– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

కుటుంబసభ్యులు మరింత ప్రేమ చూపుతారు. ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు. తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు కోరుకున్న మార్పులు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. క్రీడాకారులు, పరిశోధకులకు అవార్డులు లభిస్తాయి. 11,12 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

ఆదాయం కొంత నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు సంభవం. స్నేహితులు, బంధువులతో అకారణంగా తగాదాలు. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. విలువైన వస్తువులు, వాహనాలు జాగ్రత్తగా చూసుకోండి. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తారు. వ్యాపారస్తులకు లాభాలు, పెట్టుబడులు సంతృప్తినీయవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు, ఒత్తిడులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులకు అవకాశాలు చేజారతాయి. రచయితలు, క్రీడాకారులు కొంత నిరుత్సాహం చెందుతారు. 12,13 తేదీల్లో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. దేవీఖడ్గమాల పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

ఆత్మీయులు, శ్రేయోభిలాషులతో ఉత్సాహంగా గడుపుతారు. ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. ప్రముఖుల సలహాలు పొందుతారు. గృహ నిర్మాణయత్నాలు సాగిస్తారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు లభించవచ్చు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలవారు అనుకున్నది సాధిస్తారు. క్రీడాకారులు, రచయితలు, కళాకారులకు పట్టింది బంగారమే. 14,15 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. శివస్తుతి మంచిది.


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

మీ కష్టం ఫలించే సమయం. రావలసిన బాకీలు అంది అవసరాలు తీరతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. విద్యార్థులు, నిరుద్యోగులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. సమాజసేవలో పాలుపంచుకుంటారు. గతం గుర్తుకు రాగలదు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. వ్యాపారస్తులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులు కొన్ని మార్పులు పొందుతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు. కళాకారులు, రచయితలకు విశేష గౌరవం లభిస్తుంది. 10,11తేదీల్లో బంధువిరోధాలు. మానసిక అశాంతి. ఆంజనేయ దండకం పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ కార్యదక్షత, పట్టుదల అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఉద్యోగులకు పైస్థాయి వారి నుంచి సమస్యలు తీరతాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం. రచయితలు, పరిశోధకులకు అవార్డులు దక్కే అవకాశం. 14,15తేదీలలో శుభవార్తలు. వాహనయోగం. లక్ష్మీస్తుతి మంచిది.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

నిరుద్యోగులు, విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ భావాలతో స్నేహితులు ఏకీభవిస్తారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. రాబడి ఆశించినంతగా ఉండి అవసరాలు తీరతాయి. కాంట్రాక్టులు దక్కవచ్చు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. స్వల్ప అస్వస్థత. వ్యాపారులు పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు సన్మానాలు. క్రీడాకారులు, రచయితలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 13,14 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ తప్పదు. శివపంచాక్షరి పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

ఆదాయం సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. మీ ప్రతిపాదనలు, నిర్ణయాలు కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. ముఖ్య కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులు లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగులకు

 మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయవర్గాలకు పదవీయోగం. కళాకారులు, రచయితలు, క్రీడాకారులకు పట్టింది బంగారమే. 10,11 తేదీల్లో అనుకోని ఖర్చులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆదిత్య హృదయం పఠించండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాల వైపు పయనిస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. కొత్త కాంట్రాక్టులు కొన్ని లభిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. చిన్ననాటి స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులు మరింతగా లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి. కళాకారులకు నూతనోత్సాహం. రచయితలు, వైద్యులు, పారిశ్రామికవేత్తలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు. 13.14తేదీల్లో ఆస్తి వివాదాలు. శారీరక రుగ్మతలు. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని బాకీలు అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. శుభకార్యాలు, విందువినోదాలకు హాజరవుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. మీ నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారతారు. వ్యాపారస్తులు ఆశించిన విధంగా లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రశంసలు అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహం. క్రీడాకారులు విశేష గుర్తింపు పొందుతారు. 14,15తేదీల్లో లేనిపోని వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు రాగలవు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారస్తులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. కళాకారులు, పరిశోధకులు, రచయితల యత్నాలు సఫలం. 15,16 తేదీల్లో వృథా ఖర్చులు. ప్రయాణాలు.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇళ్లు, స్థలాలు సమకూర్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. నేర్పుగా ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.రాజకీయ, పారిశ్రామికవేత్తలకు అనుకోని విదేశీ పర్యటనలు. కళాకారులు, రచయితలు సత్తా చాటుకుంటారు. 10,11తేదీల్లో అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. గణేశాష్టకం పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వివాదాలు ఎదురైనా నేర్పుగా అధిగమిస్తారు. ఆదాయానికి లోటు లేకుండా గడుస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆస్తుల కొనుగోలు, విక్రయాలలో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు. రాజకీయ, పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం. కళాకారులు, రచయితలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 12,13తేదీల్లో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE