– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

ఇతరుల నుంచి రావలసిన సొమ్ములు కూడా అందుతాయి. మీ విధానాలు, నడవడిక పట్ల కుటుంబసభ్యులు ఆకర్షితులవుతారు.  వ్యాపారాలలో అనుకున్న లాభాలు.ఉద్యోగాలలో కోరుకున్న విధంగా మార్పులు జరుగుతాయి. కళాకారులకు మరింత ఆశాజనకంగా ఉంటుంది. పరిశోధకులు, వైద్యుల సేవలకు విస్తృత మవుతాయి. 20,21 తేదీల్లో దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

కుటుంబంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. శుభకార్యాల నిర్వహణలో బిజీగా గడుపుతారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులు సమకూరి మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు రాగలవు. ఆశ్చర్యకరంగా కొన్ని సమస్యలు తీరతాయి. కళాకారులకు సన్మానయోగం. రచయితలు, వ్యవసాయదారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. 16,17 తేదీల్లో అదనపు ఖర్చులు. సమస్యలు. ఆంజనేయ దండకం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

విద్యార్థుల ప్రతిభా పాటవాలు గుర్తింపు లోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలకు లోటు ఉండదు. అలాగే, పెట్టుబడులు అందుతాయి. ఉద్యో గాలలో విధి నిర్వహణలో అవాంతరాలు తొలగు తాయి. మంచి గుర్తింపు పొందుతారు. కళాకారులకు విజయాలు వరిస్తాయి. రచయితలకు శుభవర్త మానాలు. 18,19 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. బంధువిరోధాలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

మీ నిర్ణయాలను గౌరవిస్తారు. ఆస్తుల పంపకాలు పూర్తి చేస్తారు. ఆరోగ్యం మరింత మెరుగుపడి ఊరట లభిస్తుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడులకు లోటు ఉండదు.ఉద్యో గాలలో విధి నిర్వహణ ప్రశాంతంగా సాగుతుంది. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు, క్రీడాకారులకు సంతోషకర సమాచారం. 20,21 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబంలో సమస్యలు. నృసింహస్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

సంతానం, ఉద్యోగావకాశాలు సఫలమై ఉత్సాహంతో గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో మీపై ఉంచిన బాధ్యతలు సమర్థ వంతంగా నిర్వహిస్తారు. ప్రత్యేక గుర్తింపు పొందు తారు. పారిశ్రామికవేత్తలకు వివాదాలు తీరతాయి. క్రీడాకారులు, వైద్యులకు మరింత ప్రోత్సాహం. 19,20 తేదీల్లో ధనవ్యయం. మనశ్శాంతి లోపిస్తుంది. విష్ణుధ్యానం చేయండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

రుణాలపై ఒత్తిడులు ఉండవచ్చు. .పెద్దల నుంచి స్థిరాస్తి పంపకాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలు ఎంతటి బాధ్యత అప్పగించినా భయపడకుండా పూర్తి చేస్తారు. రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్య టనలు. క్రీడాకారులు, రచయితల ఆశయాలు సిద్ధి స్తాయి 21,22తేదీల్లో వృథా ఖర్చులు. దూర ప్రయాణాలు. ఆదిత్య హృదయం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఎటువంటి ఇబ్బంది ఎదురైనా పట్టు దలతో అధిగమిస్తారు. అదనపు విధులు మీదపడినా లెక్కచేయరు. రాజకీయవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వైద్యులు, వ్యవసాయదారులు మరింత ఉత్సాహంగా గడుపుతారు. 17,18 తేదీల్లో ధన వ్యయం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

బంధువులతో వివాదాలు తీరతాయి. సంతాన విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.  ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. ఉన్నతాధికారుల నుంచి సహాయం అందుతుంది. కళాకారులకు మరింత అనుకూల సమయం. క్రీడాకారులు, పరిశోధకులకు సంతోషకర సమా చారం. 20,21 తేదీల్లో మిత్రుల నుండి ఒత్తిడులు. శ్రమాధిక్యం. శివాష్టకం పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

చేపట్టిన కార్యక్రమాలు మందగమనంలో సాగుతాయి. కొత్త రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల రాక కొంత ఊరటనిస్తుంది.  వ్యాపారాలు మొదట్లో కొంత లాభించినా అంతగా కలసిరావు. రాజకీయవేత్తలకు కొద్దిపాటి చికాకులు. రచయితలకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. 20,21తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. కనకధారా స్తోత్రాలు పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆర్థిక ఇబ్బందులు చాలావరకూ తగ్గుతాయి. మీరంటే అందరూ గౌరవిస్తారు. వ్యాపారాలు లాభాలు తథ్యం. పెట్టుబడులకు లోటు లేకుండా ఉంటుంది. ఉద్యోగాలు కోరుకున్న పదోన్నతులు దక్కుతాయి. బ్యాధ్యతలు కొంత తగ్గే సూచనలు. పారిశ్రామిక వేత్తలకు నూతనోత్సాహం. రచయితలు, క్రీడా కారులకు శుభవార్తలు. 21,22తేదీల్లో మానసిక అశాంతి. ఆకస్మిక ప్రయాణాలు. కనకధారాస్తోత్రాలు పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

కొన్ని రుగ్మతల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపారాలు లాభాల దిశగా కొన సాగుతారు. ఉద్యోగాలలో సమస్యలు్య ధిగమించి ముందడుగు వేస్తారు. పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూలత. క్రీడాకారులు, రచయితలు మరిన్ని అవ కాశాలు పొందుతారు. 16,17 తేదీల్లో సన్నిహితు లతో కలహాలు. బాధ్యతలు పెరుగుతాయి. గణపతిని పూజించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

సంతాన ఉద్యోగాలు కొలిక్కి వచ్చి ఊరట చెందు తారు. వ్యాపారాలలో క్రమేపీ లాభాలు అందుకుం టారు. కొత్త భాగస్వాములతో విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగ విధి నిర్వహణలో చిక్కులు తొలగుతాయి. ఉన్నతాధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయవేత్తలకు శుభవార్తలు. క్రీడాకారులు,వైద్యులకు మరింత సానుకూలత. 17,18 తేదీల్లో దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE