• డా. రామహరిత

యోమ్‌ కిప్పర్‌ యుద్ధం జరిగి ఐదు దశాబ్దాలు పూర్తైన మరురోజు…  పవిత్రమైన సించోత్‌ తోరా ఉత్సవం జరుపుకుంటున్న యూదులపై ఇజ్రాయెల్‌ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా దాడులు ప్రారంభమయ్యాయి. గాజా నుంచి హమాస్‌ తీవ్రవాదులు (HAMAS) నీరు, భూమి, వాయుమార్గాల ద్వారా దాడులు ప్రారంభించారు. ఇజ్రాయెల్‌కు దక్షిణ సరిహద్దుల నుంచి చొరబడిన ఈ తీవ్రవాదులు అత్యంత ఘోరమైన దాడిని ప్రారంభించారు. ‘ఆపరేషన్‌ అల్‌ ` అక్సా ఫ్లడ్‌’ పేరుతో ప్రారంభించిన ఈ దాడిలో హమాస్‌ తీవ్రవాదులు  20 నిమిషాలలో 5000 రాకెట్లు ప్రయోగించారు. అంతకు ముందు ఇజ్రాయెలీ దళాలు అల్‌ ` అక్సా మసీదుపై చేసిన దాడులను గర్హిస్తూ తమ ఆపరేషన్‌కు ఆ పేరు పెట్టారు. రాకెట్లను ప్రయోగించడం వల్ల ఇజ్రాయెలీల దృష్టి మళ్లించి చొరబాటుదారులకు రక్షణ కవచాన్ని అందించింది. అక్టోబర్‌ 7వ తేదీన సైనికేతర జిహాదీ గ్రూపుల దాడులతో సాల్వో రాకెట్‌ లాంచర్‌ నుంచి దూసుకువస్తున్న రాకెట్ల వేగానికి, 90శాతం విజయపు రేటు కలిగి, అత్యాధునికమైనదిగా చెప్పుకునే ‘ఐరన్‌ డోమ్‌’ కూడా బిత్తరపోయింది.

దాదాపు బలియన్‌ డాలర్ల ఖర్చుతో లెక్కలేనన్ని సెన్సార్లు, కెమేరాలు, భద్రతా విధానాలతో బలోపేతం చేసిన, దుర్బేధ్యమైన సరిహద్దు వెంట రంధ్రాలు చేస్తూ మందలు మందలుగా చొరబాటుదారులు ప్రవేశించారు. ఇజ్రాయెలీ పట్టణాలు, గ్రామాల లోకి ప్రవేశించిన తీవ్రవాదులు అడ్డువచ్చిన వారిని కాల్చి వేస్తూ, ఇల్లిల్లూ శోధించారు. యూదు మహిళలపై అనాగరికమైన దాడులు చేయడమే కాదు, వారి మృతదేహాలను ఊరేగించారు. చంపకుండా వదిలిన పిల్లలు, వృద్ధులు, కొందరు మహిళలను జుత్తు పట్టుకుని ఈడ్చుకువెళ్లి వాహనాలలో వేసుకుని గాజాకు బందీలుగా పట్టుకువెళ్లారు.

సరిహద్దుల ఆవల నుంచి సాగే సంప్రదాయ యుద్ధానికి విరుద్ధంగా, చొరబాటుదారులు ఇజ్రాయెల్‌ ప్రాంతంలోకి వచ్చి, అనాగరికమైన రీతిలో వందలాది అమాయకులను కాల్చి చంపి అల్లకల్లోలాన్ని సృష్టించారు. దాదాపు 1000 మంది ఉంటారని అంచనా వేస్తున్న చొరబాటుదారులు, పూర్తి స్థాయిలో సాయుధులై జన హననానికి పాల్పడ్డారు. ఈ దాడి మృతుల సంఖ్య యోమ్‌ కిప్పర్‌ యుద్ధంలో అత్యంత భీకరమైనదిగా భావించే రోజున జరిగిన ప్రాణనష్టాన్ని మించిపోయాయి. సైనిక శక్తి గురించి, నిఘా సంస్థల గురించి గర్వంగా చెప్పుకునే ఇజ్రాయెలీల మనసుల్లో ముందెన్నడూ ఊహించని, జరగని ఈ ఘటన శాశ్వత ముద్రవేయ నున్నది. నిఘా వైఫల్యం దేశాన్ని ఆ పరిస్థితికి లోను చేసింది.

 సంఘర్షణాత్మకతకు తావిచ్చే క్షేత్రంలో, చుట్టూ శత్రువులే ఇరుగు పొరుగున ఉన్న ఇజ్రాయెల్‌ బలమైన నిరోధక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకుంది. కానీ, హమాస్‌ తాజా దాడితో మధ్య ప్రాచ్యంలో అత్యంత శక్తిమంతమైన దేశం ఇజ్రాయెల్‌ అన్న ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతిన్నది.

తీవ్రవాదపు జాడలతో నిండిన హమాస్‌ దాడి, ఈ నాగరిక ప్రపంచంలో చోటు లేని అనాగరిక, బర్బర ముద్రలను వేసింది. ఈ లక్షిత హింస అన్నది 11/9, 26/11 జ్ఞాపకాలను గుర్తు చేశాయి. ముఖ్యంగా వారు దాడి చేసిన పద్ధతి కారణంగా 26/11 అందరికీ గుర్తు వచ్చింది. ఈ రెండు దాడులకూ పాల్పడినవారి లక్ష్యాలు ఒకటే ` ప్రజలను భయభ్రాంతులను చేయడం, దేశ భద్రతా వ్యవస్థను తీవ్రంగా దుర్బలం చేయడం, భయాన్ని ప్రేరే పించడం, అస్థిరతను, గందరగోళాన్ని సృష్టించి, తాము బలహీనంగా ఉన్నామనే భావనను ప్రజలలో ఏర్పడేలా చేయడం.

ఈ అంశాలతో పాటుగా, దారుణమైన హమాస్‌ దాడి, ‘‘ఇంతకు ముందు తాను ఇతరులను తుడిచిపెట్టినట్టే, ఇస్లాం దానిని తుడిచిపెట్టే వరకు ఇజ్రాయెల్‌ ఉనికిలో ఉంటుంది, ఉండటాన్ని కొనసాగిస్తుంది,’’ అన్న వారి పీఠికలో గల ఒప్పందాన్ని పట్టి చూపుతుంది. ఇందుకు, ఆర్టికల్‌ 15లో, ‘‘ముస్లిం భూభాగాన్ని శత్రువులు ఆక్రమించుకున్న రోజు నుంచీ, జిహాద్‌ అన్నది ప్రతి ముస్లిం వ్యక్తిగత విధి అవుతుంది,’’ అన్న ప్రతిజ్ఞతో జిహాదే వారికి మార్గనిర్దేశక శక్తిగా ఉంటుందని ఈ దాడి ద్వారా హమాస్‌ రుజువు చేసింది.

జిహాద్‌ విషయంలో ముస్లిం బ్రదర్‌హుడ్‌ (ఎంబీ) నుంచి పుట్టుకువచ్చిన హమాస్‌ ప్రతిజ్ఞ, పట్టుదలను చూసి ఆశ్చర్యపోనవసరం లేదు. హమాస్‌ (HAMAS) అన్నది హర్కత్‌ ఆల్‌` ముకావామ ఆల్‌` ఇస్లామియా అన్న దానికి సంక్షిప్త నామం. మొదటి ఇంతిఫాదా ప్రారంభమైన తర్వాత 1987లో ఎంబీ రాజకీయ అంగంగా గాజాలో అధికారికంగా ఏర్పాటు చేసిన ఇస్లామిక్‌ ప్రతిఘటన ఉద్యమం ఇది. ఇజ్రాయెల్‌ను హింసాత్మకంగా, తీవ్రంగా ప్రతిఘటించిన పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌ (పీఐజే)తో మొదట్లో ఇది పోటీ పడే ప్రయత్నం చేసింది. 1990ల నుంచి హమాస్‌ సైనిక విభాగం ఇజ్‌ఆల్‌`దిన్‌` ఆల్‌`ఖస్సాం దళాలు గాజా నుంచి ఇజ్రాయిల్‌పై గగనతల దాడులు ప్రారంభించాయి.

‘చొరవలు, శాంతియుత పరిష్కారాలని చెప్పేవి, అంతర్జాతీయ సదస్సులనేవి ఇస్లామిక్‌ ప్రతిఘటన ఉద్యమ సూత్రాలకు వ్యతిరేకమైనవి. పాలస్తీనాలో ఏదైనా భాగాన్ని అయినా దుర్వినియోగం చేయడం, దూషించడం అంటే అది ఆ భాగంలోని మతానికి వ్యతిరేకంగా ఉద్దేశించినదే. ఇస్లామిక్‌ ప్రతిఘటన ఉద్యమపు జాతీయవాదం అనేది దాని మతంలోని భాగమే,’ అని చెప్పే తమ చార్టర్‌లోని ఆర్టికల్‌ 13కు అనుగుణంగా, ఓస్లో ఒప్పందాన్ని తిరస్కరించి, హమాస్‌ హింసాత్మక పద్ధతులను అనుసరించి, 2000 నుంచి 2005వరకు రెండవ ఇంతిఫాదాకు నాయకత్వం వహించింది.

చర్చలు, రాయితీలు లేదా సర్దుబాట్లు సహా ఎటువంటి శాంతియుత పరిష్కారానికి అవసరమైన ప్రత్యామ్నాయాలన్నింటినీ హమాస్‌ చార్టర్‌ ప్రత్యక్షంగా తిరస్కరించి, నిలువరించింది. ఈ క్రమంలో తన ఇష్టానుసారం కాల్పుల విరమణ ఒప్పందాలను హమాస్‌ ఉల్లంఘించడంలో ఆశ్చర్యం లేదు. శాంతి ఎండమావి అయింది. హమాస్‌కు పాలస్తీనా సమస్య అనేది మతపరమైనది. దానికి కొనసాగింపుగా జిహాద్‌ అనేది వారి విధి.

2005లో ఇజ్రాయెల్‌ గాజా పట్టీని ఖాళీ చేసిన తర్వాత, పాలస్తీనా అథారిటీ (పీఏ) శాసనసభలో మెజారిటీ స్థానాలను గెలుచుకుని, 2006నుంచి గాజాలో హమాస్‌ అధికారికంగా ప్రభుత్వాన్ని ఏర్పరచింది. పిఎల్‌ఒ (పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గ నైజేషన్‌పై ఆధిపత్యం కలిగి ఉండటమే కాక రాజకీయ ప్రత్యర్ధి కూడా అయిన నాటి పాలకపార్టీ ఫతా (Fatah) వెస్ట్‌ బ్యాంకులో ఏకైక శక్తిగా మారింది. ఫతా హింసను పరిత్యజించగా, హమస్‌ తిరుగులేని శత్రుత్వ భావన అన్నవి పాలస్తీనా అథారిటీలో చీలికకు దారి తీసి, గాజాను మౌలికంగా తీవ్రవాద కేంద్రంగా మార్చింది.

రాయితీలు తదితరాలు యుద్ధరీతిని, గమనాన్ని మార్చి, కాలక్రమంలో సంఘర్షణలను అణిచి వేయగల సంప్రదాయ యుద్ధానికి వ్యతిరేకంగా జిహాద్‌ సిద్ధాంతంతో ప్రేరితమైన శత్రుత్వంతో అటువంటి వాటికి ఆస్కారమివ్వదు. సైనికపరంగా ఉన్నతంగా ఉన్న భారతదేశాన్ని అస్థిరం చేసేందుకు సంప్రదాయేతర పద్ధతులను అవలంబిస్తూ పాకిస్తాన్‌ చేస్తున్న అసమాన జిహాదీ యుద్ధాన్ని 75 సంవత్స రాలుగా భారత్‌ ఎదుర్కొంటున్నది. ప్రభుత్వ ప్రోత్సాహిత తీవ్రవాదం అన్నది భారత్‌ పట్ల పాకిస్తాన్‌ విధానంగా ఉంది. తీవ్రవాదాన్ని పెంచి, పోషించి, తోడ్పడడం ద్వారా పాకిస్తాన్‌ తీవ్రవాదాన్ని ఆయుధీక రించి, ప్రపంచంలోని అత్యంత బలమైన దేశాలకు వ్యతిరేకంగా కూడా దీనిని ప్రయోగించింది. ఈ సమానం కాని యుద్ధం తమ గడపలోకి వచ్చి, అమాయకుల ప్రాణాలను బలిగొన్న తర్వాత మాత్రమే ప్రపంచం తీవ్రవాదం వల్ల జరిగే నష్టాలకు మేల్కొన్నది.

ప్రత్యర్ధులతో పోరాడేందుకు సంప్రదాయేతర వ్యూహాలను, అసమాన యుద్ధతంత్రాల దిశగా ప్రపంచ సంఘర్షణలన్నీ కాలక్రమంలో పరివర్తన చెందుతున్నాయి.

దీనికి సమాంతరంగా, ఈ దేశాలు ఉన్నతస్థాయి ఉదారవాద గ్రూపులతో కలిసి, ‘అణిచివేత సిద్ధాంతాల’ను, ‘బాధిత భావన’కు సంబంధించిన కథనాన్ని ప్రచారం చేసేందుకు వేదికను ఏర్పాటు చేశాయి. తద్వారా ఈ తీవ్రవాద గ్రూపులు, సైన్యాలు చేసే ప్రతి అనాగరిక, హింసాత్మక చర్యలను సమ ర్ధించడం తేలిక అయింది. ఈ ఉదారవాద అభిప్రాయానికి కట్టుబడి ఉన్న ఏ కథనం, సంవా దాన్ని అయినా రాజకీయంగా సరైనది (పొలిటికల్లీ కరెక్ట్‌) అనీ, దానిని ప్రశ్నించిన వారిని వివక్ష కల మతోన్మాది అని ముద్ర వేయడం సర్వసాధారణం అయింది. ఇప్పుడు, పరిస్థితి ఏ దశకు వచ్చిందంటే, జిహాదీ తీవ్రవాద కార్యకలాపాలను ఖండిరచడం కూడా ‘ఇస్లామోఫోబియా’ అయిపోయింది.

ఈ క్రూరమైన, అనాగరికమైన జన హననాన్ని సమర్ధించేందుకు, దానిని సాధారణీకరించేందుకు హార్వార్డ్‌ విద్యార్ధి సంఘాలు హమాస్‌ దాడికి ఇజ్రాయెలే పూర్తి బాధ్యురాలంటూ పేర్కొన్నాయి. నిజానికి, వేలాదిమంది పాలస్తీనా అనుకూల బృందాలు ఈ దాడులను సమర్ధిస్తూ ప్రపంచంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ ప్రదర్శనలు నిర్వహించడమే కాదు, ఈ పాలస్తీనా అనుకూల మూకలు ‘గ్యాస్‌ ది జ్యూస్‌’ (యూదులపై విషవాయువులు ప్రయోగించండి) అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన సిండీ ఒపెరా హౌజ్‌ ఎదురుగా జరిగిన ర్యాలీలో చోటు చేసుకుంది. ఏ రకంగా చూసిన ఈ క్రూరత్వమనేది ప్రతిఘటనా? అనే అనుమానం రాకమానదు. ‘అణచివేత’కు గురవుతున్న బాధితులమన్న ఆరోపణలు ఇటువంటి జన హననానికి పాల్పడేందుకు స్వేచ్ఛనిస్తాయా? ఇటువంటి నీచమైన సామ్యాన్ని ప్రతిపాదించడం ద్వారా ఉదారవాదులు కావాలనే ఈ తీవ్రవాద సంస్థల కసాయితనాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తున్నాయి.

ఈ రాక్షసాత్వాన్ని ఎలుగెత్తి చాటాలి. ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేసింది తీవ్రవాద దాడి. తమ దేశంలో 11/9 దాడి అనంతరం యూఎస్‌ నిర్మొహమాటమైన పద్ధతిని అనుసరించి, తీవ్రాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా యుద్ధాన్ని ప్రారంభించినట్టు, ఇజ్రాయెల్‌కు కూడా తనను తాను పరిరక్షించుకునే హక్కు ఉంది. అంతిమంగా, ఐఎస్‌ఐఎస్‌` జిహాదీ జాన్‌ హత్యలను గుర్తు చేస్తూ ‘ముందస్తు హెచ్చరికలు లేకుండా మా ప్రజలను లక్ష్యంగా చేసుకున్న ప్రతిసారీ, మేం బందీలుగా చేసుకున్న పౌరులలో ఒక మరణానికి దారితీస్తుంది’ అంటూ అల్‌`కస్సాం బృందం ప్రకటించడం హమాస్‌ జిహాదీ సిద్ధాంతం పట్ల ఎటువంటి సందేహాలూ లేకుండా చేసింది. హమాస్‌ దాడి నుంచి ప్రపంచం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ప్రజాస్వామ్య దేశాలలో నెమ్మదిగా స్థావరాలను ఏర్పరచుకుంటున్న జిహాదీ ఇస్లామ్‌ పట్ల దేశాలు తమ అలక్ష్య ధోరణిని, వైఖరిని అవలంబించడం మానుకోవలసి ఉంటుంది. ఇజ్రాయెల్‌కు ప్రధాని మోదీ ప్రకటించిన విస్పష్టమైన మద్దతు కొంత కలవరాన్ని కలిగించినా, దీనికి కారణం భారత్‌ తీవ్రవాదం పట్ల అవలంబిస్తున్న జీరో`టాలరెన్స్‌ విధానమే. అన్ని రూపాల్లోని, వ్యక్తీకరణలలోని తీవ్రవాదాన్ని భారత్‌ నిస్సంశయంగా, బలంగా ఖండిస్తుంది అంటూ మోదీ ఇచ్చిన ప్రకటన ఉగ్రవాద నిర్మూలనకు భారత్‌ నిబద్ధతను ప్రతిధ్వనింపచేస్తుంది.

తీవ్రవాద సమస్య అన్నది భారత్‌, ప్రపంచ అజెండా. ఇజ్రాయెల్‌కు భారత్‌ సంఫీుభావం అన్నది పాశ్చాత్య దేశాలతో పరివేష్టితమై, గ్లోబల్‌ సౌత్‌లోని దేశాలకు అనుగుణంగా లేనప్పటికీ (ఒక నిపుణుడు వ్యాఖ్యానించినట్టుగా), భారత అంతర్జాతీయ ప్రయోజనాలకు అత్యవసరం. భారత్‌, ఇజ్రాయెల్‌ ఒకేరకమైన ముప్పులను ఎదుర్కొంటున్నాయి. మోదీ ప్రకటన ఏగ్రూపు, సంస్థ తమను లక్ష్యంగా చేసుకున్నప్పుడు, తనను తాను కాపాడుకునే హక్కు భారత్‌కు ఉందని పరోక్షంగా నొక్కి చెప్తుంది. ఈ నిరంతర బాధిత కథనాన్ని గురించి, దేశాలను అస్థిరం చేస్తామని బెదిరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వ్యాపిస్తున్న ఇస్లామిక్‌ మతతత్వం గురించి బహిరంగంగా మాట్లాడేలా ఈ దాడులు ఉపయోగపడాలి.

21వ శతాబ్దపు నాగరిక ప్రపంచం దీర్ఘకాలిక వివాదాలను, శత్రుత్వాలను పరిష్కరించేందుకు అవసరమైన వ్యవస్థాగత యంత్రాంగాలను కలిగి ఉంది. కాలం చెల్లిన 7వ శతాబ్దపు రాజకీయ` సైనిక సంస్థతో వాటికి పరిష్కారాలను వెతకాలనుకోవడం అమానుషం.

About Author

By editor

Twitter
Instagram