్వల్ప అనారోగ్యం. పరి స్తితులు అనుకూలించవు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

నిర్ణయాలలో కొన్ని మార్పులు చేసుకుంటారు. బంధువులతో విభేదాలు నెలకొంటాయి. స్థిరాస్తి ఒప్పందాలను వాయిదా వేస్తారు. గృహ నిర్మాణాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. దేవాలయాలు సందర్శి స్తారు. కొత్త కాంట్రాక్టులు చేజారవచ్చు. వ్యాపారులకు స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగులు విధుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. రాజకీయవేత్తలకు చికాకులు తప్పవు. 5,6 తేదీల్లో విందువినోదాలు. కార్యజయం. హనుమాన్‌ ‌చాలీసా పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. విద్యార్థు లకు అనుకూల ఫలితాలు రావచ్చు. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం. వ్యాపారులు పెట్టు బడులు పెంచుకుంటారు. ఉద్యోగులకు సంతోష కరమైన సమాచారం. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు తొలగు తాయి. కళాకారులు, క్రీడాకారులకు నూతనోత్సాహం. 7,8 తేదీల్లో వృథా ఖర్చులు. దూర ప్రయాణాలు. విష్ణుధ్యానం చేయండి. పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు తగినంత లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందు తాయి. కళాకారులు, రచయితలకు నూతన అవ కాశాలు దక్కుతాయి. 5.6 తేదీలలో ఆకస్మిక ప్రయా ణాలు. శారీరక రుగ్మతలు. ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

సమాజసేవలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులు మరింత ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. వ్యాపారులు మరింత మెరుగైన లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడులు కొంత తగ్గవచ్చు. రాజకీయవేత్తలకు అన్నింటా విజయమే. కళాకారులు, క్రీడాకారులు మరిన్ని అవకాశాలు .6,7 తేదీల్లో ఖర్చులు, ఆప్తులతో తగాదాలు. శివపంచాక్షరి పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

ప్రత్యర్థులు సహాయపడడం విశేషం. నిరుద్యో గులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు పెట్టు బడులు సకాలంలో అందుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు నూత నోత్సాహం. రచయితలు, పరిశోధకులకు పురస్కా రాలు అందుతాయి.5,6 తేదీల్లో మానసిక అశాంతి. శారీరక రుగ్మతలు. అన్నపూర్ణాష్టకం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

ఆదాయ, వ్యయాలు సమానస్థాయిలో కొనసాగు తాయి. స్నేహితులతో కొన్ని వ్యవహారాలు చర్చిస్తారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. కుటుంబ సమస్యలు తీరుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు అంచనాలు నిజంకాగలవు. కళాకారులు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. 4,5 తేదీల్లో దూర ప్రయాణాలు. కాలభైరవాష్టకం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వాహనసౌఖ్యం. దూరపు బంధువుల నుంచి ఆసక్తికర సమాచారం. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారులు విస్తరిస్తారు. ఉద్యోగు లకు విధులు ప్రశాంతంగా సాగుతాయి. రాజకీయ వేత్తలకు ప్రోత్సాహకరమైన కాలం. క్రీడాకారులు, పరిశోధకులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. 2,3 తేదీల్లో శారీరక రుగ్మతలు. స్నేహితులతో విభేదాలు. సూర్యారాధన చేయండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారు లకు భాగస్వాములు సహకరిస్తారు. ఉద్యోగులకు పైస్థాయి వారినుంచి ప్రోత్సాహం.  రచ యితలు, క్రీడాకారులు విశేష ఖ్యాతి పొందుతారు. 6,7 తేదీల్లో బంధువులతో విభేదాలు. శారీరక రుగ్మతలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగు లకు శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. వివాహ, ఉద్యోగ యత్నాలలో కదలికలు. వ్యాపారులు ఆశించిన పెట్టుబడులు సమకూర్చు కుంటారు. ఉద్యోగులు విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులకు ప్రోత్సాహకరం. 4,5 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. శ్రీరామరక్షాస్తోత్రం పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE