సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి

77వ స్వాతంత్య్ర దిన వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట మీద ఇచ్చిన సందేశం సాంప్రదాయిక కులవృత్తుల వారి సంక్షేమా నికి అవసరమైన పలు పథకాల గురించి ప్రస్తావించింది. మోదీ అధికారానికి వచ్చిననాటి నుంచి కులవృత్తుల వారి అభివృద్ధికి వివిధ స్థాయుల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి ఆర్థిక, సామాజిక వికాసానికి కృషి చేస్తున్నారు. వారి వృత్తి కౌశలాన్ని పెంపొందించేందుకు శిక్షణ, పరిశోధన, ఉత్పత్తుల నాణ్యత ప్రామాణికతకు మెరుగులు దిద్ది ప్రపంచ స్థాయిలో పోటీపడేందుకు బాటలు వేస్తూ రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రవేశపెట్టారు.

విశ్వకర్మ పథకం కింద గ్రామీణ చేతివృత్తుల వారికి రాయితీ రుణాలు మంజూరు చేయాలని సంకల్పించారు. ఈ పథకం కింద నాయీ బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చేనేత సహా ఇతర కులవృతులవారికి నైపుణ్య శిక్షణకు అవసరమైన ఆధునిక పనిముట్లు, యంత్రాలు, వాటి పరికరాలు కొనుగోలు కోసం రూ.15 వేల వరకు ఉచిత ఆర్థికసాయం అందిస్తారు. దీనివల్ల ఆ వర్గంలో ఉత్పాదక సామర్థ్యం పెరిగి, వారి ఆర్థిక పురోగతికి అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాక రూ.లక్ష వరకు తక్కువ వడ్డీ లేదా వడ్డీ లేని రుణాలు అందిస్తారు. రెండో విడత రూ.2 లక్ష వరకు రుణాలు అందిస్తారు. ఇంకా, వృత్తి కళాకారుల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ ‌సౌకర్యాలు కల్పిస్తారు. అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద దేశంలో 30 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం లభిస్తుంది.

విశ్వకర్మ పథకం: బడ్జెట్‌

‌ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కోసం ఐదేళ్ల పాటు కేంద్ర బడ్జెట్‌లో రూ.13,000 కోట్ల నుండి రూ. 15,000 కోట్ల వరకు కేటాయిస్తారు. మొదటి దశలో 18 సాంప్రదాయిక వృత్తులకు ఈ పథకం అందించనున్నారు. చేతివృత్తి పని వారికి పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్స్ ‌జారీ చేసి గుర్తింపు కార్డులు ఇస్తారు. సెప్టెంబర్‌ 17‌న విశ్వకర్మ జయంతికి ఈ పథకం అమలు చేస్తారు.

ఈ పథకంతో ఇంకా చర్మకారులు, మేస్త్రిలు, స్వర్ణకారులు, దర్జీలు, పనిముట్లు తయారుచేసే కమ్మరి, మట్టిపాత్రలు చేసే కుమ్మరి, శిల్పి, పడవలు నిర్మించే వడ్రంగులు లబ్ధి పొందు తారు.

విశ్వ స్థాయి సరఫరాతో ఏకీకృతం

వృత్తి కళాకారుల ఉత్పత్తుల్లో నాణ్యతను పెంచి, ప్రపంచ సరఫరా వ్యవస్థతో వారిని అనుసంధానం చేయడానికి ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు ట్రాన్స్‌జెండర్స్, ‌బలహీన వర్గాల కార్మికుల ఆర్థిక సాధికారతకు విశ్వకర్మ యోజన సహాయపడుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక చేయూతనిస్తారు.

చేతివృత్తులు: ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి

గ్రామీణ ఆర్థికవ్యవస్థను పటిష్టం చేయడంలో చేతివృత్తుల వారి పాత్ర విస్మరించలేనిది. గ్రామాలు ఆర్థిక స్వావలంబన సాధించే క్రమంలో ఆ వృత్తుల వారు బహుముఖ పాత్ర పోషించారు. ఇనప వస్తువులు, కొయ్య పరికరాలు, మట్టిపాత్రలు, గృహోపకరణాలు, గ్రామీణ ప్రాంత వాహనాలు మనిషి జీవనయానానికి తోడ్పడేవే. రకరకాల పనిముట్లు తయారుచేసే చిన్నతరహా కుటీర పరిశ్రమలు, వాటి ఆధారంగా ఉండే చేతివృత్తులు గ్రామీణ ఆర్థిక ప్రగతికి పట్టుగొమ్మలు.

కుటీర పరిశ్రమలు: గ్రామీణ స్వరాజ్యం

కుటీర, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర గ్రామీణ ఖాదీ పరిశ్రమలు గ్రామీణ స్వరాజ్య పటిష్టతకు దోహదపడతాయని మహాత్మాగాంధీ• స్పష్టం చేశారు. చిన్న తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని గాంధీజీ ఆనాడే ఉద్బోధించారు. కుటీర పరిశ్రమలు, చేతి వృత్తులు స్వయం ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తాయి. ఆర్థికవ్యవస్థ స్వావలంబన సాధనలో బహుముఖ పాత్ర పోషిస్తాయి.

प्रधानमंत्री विश्वकर्मा कौशल सम्मान योजना 17 सितंबर से होगी शुरु, जानिए  किनको मिलेगा लाभ – News 8 Today

ప్రపంచీకరణ: కులవృత్తులు

ప్రపంచీకరణ, కార్పొరేటీకరణల ప్రభావం వల్ల గ్రామాల్లో చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, కులవృత్తులు దెబ్బతిన్నాయి. బతుకు పోరాటంలో భాగంగా ఉపాధి వెతుక్కుంటూ గ్రామాల నుండి పట్టణాలకు నగరాలకు కార్మికుల వలసలు పెరి గాయి. ఎంతో నైపుణ్యం కలిగిన చేతివృత్తి పనివారు నగరాలలో, పట్టణాలలో ప్రైవేటు, అసంఘటిత రంగంలో కార్మికులుగా పనిచేస్తున్నారు. తరతరాల చేతి వృతులను వదిలి ఎక్కువ పనిగంటలు శ్రమించి నప్పటికి సక్రమంగా వేతనాలు పొందక శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఇలాంటి వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి విశ్వకర్మ యోజన పథకం ఉపయోగపడుతుంది.

ఆత్మ విశ్వాసం పెంచే రుణాలు

విశ్వకర్మ యోజన కింద చేతివృత్తి దారులకు రూ.లక్ష నుండి రూ.2 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పించిన సంగతి ముందు ఉదహ రించుకున్నాం. అలాగే వారికి రోజుకు రూ. 500 వంతున ఉపకార వేతనం ఇచ్చి మెరుగైన శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందినవారు సొంతంగా చిన్న పరిశ్రమ యూనిట్‌ను ప్రారంభించుకోవచ్చు. ప్రభుత్వం కావలసిన సహాయం అందిస్తుంది. అలా వారిలో పారిశ్రామిక ఉద్యమిత్వ నైపుణ్య సామర్థ్యాలను ప్రోత్సహించి, ఆత్మవిశ్వాసాన్ని నింపుతారు. దీనితో ఉత్పాదక సామర్థ్యం పెరిగి, అది ఆర్థికాభివృదికి దోహదపడి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. స్వదేశీ ఉత్పత్తులు పెరిగి ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక స్వావలంబన, స్వయం సమృద్ధి సాధ్యమౌతుంది.

కులవృత్తుల వారి ఆత్మగౌరవం పెంచే పేరుతో సమాజాన్ని కులాల వారీగా వర్గీకరించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. సమాజంలో అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు కాలేరు. ఎవరికి ఏ రంగంలో ఆసక్తి ఉంటుందో వారిని ఆ రంగంలో వృద్ధి చెందేటట్లు చేయూతనివ్వాలి. నైపుణ్య భారత్‌, ఆత్మనిర్భర భారత్‌ ‌పేరున కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ఎంచుకున్న రంగంలో రాణించాలంటే నైపుణ్యం పెంపొందించుకోవాలి. అప్పుడే ఆర్థికవ్యవస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత, ఆదాయ సృష్టి జరిగి అభివృద్ధి జరుగుతుంది.

డిజిటల్‌ ఇం‌డియా నైపుణ్యం, ఉపాధి

5.25 లక్షల ఐటీ ఉద్యోగుల నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను అమలుచేయడం, సూపర్‌ ‌కంప్యూటర్స్ అం‌దుబాటులోకి తేవడం, డిజిటల్‌ ఆర్థికవ్యవస్థ విస్తరణ, బలోపేతాలకు డిజిటల్‌ ఇం‌డియా ప్రాజెక్ట్ ‌ద్వారా వ్యూహాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

వృత్తి నైపుణ్యం పెంపు: ఆర్థిక పునరుజ్జీవనం

స్కిల్‌ ఇం‌డియా, మిషన్‌ ‌స్కిల్‌ ఎం‌ప్లాయిమెంట్‌ ‌కేంద్రాల ద్వారా కోట్లాది మంది యువతకు నైపుణ్యాలను అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడానికీ, సంప్రదాయ వృత్తులన• గౌరవించడానికీ, చేతివృత్తుల వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి, వారి ఆర్థిక పునరుజ్జీవ నానికి ఈ పథకం దోహదపడుతుంది.

పట్టణ కాలుష్య నియంత్రణ

దేశంలోని 169 పట్టణాలలో కాలుష్య నియంత్రణకు ఈ-బస్సు సేవా కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించిన మరుసటి రోజే అమలుచేయాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణ యించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.

 – నేదునూరి కనకయ్య, అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్‌ ‌ఫోరం, కరీంనగర్‌, 9440245771)

About Author

By editor

Twitter
YOUTUBE