వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– నామని సుజనాదేవి

సెల్‌లో అవతల నుండి యూనియన్‌ ‌సెక్రెటరీ మాటలు వింటూనే నిశ్చేష్టుడినై పోయాను. చుట్టూ వేడివేడిగా, ఘుమఘుమలాడే పదార్ధాలన్నీ వెక్కిరిస్తూ కనబడ్డాయి. ఇలా జరగడం ఇది రెండోసారి! ఆ ఆహార పదార్థాలు వెక్కిరిస్తుంటే, వడ్డించడానికి రెడీగా నిలబడ్డ క్యాటరింగ్‌ ‌వారి మధ్య, అశేష జనవాహిని, ఆత్మీయులు ఉన్నా ఒంటరిని అయినట్లు, సముద్ర మంత జలం చుట్టూ ఉన్నా తాగడానికి చుక్క నీరు లేనట్లు అచేతనంగా అక్కడే ఉన్న కుర్చీలో కూలబడి పోయాను. ఆలోచనలు ఆ పరిస్థితికి దారి తీసిన మూడురోజుల ముందు సంఘటనను నెమరేసాయి.

*************

‘హలో! హలో… విజయ్‌ ‌మోహన్‌ ‌గారేనా’ మార్కెటింగ్‌ ‌సెక్రెటరీకి ఫోన్‌ ‌చేస్తూ అడిగాను.

‘లేరండీ! స్నానం చేస్తున్నారు‘

‘నేను బ్రాంచ్‌ ‌మేనేజర్‌ను మాట్లాడుతున్నానమ్మా. వచ్చాక ఎల్లుండి బ్రాంచ్‌ ఆవిర్భావ దినోత్సవం పొద్దునే రావాలని, భోజనం ఇక్కడే అని చెప్పండి… నేను మెసేజ్‌ ‌పెడతాను…’ అంటూ పెట్టేసాను.

బ్రాంచ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడు కలు నిర్వహించాలంటూ కేవలం మూడు రోజుల ముందే పై ఆఫీసు నుండి మెయిల్‌ ‌రావడంతో బ్రాంచ్‌లో స్టాఫ్‌ అం‌దరికీ ఆ రోజు సర్క్యులర్‌ ‌పంపాను. నేను పని చేస్తున్నది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఇందులో పరిపాలక సిబ్బందితో పాటు మార్కెటింగ్‌ ‌వింగ్‌ ‌కూడా ఉంటుంది. ప్రతీ బ్రాంచ్‌ ‌మేనేజర్‌ ఇద్దరితో సమన్వయం చేసుకుంటూ సాగాలి.

పై ఆఫీస్‌ ‌పెట్టిన మెయిల్‌ను ఆఫీసు పని వేళల తర్వాత చూసాను. అప్పటికే అందరూ వెళ్లిపోవడంతో ఆఫీసులోని ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో మునిగిపోయాను. అసిస్టెంట్‌ ‌బ్రాంచ్‌ ‌మేనేజర్‌ ‌ద్వారా కొన్ని పనులు చేయిద్దామంటే ఆయన మరో నాలుగు రోజుల వరకు లీవ్‌లో ఉన్నారు. అందుకే తెల్లవారి ఆఫీసులో స్టాఫ్‌కి సర్కులర్‌ ‌పంపి సమావేశం పెట్టి విషయం చెప్పాను. యూనియన్‌ ‌లీడర్లతో, స్టాఫ్‌ ‌క్లబ్‌ ‌సెక్రెటరీ, ఇ.సి. మెంబర్‌లతో మీటింగ్‌ ‌పెట్టి ఎలా చేయాలి? దానిలో ఎవరెవరికి ఏమే పనులు అప్పగించాలి? ఇనాగరల్‌ ‌కమిటీ, డెకరేషన్‌ ‌కమిటీ లాంటి ప్లానింగ్‌ అం‌తా చేశాను. అప్పటికే సాయంత్రం అయ్యింది. ఇక మార్కెటింగ్‌ ‌యూనియన్‌ ‌లీడర్‌తో మాట్లాడదామని ఫోన్‌ ‌చేస్తే స్విచ్‌ ఆఫ్‌ ‌వచ్చింది. విషయం కనుక్కుంటే అతను ఊళ్లో లేడని, ఎవరో బంధువులు చనిపోతే వెళ్లాడని, ఫోన్‌లో చార్జింగ్‌ ‌లేక స్విచ్‌ ఆఫ్‌ ‌వస్తోందేమోనని చెప్పారు. మిగతా మార్కెటింగ్‌ ‌యూనియన్‌ ‌లీడర్లతో మాట్లాడాను. తెల్లవారి మార్కెటింగ్‌ ‌సెక్రెటరీకి మళ్ళీ చేసాను. అతను స్నానం చేస్తున్నాడని చెప్పడంతో మెసేజ్‌ ‌పెట్టి, మార్కెటింగ్‌ ‌వారందరికీ మెసేజ్‌ ‌పెట్టాను. వాట్సప్‌ ‌సమూహంలో అంతకు ముందే నిర్ణయించిన ఆహ్వానం, ఎజెండా అంతా పెట్టాను.

కార్యక్రమానికి ఈ ఒక్కరోజే సమయం ఉండడంతో మిగతా పనులన్నీ పర్యవేక్షించే పనిలో పడ్డాను.

 ఏ ప•ని జరగాలన్నా ముందు డబ్బు కావాలి. ఇలాంటి వాటికి సాధారణంగా, ముందు సండ్రీ అడ్వాన్స్ ‌డ్రా చేయడం కాని, ముందు ఖర్చు చేసి తర్వాత బిల్లులు పంపి బడ్జెట్‌ ‌శాంక్షన్‌ ‌చేయించుకోవడం గానీ చేస్తారు. అట్టే సమయం లేకపోవడంతో బాంక్‌ ‌నుండి డబ్బులు డ్రా చేసాను. తెల్లవారి పొద్దుటే పూజా కార్యక్రమ నిర్వహణకు పంతులును మాట్లాడ్డం, ఆయన చెప్పిన ప్రకారం పూజా సామాగ్రి రాసుకుని అటెండర్‌తో తెప్పించడం, స్వీట్‌ ఆర్డర్‌ ఇవ్వడం, కార్యాలయాన్ని అలంకరించే కమిటీకి, మిగతా కమిటీలకు, వాటికి సంబంధించిన బిల్లులు తదితరాలు అన్నీ జాగ్రత్తగా పెట్టమని చెప్పి, తెల్లవారి మొత్తం దాదాపు ఎంతమంది స్టాఫ్‌, ‌మార్కెటింగ్‌ ‌సిబ్బంది వస్తారో అంచనా వేసి దానికి తగ్గట్లు భోజన ఏర్పాట్లకు కాటరింగ్‌కి ఆర్డర్‌

ఇవ్వడం లాంటివన్నీ చేయడం వల్ల చాలా బిజీ ఐపోయాను.

అనుకున్న రోజు పొద్దుటే మామిడాకులు, రంగవల్లులు, పూలతో బ్రాంచ్‌ అం‌తా పండగ వాతావరణం నెలకొంది. పూజా కార్యక్రమానికి అందరూ హాజరయ్యారు. పూజ కాగానే అందరికీ స్వీట్లు పంచారు. లంచ్‌ ‌సమయానికి క్యాటరింగ్‌ ‌వాళ్ళు అన్నీ తెచ్చేస్తా మన్నారు. అందరికీ అదే విషయం పూజ కాగానే అనౌన్స్ ‌చేసి ఆఫీసు పనిలో పడ్డాను. లంచ్‌ ‌సమయం అయ్యింది. ఎదురుగుండా ఉన్న కస్టమర్‌ల పనులు త్వరగా చేయించి పంపించేసి కిందకి వచ్చాను. అక్కడ క్యాటరింగ్‌ ‌వాళ్ళు సిద్ధ్దంగా ఉన్నారు. కాని తినడానికి స్టాఫ్‌, ‌మార్కెటింగ్‌ ‌వాళ్లెవరూ ఇంకా రాలేదు. ఆశ్చర్యంతో యూనియన్‌ ‌సెక్రెటరీకి ఫోన్‌ ‌చేసాను. అతను ‘మీరేమీ అనుకోవద్దు సార్‌… ‌మార్కెటింగ్‌ ‌సెక్రెటరీని మీరు పిలవలేదట, అందుకే అతను ఎవర్నీ భోజనానికి అటెండ్‌ ‌కావద్దు అని చెప్పాడట. మమ్మల్ని కూడా అటెండ్‌ ‌కావద్దు అన్నారు. మా డిమాండ్స్ ఏవైనా వారు సహకరిస్తారు కాబట్టి వారి డిమాండ్స్‌కి మేము సహకరించక తప్పదు కాబట్టి మేమూ బాయ్‌ ‌కాట్‌ ‌చేసాం సార్‌..’ అం‌టూ పెట్టేసాడు.

ఇదీ జరిగింది.

ఒక్క క్షణం మెదడు మొద్దుబారింది. తను పిలవక పోవడం ఏమిటీ? తను ఫోన్‌ ‌చేసినపుడు తీయకపోతే ఇంట్లో చెప్పాడు. మెసేజ్‌లు పెట్టాడు. గ్రూప్‌లో పెట్టాడు. అయినా గొడవ ఎందుకు అనుకుని, బాధను దిగమింగుకుని మళ్ళీ మార్కెటింగ్‌ ‌సెక్రెటరీకి ఫోన్‌ ‌చేసాను. కనీసం ఫోన్‌ ఎత్తలేదు. రెండవ సారి ఎత్తి, ‘మీరు మమ్మల్ని నిర్లక్ష్యం చేసారు. అందుకే మేము బాయ్‌ ‌కాట్‌ ‌చేస్తున్నాం’ అంటూ పెట్టేసాడు. ఏం తోచలేదు. పైఅధికారికి ఫోన్‌ ‌చేసాను. ‘ఇది బ్రాంచ్‌కి సంబంధించిన సమస్య. దీంట్లో మేము తల దూర్చలేము. మీరు సరిగ్గా ఆర్గనైజ్‌ ‌చేయాలి. ఒకవేళ వాళ్లెవరూ భోజనానికి రాకపోతే మాత్రం మీకు భోజనానికి బడ్జెట్‌ ‌శాంక్షన్‌ అవదు..’ అంటూ పెట్టేసారు. రాయి మీద రాయి. చుట్టూ ఘుమఘుమ లాడుతున్న పదార్థాలు…

‘సర్‌! ‌గంట గంటన్నరలో మేము వెళ్లిపోవాలి..’ క్యాటరింగ్‌ అతని అభ్యర్థనతో కూడిన డిమాండ్‌. ఇలా జరగడం ఇది రెండోసారి.

మొదటిసారి తను వచ్చిన కొత్తలో ఆఫీస్‌లో మార్కెటింగ్‌ అఫీషియల్స్‌కి, బ్రేక్‌ ‌ఫాస్ట్ ‌మీటింగ్‌ ‌పెట్టాడు. అప్పుడు మార్కెటింగ్‌ ‌ప్రెసిడెంట్‌,‌తమ ఇంట్లో పెళ్లికి వెళ్లనందున ఈ మీటింగ్‌కి వెళ్లకూడదని చెప్పాడట. తనకు తెలీక ముప్పై ప్లేట్లు ఇడ్లీ, వడకి ఆర్డర్‌ ఇచ్చాడు. అనుకున్న సమయం దాటినా ఎవ్వరూ రాకపోతే ఫోన్‌ ‌చేసాడు. ఎవరికివారు ‘ఏదో పనిపై ఊరెళ్ల్లామనో, వేరే పని మీద ఉన్నామనో చెప్పారు. తను ఆశ్చర్యపోయాడు. తర్వాత అటెండర్‌ ‌చెప్పాడు,‘ సర్‌ ‌మీరు ఫలానా వాళ్ళ అమ్మాయి పెళ్లికి వెళ్లలేదట. కనీసం గ్రీట్‌ ‌కూడా చేయలేదట. అందుకే ఎవరూ రావద్దనుకున్నారట సర్‌’ అని. చాలా ఆశ్చర్యం , బాధనిపించింది. ముసుగులో గుద్దులాట ఎందుకు? తనతో డైరెక్ట్‌గా చెప్పొచ్చుగా. ఆ రోజు నిజానికి వెళదామనే అనుకున్నాడు. కాని సడెన్‌గా తన క్లోజ్‌ ‌ఫ్రెండ్‌కి ఆక్సిడెంట్‌ అయితే హాస్పిటల్‌కి వెళ్ళాడు. చాలా దారుణమైన ఆక్సిడెంట్‌. ‌లైఫ్‌ ‌రిస్క్‌లో ఉందని అక్కడే ఉండిపోయాడు. కనీసం ఫోన్‌ ‌చేయాలనే ధ్యాస కూడా లేదు. చెబుదామనుకున్నా, శుభమాని పెళ్లి జరుగుతుంటే, ఇలాంటి అశుభమైన విషయాలు ఎందుకని ఊర్కున్నాడు.

మనసు బాలేక నాకూ టిఫిన్‌ ‌తినబుద్ధి కాలేదు. అర్జెంట్‌ ‌స్టేట్‌ ‌మెంట్స్ ‌కోసం పొద్దుటే వచ్చి పని చేస్తున్న ఒక డిపార్ట్‌మెంట్‌లో ఉన్న అయిదుగురు స్టాఫ్‌ను ‘టిఫిన్‌ ఉం‌ది, తినండి’ అని ఇంటర్‌కంలో చెప్పాను. కాని వాళ్లు ‘మేము తెప్పించుకున్నాం సర్‌’ అని పెట్టేసారు. తర్వాత అటెండర్‌ ‌చెప్పాడు, ‘వాళ్లు తెచ్చుకోలేదు, తెప్పించు కోలేదు సర్‌. ‌వాళ్ళ డిపార్ట్‌మెంట్‌ అటెండర్‌ని తెమ్మని ఇప్పుడు చెబుతున్నారు. ఒకరి కోసం తెచ్చినవి, వాళ్ళు వద్దు అంటే మాకు ఇస్తారా?’ అని మిమ్మల్ని తప్పుపడుతున్నారు సర్‌. ‌నాకు తినాలనే ఉంది కానీ, ‘ఇలా అందరూ వదిలేసింది తింటావా;’ అని నన్ను కూడా వెక్కిరిస్తారు సర్‌.

అయినా ఎన్నో కష్టాలను ఎదుర్కొని వచ్చిన నాకు, అన్నం విలువ, ఆకలి బాధ బాగా తెల్సు సర్‌. ‌నాది పర్మనెంట్‌ ‌జాబ్‌ ‌కాదు కాబట్టి, నాకు ఆ యూనియన్‌కి ఏ సంబంధం లేదు కాబట్టి, మీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో వాళ్లకి, మన ఆఫీస్‌ ‌వాచ్‌మన్‌కి, వాళ్లింట్లో వాళ్లకి కొన్ని తీసుకుంటాను సర్‌. ‌మీ పేరు చెప్పుకుని కడుపునిండా తింటారు సర్‌’ అన్నాడు. సంతోషంగా తలూపాను.

ఇప్పుడు ఒక నిశ్చయానికి వచ్చినట్లు ఫోన్‌ ‌చేసి ట్రాలీ తెప్పించాను. అటెండర్‌తో గిన్నెలన్నీ అందు లోకి ఎక్కించాను. అతన్ని తీసుకుని నా కార్లో బయల్దేరాను. నేను ప్రతి నెలా డబ్బులు పంపించే అనాథాశ్రమానికి వెళ్లాను. అప్పటికే వాళ్లంతా తినేసినా, సంతోషంగా రాత్రికి సరిపడా పదార్థాలన్నీ వాళ్ళ గిన్నెల్ల్లోకి వంపుకున్నారు. వృద్ధాశ్రమానికి వెళ్ళాను. అక్కడ అలాగే చేసాను. తృప్తిగా తింటున్నవారిని చూస్తున్న నేను కొంతసేపు బిడ్డలకు షడ్రసోపేత భోజనం పెట్టి, వారు కడుపారా తింటుంటే ఆనందిస్తున్న మాతృమూర్తి నయ్యాను. ఇంకా దాదాపు మరో పది మందికి మిగిలేలా ఉన్న పదార్థాలతో సాయిబాబా గుడికి వెళ్లి, అక్కడే ఉండే నలుగురికి విస్తళ్లు వేసి వడ్డించాను. ఆఫీస్‌కి వచ్చాక తను, డ్రైవర్‌, అటెండర్‌ ‌ముగ్గురు కూర్చుని తినేశారు. ఆహార పదార్థాలు మొత్తం ఖాళీ అయ్యాయి. ట్రాలీ డ్రైవర్‌కి, అటెండర్‌కి డబ్బులు ఇవ్వబోగా చేతులెత్తి నమస్కారం పెట్టారు. ‘మీరు చేసిన పుణ్యంలో మాకూ భాగం ఇవ్వండి’ అన్నట్లు.

నేను వచ్చేప్పుడు రాయించు కొచ్చిన చిన్న బోర్డ్ ఆ ‌భోజనం హాల్లో తగిలించాను. ఆ బోర్డ్ అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఉంటుందని నాకు తెల్సు. ఇంతకీ ఆ బోర్డ్ ‌లో ఏమని ఉందం…‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’, ‘అన్నం లేనివారెందరో ఉన్నారు..దానిని వృథా చేయకండి’, ‘ఆహార పదార్థాలు మిగిలినచో ఈ క్రింది సెల్‌ ‌నంబర్లను సంప్రదించగలరు’ అంటూ అనాథాశ్రమం, వృద్ధాశ్రమం నిర్వాహకుల సెల్‌ ‌నంబర్లు వేసి ఉంది.

అప్పటికే స్టాఫ్‌ అం‌తా వచ్చి గుంపులు గుంపులుగా చేరారు. మాడిపోయిన నా మొహం చూడాలనుకున్న వారి మొహాలన్నీ, నేను చేసిన పని తెల్సిపోయినట్లు మాడిపోయి ఉన్నాయి.

వాళ్ల స్టాఫ్‌ ‌యూనియన్‌ ‌సభ్యులంతా చర్చించి, ఈ విషయమై లీడర్లను చీవాట్లు వేసినట్లున్నారు. తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఆనందకర వాతావరణం ఒకేసారి గంభీరంగా మారిపోయింది.

ఇంటర్‌ ‌కంలో ఫోన్‌ ‌చేసి, మార్కెటింగ్‌ ‌యూని యన్‌ ‌బాడీ, స్టాఫ్‌ ‌యూనియన్‌ ‌బాడీ కలవాలను కుంటున్నారని అటెండర్‌ ‌చెప్పాడు.

‘ఇప్పుడు బిజీగా ఉన్నాను, సాయంత్రం అయిదు గంటలకు’ అని చెప్పాను కావాలనే. నిజానికి స్టాఫ్‌ అయిదు తర్వాత ఉండడం చాలా అరుదు. అత్య వసరం అయితే తప్ప ఉండరు. అంతా అయిదు లోపే వెళ్ళిపోతారు. కాని అంతవరకు వేచి చూసి వచ్చారు. నాకు తెలుసు… రాకుండా ఉంటే మిగతా సభ్యులు బతకనివ్వరని.

చాలా సీరియస్‌గా ఉన్నాను. ఎందుకంటే వారేమైనా వర్క్ ‌విషయంలో స్ట్రిక్ట్ ‌చేస్తే, అటెండెన్స్‌లో స్ట్రిక్ట్ ‌గా ఉండడం నా చేతిలో పనని వారికి బాగా తెల్సు.

‘సర్‌! ‌జరిగిందేదో జరిగిపోయింది. ఏదో మిస్‌ అం‌డర్‌స్టాండింగ్‌ ‌జరిగింది. మీరు అది మనసులో పెట్టుకోకండి’ ఏం మాట్లాడాలో తెలీక నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ మార్కెటింగ్‌ ‌సెక్రెటరీ అన్నాడు.

 ‘మీరు ఫోన్‌ ‌చేసినప్పుడు అతను మాట్లాడక పోవడం, ఆ తర్వాత మీరు చేయ• పోవడం, సమయం కల్సిరాక అలా జరిగింది. ఇప్పుడు మరోరోజు గెట్‌ ‌టు గెదర్‌లా పెట్టుకుందాం సర్‌’ ‌స్టాఫ్‌ ‌యూనియన్‌ ‌సెక్రెటరీ అన్నాడు.

వారికి నా గాంభీర్యం, మౌనం భయం గొల్పుతోంది.

‘చాలు. ఇందులో నా తప్పు ఏం ఉంది? నేనూ మనిషినే. నాకూ పనులుం టాయి. ఇదేం నా ఇంట్లో పెళ్లి కాదు బొట్టుపెట్టి పిలవడానికి. మనందరి పండగ. అందరం కల్సి సంతోషంగా చేసుకోవాల్సిన పండగ. నేను వ్యక్తిగతంగా తప్పు చేస్తే నాపై అలగండి. నా తప్పు సరిచేసుకుంటాను. కాని అన్నంపై అలగడం, అదీ మొత్తం తయారయ్యాక అలగడం ఏంటి’?

 రైతు పొలం దుక్కిదున్ని, విత్తనాలేసి, నారు పెట్టి, నీరు పోసి, కలుపు తీసి బురదనకా, నీరనకా, రేయనక పగలనకా కాపలా కాసి, ఆరుగాలం కష్టపడ్డ పంటను కోసి, కుప్ప నూర్చి, తూర్పార పట్టి, బస్తాకెత్తి బండి కట్టి, బజారుకెళ్లి గిట్టుబాటు ధర కోసం వాన నుండి, ఎండ నుండి కాపాడుకుంటూ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతాడు. మనం అన్నం వృథా చేస్తున్నామంటే అంత మంది చేసిన శ్రమను వృథా చేసినట్లే. వారిని అగౌరవ పరిచినట్లే.

 పరబ్రహ్మ స్వరూపమైన అన్నం దొరకని పేదలెందరో లోకంలో ఉన్నారు. ముందు మీరు నా మాట గౌరవించి భోజనం చేసాక, మీరీ తప్పు చేసారు అన్నా, కనీసం మీతో మాట్లాడాక, భోజనం చేస్తాం అన్నా నా కింత బాధ ఉండేది కాదు. మనమందరం ఒక కుటుంబ సభ్యులం అని నేను మీ అందరికి ఎన్నోసార్లు చెప్పాను. మన కుటుంబ సభ్యుడు ఏదైనా తప్పు చేస్తే ఇలాగే చేస్తామా? నా స్వంత డబ్బు పోయినా నా ఆతిథ్యాన్ని మన్నించిన ఆ ఆశ్రమం వాళ్లు ఎన్ని డబ్బులు పోసినా కొనలేని సంతృప్తి నిచ్చారు. ఆ డబ్బులు నేనే పెట్టుకున్నా. ఆ పుణ్యం ఇచ్చినందుకు వారికి, అవకాశం కలగజేసిన మీకు రుణ పడి ఉన్నాను… థాంక్‌ ‌యు…’ అన్నాను. వారికి అప్పటికే అర్థమయ్యింది నేను బాగా హర్ట్ అయ్యానని. ఇక వారు గింజుకున్నా మరోమారు భోజనం పెట్టనని. నా మాటలు ‘సత్యం’ అన్నట్లు బయట గుళ్లోని జేగంటలు మంగళకరంగా మోగాయి.

అనుభవం నేర్పిన గుణపాఠం అనుకుంటూ, పశ్చాత్తాపంతో రెండు చేతులు జోడిస్తూ, ‘క్షమించండి సర్‌… ‌మరోమారు మా ద్వారా ఏ తప్పు జరగదు’ అంటూ వెళ్ళిపోయారంతా.

About Author

By editor

Twitter
Instagram