A man in handcuffs sits behind a gavel waiting for the judge to render his decision.

అమరావతి రాజధాని కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానుల బెడద, విశాఖకు సీఎం క్యాంపు కార్యాలయం తరలింపు పక్రియ ఆగినట్లేనని అధికార పార్టీ నేతలు, అధికారులు పేర్కొంటున్నారు. త్వరలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ ‌వెలువడనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ ‌రెడ్డి కూడా విశాఖకు తరలివెళ్లే సాహసం చేసే అవకాశం లేదు. మొత్తానికి వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయం నినాదానికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు ఆర్‌ 5 ‌జోన్‌ ‌కేసు విచారణను కూడా సుప్రీం కోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేయడంతో  రాజధాని ప్రాంతంలో 2024 ఎన్నికల్లో విజయం సాధించాలనే వైసీపీ  ఆలోచనకు తెరపడింది.

రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలోని 34,322 ఎకరాల భూములను 29,881 మంది రైతులు భూ సమీకరణ కింద ఇచ్చారు. వారిలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ఎకరంలోపు భూమి ఉన్నవారు 20 వేల మంది, 5 ఎకరాలలోపు వారు 8,500మంది ఉన్నారు. రాజధాని నిర్మాణంతో తమ బతుకులు బాగుపడతాయన్న ఆశతో వారు ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తమను ఊహించని విధంగా మోసం చేసిందని అంటున్నారు. 2019 డిసెంబరు 17న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి శాసన సభలో చేసిన ‘మూడు రాజధానుల’ ప్రకటన ఆ ప్రాంతవాసులను కుదిపేసింది. ఆ మర్నాడే రాజధాని ఉద్యమం ఊపిరి పోసుకుంది. తుళ్లూరు, మందడం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో మొదలైన ఉద్యమం క్రమంగా రాజధాని గ్రామాలకు విస్తరించింది.

మూడవనాడు (19వ తేదీన) రైతులు బంద్‌ ‌నిర్వహించారు.వారికి మద్దతుగా గుంటూరు, విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. వారి ఉద్యమానికి అధికారపక్షం మి•నహా పార్టీలన్నీ సంఘీభావం ప్రకటించాయి. ఆయా పార్టీల నాయకులు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు మద్దతు తెలిపారు.

ప్రభుత్వంపై సమరశంఖం

రాజధాని కోసం వేలాది ఎకరాలు తృణప్రాయంగా ఇచ్చిన రైతులు తమను వైసీపీ ప్రభుత్వం తమను నమ్మించి నట్టేట ముంచిందని విమర్శిస్తూ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. అనతి కాలంలోనే రాజధాని సమరం రాష్ట్ర ప్రజలందరి ఉద్యమంగా మారింది. రాజధాని రైతులు, మహిళలు, రైతుకూలీలు, దళిత బహుజన వర్గాలు ఏకమై మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని ఉరకలెత్తించాయి. పోలీసుల నిర్బంధాలు, కవాతులు, లాఠీల కరాళ నృత్యాలు, రక్తమోడుతున్న గాయాలు.. ఇవేవీ పోరాట పటిమను దెబ్బతీయలేకపోయాయి. అందుకే ఈ మహా ఉద్యమం దేశ చరిత్రలో సుదీర్ఘ సమరశీల పోరాటంగా నిలిచి పోయింది. మూడు రాజధానుల ప్రకటన వెల్లడై నప్పటి నుంచి ఆర్‌ ‌జోన్‌-5 ఏర్పాటు, అందులో ఇళ్ల నిర్మాణం వరకు వైసీపీ ప్రభుత్వం అమరావతిపై చేయని కుట్ర లేదని రైతులంటున్నారు. ప్రజా రాజధానిపై పగబట్టిన ప్రభుత్వం.. ఉద్యమ గళాలను అణిచేయడానికి చేయని ప్రయత్నమూ లేదు. తాము స్నానంచేసే సమయంలో ప్రభుత్వం డ్రోన్‌ ‌కెమేరాలు తిప్పినట్లు ఆరోపిస్తూ మహిళలు తీవ్రంగా తప్పు పట్టారు. ఈ దుశ్చర్యలను అడ్డుకున్న 40 మందిపై కేసులు పెట్టి 20 రోజులపాటు జైలుపాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి నాలుగేళ్ల ఉద్యమ క్రమంలో 2000 మందిపై 600కు పైగా కేసులు బనాయించారు. మరోవైపు అమరా వతిపై బెంగతో గడిచిన నాలుగేళ్లలో 240 మంది రైతులు గుండెలు పగిలి చనిపోయారు. దీక్షా శిబి రాలు, దేవస్థానాలు, న్యాయస్థానాలే పోరాట వేదికలుగా నాలుగేళ్లపాటు సాగిన ఉద్యమంలో మరిచిపోలేని విజయాలను రైతులు సొంతం చేసు కున్నారు. పలు సందర్భాల్లో న్యాయస్థానాల్లో ఎదురైన అనూహ్య ఓటములను సైతం విజయ సోపానాలుగా మలుచుకున్న రైతు ఉద్యమం తాజాగా ఆర్‌-5 ‌జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించి మరో విజయాన్ని నమోదు చేసింది.

హై కోర్టు చరిత్రాత్మక తీర్పు

అమరావతి వ్యవహారంపై మార్చి 4, 2023న హైకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. మూడు రాజధానుల చట్టాన్ని కొట్టివేస్తూ అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను అభివృద్ధిచేసి మూడు నెలల్లోగా ఇవ్వాలని, ఆరు నెలల్లోగా రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తిచేయాలని సూచించింది. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకో లేదు. తీర్పు వచ్చిన 8నెలల వరకు మౌనంగా ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిం చింది. కాని విశాఖపై మాత్రం ఆశను చంపుకోలేదు. వచ్చే సాధారణ ఎన్నికల్లోపు ఎలాగైనా విశాఖకు తరలివెళ్లి తమ పంతం నెగ్గించుకోవాలని మరో ప్రయత్నం చేసింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో తరచూ సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుందనే నెపంతో, సీఎం క్యాంపు కార్యాలయం, మరికొన్ని ముఖ్యమైన ప్రభుత్వ శాఖల కార్యాలయాలు తరలించేందుకు ప్రణాళిక రచించారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా సమీక్షలు నిర్వహించే వెసులుబాటు ఉన్నందున, ఆ కారణంతో విశాఖకు వెళ్లాలని ప్లాన్‌ ‌చేశారు. ఇందుకోసం విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు భవనాలను కూడా గుర్తించారు. 2023 ఏడాది దసరా నాటికి విశాఖకు తరలివెళ్లేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. కానీ రైతులు మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో తరలింపు పక్రియ వాయిదా పడుతూ వచ్చింది. ఈలోగా కార్యాలయాల తరలింపు పక్రియను ఆపాలని హైకోర్టు సింగిల్‌ ‌జడ్జి ఆదేశించడంతో వైసీపీ సర్కార్‌కు మరలా ఎదురుదెబ్బ తగిలింది. ఇక సుప్రీంపై చివరి ఆశలు పెట్టుకోగా, అక్కడ కూడా కేసు విచారణ ఏకంగా ఏప్రిల్‌ ‌నెలకు వాయిదా పడింది. దీంతో వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల కల కలగానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈలోగా సాధారణ ఎన్నికలు ముగియ నున్నాయి. ఈసారి మూడు రాజధానుల పేరుతో వైసీపీ, అమరావతి రాజధాని పేరుతో టీడీపీ, మిగిలిన రాజకీయపక్షాలు ప్రజల తీర్పు కోరను న్నాయి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడితే ఇక మూడు రాజధానులు శాశ్వతంగా అటకెక్కినట్టే.

ఆర్‌ -5 ‌జోన్‌ ‌గతీ అంతే

రాజధాని ప్రాంతంలో ఆర్‌-5 ‌జోన్‌ ‌వ్యవహారంలో జగన్‌ ‌సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆర్‌-5 ‌జోన్‌ ఏర్పాటుపై దాఖలైన పిటిషన విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది. రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అమరావతిలో ఆర్‌-5 ‌జోన్‌ ఏర్పాటు చేసింది. రాజధాని అ

మరావతిలో ఆర్‌-5 ‌జోన్‌కి సంబంధించి సీఆర్డీఏ చట్టాన్ని సవరించి యాక్ట్ 13/2022, ‌జీవో 45ని తీసు కొచ్చారు. మొత్తం 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్‌ ‌జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు, ఇళ్ల నిర్మాణ పక్రియ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. అమరావతి సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో పేదల కోసం మొత్తం 25 లే అవుట్‌లలో 50,793 మందికి గతేడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే మరో నెల తర్వాత నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్మోహ హన్‌ ‌రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. ఇంతలో హైకోర్టు స్టే ఇవ్వడంతో పనులకు బ్రేకులు పడ్డాయి. దీంతో.. ఇతర ప్రాంతాలకు చెందిన సుమారు 50 వేలమంది పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి తాడికొండ, మంగళగిరి నియోజక వర్గాల్లో మరోసారి వైసీపీ జెండా ఎగురవేయాలన్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో ఆర్‌5 ‌జోన్‌ ఏర్పాటుపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ ‌

దాఖలు చేయగా, ఈ పిటిషన్‌ ‌విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేస్తూ జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా, జస్టిస్‌ ‌దీపాంకర్‌ ‌దత్తాతో కూడిన ధర్మాసనం ఆదేశా లిచ్చింది. దీనిపై తక్షణమే జోక్యం చేసుకుని పిటి షన్లపై విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్‌ ‌న్యాయవాది అభిషేక్‌ ‌సింఘ్వీ కోరినప్పటికీ ధర్మాసనం ఒప్పుకో లేదు. నాన్‌ ‌మిస్‌లేనియస్‌ ‌డేలో ఈ వ్యవహారాన్ని విచారిస్తా మని తేల్చిచెప్పింది. రాజధాని అమరావతికి సంబంధించిన ప్రధాన పిటిషన్‌ ‌కూడా ఇదే ధర్మాసనం వద్ద పెండింగ్‌లో ఉందని రైతుల తరపు సీనియర్‌ ‌న్యాయవాది దేవదత్‌ ‌కామత్‌ ‌కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సింఘ్వీ వాదనలు వినిపిస్తూ పేదలకు సెంటు భూమి ఇచ్చి నివాస గృహాలు నిర్మిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారని చెప్పారు.

దీనిపై జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నా స్పందిస్తూ ఏం జరుగుతుందో తమకు తెలుసని వ్యాఖ్యా నించారు. మొత్తానికి ఈ పరిణామంతో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు ఊపిరి పీల్చుకోగా, రాష్ట్ర ప్రభుత్వ దూకుడుకి కళ్లెం పడింది.

– టిఎన్‌. ‌భూషణ్‌

‌వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram