‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ/ఎన్డీఎ ప్రభుత్వం ఆర్టికల్‌ 370 ‌రద్దు మొదలు అనేక అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపింది. అసాధ్యాలను సుసాధ్యం చేయడం మోదీ ప్రభుత్వ ‘హాల్‌ ‌మార్క్’‌గా, ఒక మకుటంగా మారిందని అనడం అతిశయోక్తి కాదు. మోదీని అనుక్షణం ఆడి పోసుకునే రాజకీయ ప్రత్యర్ధులు కూడా దీనిని కాదనలేరు. అందుకే, కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, మోదీజీ యూపీఐ చొరవను నాడు పార్లమెంట్‌ ‌వేదికగా అవహేళన చేసిన చిదంబరం సైతం, ‘మోదీకి ఏదీ అసాధ్యం కాదు. ఆయన అనుకున్నది సాధ్యమై తీరుతుంద’నే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంకిత భావంతో అనుకున్నది సాధిస్తారని అభినందించారు. ఒక్క చిదంబరంలో మాత్రమేకాదు, 140 కోట్ల మంది భారతీయుల్లోనూ అదే విశ్వాసం ఉంది. విదేశాల్లో ఉన్న భారతీయులు, అంతకంటే ఎక్కువగా విదేశీయులు, విదేశీ ప్రభుత్వాలు, ‘మోదీ అంటే విశ్వాసం, మోదీ అంటే భరోసా’ అంటున్నారు. అందుకే మోదీ, పప్రంచంలోనే అత్యంత ప్రజాదరణ గల నాయకుడిగా గుర్తింపు పొందారు.

ఇటీవల ఖతార్‌ ‌ప్రభుత్వం గూఢచర్యం ఆరోపణలపై మరణ శిక్ష పడిన ఎనిమిది మంది భారతీయ నావికాదళ మాజీ అధికారులను విడుదల కావడానికి మోదీ విశ్వసనీయతకు ఒక ఉదాహరణగా పేర్కొంటున్నారు. మరణశిక్ష విధించిన తర్వాత భారత దౌత్యం కారణంగా దానిని కారాగార శిక్షగా తగ్గించారు. ఆ తర్వాత, ఇంతవరకు ఎక్కడ, ఎప్పుడు జరగని విధంగా ఖతార్‌ అమీర్‌, అల్‌ ‌దానీ, భారతీయ మాజీ నౌకాదళ అధికారులను విడుదల చేసి, సగౌరవంగా స్వదేశానికి పంపారు.

మన దేశం సాధించిన ఈ దౌత్య విజయం వెనక ఎంతో కథ వుంది.. మోదీ హీరోగా సాగిన ఈ కథలోకి వెళితే.. ఖతార్‌ ‌స్థానిక న్యాయస్థానం మరణ శిక్ష విధించిన ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులు, సజీవంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. పరాయి దేశంలో గూఢచర్యం ఆరోపణలపై మరణదండన దాకా వెళ్లిన మనవాళ్లు విముక్తి పొంది స్వదేశానికి తిరిగి వస్తారని ఎవరూ అనుకుని ఉండరు. మన విదేశీ వ్యవహారాలశాఖ అధికారులు అన్నట్లు, ప్రపంచ అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే, గూఢ•చర్యం కేసులో ఉరికంబం దాకా వెళ్లినవారు తిరిగి వస్తారని, అనుకునే, ఆశించే, ఆలోచించే ఆస్కారమే లేదు. అది సుసాధ్యమైంది. డిసెంబర్‌ 12 ఆ ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారాలలో ఏడుగురు చిరునవ్వులు చిందిస్తూ స్వదేశానికి తిరిగి వచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో విమానం దిగారు. భారత్‌ ‌మాతాకీ జై .. అంటూ హుందాగా నడుచుకుంటూ ముందుకు సాగారు. మిగిలిన ఒక్కరు కొంచెం ఆలస్యంగా స్వదేశం చేరుకున్నారు. మోదీజీ చొరవ వల్లనే తము సజీంగా తిరిగి వచ్చామని అంటున్నారు.

పద్దెనిమిది నెలలుగా అక్కడి జైళ్లలో అనుక్షణం భయం భయంగా బతికిన తాము ప్రధాని మోదీ చొరవతోనే సజీవంగా స్వదేశానికి తిరిగొచ్చామని అంటున్న వారి మాటల్లో ఆయన పట్ల గల విశ్వాసం స్పష్టంగా కనిపించింది. ఇదొక అనూహ్య పరిణామ మనే దౌత్య వ్యవహారాలలో అనుభవం ఉన్న వారు అంటున్నారు.

 ఆ ఎనిమిది మంది అరెస్ట్‌కు విడుదలకు మధ్య చాలా కథే నడిచింది. అది… అల్‌ ‌దహ్రా సంస్థలో పని చేస్తున్న మన దేశానికి చెందిన ఎనిమిదిమంది నౌకాదళ మాజీ అధికారులను, గూఢచర్యం ఆరోపణలపై ఖతర్‌ అధికారులు 2022 ఆగస్టులో బంధించారు. స్థానిక న్యాయస్థానం విధించిన మరణ శిక్షను అపీల్స్ ‌కోర్టు యావజ్జీవ శిక్షగా మార్చింది. వారిలో ఏ ఒక్కరినీ నిర్దోషిగా నిర్ధారించలేదు. విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించ లేదు. వారిని ఎలాగైనా సజీవంగా స్వదేశానికి రప్పించేందుకు, దౌత్యపరంగా చేయగల అన్ని ప్రయత్నాలు చేసింది. మన విదేశాంగ శాఖ, ఇంచుమించుగా సంవత్సర కాలానికి పైగా అనేక నిర్ణయాలు తీసుకుంది.

భారతీయ నౌకాదళ మాజీ అధికారులు ఖతార్‌లో అరెస్టయిన వెంటనే, ప్రధాని మోదీ ఆదేశాలతో, విదేశాంగ శాఖమంత్రి జైశంకర్‌ ఆ ‌దేశంతో చర్చలు ప్రారంభించారు. వారిని ఎలాంటి షరతులు లేకుండా స్వదేశానికి తిరిగి రప్పించడమే లక్ష్యంగా…మధ్య ప్రాచ్య, పశ్చిమ ఆసియా పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగిన ఆరుగురు అధికారులతో జైశంకర్‌ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో పదవీ విరమణ చేసిన అధికారులు కూడా ఉన్నారు. మరో వంక, మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌ ‌తమ పని తాము కానిచ్చారు.

కాగా, గత డిసెంబరులో కాప్‌ ‌సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖతార్‌ అమీర్‌తో భేటీ అయిన సందర్భంలో, ఏమి మాట్లాడారో ఏమో కానీ, అక్కడే శుభం కార్డుకు రంగం సిద్ధమైంది మనవాళ్లు విడదలయ్యారు. దౌత్య సంబంధాలు ఏ మాత్రం దెబ్బతినకుండా, ఎక్కడా, ఎలాంటి వ్యతిరేక ప్రకటన లేకుండా, ప్రభుత్వం ఎంతో సమన్వయంతో వ్యవహరించింది. సున్నిత మైన సమస్యను అతి సున్నితంగా పరిష్కరించారు. అందుకే ఇటు దౌత్యవేత్తలు, అటు రక్షణరంగ నిపుణులు, న్యాయపండితులు ఈ మొత్తం వ్యవహారాన్ని మోదీ ప్రభుత్వ దౌత్య విజయంగా అభివర్ణిస్తున్నారు.

చాణక్య నీతి

ఈ పరిణామం అనూహ్యం మాత్రమే కాదు, అద్భుత దౌత్య విజయంగా నిపుణులు పేర్కొంటు న్నారు. భారత ప్రభుత్వ దక్షతకు నిదర్శనం అంటున్నారు. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌, ‌జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌ ‌త్రయం నిబద్ధతతో, నిజాయతీగా సాగించిన ప్రయత్నాలకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. మోదీ సారథ్యంలో మన దేశపు ఖాతాలో చేరిన మరో చారిత్రక దౌత్య విజయంగా అభివర్ణిస్తున్నారు. అమృతకాల దర్శనంలో మరో వెలుగురేఖ, విశ్వగురు ప్రస్థానంలో మరో ముందడుగు అంటున్నారు.

ఒక్క ఖతారనే కాదు, ప్రపంచంలో ఏ దేశం కూడా, గూఢచర్యం వంటి తీవ్రాతితీవ్రమైన కేసులో ఆయా దేశాల న్యాయస్థానాలు మరణ శిక్ష విధించిన విదేశీయులను వదిలిపెట్టవు. వదిలి పెడతారనే ఆలోచన కూడా రానీయవు. . కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు నుంచి ఖతార్‌తో సాగిస్తూ వచ్చిన దౌత్య, స్నేహ సంబంధాల కారణంగా, ఖతార్‌ ‌ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. క్షమాభిక్షకు సంబంధించి కేసు ఇంకా విచారణలో ఉండగానే, భారత నౌకాదళం మాజీ అధికారులను ఖతార్‌ ‌ప్రభుత్వం విడుదల చేసింది, సగౌరవంగా స్వదేశానికి పంపింది. ఫిబ్రవరి 12వ తేదీ, ‘భానుడు’ ఉదయిస్తున్న వేళ, భారత విదేశాంగ శాఖ చల్లని వార్తను మోసుకొచ్చింది.

‘‘ఖతార్‌లో బందీలుగా మారిన ఎనిమిదిమంది భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నాం. అందులో ఏడుగురు ఇప్పటికే స్వదేశానికి చేరుకు న్నారు. ఖతార్‌ ‌ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కమాండర్‌ అమిత్‌ ‌నాగ్‌పాల్‌, ‌కెప్టెన్‌ ‌సౌరభ్‌ ‌వశిష్ఠ, కెప్టెన్‌ ‌నవ్‌తేజ్‌ ‌సింగ్‌ ‌గిల్‌, ‌కెప్టెన్‌ ‌బీరేంద్ర కుమార్‌ ‌వర్మ, కమాండర్‌ ‌పూర్ణేందు తివారీ, కమాండర్‌ ‌సుగునాకర్‌ ‌పాకాల, కమాండర్‌ ‌సంజీవ్‌ ‌గుప్తాలు భారత్‌కు తిరిగొచ్చిన వారిలో ఉన్నారని విదేశాంగ శాఖ ప్రకటన పేర్కొంది. ఇంతకు మించి ప్రకటనలో మరే ఇతర వివరాలు లేవు. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తూ వచ్చిన విభిన్న విదేశాంగ విధానం, ప్రపంచ దేశాలలో పెరుగతున్న భారత ప్రతిష్ట కారణంగానే, భారతీయుల విడుదల సాధ్యమైందని వేరే చెప్పనక్కర్లేదు. నిజానికి, ఇది ఎనిమిదిమంది విడుదలకు పరిమితం అయిన విషయం మాత్రమే కాదు. అంతర్జాతీయంగా భారత దేశం పట్ల పెరుగుతున్న విశ్వాసానికి ఇదొక సంకేతం.

మరో కలికి తురాయి

గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన వ్యక్తులు, అది కూడా శిక్ష ఖారారై… క్షమాభిక్ష కేసు విచారణ సైతం ఇంచుమించుగా ముగింపు దశకు చేరుకున్న సమయంలో, ఉచ్చు నుంచి బయట పడి రాజ మార్గంలో స్వదేశానికి తిరిగి రావడం కల్పిత కథల్లో సాధ్యం ఏమో కానీ, వాస్తవంలో జరిగే పని కాదు. కానీ, అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో ఆరితేరిన, జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ కార్యాన్ని సైతం సుసాధ్యం చేశారు. అందుకే, విపక్షాలు సైతం ఈ దౌత్య విజయాన్ని మోదీ కీర్తి కిరీటంలో చేరిన మరో తురాయిగా పేర్కొంటున్నారు. అభినందిస్తున్నారు.ఈ వ్యవహారంలో మన విదేశాంగశాఖ కృషి, ప్రధానమంత్రి నరేంద్ర మోడ్‌ ‌మోదీ వ్యక్తిగతంగా చేసిన ప్రయత్నాలు విశేషమైన వని, మీడియా సైతం మెచ్చుకుంటోంది. ‘భారత్‌-‌ఖతార్‌ ‌ద్వైపాక్షిక సంబంధాల్లో మైలురాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. అంతర్జాతీ యంగా, ముఖ్యంగా పశ్చిమా సియాలో భారత్‌కు పెరుగుతున్న పలుకుబడికి ఈ ఉదంతమ అద్దం పడుతున్న’దని, మోదీ వ్యతిరేక ముద్రలు వేసుకున్న మీడియా సంస్థలు కూడా పేర్కొంటున్నాయి అంటే, మోదీ ఎంతటి క్లిష్టమైన సమస్యను అవలీలగా పరిష్కరించారో వేరే చెప్పనక్కరలేదు. ..

నభూతో..న భవిష్యతి..

నిజమే, గతంలోనూ అప్పుడప్పుడు, అక్కడక్కడ, తమ తమ దేశాల్లో నేరాలకు పాల్పడిన విదేశీయుల శిక్షలను తగ్గించిన సందర్భాలు, క్ష.మించి వదిలేసిన సందర్భాలు కొన్ని ఉంటే ఉండవచ్చును, కానీ, కేసు న్యాయస్థానాల విచారణలో ఉండగానే విడుదల చేయడం మాత్రం, ‘నభూతో.. న భవిష్యతి..’ అంటున్నారు, విదేశాంగ శాఖలో ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు. ‘‘గతంలోనూ ఖతార్‌ అమీర్‌, ‌క్షమాభిక్ష ప్రసాదించి, ఖైదీలను విడుదల చేశారు. అలాగే, అనేక ఇతర దేశాలు కూడా ఖైదీలను క్షమించి వదిలేసిన సందర్భాలున్నాయి. కానీ ఇలా, క్షమాభిక్ష కేసు విచారణలో ఉండగానే విడుదల చేసిన సందర్భాలు మాత్రం లేనేలేవు. అలాగే, ఖతార్‌ ‌సహా చాలావరకు దేశాలు గూఢచర్యం కేసులో శిక్ష పడిన ఖైదీలను విడుదల చేసిన సందర్భాలు లేనే లేవు’ విదేశాంగ శాఖ అధికారులు అంటున్నారు. అందుకే ఇది, అనితర సాధ్యం.. అద్భుత దౌత్య విజయం, మోదీ విజయం అంటున్నారు .

-రాజనాల బాలకృష్ణ

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram