– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

‌ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆదాయం సంతృప్తి కరంగా ఉంటుంది. సమాజ సేవలో భాగ స్వాము లవుతారు. ఇళ్ల నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపా రస్తులకు మరింత లాభాలు. ఉద్యోగస్తులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయ వేత్తలు, కళాకారులు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. 31.1 తేదీల్లో దూరప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ఆంజనేయ దండకం పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

గృహ నిర్మాణయత్నాలు కొంత ఫలిస్తాయి. సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారస్తులకు అనూహ్యంగా లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఈతిబాధలు తొలగు తాయి. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులు లక్ష్యసాధన దిశగా ముందడుగు వేస్తారు. 26,27 తేదీల్లో వృథా ఖర్చులు. కుటుంబసభ్యులతో విభేదాలు. గణేశాష్టకం పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. పరిస్థితుల ప్రభావంతో ఇంతకాలం వాయిదా పడిన కొన్ని వేడుకలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు లాభాల బాట పట్టి లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అంది ఊరటనిస్తుంది. కళాకారులు, రచయితలు, క్రీడాకారులకు ఉత్సాహంగా గడిచిపోతుంది. 30,31 తేదీల్లో దూర ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. లక్ష్మీస్తుతి మంచిది.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవమర్యాదలు మరింతగా పొందుతారు. వాహ నాలు, ఆభరణాలు కొంటారు. ఆధ్యాత్మిక కార్య క్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు ఉత్సాహ వంతమైన కాలం. ఉద్యోగస్తులకు కొత్త హోదాలు రాగల అవకాశం. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులకు కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. 28,29 తేదీల్లో బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రీ కృష్ణాష్టకం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

అనుకున్నది సాధించాలన్న తపన పెరుగు తుంది. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. శారీరక రుగ్మతలు. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారస్తు లకు ఆశించిన లాభాలు. ఉద్యోగస్తులకు మార్పులు. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలకు ఒక సంతోషకరమైన సమాచారం అందుతుంది. 26,27తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో విభేదాలు. శివపంచాక్షరి పఠించండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులు ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఒక సమాచారం కొంత ఊరటనిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు ప్రోత్సాహకరమైన సమయం. 27,28 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. స్వల్ప అనారోగ్యం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

రావలసిన డబ్బు చాలావరకూ అంది అవసరాలు తీరతాయి. ఒక చిరకాల మిత్రుడి కలయిక మరింత ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారులకు గతం కంటే లాభాలు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారుల యత్నాలు సఫలమవుతాయి. 30,31 తేదీల్లో అనుకోని ఖర్చులు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

పరిస్థితులు అనుకూలించడంతో కొన్ని వ్యవహారా లలో ముందడుగు వేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు అంది విస్తరణ కార్య క్రమాలు చేపడతారు. ఉద్యోగులు ఒత్తిడుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, కళాకారులకు ఒక సంతోషకరమైన సమాచారం. 28,29 తేదీల్లో వృథా ఖర్చులు. ఆరోగ్యపరమైన చికాకులు. హనుమాన్‌ ‌ఛాలీసా పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారులు పెట్టుబడులు మరింత దక్కించుకుంటారు. ఉద్యోగులకు ప్రస్తుత బాధ్యతలు కొంత పెరిగే అవకాశం. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, రచయితలకు విశేషమైన కాలమనే చెప్పాలి. 26,27 తేదీల్లో బంధువులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. శివాష్టకం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ప్రముఖులు మీకు అప్పగించిన బాధ్యతను సమర్థ వంతంగా నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గవచ్చు. రాజకీయ వేత్తలు, క్రీడాకారులు, రచయితలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 27,28 తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆదిత్య హృదయం పఠించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

అదనపు ఆదాయం లభించి అవసరాలు తీర తాయి. అత్యవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కాంట్రాక్టులు కొన్ని ఎట్టకేలకు దక్కించు కుంటారు. వ్యాపారులు విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు కొత్త అవకాశాలు దక్కవచ్చు. 29,30 తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి. శ్రమ తప్పదు. అనారోగ్యం. సుబ్రహ్మణ్యాష్టకం పఠిం చండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కష్టానికి ఫలితం అంతగా కనిపించదు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో చికాకులు. నిరుద్యోగుల ప్రయత్నాలలో ప్రతిబంధ కాలు ఎదురుకావుచ్చు. వ్యాపారస్తులకు ఒత్తిడులు. ఉద్యోగులు విధుల్లో సమర్థతను నిరూపించుకో వలసిన సమయం. రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలు నిర్ణయాలలో తొందరపడరాదు. 29,30 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. ధనలబ్ధి. కనకధారా స్తోత్రాలు పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE