భారత్‌ ‌సహా గ్లోబల్‌ ‌సౌత్‌ ‌దేశాల సంప్రదాయ విజ్ఞానికి సంబంధించిన మేధో వనరులను పరిరక్షించే లక్ష్యంతో ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (వరల్డ్ ఇం‌టలెక్చువల్‌ ‌ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌ – ‌డబ్ల్యుఐపిఓ) పాతికేళ్ల చర్చల అనంతరం వాటి పరిరక్షణ ఒప్పందాన్ని జెనీవాలో ఈ ఏడాది మే 26న ఆమోదించింది.

డబ్ల్యుఐపిఓ ఒప్పందం భారత్‌కు, గ్లోబల్‌ ‌సౌత్‌కు పెద్ద గెలుపు. ఈ ఒప్పందం కారణంగా ఈ దేశాల సంప్రదాయ విజ్ఞానాన్ని చట్టబద్ధంగా పరిరక్షించుకునే అవకాశం లభిస్తుంది. దాదాపు 25 ఏళ్ల చర్చలు, సంప్రదింపుల అనంతరం మే 26,2024న జన్యుపరమైన వనరులు, తత్సంబంధిత సంప్రదాయ విజ్ఞాన పరిరక్షణకు ఒక ఒప్పందం జెనీవాలోని డబ్ల్యుఐపిఓ కేంద్ర కార్యాలయంలో కుదిరిందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఈ ఒప్పందం భారత జన్యుపరమైన వనరులు, సంప్రదాయ విజ్ఞానానికి రక్షణలు కల్పించడమే కాక అభివృద్ధి చెందిన దేశాలు, బహుళ జాతి సంస్థలు వాటిని దుర్వినియోగం చేయడం నుంచి కాపాడుతుందని మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు. దౌత్యపరమైన సదస్సులో మే 13 నుంచి 24వరకు జరిగిన రెండు వారాల సంప్రదింపులలో 192 దేశాలు, 86మంది పరిశీలకులు చర్చలు జరిపిన అనంతరం ఒక అంగీకారం కుదిరిందని ఆయన తెలిపారు.

మేధోసంపత్తి, జన్యుపరమైన వనరులు (జిఆర్‌), ‌తత్సంబంధిత సంప్రదాయ విజ్ఞానం (ఎటికె) పై డబ్ల్యుఐపిఐ ఒప్పందం అన్నది గ్లోబల్‌ ‌సౌత్‌కు, భారత్‌కు గొప్ప విజయం. ముఖ్యంగా, భారీ జీవవైవిధ్యానికి, సంప్రదాయ విజ్ఞానం, వివేకానికి ఖని అయిన భారత్‌కు ఇది అత్యంత గొప్ప విజయమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. శతాబ్దాల పాటు ఆర్ధిక వ్యవస్థలు, సమాజాలు, సంస్కృతులకు మద్దతుగా నిలిచిన విజ్ఞ్ఞానానికి ఇప్పుడు గ్లోబల్‌ ‌మేధోసంపత్తి వ్యవస్థలో చోటు లభించింది.

తొలిసారి, స్థానిక సమూహాలు, వారి జన్యుపరమైన వనరులు, సంబంధిత సంప్రదాయ విజ్ఞానానికి అంతర్జాతీయ మేధోసంపత్తి సమాజంలో గుర్తింపు లభించడం గొప్ప విషయం. సంప్రదాయ విజ్ఞానాన్ని అందించడంలో, జీవవైవిధ్యానికి ఖజానాగా నిలిచిన భారత్‌కు ఇది అత్యంత గొప్ప విజయం.

ఈ ఒప్పందం జీవవైవిధ్యాన్ని పరిరక్షించి, కాపాడడమే కాక పేటెంట్‌ ‌వ్యవస్థలో పారదర్శికతను పెంచి, ఆవిష్కరణలను బలోపేతం చేస్తుంది. దీనిని ద్వారా అన్ని దేశాల, సమాజాలను అవసరాలకు స్పందించి మరింత సమ్మిళిత మార్గాన్ని పెంపొందిస్తూ చేసే ఆవిష్కరణలకు ఐపి వ్యవస్థ ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని కొనసాగించవచ్చు.

దీనికోసం సుదీర్ఘంగా పోరాడుతున్న భారత్‌, ‌గ్లోబల్‌ ‌సౌత్‌కు ఈ ఒప్పందం ఘన విజయం. బహుళ వేదికపై  దాదాపు రెండు దశాబ్దాలకు పైగా చర్చలు, సంప్రదింపులు అనంతరం 150కి పైగా దేశాల ఏకాభిప్రాయంతో ఈ ఒప్పందం కుదిరింది.

ఇందులో మేధో సంపత్తిని ఉత్పత్తి చేసి, ఈ వనరులు, విజ్ఞానాన్ని ఆవిష్కరణలకు, పరిశోధనలకు ఉపయోగించుకునే మెజారిటీ అభివృద్ధి చెందిన  దేశాలు కూడా ఉన్న క్రమంలో మేధోసంపత్తి వ్యవస్థలో సంఘర్షణకు తావిచ్చే రూపావళులకు ఈ ఒప్పందం వంతెనగా ఉండటమే కాక, శతాబ్దాలు,దశాబ్దాల తరబడి ఉనికిలో ఉన్న జీవవైవిధ్యానికి రక్షణ లభ్యమవుతుంది.

పేటెంట్‌ ‌దరఖాస్తుదారులు తమదంటూ వాదించే ఆవిష్కరణలకు మూలమైన జన్యు వనరులు లేదా సంబంధిత సాంప్రదాయ విజ్ఞానాన్ని బహిర్గతం చేస్తూ,  అది ఏ దేశానికి చెందినది లేదా జన్యు వనరుల మూలాన్ని బహిర్గతం చేయడానికి కాంట్రాక్టు పార్టీలు ఆమోదించిన తర్వాత అమలులోకి రావడంపై ఒప్పందం అవసరం.  ఇది భారత్‌కు గల గొప్ప తత్సంబంధిత సంప్రదాయ విజ్ఞానానికి (ఎటికె)కి• అదనపు రక్షణను అందిస్తుంది. ప్రస్తుతం భారతదేశ రక్షణలో ఈ విజ్ఞానం ఉన్నప్పటికీ, బాధ్యతలకు కట్టుబడి మూలాలను బహిర్గతం చేయని దేశాలలో దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉంది.

కనుక, మూలానికి సంబంధించిన అంశాలను బహిర్గతం చేసే బాధ్యతలపై అంతర్జాతీయ ప్రమాణాలను సృష్టించడం ద్వారా ఈ ఒప్పందం మేథోసంపత్తి వ్యవస్థలో జన్యుపరమైన వనరులు, తత్సంబంధిత సంప్రదాయ విజ్ఞానాన్ని అందించే దేశాలకు ముందెన్నడూ లేని విధంగా చట్రాన్ని ఈ ఒప్పందం సృష్టించనుంది. ప్రస్తుతం 35 దేశాలు మాత్రమే బహిర్గతం చేసే బాధ్యతకు కట్టుబడి ఉన్నాయి. ఇందులో చాలావరకూ తప్పనిసరి కానివి, దాని సమర్ధవంతమైన అమలుకు తగిన ఆంక్షలు లేదా నివారణలు అందుబాటులో లేనివి.

అభివృద్ధి చెందిన దేశాలు సహా ఈ ఒప్పందం లోని పార్టీలు తమ చట్టపరమైన చట్రంలో పేటెంట్‌ ‌దరఖాస్తులు మూలాన్ని బహిర్గతం చేయడం తప్పనిసరి చేసే చట్టాలను రూపొందించవలసి ఉంటుంది. ఈ ఒప్పందం సామూహిక వృద్ధికి సంబంధించిన ప్రయాణానికే కాదు, శతాబ్దాలుగా భారత్‌ ‌ప్రతిపా దించి, ప్రోత్సహించిన నిలకడైన వృద్ధి హామీని అందించే దిశకు సంకేతంగా నిలుస్తుంది.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE