ఓటు నిర్ణయాన్ని ప్రభావితం చేసే అంశాలలో నిశితమైనది`సామాజిక అస్తిత్వం. ఒక సమూహంతో ఓటరుకు ఉన్న బంధం ఆ నిర్ణయాన్ని నిర్దేశిస్తుంది. ప్రపంచంలో జరిగిన చాలా అధ్యయనాలు దీనిని రుజువు చేశాయి. జాతి, సామాజిక అస్తిత్వాలే ఓటరు నిర్ణయాన్ని మలుస్తున్నాయి. ఇందుకు పెద్ద ఉదాహరణ మైనారిటీ ఓటర్లు. మతం, ఓటింగ్‌ సరళి మధ్య బంధం క్లిష్టమైనది.

 భారతీయ ఓటరు విషయానికి వస్తే సామాజిక అస్త్తిత్వస్పృహతో పాటు ధార్మిక స్పృహ అనివార్యం. ఎవరికి ఓటు వేయాలి అన్న ప్రశ్నను ఆత్మసాక్షిని అడిగి తెలుసుకోవాలన్న దృష్టి ఏర్పడుతున్నది. ఇంత విలువైన ఓటు ఎవరికి అన్న ప్రశ్నకు ధార్మిక దృక్కోణం నుంచి సమాధానం అన్వేషించే అవసరాన్ని చాలామంది ఓటర్లు ఇప్పుడు గ్రహిస్తున్నారు. కాబట్టే భారతీయ నాగరికత పునాదిగా ఉండే రాజకీయ చింతన, పరిష్కార మార్గాలతో ముందుకు వచ్చిన రాజకీయ పక్షానికి విజయం లభిస్తున్నది. అదే భారతీయ జనతా పార్టీ. ఈ చింతన నుంచి, దృష్టి నుంచి ఓటరును దూరంగా తీసుకుపోయే ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. దానికి ఉన్న చారిత్రక, సామాజిక కారణాలు బలమైనవి. ఈ రెండిరటికీ రాజకీయ కారణాలు ఊడిగం చేస్తున్నాయి.

మన సామాజిక గమ్యాన్ని నిర్దేశించేది ప్రభుత్వం. భారత్‌ వంటి ప్రజాస్వామిక వ్యవస్థలో ఆ ప్రభుత్వాన్ని ప్రతిష్టించేది ఓటు. ఓటు వేసే నిర్ణయం దగ్గర చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చినా ధర్మం, సంస్కృతి, గతంతో మన బంధం వంటి వాస్తవాలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. ఫలితమే ఈ దేశంలో మెజారిటీ మతస్థుల మీద దాడి. బుజ్జగింపు అనే దీర్ఘరోగంతో బాధపడుతున్న రాజకీయ నాయకత్వం ఇలాంటి దాడికి దారి చూపుతోంది. భారత స్వాతంత్య్ర సమర కాలం నుంచి బుజ్జగింపు ఒక వాస్తవం. దాని ఫలితం చరిత్ర క్షమించనంత దారుణ మైనది. అదే` దేశ విభజన. దాని నుంచి పాఠాలు నేర్చుకోలేకపోతున్నారు. ఇంత సుదీర్ఘ చరిత్ర చూస్తే దీని నుంచి మనిషి ఏమీ నేర్చుకోలేదన్న విషయం అర్ధమవుతుంది అంటారు తత్త్వవేత్తలు. భారత రాజకీయ నాయకత్వంలో ఒక తెగ చరిత్ర అందుకు సరైన ఉదాహరణ. వాటి వర్తమానం సజీవ సాక్ష్యమే.

ఈ దేశంలో హిందువులు మెజారిటీలు. కానీ వారి జీవన విధానానికీ, విశ్వాసాలకు విలువ దక్కడం లేదు. దీనిని ప్రశ్నించే సమూహానికి వేర్వేరు పేర్లు పెట్టి హక్కులకీ, ప్రభుత్వాలకీ దూరంగా ఉంచు తున్నారు. 143 కోట్ల జనాభాలో 80 శాతం ఉన్న వర్గం ద్వితీయ శ్రేణి పౌరులుగా ఎందుకు మనుగడ సాగించవలసి వస్తున్నది? ఏ పరిస్థితులు దారి తీశాయి? ఏమిటీ హిందూ వ్యతిరేకత?

స్వయం ప్రకటిత మేధావులు, ఉబుసుపోక ఉదారవాదులు నెగేషనిజంలో ముగిని ఉండవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా హిందూ వ్యతిరేక కుట్రలు ఒక వాస్తవం. క్రైస్తవం కోసం కొందరు. ఉమ్మా పేరుతో అవిశ్వాసులను అంతం చేయడానికి కొందరు. కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్‌ విశ్వ విద్యాలయాలలో ఎందుకు జరుగుతున్నది హిందూ వ్యతిరేక ప్రచారం? ఎందుకీ హిందూ ఫోబియా? దీనికి కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌ గాంధీ, డీఎంకే యువరాజు ఉదయనిధి స్టాలిన్‌ ఎందుకు వత్తాసు పలుకుతున్నారు?

1990కి ముందు కమ్యూనిజం పేరుతో, బడుగువర్గాల ఉద్ధరణ పేరుతో వాస్తవంగా జరిగినది హిందూ సంస్కృతి మీద దాడి. కళలు, రచన, రాజకీయం అంతా హిందూ వ్యతిరేకతతో నింపారు. అప్పటిదాకా ఇలాంటి విధ్వంసక శక్తులకు రక్షణ కవచంలా ఉపయోగపడిన కమ్యూనిజం కుప్ప కూలడంతో కొత్త మార్గం అవసరమైంది. ఆర్యద్రావిడ సిద్ధాంతానికి ఊపిరులూదడం, ఆఫ్రో`దళిత్‌ ప్రాజెక్టుల ఆవిర్భావం ఆ నేపథ్యంలో జరిగినవే. కశ్మీర్‌లో పండిత్‌ల ఊచకోత, పంజాబ్‌లో ఖలిస్తానీలు, భారత దక్షిణ భాగంలో ‘ప్రజాస్వామిక’ వేర్పాటువాదం అప్పుడు ముమ్మరించినవే. కానీ అదే సమయంలో బలపడిన అయోధ్య ఉద్యమం పతాకస్థాయికి చేరినది కూడా అప్పుడే. ఇక్కడే చరిత్ర మలుపు తిరిగింది. అయోధ్య ఉద్యమానికి ముందు భారతదేశం, తరువాతి భారతదేశం అన్న విభజన కనిపిస్తుంది. 1947 నాటి ఒక మహా విధ్వంసపు విభజన విపత్తు పునరావృతం కాకుండా కాపాడిరది. శతాబ్దాల పాటు ఇక్కడ పరఢవిల్లిన సాంస్కృతిక ఏకత్వ స్పృహను అయోధ్య ఉద్యమం తట్టి లేపింది. మార్క్సిజం, లెనినిజం, నెహ్రూ చింతన, మోసపూరిత దళితవాదం, మావోయిజం ఐసీయూలోకి వెళ్లాయి.

ఈ రాజకీయ సునామీకి కేంద్రమే భారతీయ జనతా పార్టీ. సాంస్కృతిక జాతీయవాదం, సంక్షేమం, దేశమే ప్రధానం అన్న నినాదాలతో సాగుతున్న బీజేపీని ఓడిరచడానికి విపక్షాలు దిగజారుతున్న తీరు జుగుప్సాకరం. ఏప్రిల్‌ మూడో వారంలో బేతుల్‌ ఎన్నికల సభలో (ఎంపీ) ప్రధాని చేసిన ఆరోపణ విపక్షాల రాజకీయ దిగజారుడికి పరాకాష్ట. కొన్ని పత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగా ప్రధాని ఆ వ్యాఖ్య చేశారు. ఏడాదికి ఒకరి వంతున ఐదుగురు ప్రధానులుగా పని చేయడానికి ఆ పదవికి ఇండీ కూటమి వేలం పాట నిర్వహిస్తున్నదని ప్రధాని మోదీ ఆరోపించారు.

ఈ దేశంలో చాలా పార్టీలకు భారతమాత పేరు పలకడం ఇష్టం లేదు. హిందువుల హక్కుల గురించి పట్టదు. మైనారిటీల ఆఘాయిత్యాలను పట్టించుకునే, వాటి గురించి ఆలోచించే, ఆ అఘాయిత్యాల వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్రను, ఉగ్రవాద కోణాన్ని చూసే ఓపిక, తెలివిడి లేవు. అలాంటి పార్టీల నుంచి ఓట్లు అడగడానికి వచ్చిన వారిని ఈ ప్రశ్నలు అడుగుదాం. ఈ దేశ సంపద మీద ముస్లింలకే ప్రథమ హక్కుల అంటే అర్ధం ఏమిటో ప్రశ్నించవలసిన అవసరం లేదా? మరి ఎస్‌సీలు, ఎస్‌టీలు, దళితులు, వెనుకబడిన వర్గాల వారు, రైతులు, చేనేతలు వీరికి హక్కు ఎప్పుడు అని ప్రశ్నిద్దాం.

దేశ రక్షణ, సర్వ ధర్మ సమభావన, అందరికీ సమాన హక్కులు వంటి అంశాల మీద సరైన అవగాహన, నిబద్ధత ఉన్న పార్టీలు ఇప్పుడు ఒకటి రెండు మాత్రమే. మిగిలనవన్నీ హిందువులకు తప్ప మిగిలిన అన్ని మతాల, వర్గాల మీద ఈగ వాలనీయడానికి ఒప్పుకోనివే. అలాంటి పార్టీల నేతలు మిమ్మల్ని ఓటు అడగడానికి వస్తే ఈ ప్రశ్నలతో నిలదీయాలి.


*   భారతమాతాకీ జై అంటూ వేదిక ఎక్కి చెప్పగలరా? స్వాతంత్య్రం తెచ్చిన వందేమాతరం నినాదాన్ని హృదయపూర్వకంగా పలకగలరా? జైహింద్‌ అని నోరారా చెప్పగలరా?

*  మతం, కులం, ప్రాంతం ఏదైనా మనమంతా భారతీయులమేనని ప్రకటించగలరా?

*  నేను మొదట భారతీయుడిని, తరువాతే మరేదైనా అని చెబుతారా?

*  దేశంలో హిందువులకు కూడా హక్కులు ఉన్నాయని చాటగలరా?

*  శ్రీరాముడు భారతదేశానికి ఆదర్శపురుషుడు. ఆయన పుట్టిన అయోధ్యపై హక్కు కోసం హిందువులు అంతకాలం ఎందుకు పోరాడవలసి వచ్చింది?

*  బాలక్‌రామ్‌ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, ఇతర పార్టీలను, వ్యక్తులను మీరు ఎలా చూస్తారు? జైశ్రీరామ్‌ నినాదం కడుపు నింపుతుందా అంటూ ప్రశ్నించేవారికి ఓటు వేయాలంటారా?

*  రామ, హనుమ శోభాయాత్రల మీద, ఇతర ఉత్సవాల మీద దేశవ్యాప్తంగా జరిగిన దాడులు గురించి ఏమంటారు?

*  భారత రాజ్యాంగం మీద రాముడి చిత్రం ఉన్నట్టు మీకు తెలుసా? దీని అర్థం ఏమిటి?

*   ఈ దేశానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరమేనని చెప్పగలరా?

*  కశ్మీర్‌ పండిత్‌లపై ఊచకోత (1990)ను ఇక విచారించలేమని, సిక్కుల హత్యాకాండ (1984)పై సిట్‌ను నియమించవచ్చునని చెప్పడం న్యాయవ్యవస్థకు ధర్మమా? 370 అధికరణ రద్దు సమంజసమేనని చెప్పగలరా?

*   ‘హిందూయిజంలోని శక్తికి వ్యతిరేకంగా పోరాడతాం’ అని రాహుల్‌ చెప్పడం మెజారిటీ ప్రజల మనోభావాలకు విరుద్ధం కాదా?

*  డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్‌ హిందూ ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలన్నాడు. ఏ. రాజా భారత్‌ ఒక దేశమే కాదన్నాడు. రాముడు వాళ్లకి శత్రువు అన్నాడు. భారతమాతాకీ జై వంటి నినాదాలని తమిళనాడు ఏనాడూ అంగీకరించదన్నాడు. హిందువులనూ, భారతీయులనూ దారుణంగా అవమానించిన ఈ వ్యాఖ్యలను మీరు బహిరంగంగా ఖండిరచ గలరా?

*  15వ శతాబ్దం నాటి హిందూ దేవాలయాన్ని వక్ఫ్‌ ఆస్తిగా చూడడానికి అంగీకరిస్తారా?

* పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో దళిత వర్గాల మహిళలను షేక్‌ షాజహాన్‌ అనేవాడు చెరబడితే ఒక్క మానవహక్కుల సంఘం, మహిళా సంఘం నోరెత్తలేదు. షేక్‌ను ముఖ్య మంత్రి శాసనసభ సాక్షిగా వెనకేసుకొచ్చారు. దీనిని మీరు ఎలా చూస్తున్నారు?

* ‘370 అధికరణాన్ని రద్దు చేసినా మౌనం ఉన్న నాయకులు సెక్యులరిస్టులు ఎందుకవుతారు?’ అన్న అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్య, పావుగంట రక్షణదళాలు కళ్లు మూసుకుంటే ముస్లింల సత్తా ఏమిటో హిందువులకు చూపిస్తామన్న అక్బరుద్దీన్‌ వ్యాఖ్య సంఘ వ్యతిరేకమని చాటగలరా?

*  కర్ణాటకలో కోటి రూపాయల ఆదాయం దాటిన హిందూ దేవాలయాల మీద పన్ను విధింపు, మతాంతరీకరణ, హిజాబ్‌, గోవధలకు అనుమతిస్తామని ప్రకటించిన ప్రభుత్వాన్ని ఏమనాలి?

*  ఈ దేశంలో బహిరంగంగా గుడిగంటలు మోగించే, హనుమాన్‌ చాలీసా చదువుకునే హక్కు హిందువులకు ఉందా లేదా?

  లవ్‌ జిహాద్‌ భారతీయతకు గొడ్డలిపెట్టు అని నమ్మగలరా?

ఏ రాజకీయ పార్టీని అయినా సమర్థించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఈ హక్కును దారుణంగా భంగపరుస్తున్న పార్టీలు ఉన్నాయి. దానిని గుర్తిస్తూనే అందుకే మన దేశం, మన ధర్మం అన్న చింతనతో ఈ ఎన్నికలలో ఓటు వేద్దాం.

– జాగృతి డెస్క్‌

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE
Instagram