మొన్న గోహత్య. నిన్న లవ్‌ ‌జిహాద్‌ ఉదంతం. రేపు ఏం జరగబోతున్నదో? దేవభూమి ఉత్తరాఖండ్‌ ‌భవిష్యత్తు ఏమిటి? పురోలా పట్టణం ఎందుకు అంతగా అట్టుడికినట్టు ఉడుకుతోంది?  హిందువులకు అతి పవిత్రమైన చార్‌ధామ్‌ ‌క్షేత్రాలు ఉన్న ఈ రాష్ట్రంలో జనాభా సమీకరణాలు మారడంతో ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో అనుభవంలోకి వచ్చింది. లవ్‌ ‌జిహాద్‌ ‌ఘటనతో మేల్కొని ‘దేవభూమి రక్షా అభియాన్‌’ ఉద్యమం ప్రారంభించడం దేశ ప్రజలను ఆకర్షించింది. ఉత్తరాఖండ్‌లో ఆ పరిణామాల గురించి తెలుసుకుందాం..

దేవతలకు కొలువైన రాష్ట్రం ఉత్తరాఖండ్‌ అని హిందువులు విశ్వసిస్తారు. ఇది హిమాలయ పర్వత శిఖరాల చెంత ఉన్న చిన్న రాష్ట్రం. అత్యంత పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవు. పవిత్ర గంగానదికి పుట్టినిల్లు. అందుకే అది దేవభూమి. దేవభాషగా ప్రసిద్ధి పొందిన సంస్కృతం అధికారిక భాషల్లో ఒకటిగా ఉన్న ఏకైన రాష్ట్రం కూడా ఉత్తరా ఖండే. అడవులు, పర్వతాలు, నదులు, హిమవాహిను లతో పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే ఈ రాష్ట్రంలో పవిత్ర చార్‌ధామ్‌ ‌యాత్రలో భాగమైన హరిద్వార్‌, ‌హృషీకేశ్‌, ‌బదరీనాథ్‌, ‌కేదారనాథ్‌ ఉన్నాయి. భారత్‌తోపాటు ప్రపంచ దేశాల్లోని హిందువులు జీవితంలో ఒక్కసారైనా చార్‌ధామ్‌ ‌యాత్ర చేయాలనే సంకల్పంతో ఇక్కడికి వస్తుంటారు.

ధార్మికంగా ఎంతో ప్రధానమైన పుణ్యక్షేత్రాలున్న ఉత్తరాఖండ్‌లో సహజంగానే హిందువుల జనాభా ఎక్కువ. కానీ గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు ఇక్కడి ప్రజలను ఆందోళనలోకి నెట్టాయి. జనాభా లెక్కలు క్రమంగా మారిపోయాయి. సాధారణంగా ఉపాధి అవకాశాలు అధికంగా ఉండే ప్రాంతాలకే వలసలు ఉంటాయి. కానీ అతి తక్కువ అందునా ఆధ్యాత్మిక, పర్యాటక ఆదాయం మాత్రమే ఉండే ఉత్తరాఖండ్‌కు ఇతర మతాల వారు రావడం అనుమానాలక• ఆస్కారం ఇచ్చేదే. ఉత్తరప్రదేశ్‌, ‌బిహార్‌, ‌పశ్చిమబెంగాల్‌ ‌రాష్ట్రాల నుంచి ఎక్కువగా వలసవస్తున్నారు. వీరిలో బంగ్లాదేశీయులతో పాటు మైన్మార్‌ ‌రొహింగ్యాలు కూడా ఉండటం గమనించ వచ్చు.

కొన్ని సంవత్సరాలు నిశ్శబ్దంగా జరిగిన వలసల దుష్ప్రభావం ఉత్తరాఖండ్‌లో స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వ, అటవీభూముల అక్రమణలు పెరిగాయి. వ్యాపారాలు కూడా క్రమంగా స్థానికుల నుంచి వలస వచ్చిన వారి చేతిలోకి వెళ్లిపోతున్నాయి. ఉత్తరాఖండ్‌లో ఒకప్పుడు నేరాలు, హింస చాలా తక్కువ. దాదాపు లేవనే చెప్పాలి. దొంగతనం తెలియ దంటే అతిశయోక్తి కాదు. యాత్రికులు ఎవరైనా వస్తువులు మరచిపోతే తిరిగి వచ్చేవరకూ అక్కడే భద్రంగా ఉండేవి. ఇలాంటి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా నేరాలు పెరిగాయి.

లవ్‌ ‌జిహాద్‌ ‌కలకలం

ఉత్తరాఖండ్‌లో ఎన్నడూ లేని విధంగా 2011లో గోహత్య జరిగింది. గోమాతను చంపి, గర్భంలోని దూడను బయట పడేయడం ఆందోళనకు గురి చేసింది. ఇది కుట్ర పూరితంగా జరిగిందని అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. తాజాగా జరిగిన మరో పరిణామం ఉత్తరాఖండ్‌ ‌ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది.

డెహ్రాడూన్‌కు 145 కిలోమీటర్ల దూరంలోని ఉత్తరకాశీ జిల్లాలోని చిన్న పట్టణం పురోలా. మే 26న ఇక్కడి మార్కెట్‌లోని దుకాణదారుల్లో ఒకరి కుమార్తె 9వ తరగతి చదువుతున్న బాలిక అపహరణకు గురైంది. ఉవేద్‌ఖాన్‌ అనే యువకుడు ఆమెను ఎత్తుకెళ్లాడని గుర్తించారు. ఇందుకు జితేంద్ర సైనీ సహకరించాడని తేలింది. వీరిద్దరిలో ఒకడు పంచర్లు వేసేవాడు, మరొకడు దుప్పట్లు నేసేవాడు. ఉవేద్‌ఖాన్‌ ‌బాలికకు ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ట్రాప్‌ ‌చేశాడు.

ఈ కిడ్నాప్‌ ‌ఘటనతో పురోలా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. అక్కడి వ్యాపారులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగి బంద్‌కు పిలుపునిచ్చారు. కొందరు వ్యక్తులు బయటి నుంచి వచ్చి వ్యాపారాలు చేస్తున్నవారి దుకాణాలను ధ్వంసం చేశారు. ఈ ఆందోళనలో భయపడ్డ కిడ్నాపర్‌ ఐదు రోజుల తర్వాత బాలికను వదిలేశాడు. అక్కడికి దగ్గర్లోని వికాస్‌నగర్‌లో ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామా లను గమనిస్తే తాజాగా జరిగింది ‘లవ్‌ ‌జిహాద్‌’ అని స్పష్టంగా అర్థమైపోయింది. బయటి వ్యక్తులు వచ్చిన తర్వాతే తమ పట్టణంలో నేరాలు మొదలయ్యాయని స్థానికులు గుర్తించారు. నవ్‌గౌవ్‌, ‌చిన్యాలిసోర్‌, ‌మోరీ తదితర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. దాదాపు రెండేళ్ల క్రితం మోరీలో ఒక హిందూ అమ్మాయిని అపహరించి ఓ దుకాణంలో బంధించారు. ఆమె ఏడుపు బయటకు వినిపించడంతో కుట్ర బయటపడింది. ఇక్కడ ఒక్క లవ్‌ ‌జిహాదే కాదు.. భూ జిహాద్‌, ‌వ్యాపార్‌ ‌జిహాద్‌ ‌కూడా కొనసాగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఇంతటితో వదిలేస్తే మరింత ప్రమాదమని గ్రహించారు.

హిందువులుగా పేర్లు మార్చుకొని..

ఉత్తరాఖండ్‌లోనే వెలుగు చూసిన మరో ఘటన ఇది. మహ్మద్‌ ‌సలీక్‌ ‌డెహ్రాడూన్‌లో జూనియర్‌ అడ్వకేట్‌. ఇతని సోదరుడు బంగ్లాదేశ్‌ ‌లో ఎంబీబీఎస్‌ ‌చదువుతున్నాడు. ఈ ఇద్దరు ఉత్తరప్రదేశ్‌ ‌బిజ్నోర్‌కు చెందినవారు. సలీక్‌ ‌తనను లక్కీరాణాగా పరిచయం చేసుకొని ఓ హిందూ అమ్మాయిని ప్రేమలోకి దింపాడు. ఇతని తమ్ముడు కూడా హిందూ పేరు పెట్టుకుని మరో అమ్మాయితో ప్రేమ నటించాడు. మరో విచిత్రం ఏమిటంటే వీరిద్దరూ ఆ యువతులను ఇటీవల విడుదలైన కేరళ స్టోరీ సినిమాకు తీసుకెళ్లి, హిందూ అమ్మాయిలను ముస్లింలు ఎలా ట్రాప్‌ ‌చేస్తున్నారో చెబుతూ వారి నమ్మకాన్ని పొందారు. సలీక్‌ ‌పెళ్లి చేసుకుంటానంటూ ఆ యువతితో పలుమార్లు శారీరకంగా కలిశాడు.

ఈ కుట్రలో సలీక్‌ ‌తల్లిదండ్రులు కూడా పాల్పంచుకున్నారు. తండ్రి బిజ్నోర్‌లో అసిస్టెంట్‌ ‌ప్రభుత్వ న్యాయవాది. ఇద్దరు యువతుల కుటుంబా లను ఒప్పించి అక్టోబర్‌ 4‌న పెళ్లి కూడా కుదుర్చు కున్నారు. అయితే వీరు చేసిన ఒక చిన్న పని కుట్రను బయటపెట్టింది. మహ్మద్‌ ‌సలిక్‌ ‌పండిత్వాడి ఏరియాలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. తన పేరు లక్కీరాణా అని, తన తండ్రి పేరు దినేష్‌ ‌రాణా అని పరిచయం చేశాడు. యజమానికి అడ్వాన్స్ ‌చెల్లించేందుకు ఆన్‌లైన్‌ ‌పేమెంట్‌ ‌చేశాడు. ఇందులో అతని పేరు మహ్మద్‌ ‌సలీక్‌ అని కనిపించింది. యజమానికి అనుమానం వచ్చి పోలీసులు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హిందూ అమ్మాయిలను ట్రాప్‌ ‌చేసేందుకు ఇలా పేర్లను మార్చుకుని నాటకం ఆడుతున్నట్లు తేలింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ ‌చేసి జైలుకు తరలించారు. బంగ్లాదేశ్‌లో ఉన్న అతని తమ్ముడిని విచారించేందుకు పిలిచారు.

దేవభూమి రక్షా అభియాన్‌

‌పురోలా లవ్‌ ‌జిహాద్‌ ‌ఘటనతో ఇతర ప్రాంతాల వారిని, ముఖ్యంగా మతోన్మాద జిహాదీ శక్తులను రాష్ట్రం నుంచి బయటకు పంపించాలనే డిమాండ్‌తో ‘దేవభూమి రక్షా అభియాన్‌’ ‌పేరుతో ఉద్యమం మొదలైంది. పురోలా, ఉత్తరకాశీ సహా అన్ని పట్టణాలు, ప్రాంతాలు అట్టుడికిపోయాయి. విజయ వంతంగా బంద్‌లు జరిగాయి. స్వధర్మాన్ని, ప్రాంతాన్ని రక్షించుకోవాలని, దేవభూమి పవిత్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి స్వామి దర్శన్‌భారతి మార్గదర్శనం చేస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్‌, ‌బజరంగ్‌దళ్‌ ‌మద్దతు పలికాయి. ముఖ్యంగా న్కెన్‌ ‌బాగ్‌, ‌జాఖడ్‌, ‌నగ్తీబ్బ, తట్యూర్‌, ‌సక్లానా, దంతా, పురోలా, బార్కోట్‌, ఉత్తరాక్షి ప్రాంతాల్లో చొరబాట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. తమ ప్రాంతాల నుంచి బయటివారు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. వీరి చెరలోని ప్రభుత్వ, అటవీ భూములను విడిపించాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దుతు ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన పార్టీలు, రాజకీయాలకు అతీతంగా తమ మద్దతును ప్రకటించాయి.

ఈ ఉద్యమానికి సంబంధించిన వార్తలు ఉత్తర భారతదేశ మీడియాలో విరివిగా వెలువడినా దక్షిణాది మీడియా దాదాపు పట్టించుకోలేదు. మన తెలుగు పత్రికలు, టీవీ ఛానల్స్ ‌దాదాపు ఈ వార్తలనే ఇవ్వలేదు. మరోవైపు కొన్ని జాతీయ మీడియా సంస్థల ఏకపక్ష వార్తా కథనాలతో అక్కడ ముస్లింలకు వ్యతిరేకంగా గొడవలు ఏవో జరుగుతున్నాయనే అపోహలు ఏర్పడ్డాయి.

మహా పంచాయత్‌

ఉత్తరాఖండ్‌లో జరిగిన ఈ పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడంతో పురోలాతో పాటు అనేక ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసు యంత్రాంగం 144 సెక్షన్‌ ‌విధించి కర్ఫ్యూ అమలు చేసింది. మరోవైపు తమ ప్రాంతంలో ఇతర ప్రాంతాల వ్యక్తుల చొరబాట్లు, లవ్‌ ‌జిహాద్‌లకు వ్యతిరేకంగా దేవభూమి రక్షా అభియాన్‌, ‌పురోల ప్రధాన్‌ ‌సంస్థాన్‌తో పాటు స్థానికులు జూన్‌ 15‌న పురోలాలో మహాపంచాయత్‌ ‌నిర్వహించాలని తలపెట్టారు. దీనికి ఉత్తరకాశీ జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించింది. మరోవైపు దీనికి పోటీగా ముస్లిం వర్గాలు జూన్‌ 18‌న డెహ్రాడూన్‌లో మరో మహాపంచాయత్‌ ‌తలపెట్టారు. డెహ్రాడూన్‌, ‌వికాస్‌నగర్‌, ‌హరిద్వార్‌, ‌రూర్కీ, హల్ద్వానీ, ఉదమ్‌సింగ్‌నగర్‌లకు చెందిన ముస్లింలు ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీనికి కూడా అధికారులు అనుమతి ఇవ్వలేదు.

లవ్‌ ‌జహాద్‌పై చర్యలు తీసుకుంటామని సీఎం పుష్కర్‌ ‌సింగ్‌ ‌ధామి హామీ ఇవ్వడంతో రెండు వర్గాలు మహాపంచాయత్‌లను రద్దు చేసుకున్నాయి. అనేక స్థాయుల్లో చర్చలు జరిగిన తర్వాత దీన్ని రద్దు చేసుకు న్నారని జిల్లా పోలీసు యంత్రాంగం తెలిపింది. ఎవరైనా వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన ఘటనల్లో పాలనా యంత్రాంగం సక్రమంగా వ్యవహరించింది. ఎవరైనా దోషి అయితే అతనిపై చట్టం పనిచేస్తుంది. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని స్పష్టం చేశారు.

ఓవైసీ జాగ్రత్త

ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ తమ రాష్ట్రంలో మత కల్లోలాలను రెచ్చగొడుతున్నారని ఉత్తరాఖండ్‌ ‌సీఎం పుష్కర్‌ ‌సింఘ్‌ ‌ధామి విమర్శిం చారు. శాంతియుత వాతావరణాన్ని భంగపరచడాన్ని సహించబోమని చెప్పారు. ఘర్షణలు జరుగుతున్న ఉత్తరకాశీ జిల్లా పురోలా పట్టణంలో మహా పంచాయత్‌ ‌నిర్వహణకు అనుమతించ కూడదంటూ ఒవైసీ చేసిన ట్వీట్‌ను తప్పు పట్టారు. లవ్‌ ‌జిహాద్‌, ‌ల్యాండ్‌ ‌జిహాద్‌లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రావత్‌ ఓవైసీవి విద్వేషపూరిత ప్రసంగాలని ఆరోపించారు. ఆయన జాగ్రత్తగా మాట్లాడాలని, అలా చేస్తేనే రాష్ట్రంలోని రానిస్తామని అన్నారు. మత సామరస్యాన్ని కాపాడేలా మదర్సాల్లో పిల్లలకు మంచి విలువలు నేర్పించాలని మౌల్వీలకు సూచించారు. హిందూ మత నాయకులు మాత్రం తప్పుడు పనులు చేసేలా ఎన్నడూ యువతను రెచ్చగొట్టబోరని అన్నారు.

రోటీ-బేటీ-చోటీ

మత మార్పిడుల కుట్రలు మూడు రకాలుగా జరుగుతున్నాయని ఉత్తరాఖండ్‌ ‌ప్రజలు గుర్తించారు. రోటీ: ముందుగా ఆహార అలవాట్ల మీద దాడి.. బేటీ: అమ్మాయిలను అపహరించడం.. చోటీ: అంటే శిఖ, ధార్మిక విశ్వాసాలను కించపచరచడం.. ఉత్తరా ఖండ్‌ ‌ప్రజలకు వచ్చిన చైతన్యం దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా కనువిప్పు కలిగించాలి. ఇటీవల ఆంధప్రదేశ్‌లోని శ్రీశైలం, పెద్దకాకాని ఇతర పుణ్యక్షేత్రాల్లో అన్యమతస్తుల చొరబాట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి విషయాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram