– సింహంభట్ల సుబ్బారావు, 6300674054

మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం

చేపట్టిన కార్యక్రమాలలో కొంత జాప్యం. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి.  ఆరోగ్యసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదా సీదాగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగు తుంది. రాజకీయనేతలకు కొంత నిరాశ తప్పదు. కళాకారులు, రచయితలకు ఒత్తిడులు. 22,23 తేదీల్లో కీలక నిర్ణయాలు. కార్యజయం. వస్తులాభాలు. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.


వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు

పనుల్లో ముందడుగు వేస్తారు. ఆదాయం మరింత పెరిగే అవకాశం. కొత్త విద్యావకాశాలు పొందుతారు. కొన్ని వివాదాల నుంచి బయట పడతారు.  ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. వైద్యుల యత్నాలు సఫలం. క్రీడా కారులు, సాంకేతికనిపుణులకు ఆశలు ఫలిస్తాయి. 24,25తేదీల్లో మానసిక ఆందోళన. ఆరోగ్య సమస్యలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.


మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

 చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. మీ కృషి ఫలించే సమయం. జీవిత భాగస్వామితో తగాదాలు తీరతాయి. కాంట్రాక్టర్లకు అనుకూలం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు. వైద్యులు, వ్యవసాయ దారులకు కాస్త ఊరట కలుగుతుంది.  19,20 తేదీల్లో ప్రయాణాలు రద్దు. అత్యంత ఆప్తులతో వివాదాలు. శివపంచాక్షరి పఠించండి..


కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్ని హితులతో వివాదాలు తీరతాయి. మీ అంచనలు నిజమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు.  వ్యాపా రాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు ఊహించని పిలుపు రావచ్చు. సాంకేతిక నిపుణులు, రచయితలకు ఆహ్వానాలు. 23,24 తేదీల్లో ఖర్చులు పెరుగుతాయి. సహనం అవసరం. అనారోగ్యం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.


సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

కొన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తి.   విలువైన వస్తువులు కొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు సమస్యలు దూరం కాగలవు. పారిశ్రామికవేత్తలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి.క్రీడాకారులు, వైద్యుల కృషి కొంత ఫలించే సమయం. 22,23 తేదీల్లో దూరప్రయాణాలు. ఒప్పందాలు కొన్ని వాయిదా వేస్తారు. ధనవ్యయం. గణేశ్స్తోత్రాలు పఠిం చండి.


కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు

ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. మీ వ్యూహాల అమలులో కుటుంబసభ్యుల సహకారం అందు తుంది. నిరుద్యోగులకు అంచనాలు నిజమవు తాయి.వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. క్రీడాకారులు, వ్యవసాయదారులు మరింత ఉత్సాహంతో ముంద డుగు వేస్తారు.  20,21 తేదీల్లో వృథా ఖర్చులు. ఆదిత్య హృదయం పఠించండి.


తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఓర్పుతో కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు క్లిష్టమైన బాధ్యతల నుండి విముక్తి. రాజకీయ వేత్తలకు విదేశీపర్యటనలు ఉంటాయి. రచయితలు, సాంకేతిక నిపుణులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. 19,20 తేదీల్లో మీ నిర్ణయాలు మార్చుకుంటారు. మనశ్శాంతి లోపిస్తుంది. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ

కొన్ని కార్యక్రమాలలో వేగం తగ్గినా సమయానికి పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.  నిరుద్యోగులకు కొత్త ఆశలు. వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవేత్తలకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వైద్యులు, కళాకారులకు ఊహించని అవకాశాలు రావచ్చు.  20,21 తేదీల్లో కొంత ఆందోళన తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.


ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం

కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. రాబడి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు ఊహించని పోస్టులు రావచ్చు. క్రీడాకారులు, సాంకేతిక నిపుణుల దీర్ఘకాలిక కల నెరవేరుతుంది.  22,23 తేదీల్లో ఖర్చులు తగ్గించుకోవాలి.  ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆంజనేయ దండకం పఠించండి.


మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం , ధనిష్ఠ 1, 2 పాదాలు

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. 20,21 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. ఆప్తుల నుండి సమస్యలు. గణపతిని పూజించండి.


కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది.   ఆలయాలు సందర్శి స్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. కళాకారుల యత్నాలు సఫలం. 19,20 తేదీల్లో శ్రమ తప్ప ఫలితం ఉండదు. వివాదాలకు దూరంగా ఉండండి. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.


మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

కొత్త కార్యక్రమాలు చేపడతారు.నిర్ణయాలలో మాత్రం కొంత నిదానం అవసరం ఆరోగ్యసమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం మరింత పెరుగుతుంది.  వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు విధులు మరింత తేలికపడతాయి.   వైద్యులు, సాంకేతిక నిపుణులకు కొత్త ఆశలు. 22,23 తేదీల్లో కొత్త సమస్యలు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. దుర్గాస్తోత్రం పఠించండి.

About Author

By editor

Twitter
Instagram