– కె. గోపీకృష్ణ, విశ్రాంత ఉపన్యాసకులు

ఖర్చులు చేసిన తరువాత మిగిలే మొత్తాన్ని పొదుపు చేయడం కాదు. పొదుపు చేయవలసిన మొత్తం నిర్ధారించుకున్నాక, మిగిలినదే ఖర్చు చేయాలి.

-వారెన్‌ ‌బఫెట్‌

‌తనకు అవసరంలేని వస్తువును ఎవడైతే కొనుగోలు చేస్తాడో, వాడు తన సొమ్మును తానే దొంగతనం చేసినట్టు.        -స్వీడన్‌ ‌సామెత

నీ డబ్బు నీ చేతికి రాకుండానే ఖర్చు మొదలెట్టకు.     – థామస్‌ ‌జఫర్సన్‌

‌భారతదేశపు రూపాయి మారకపు విలువ అంతర్జాతీయంగా తగ్గటం వలన దేశీయ ఆర్థిక కార్యకలాపాలపై, స్థూల దేశీయ ఆదాయంపై, ఎగుమతులు-దిగుమతులపై, షేర్‌ ‌మార్కెట్లు ట్రేడింగ్‌లో, దేశీయంగా, అంతర్జాతీయంగా ఎటువంటి ప్రభావాన్ని కలిగిస్తుందో తెలుసుకోవడం ద్వారా, రాబోవు ఆర్థిక పర్యావసానాన్ని అంచనా వేయగలిగే నైపుణ్యాలు పొందగలుగుతాము.

సంవత్సరం క్రితం వరకు డాలర్‌కు 77 రూపాయలుగా ఉన్న మారకపు విలువ నేడు సుమారు 85 రూపాయలకు పెరగడం వల్ల రూపాయి విలువ క్రమక్రమంగా తగ్గుతుంది. దీనికి అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక రంగాలలో చోటు చేసుకుంటున్న అనేక కారణాలు ఉన్నాయి.

ఎగుమతుల ద్వారా సమకూరే రాబడులు సన్నగిల్లుతూ, దిగుమతులకు ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేయవలసి రావలసిన స్థితి కలుగుతుంది. ఫలితంగా, దేశీయ ఆర్థికస్థితిలో ‘ద్రవ్యోల్బణానికి’ అవకాశం కలుగుతుంది. దేశీయ స్థూలఉత్పత్తి విలువ తగ్గుతుంది.

దేశీయ ఉత్పత్తులను పెంపొందించుకోవటం ద్వారా, అంతర్జాతీయ ఉత్ప త్తులపై ఎక్కువగా ఆధారపడకుండా, వాటికి సరైన ప్రత్యామ్నాయ ఉత్పత్తులను సృష్టించుకోవటం ద్వారా సుస్థిరమైన ఆర్థిక స్థితిని పొందగలుగుతాము.

ఆధునిక ఆర్థిక వలలు

12 శాతం వడ్డీ గ్యారెంటీలతో అనేక ‘స్టార్టప్‌• ‌కంపెనీ’లు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. మధ్య తరగతి వర్గం ఎక్కువగా వాటిపట్ల ఆకర్షితులై కనీసం రూ. 5,000 నుండి పది వేల వరకు డిపాజిట్లు చేస్తున్నారు.

ఇక్కడే అంతర్గతంగా అసలు సమస్య ఉంది. నూతనంగా ఆవిష్కరించిన ‘కంపెనీల’కు భవిష్యత్‌ ఎలా ఉంటుంది? దీర్ఘకాలంగా అవి భారీ మొత్తంతో ఎదుగుతాయా? తెలియని ప్రయోగాలు, అదే ‘పదివేలు’ మార్కెట్టు గల పెద్ద కంపెనీలు ఒకటి లేదా ఐదు షేర్లలో పెట్టుబడిగా ఉంచితే, రెండు ప్రయోజనాలు ఉంటాయి.

వాటి ‘షేర్ల’కు మార్కెట్‌లలో డిమాండ్‌ ఉం‌డటం వల్ల మనం ఏ రోజైనా, మన పెట్టుబడులను తిరిగి వెనక్కు తీసుకోగలిగే ‘‘ద్రవ్యత్వం’’ ఉండటం.

కనుక, స్టార్టప్‌ ‌కంపెనీల 12 శాతం వడ్డీ వలయంలో చిక్కుకోరాదు.

ఆర్థిక విషయాలలో ఒక నిర్ణయం తీసుకొనే ముందుగా, ‘రిస్క్ ‌రివార్డ్ ‌కర్వు’ (ఆర్‌.ఆర్‌.‌సి) గురించి అవగాహన ఉండాలి.

బ్యాంకులలో ఉంచే ‘ఫిక్సెడ్‌ ‌డిపాజిట్‌’‌లకు తక్కువ నష్టభయంతో పాటు రాబడులు కూడా అన్ని స్థాయిల్లో ఉంటాయి.

అదే ‘క్రిప్టో కరెన్సీ’లలో పెట్టుబడులు అధిక నష్ట భయం కలిగి ఉన్నా, అధిక రాబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.

తల్లిదండ్రుల పాత్ర – ఆర్థిక అక్షరాస్యత నిర్వహణ

చిరుప్రాయం నుంచి పిల్లలకు డబ్బు విలువను తెలియచేస్తూ పొదుపును నేర్పించాలి. భవిష్యత్‌ ‌కాలంలో బాధ్యతాయుతమైన వారి ద్రవ్య నిర్వహణ శక్తికి అది పునాదిగా మారుతుంది.

  1. తల్లిదండ్రులు పిల్లలతో అన్ని సమయాలలో డబ్బు ప్రాముఖ్యత, పొదుపు ఆవశ్యకతలను గురించి నిరంతరం మాట్లాడడం ప్రారంభించాలి. ఫలితంగా వారికి ‘డబ్బు’ విలువ తెలుస్తుంది.
  2. తల్లిదండ్రులు తమ పిల్లలకు ద్రవ్య విలువ, సంపాదన, వ్యయం, పొదుపు, పెట్టుబడులు మొదలైన అన్ని రకాల ఆర్థిక కార్యక్రమాలవల్ల జరిగే లాభ నష్టాలను అర్థమయ్యేలా బోధించాలి. దానివల్ల వారికి తగిన విషయ పరిజ్ఞానం కలిగి భవిష్యత్‌లో తగు ఆర్థిక నిర్ణయాలు తీసుకో గలుగుతారు.

3) ఉన్నత పాఠశాలలో టీనేజ్‌ ‌విద్యార్థులకు ఆధునిక మనీ మేనేజ్‌మెంటు కాన్సెప్ట్‌లను వారు అర్థం చేసుకునే విధంగా బోధించాలి.

4) విద్యార్థుల కోరికలు, అవసరాలు, సౌకర్యాలు, మోసాలు మధ్య గల తేడాలను తెలియచేయాలి. అనవసరమైన వస్తు వినియోగం చేయకుండా వారిలో ఆర్థిక క్రమశిక్షణను కలిగించాలి.

                                                                                                                                                                                      (సమాప్తం)

About Author

By editor

Twitter
YOUTUBE