– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌రాజకీయపార్టీల బహిరంగ సభలపై నిబంధనలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబరు 1 వివాదాస్పదమైంది. ప్రభుత్వం ప్రజల రక్షణ గురించి మాట్లాడుతున్నా, ఈ జీవో తీసుకువచ్చిన లక్ష్యం మాత్రం వేరు. ప్రజలు తమ బాధలను విపక్షాలకు చెప్పుకోకుండా, సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయకుండా చేయడమే ప్రభుత్వ క్ష్యమనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. ఈ జీవోను అడ్డం పెట్టుకుని విపక్షాలను కట్టడిచేసి తన పట్ల వ్యతిరేకతను బయటకు రానీయకుండా ఉండేలా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే బ్రిటిష్‌ ‌కాలం నాటి చట్టాలను అమలుచేస్తూ, తమను వ్యతిరేకించిన వారిని అణచివేయాలని చూస్తోంది. అన్ని రాజకీయ పార్టీలతో పాటు అధికార వైసీపీకి కూడా ఈ జీవో వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. కాని రాజమండ్రిలో ముఖ్యమంత్రి, ఇతర నగరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వహించుకుంటున్న సభలకు మాత్రం ఈ జీవోను వర్తింప చేయడం లేదు. దీనిని బట్టి కేవలం విపక్షాలను నియంత్రించడానికే ఈ జీవోను తెచ్చినట్లు భావించాల్సి వస్తోంది.

ఈ జీవో తీసుకురావడానికి కారణం ఇటీవల జరిగిన రెండు దుర్ఘటనలు. టీడీపీ కందుకూరులో జరిపిన రోడ్డుషోలో డ్రైనేజీలో పడి 11 మంది, గుంటూరులో నిర్వహించిన మరో సమావేశంలో ముగ్గురు మరణించడం. ఈ కారణాలను సాకుగా చూపి ప్రభుత్వం జీవో నె•ం.1 తీసుకువచ్చింది. జాతీయ, రాష్ట్ర రహదారులు, వీధులలో ప్రధానంగా సమావేశాలు నిర్వహించుకోవటానికి అనుమతించక పోవడం మంచిదని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఈ జీవోలో సూచించింది. అక్కడ సభలకు అనుమతిస్తే లాజిస్టిక్‌ ‌చలనంపై వ్యతిరేక ప్రభావం పడుతుందని పేర్కొంది. ఇరుకుగా, సన్నగా ఉండే మున్సిపాలిటీ, పంచాయతీల రహదారుల్లో ఎటువంటి అంతరాయం కలిగించినా అది సాధారణ ప్రజలకు అసౌకర్యంగా పరిణమిస్తుందని జీవో పేర్కొంది. తొక్కిసలాట జరిగితే ఆ ప్రాంత ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుందని, గాయాలు, మరణాలు సంభవించ వచ్చని తెలిపింది. ట్రాఫిక్‌ ‌సమస్యలు ఏర్పడితే, పరిస్థితిని చక్కదిద్దటానికి ఎక్కువ సమయం తీసుకుంటుందని, అనారోగ్యంతో వున్న వారు, వృద్ధులు, గర్భిణులు, గాయపడిన వారిని ఆసుపత్రులకు తీసుకెళ్ళి చికిత్స చేయటానికి వీలుపడక ఇబ్బందులకు గురౌతున్నారని జీవోలో పేర్కొన్నారు. అలాంటి బహిరంగ సమావేశాలు వల్ల పౌర జీవనానికి, అత్యవసర సేవలకు ఆటంకం ఏర్పడుతుందని కూడా జీవోలో తెలిపింది.

హేతుబద్దత ఏదీ?

జీవోలో పేర్కొన్న కారణాలు చూస్తే సభలపై నిబంధనలు విధించడంలో హేతుబద్దత కనిపించడం లేదని నిపుణులు, రాజకీయ పార్టీలు విమర్శిస్తు న్నాయి. ఒక సమావేశంలో ఏర్పడిన ప్రమాదానికి గల కారణాలను అన్నిటికీ ఆపాదించడం సరైంది కాదని వాదిస్తున్నాయి. ట్రాఫిక్‌ అం‌తరాయాలు, సాధారణ ప్రజల తాత్కాలిక అసౌకర్యాలు అనేకసార్లు అనేక రూపాలలో జరుగుతుండటం మనం చేస్తూనే ఉన్నాం. మంత్రులు, ముఖ్యమంత్రుల పర్యటనలు, రాకపోకలు, అనేక మతపరమైన ఊరేగింపులు, ఉత్సవాలు, ఇతర సందర్భాలలో ట్రాఫిక్‌ ‌సమస్యలు ఉత్పన్నమవడం, వాటిని చక్కదిద్దే క్రమంలో పోలీ సులు ప్రజలను తాత్కాలికంగా ప్రత్యామ్నాయ మార్గాలలో పంపించడం ఏళ్ల తరబడి చూస్తూనే ఉన్నాం. పోలీసుల పనే అది. అది కూడా చేయ నప్పుడు, చేయలేనప్పుడు చట్టం అమలులో పోలీసులు వైఫల్యం చెందినట్లే అనేది వారి అభిప్రాయం.

హక్కులపై ప్రత్యక్ష దాడి

జీవోలో పేర్కొన్న జాతీయ, రాష్ట్ర మున్సిపాలిటీ, పంచాయితీ రహదారులన్నింటిలోను సాధారణ పరిస్థితుల్లో సమావేశాలక• అనుమతించ రాదని, కేవలం ప్రత్యేక పరిస్థితుల్లో, అరుదుగా మాత్రమే అనుమతించాలని ఆదేశించింది. ప్రత్యేక పరిస్థితుల్లో రోడ్లపై సభలు, రోడ్‌ ‌షోల నిర్వహణకు అనుమతిస్తా మని పేర్కొన్న జీవోలో రోడ్డు వెడల్పు, సభ జరిగే ప్రదేశం, సభకు పట్టే సమయం, హాజరయ్యే జనం, రద్దీ నిర్వహణ చర్యలు తదితరాలను కూడా అధి కారులకు ఇవ్వాలని ఆంక్షలు పెట్టారు. ప్రత్యేక పరిస్థితులను పోలీసు యంత్రాంగం అన్ని పార్టీలకు ఒకేవిధంగా వర్తింపజేసే పరిస్థితి నేటి రాజకీయాలలో లేదు. సభలు జరుపుకోవడానికి కూడా ఆయా ప్రాంతాలను పోలీసులే ఎంపిక చేస్తారట. ఈ అవకాశం సైతం నిర్వాహకులకు ఉండదు. అంటే… సమావేశాలు ఎక్కడ, ఎలా నిర్వహించుకోవాలన్నది నిర్వాహకుల చేతిలో లేదన్న మాట.

సమావేశాలు, ప్రదర్శనలు లాంటివి ప్రజా స్వామ్యానికి ప్రాణం లాంటివి. ప్రాథమికమైనవి. అభిప్రాయాలను పంచుకోవటానికి, ప్రభుత్వాలకు తెలియ చేయటానికి అవి మార్గాలు. వాటిని అడ్డుకోవడమంటే ప్రజాస్వామిక హక్కులపై ప్రత్యక్ష దాడికి దిగడమే. జీవోలో చెప్పిన ప్రత్యామ్నాయ స్థలాలు, మైదానాలను గుర్తించడం సాధ్యం కాదు. రాష్ట్రంలో అతి తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి స్థలాలున్నాయి. ప్రజా సమావేశాలను ప్రైవేటు స్థలాలలో ఏర్పాటు చేయడం కూడా వీలుకాదు. అసలు బహిరంగ సభలను ప్రైవేటు స్థలాల్లో పెట్టుకోవలసిన దుస్థితి ఏర్పడటం అప్రజాస్వామికం. ఇదంతా చూస్తుంటే అసలు ప్రతిపక్షాలు బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా నియంత్రించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమనేది తెలిసిపోతోంది.

గొంతునొక్కడమే పనిగా

చాలా కాలంగా ప్రజా ఉద్యమాలు, కార్మిక, ఉద్యోగ నిరసనలు, రాజకీయ పార్టీల పిలుపులు, పర్యటనలను విఫలం చేయడానికి పోలీసులు గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు చేయడం సర్వ సాధారణం అయిపోయింది. ముందుగానే వాటిని అడ్డుకుంటూ ఆంక్షలతో ప్రత్యేక ఉత్తర్వులు, పొలి మేరల్లో అరెస్టు చేయడం జరిగిపోతున్నది. పాలనా వైఫల్యాలు, అవినీతి, అసమర్థ పాలనలో కూరుకు పోయిన ప్రభుత్వం తమపై వచ్చిన ఆరోపణలను, నిలదీతలను అడ్డుకోలేక వారిని నియంత్రించే ప్రయత్నాన్ని రెండున్నరేళ్లుగా చేస్తోంది. కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, ఉపాధ్యాయులు, రాజకీయ పార్టీలు ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇప్పుడు జీవో నెంబరు 1 ను సాకుగా చూపి ఇక ప్రతిపక్షాలు ఏ కార్యక్రమం చేయనీయకుండా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది.

నిరంకుశ చర్య

కందుకూరు, గుంటూరుల్లో జరిగింది తీవ్ర విషాదమే అయినా ప్రభుత్వం ఏకపక్షంగా జీవోలు జారీచేయడం నిరంకుశ చర్యగా పౌరసంఘాలు ఆక్షేపిస్త్తున్నాయి. ఇలాంటి విషాదాలు నివారించాలన్న చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. అలా తీసుకున్న నిర్ణయాలకు అన్నిపార్టీలు కట్టుబడి తమ కార్యా చరణను అమలు చేయవలసి ఉండగా, ప్రభుత్వం ఆంక్షల కొరడాను ఝుళిపించింది. పైగా ఈ చర్యలను మంత్రులు, వైసీపీ నాయకులు పోటీ పడి సమర్థించడం శోచనీయం.

పోలీసులపై విమర్శలు

విషాద ఘటనలు జరిగిన చోట్ల పోలీసులు బందోబస్తు సైతం సక్రమంగా లేదని తీవ్ర విమర్శ లొచ్చాయి. గుంటూరు సభకు సంక్రాతి కానుకల కోసం పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తారని అంచనా వేయలేకపోవడం సమర్ధనీయం కాదంటున్నారు. బందోబస్తుకు వచ్చిన 200 మంది పోలీసులు కూడా తగినంత శ్రద్ధ వహించలేదని పలువురు ఆరోపిస్తు న్నారు. కానుకల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడటం పోలీసుల విధి అంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ నిర్వహించే సభలు, సమావేశాలకు కొద్ది రోజుల ముందు నుంచే బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శలకు పాలకులు సమాధానం చెప్పాలి. గత ఏడాది జులైలో గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన వైసీపీ ప్లీనరీకి పది రోజుల ముందే పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారన్న విషయాన్ని ప్రభుత్వానికి గుర్తుందా?

ఈ చావులకు బాధ్యత ప్రభుత్వానిది కాదా?

ంగారెడ్డిగూడెంలో కల్తీమద్యం తాగి 29 మంది మరణించిన సంఘటనకు ఈ ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించదు? విశాఖలో పర్యవేక్ష•ణ లోపాలతో పరిశ్రమల్లో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలకు ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఇసుక సరఫరాను ఆపడంతో చోటు చేసుకున్న నిర్మాణ కార్మికుల ఆకలి చావులకు బాధ్యత వహించదా? అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి పదుల సంఖ్యలో జరిగిన మరణాలపై కారణం ఈ ప్రభుత్వం కాదా? నాసిరకం మద్యం తాగి…. పోతున్న ప్రాణాలకు ప్రభుత్వానిదే బాధ్యత కాదా? రహదారి మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదా? ప్రభుత్వ విధానాలతో సర్వం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌలురైతుల మరణాలకు ప్రభుత్వానికి బాధ్యత లేదా? అవన్నీ ప్రభుత్వానికి బాధితులు సంధిస్తోన్న ప్రశ్నలు.

About Author

By editor

Twitter
Instagram