దేశంలో ఎక్కడ ఉగ్రవాద ఘటనలు జరిగినా దాని లింకులు ఏదో రూపంలో హైదరాబాద్‌లో తేలడం కొత్తేమీ కాదు. ఇప్పుడు ఈ కార్యకలాపాలు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేరళకు చెందిన తీవ్రవాద సంస్థ నిజామాబాద్‌లో మతపరమైన దాడులు జరిపేందుకు కొందరు ముస్లిం యువకులకు శిక్షణ ఇస్తూ దొరికిపోవడం కలకలం రేపుతోంది. అబ్దుల్‌ ‌ఖాదర్‌ అనే వ్యక్తి కరాటే శిక్షణ ముసుగులో భైంసా, జగిత్యాల, కరీంనగర్‌, ‌హైదరాబాద్‌, ‌నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశం ప్రాంతాల వ్యక్తులకు ఉగ్రవాద తర్ఫీదు ఇస్తున్నట్లు బయటపడింది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లో ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటి స్థావరాలు ఉన్నాయి? ఎంత మంది శిక్షణ తీసుకున్నారు అనే ఆందోళనలు నెలకొన్నాయి.

అసాంఘిక శక్తులంటే దుర్గమ కీకారణ్యాలలో, అజ్ఞాత ప్రదేశాలలో పని చేస్తుంటాయని భావిస్తే ఆ అభిప్రాయం మార్చుకోక తప్పదు. అవి ఎక్కడో లేవు. మన చుట్టుపక్క, రహస్యంగా తమ కార్యకలాపాలు చేసుకుంటున్నాయి. ఎవరికీ అనుమానం రాదు. ఎందుకంటే వీరి కార్యకలాపాలు స్థానికంగా ఉండవు. ఇక్కడ ఆశ్రయం పొందుతూ ఎక్కడో తమ కుట్రలను అమలు చేస్తారు. అనుకోని ఘటనలు జరిగిన తర్వాత జరిగే దర్యాప్తు సందర్భంగా ఈ లింకులు బయట పడుతుంటాయి. ఇలాంటి అతిపెద్ద షెల్టర్‌ ‌జోన్‌లో హైదరాబాద్‌ ‌పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది.

దేశంలోనే అతిపెద్ద ఐదో మెట్రోపాలిటన్‌ ‌నగరం, గ్లోబల్‌ ‌హబ్‌, ‌కాస్మోపాలిటన్‌ ‌సిటీ అంటూ హైదరాబాద్‌ను మన పాలకులు ఊదరగొట్టేస్తుం టారు. ఈ మహానగరంలో ఎంతోమంది ఉగ్ర వాదులు, గుట్టుగా పనులు చేసుకుపోతున్నారు. మన నగరంలో అడుగడుగునా సీసీ కెమెరాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమర్ధవంతమైన పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ సకాలంలో వీరిని పసిగట్టి పట్టుకోలేకపోతున్నారు. ఈ కార్యకలాపాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలోని జిల్లాలకు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. తాజాగా జరిగిన రెండు ఘటనలతో ఇది రూఢి అయింది.

ముస్లిం ఉగ్రవాదంతో నిజామాబాద్‌ ‌జిల్లాకు ఉన్న లంకె ఇటీవల బయటపడింది. అక్కడి ఆటో నగర్‌లో పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా (పీఎఫ్‌ఐ) ‌పేరిట బ్యానర్‌ ఏర్పాటు చేసిన ఓ ఇంట్లో కరాటే శిక్షణ ఇస్తున్నారు. జగిత్యాలకు చెందిన అబ్దుల్‌ ‌ఖాదర్‌ ‌సాగించిన ఈ కార్యకలాపాల మీద అనుమానాలు మొదలయ్యాయి. ఇతడు దుబాయ్‌లో ఉండి వచ్చాడు. పోలీసులు చెప్పిన వివరాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఖాదర్‌ ‌తన ఇంటిపై వేసిన టెంటులో సాగిస్తున్న శిక్షణ కార్యకలాపాలపై అనుమానం వచ్చి నిఘా పెట్టారు. జులై 4వ తేదీన ఆ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ కర్రలు, నాన్‌చాక్‌లు, పుస్త కాలు స్వాధీనం చేసుకొన్నారు. అబ్దుల్‌ ‌ఖాదర్‌ను అరెస్టు చేసి దేశద్రోహం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత పీఎఫ్‌ఐకు చెందిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పీఎఫ్‌ఐ ‌జిల్లా కన్వీనర్‌ ‌షాదుల్లాతో పాటు మహమ్మద్‌ ఇ‌మ్రాన్‌, ‌మహమ్మద్‌ అబ్దుల్‌ ‌మోబిన్‌ అనే మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు నిజామా బాద్‌ ‌శివారు గుడారంలో నివసిస్తున్నారు.

అబ్దుల్‌ ‌ఖాదర్‌ను పోలీసులు విచారించినప్పుడు అనేక విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పటివరకు 200 మంది యువతకు విడతలవారీగా శిక్షణ ఇచ్చినట్లు ఖాదర్‌ ‌తెలిపాడు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందిన యువత ఇందులో పాల్గొన్నట్టు చెప్పాడు. తెలంగాణలోని భైంసా, జగిత్యాల, కరీంనగర్‌, ‌హైదరాబాద్‌ ‌వాసులు, ఏపీ  లోని నెల్లూరు, కడప, కర్నూలు, ప్రకాశంతో పాటు పలు జిల్లాలకు చెందిన యువత శిక్షణ తీసుకున్న వారిలో ఉన్నారు. హిందూ వ్యతిరేక భావజాలాన్ని నూరిపోయడమూ శిక్షణలో భాగమే. ఎలా పని చేయాలి? ఎవరెవరిపై దాడులు చేయాలి వంటి విషయాలపైననే ఖాదర్‌ ‌నిత్యం శిక్షణ ఇచ్చినట్టు నిర్ధారణైంది. మానవ బాంబులను తయారు చేయడం, విస్ఫోటనాలకు పథక రచన పీఎఫ్‌ఐ ‌కార్యా చరణగా పోలీసులు వెల్లడించారు. దేశంలో ఎప్పు డైనా, ఎక్కడైనా ఉగ్రదాడులు చేయించటమే ఈ శిక్షణ లక్ష్యం. దేశంలో అస్థిరత్వం సృష్టించి, షరియత్‌ ‌చట్టం సాధించేలా శిక్షణ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది.

అబ్దుల్‌ ‌ఖాదర్‌ ‌వరంగల్‌ ‌లాంటి ఇతర ప్రాంతా లకు కూడా వెళ్లి శిక్షణ ఇచ్చారని విచారణలో తేలింది. కడపలోనూ బేస్‌ ‌క్యాంప్‌ ఏర్పాటు చేసుకున్నారనే సమాచారం ఉంది. దూకుడుగా ఉండే యువకులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారని, ఇలా శిక్షణ పొందిన వారు మరణాయుధాలు సమకూర్చుకుంటారని 120, 120బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని నిజామాబాద్‌ ‌పోలీసు కమిషనర్‌ ‌నాగరాజు చెప్పారు. శిక్షణ పొందిన వారంతా ఎక్కడెక్కడ ఉన్నారనేది తెలియాలి. ఇలాంటి వారిని 30 మంది వరకు గుర్తించామని, దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఇప్పటికి నలుగురిని అరెస్టు చేసినట్లు వివరించారు. మరో 23 మంది కోసం గాలిస్తున్నట్లు పోలీసు కమిషనర్‌ ‌వెల్లడించారు.

ఉగ్రవాద మూలాలు ఉన్న స్టూడెంట్‌ ఇస్లామిక్‌ ‌మూమెంట్‌ (‌సిమి) సంస్థను కేంద్రం నిషేధించింది. ఇప్పుడు అదే సంస్థ పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియాగా పేరు మార్చుకొని పని చేస్తోంది. కేరళలో పీఎఫ్‌ఐ ‌చేస్తున్న హత్యలు, అరాచకాలకు అంతులేదు. ఇదే దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాలపై ప్రధా నంగా దృష్టి పెట్టింది. ఈ సంస్థపై రాష్ట్రంలో నిషేధం లేనప్పటికీ నిందితుల వద్ద దొరికిన సాహిత్యాన్ని సాక్ష్యంగా తీసుకున్నారు. వీరందరిపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

శిక్షణ తరగతులు నిర్వహణకి, యువతను ఆకర్షించటానికి అవసరమైన నిధులు బయటనుండి వస్తాయని అబ్దుల్‌ అం‌గీకరించాడు. అయితే ఎక్కడె క్కడి నుండి నిధులు అందుతున్నాయనే విషయాన్ని చెప్పలేదు. అందుకనే ఆయన బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఖాదర్‌ ఇల్లు నిర్మించు కొనే సందర్భంలో షాదుల్లా పీఎఫ్‌ఐ ‌సంస్థ నుంచి రూ.6 లక్షలు ఇప్పించినట్లు వివరించారు. ఇందుకుగాను గతేడాది అతడిని సంస్థలో కలుపుకొని యువకులకు కరాటే శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికి బయటపడింది నిజామాబాద్‌ ‌కేంద్రంలోని తర్ఫీదు కేంద్రం ఒకటే. ఇలాంటి సెంటర్లు ఇంకా ఎన్ని ఉన్నాయో అనే అనుమానాలు ఉన్నాయి.

ఇంతకీ వందల మందిని దేశ విద్రోహక చర్య లలో భాగం చేయడానికి యథేచ్ఛగా శిక్షణ ఇస్తుంటే నిఘా సంస్థలు ఏమైనట్టు? స్థానిక పోలీసులు ఏం చేస్తున్నట్టు? అందుకే నిజామాబాద్‌లో ఉగ్రమూకల శిక్షణ వెనుక పోలీసుల ప్రమేయం ఉన్నట్టు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించడం సబబేనని పిస్తుంది. ఈ అరెస్టులయినా కేంద్ర నిఘా వర్గాలు వత్తిడి నేపథ్యంలో పోలీసులు తాజాగా చేసినవేనని ఆయన అభిప్రాయం. ‘జగిత్యాలకు చెందిన వ్యక్తి నిజామాబాద్‌లో ఉగ్రశిక్షణ ఇస్తున్నారు. ఈ క్యాంపులో ఏపీతో పాటు తెలంగాణ వారు ఉన్నారు. ఇంత జరుగుతున్నా నిజామాబాద్‌ ‌సీపీ నాగరాజుకు ఎందుకు తెలియలేదు? ఎంఐఎం, తెరాస పార్టీలే ఆయన్ని కమిషనర్‌గా తీసుకువచ్చాయి. ఉదాసీనంగా వ్యవహరించిన నాగరాజును నిజామాబాద్‌ ‌పోలీసు కమిషనర్‌ ‌స్థానం నుంచి వెంటనే తప్పించాలి’ అని అర్వింద్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

నిజామాబాద్‌లో ప్రజాప్రతినిధులను హత్య చేసేందుకు సుపారీలు తీసుకుంటున్నారని అర్వింద్‌ ‌తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయలేదన్నారు. పోలీసుల సహకారంతోనే వందలాది నకిలీ పాస్‌పోర్టులతో రోహింగ్యాలు ఇక్కడ చలామణి అవుతున్నారని ఆరోపించారు. వీటిని సహజంగానే పోలీసు శాఖ ఖండించింది. కానీ వ్యవహారం చాలావరకు వచ్చిందన్న మాట నిజం.

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్‌ ‌శర్మకు అనుకూలంగా సోషల్‌ ‌మీడియాలో పోస్ట్ ‌పెట్టాడన్న కోపంతో ఇద్దరు వ్యక్తులు ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్‌ ‌కన్హయ్య లాల్‌ ‌సాహూను పట్టపగలే అత్యంత దారుణంగా హత్య చేయడం తెలిసిందే. ఈ కేసును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)‌కు అప్పగించింది. ఈ బృందం ఇదివరకే ఐదుగురు నిందితులను అరెస్ట్ ‌చేసింది. ఈ కేసులో మరో నింది తుడు హైదరాబాద్‌లో దొరకడమే విశేషం. ఈ వ్యక్తిని సంతోష్‌ ‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇతడు బిహార్‌ ‌నుంచి వచ్చి ఉంటున్నాడని గుర్తించారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా అందులోని నిందితు లకు ఏదోరకంగా దేశంలో విధ్వంసాలు సృష్టించేం దుకు కుట్ర పన్నుతున్న ఉగ్రవాదులు, సానుభూతి పరులక• భాగ్యనగరం నివాసంగా మారుతోంది. లష్కరే తోయిబా, ఇండియన్‌ ‌ముజాహిదీన్‌, ‌హుజీ, ఐసిస్‌ ఉ‌గ్రవాద సంస్థల సభ్యులు ఇక్కడ ఏళ్ల తరబడి తిష్టవేసి కార్యకలాపాలు సాగిస్తున్నా పోలీసులు పసిగట్టలేకపోతున్నారు. వీరంతా వివిధ వృత్తుల్లో ఉంటూ ఎవరికీ అనుమానాలు రాకుండా చుట్టు పక్కల వారితో స్నేహపూర్వకంగానే ఉంటారు. ఉగ్రవాద సంస్థలలో సంబంధాలు కొనసాగిస్తూ రహ స్యంగా సమాచారాన్ని చేరవేస్తున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా రూట్‌ ‌కాలింగ్‌, ‌శాటిలైట్‌ ‌ఫోన్లు, స్ఫూఫింగ్‌ ‌యాప్స్ ‌ద్వారా ఉగ్ర సంస్థల నాయకులతో మాట్లాడున్నారు.

గోకుల్‌ ‌చాట్‌, ‌లుంబినీ పార్కుల్లో రక్తపాతం అనంతరం ఇప్పటివరకూ 50 మందికి పైగా ఉగ్ర వాదులను, సానుభూతిపరులను ఇతర రాష్ట్రాల పోలీసులు, నిఘావర్గాలు అరెస్ట్ ‌చేశాయి. కానీ హైదరాబాద్‌ ‌నగర పోలీసులు, తెలంగాణ పోలీసు శాఖ వీరిని గుర్తించడంలో విఫలమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరి జ్ఞానం, నగరంలో అడుగడుగునా సీసీ టీవీలు, సమర్ధ వంతమైన పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ ఉగ్రవాదులను పట్టుకోలేకపోతున్నారు. గత ఏడాది జూన్‌ 17‌న బిహార్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్‌లో పార్సిల్‌ ‌బాంబు పేలింది. సికింద్రాబాద్‌ ‌నుంచి ఈ పార్సిల్‌ ‌వెళ్లినట్లు అధికారులు గుర్తించి విచారణ ప్రారంభించారు. మహ్మద్‌ ‌నసీర్‌ ‌ఖాన్‌ 2012‌లో పాకిస్తాన్‌ ‌వెళ్లి ఎల్‌ఈటీలో శిక్షణ పొందాడని ఎన్‌ఐఏ ‌తెలిపింది. రసాయనాలతో ఐఈడీ తయారు చేయడంలో నసీర్‌ ‌శిక్షణ పొందాడని, సోదరుడు ఇమ్రాన్‌తో కలిసి ఐఈడీ తయారు చేశాడని వెల్లడించింది. వస్త్రాల్లో ఐఈడీ పెట్టి సికింద్రాబాద్‌-‌దర్భంగా రైల్‌లో పార్సిల్‌ ‌పంపారని ఎన్‌ఐఏ ‌దర్యాప్తులో తేలింది. నసీర్‌ ‌మాలిక్‌ ఇరవై ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఎన్‌ఐఏ అధికారులు చెప్పే వారకు స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు.

అహ్మదాబాద్లో వరుస పేలుళ్లలో నిందితుడు లష్క రేతోయిబా ఉగ్రవాది గులాం జాఫర్‌ ‌పన్నెండేళ్లుగా టోలీచౌకీలో టైలర్‌ ‌దుకాణం నిర్వహిస్తున్నా పోలీసు లకు తెలీదు. సిరియా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐసిస్‌ ‌కోసం పని చేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇం‌జినీర్‌ ‌సహా నలుగురిని ఐదేళ్లక్రితం అరెస్ట్ ‌చేశారు. హుజీ ఉగ్రవాద సంస్థ సభ్యులను బెంగళూరు క్రైమ్‌ ‌బ్రాంచ్‌ ‌పోలీసులు వీరిని తొమ్మిదేళ్ల క్రితం అరెస్ట్ ‌చేశారు. గోకుల్‌ ‌చాట్‌, ‌లుంబినీ పార్కుల్లో బాంబులు అమర్చి విధ్వంసం సృష్టించిన ఉగ్రవాదులు తార్నాక ప్రాంతంలో ఓ గది అద్దెకు తీసుకుని నివాసము న్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ ‌జంట పేలుళ్లతో 48 మంది మృతికి కారకులైన ఉగ్రవాదుల్లో ఇద్దరు ఎల్బీనగర్‌ ‌పరిసర ప్రాంతాల్లోని ఓ లాడ్జిలో కొద్దిరోజులు నివాసమున్నారు. మరో ఉగ్రవాది దిల్‌సుఖ్‌నగర్‌ ‌బస్‌డిపో వెనుక నెల రోజుల పాటు ఉన్నాడు. గత ఏడాది మే నెలలో హైదరాబాద్‌ ‌సహా దేశంలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించిన ఉగ్రవాదులను హరియాణ పోలీసులు అరెస్టు చేశారు.

ఇన్ని ఘటనల్లోనూ రాష్ట్ర పోలీసులు వారెవరినీ పట్టుకోలేకపోయారు. పదిహేనేళ్లలో రాష్ట్ర పోలీసులు ఒక్కరంటే ఒక్క ఉగ్రవాదిని పట్టుకోలేకపోయారు. హైదరాబాద్‌ ‌పాటు శివారు ప్రాంతాల్లో ఉత్తరాది వారు, విదేశీయులు వేల సంఖ్యలో నివాసముండటం ఉగ్రవాదులకు కలిసి వస్తోంది. వారిలో ఉగ్రవాదులు తేలికగా కలసిపోతున్నారు. వారిని గుర్తించడంలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రత్యేక నిఘా బృందం, ఉగ్రవాద వ్యతిరేక దళం, కౌంటర్‌ ఇం‌టెలిజెన్స్ ‌విభాగాలను పటిష్టం చేయాలి.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram