ప్రజలే పాలకులై తమను తాము పాలించుకునే వ్యవస్థే ప్రజాస్వామ్యం. మన రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ఈ వ్యవస్థ ప్రజల కోసమే పనిచేస్తుది. దీనిని ప్రజలే ఏర్పరచుకొంటారు. కాబట్టి దీనిని ప్రజలు గౌరవించాలి, మన్నిచి తీరాలి. ఎన్నికల ద్వారా ప్రజలు ఏర్పరచుకున్న ప్రభుత్వాల విధానాల్లో లోపాలు, నచ్చని అంశాలు ఉంటే చట్టసభల్లో చర్చిచి అసమ్మతి తెలిపే అవకాశం ఉంది. ఆ పక్రియ ముగిసిన తరువాత నచ్చినా, నచ్చకపోయినా చట్టసభల ఆమోదం పొందిన అంశాలను దేశపౌరులు పాటించి తీరాలి. అలా కాదని మంకుపట్టు పడితే తన ముఖాన తనే దుమ్ము కొట్టుకున్న ఏనుగు పరిస్థితి కాగలదు.

దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు 1975లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకించారు. అయినా సరే తగిన సందర్భం, శాసనం ద్వారా పరిస్థితిని చక్కదిద్దే అవకాశం వచ్చేదాకా ప్రజలు వేచి చూశారు. కాంంగ్రెస్‌ ‌ప్రభుత్వం విధించిన చట్టాలను గౌరవించి, పలువురు విపక్ష నేతలు, లక్షలాదిగా ప్రజలు జైళ్లకు వెళ్లారు. ఆనాడు ప్రజాస్వామిక ధర్మాన్ని మన్నించి జైళ్లకు వెళ్లిన వారిలో కొందరు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు. పదవిని కాపాడుకోడానికి రాజ్యాగాన్ని, ప్రజాస్వామిక ధర్మాన్ని కాలరాసి అధికారంలో కొనసాగిన వారి వారసులు ఇవాళ ప్రభుత్వ వెలుపల ఉన్నారు. అలాంటి వారు రాజ్యాంగబద్ధంగా చట్టసభల ఆమోదం పొందిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆదోళనకు దిగుతున్నారు. దీర్ఘకాలంగా ఢిల్లీ పరిసరాల్లో ఆదోళన నిర్వహిస్తున్నవారు, వారిని ప్రోత్సహిస్తున్న వారు ఇరువురూ భారత రాజ్యాగం కల్పించిన హక్కులు, వెసులుబాట్లు కారణంగానే తమ ఆందోళన కొనసాగగలుగుతోందని గ్రహిచడం లేదు.

రైతుల పేరిట జరుగుతున్న ఆందోళన, ఆ ఆందోళన తీరుతెన్నులను గమనిస్తున్నవారు అది రైతుల ప్రయోజనాల కోసమా, రాజకీయ ప్రయోజనాల కోసమా అని సందేహిస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాల్లోని ప్రధాన అంశాలు ప్రధాని మోదీ మదిలో కొత్తగా మొలకెత్తినవి కావు. ఆందోళనలకు ఆజ్యం పోస్తున్న కాంగ్రెస్‌ ‌తదితర పార్టీలు గతలో తమ ఎన్నికల ప్రణాళికల్లో పలుమార్లు పేర్కొన్నవే. ఢిల్లీ సరిహద్దులకు చేరుకుని ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులు ప్రధానంగా పజాబ్‌కు చెందిన వారే కావడం గమనార్హం. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రకంటించి, ఆ మేరకు శాసనసభలో తీర్మానించింది. తమ రాష్ట్రలో అమలు కాని చట్టాల రద్దుకోసం పంజాబ్‌ ‌రైతులు ఢిల్లీ దాకా వచ్చి ఆందోళన నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటి! దేశంలో మరే రాష్ట్రం రైతులూ ఇలాంటి ఆదోళనలు జరపడం లేదు. ఆదోళన నిర్వహిస్తున్న పంజాబ్‌ ‌రైతులు దేశ రైతులదరికీ ప్రతినిధులు కారన్నది నిష్ఠుర సత్యం. అయినప్పటికీ ప్రజాస్వామిక విలువలను, ప్రజల ఆందోళనలను మన్నించిన కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేర్పులు, రైతులకు నష్టదాయకమైన అంశాలు ఉన్నాయని భావిస్తే వాటిని సూచించడానికి రమ్మని రైతు సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించింది. చట్టాల రద్దు మినహా సవరణలకు, చర్చలకు తావే లేదని రైతు సంఘాలు తేల్చి చెప్పాయి. ప్రజాస్వామిక వ్యవస్థలో దేశ సార్వభౌమాధికారానికి ప్రతిరూపమైన పార్లమెంటు ఆమోదించిన చట్టాలను రద్దు చేయాల్సిందేనని ఆదోళన కారులు మొండికెత్తడం నూటికి నూరుపాళ్లు అప్రజాస్వామికం. దేశ సర్వోన్నత న్యాయస్థానం కల్పిచిన అవకాశాన్ని వినియోగిచుకుని తమ అభిమతాన్ని వెల్లడించి చట్టసవరణలకు గల అవకాశాన్ని కూడా వారు తిరస్కరించారు.

కేంద్ర ప్రభుత్వమే ఒక మెట్టు దిగి నూతన వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నర పాటు నిలిపివేస్తామని ప్రకటించింది. పూర్తిగా రద్దయ్యే దాకా ఆదోళన విరమించే ప్రసక్తే లేదని ఆందోళన కారులు తెగేసి చెప్పారు. దేశ ప్రజలందంరి ప్రతినిధి అయిన పార్లమెంటు దేశం అతంటికీ వర్తిచేట్లు రాజ్యాగబద్ధంగా రూపొందించిన చట్టాలను ఒక రాష్ట్రానికి చెందిన కొద్ది మంది రాజకీయ ప్రేరేపితుల గుంపు ఢిల్లీ సరిహద్దుల్లో చేరి ఆందోళన నిర్వహిస్తే రద్దు చేయాలా! పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, చట్టసభల శాసనాధికారం ఆందోళనకారుల గుంపు ముందు తలవొంచాల్సిందేనా! ఇదే ఆనవాయితీ కొనసాగితే వివిధ రాష్ట్రాల్లో శాసనసభలు రేపటినుండి ఆమోదించే చట్టాలకు విలువ ఉంటుందా! చట్టసభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధుల శాసన బలం ఎన్నికల్లో ప్రజల తిరస్కరణకు గురైన పరాజితులు వీధుల్లో పోగేసిన మంద బలం ముందు దిగదుడుపు కావలసిందేనా! ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల శాసనాధికారాన్ని మన్నించడమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. చట్టసభల నిర్ణయాలకు వ్యతిరేకంగా వీధులకు ఎక్కడం మూకస్వామ్య. ప్రజాస్వామ్యానికి ముప్పు. స్వార్థ రాజకీయ జీవులు ప్రజాదోళన పేరిట ప్రజాస్వామికధర్మం మీద మూకస్వామిక దాడి జరిపిచడం విషాదం. ప్రజాస్వామ్య ప్రియులందరూ దీన్ని ఖండించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.

About Author

By editor

Twitter
Instagram