జాగృతి – సంపాదకీయం

శాలివాహన 1941 – శ్రీ శార్వరి వైశాఖ శుద్ధ చవితి – 27 ఏప్రిల్‌ 2020, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ –  బృహదారణ్యకోపనిషత్

ఆయుష్షు గట్టిగా ఉన్న రోగి అదృష్టవంతుడైన వైద్యుని వద్దకు వెళితే, ఆయువు మూడిన రోగులు అదృష్టహీనుడైన వైద్యుని వద్దకు వెళ్తారని సామెత. కరోనా కారణంగా అల్లోపతి వైద్యం అదృష్ట హీన అని ప్రపంచం అతంటా రుజువు అవుతున్నా చాలా ప్రభుత్వాలు ఇంకా ఆ అదృష్ట హీననే పట్టుకుని వేలాడ్డం విషాదం! కరోనాకు పుట్టినిల్లయిన చైనా అల్లోపతి అసమర్థతను గుర్తించి సాంప్రదాయిక వైద్యాలను ఆశ్రయించిన పిదపనే కరోనాను కట్టడి చేయడంలో సఫలమవుతున్నట్లు తెలుస్తోంది. భారతీయుల మిరియాల చారు కరోనా నివారణలో ప్రముఖ స్థానం వహిచిన వార్తలు కూడా వచ్చాయి.

కరోనాను కట్టడి చేయడంలో మన ప్రభుత్వాల రొడ్డ కొట్టుడు విధానాలు స్థానిక వైద్యుల వివేచనకు, విచక్షణకు ఊతమిచ్చేవిగా లేవు. ఇతర వైద్య విధానాల సామర్థ్య పరిశీలనకు అవకాశమివ్వని ప్రభుత్వ విధానాలు గుడ్డెద్దు చేలో పడ్డట్లు సాగుతున్నాయని (ఓ ప్రముఖ దినపత్రిక, ఏప్రిల్‌ 23) ‌విశాఖ ఉదంతం నిరూపిస్తున్నది.

విశాఖ నగరం అక్కయ్యపాలేనికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి మార్చి నెలలో ఢిల్లీలో జరిగిన మర్కజ్‌ ‌నుండి వచ్చి, మార్చి 30న ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు అతనికి నిర్వహిచిన రక్త పరీక్షలో పాజిటివ్‌ అని 31న తేలింది. అతనిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవు. ఆ తరువాత 14వ రోజు, 15వ రోజు మరలా గీతం ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌ ‌వచ్చింది. కాని అతనిలో కోవిడ్‌ 19 ‌లక్షణాలుగా చెపుతున్న జలుబు, దగ్గు, జ్వరం వంటి బాధలేవీ కనిపిచలేదు. నిబంధనల ప్రకారం అతడు 28 రోజుల పాటు ఆసుపత్రిలో ఉడాల్సిందేనని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అతనిలో వైరస్‌ ఉన్నప్పటికీ ఏదో స్వల్పంగా మినహా 14 రోజుల దాకా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో అతనికి ఎలాంటి మందులు ఇవ్వలేక పోయారు. కానీ 14 రోజుల తరువాత కూడా అతనిలో వైరస్‌ ‌కొనసాగుతూడడంతో 15వ రోజు నుండి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఇవ్వడం ప్రారంభిచారు. ఇప్పటి వరకు నిర్వహించిన వివిధ వైద్య పరీక్షల్లో అతని రోగ నిరోధకశక్తి చక్కగా ఉందని, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్‌ ఆరోగ్యంగా ఉన్నాయని తేలింది. 28 రోజుల తర్వాత కూడా అతనిలో వైరస్‌ ‌కొనసాగుతుంటే ఏం చేయాలనేది వైద్యులకు ఇప్పుడు సమస్యగా మారింది. కరోనా వైరస్‌ను అంతమొందించగల ఔషధం తమకు తెలీదని చెపుతూనే వైరస్‌ ‌బారిన పడిన రోగుల చికిత్సకు సమకట్టడం నిజంగా అల్లోపతి తెంపరి తనమే.

కొవిడ్‌ 19 ‌లక్షణాలుగా చెపుతున్న జ్వరం, జలుబు, దగ్గు, శ్వాసక్రియలో ఇబ్బంది తదితర సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఆర్సనిక్‌ ఆల్బతో చికిత్స చేసి స్వస్థత చేకూర్చిన దాఖలాలు హోమియో వైద్యలో ఉన్నాయని వెల్లడవుతున్నా కరోనా వైరస్‌ ‌సోకిన రోగులకు చికిత్స చేసేందుకు హోమియో వారికి అవకాశమిచ్చి పరీక్షిచక పోవడం ప్రభుత్వాల అవివేకమనుకోక తప్పదు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వాల సూచనలు పాటిస్తూనే వ్యాధి లక్షణాలు కనిపించగానే ప్రజలు ఆయుర్వేద, యునానీ, నేచురోపతి, హోమియో వంటి సాంప్రదాయిక వైద్యాలను ఆశ్రయిచినందునే భారత్‌లో కరోనా మృతుల సంఖ్య తక్కువనే అభిప్రాయం ఉంది. పూర్తిగా అల్లోపతిని నమ్ముకున్న దేశాలతో పోల్చితే భారత్‌లో కరోనా పీడిత మరణాల రేటు తక్కువగా ఉంది. వ్యాధి సోకిన వారిలో మరణించిన వారి సంఖ్యను బట్టి నిర్ణయమయ్యే మరణాల రేటు ఈ సత్యాన్ని నిర్ధారిస్తున్నది.

మరణాల రేటులో భారత్‌ (3.12%)‌తో పోలిస్తే అగ్రరాజ్యాలైన అమెరికా (65%), ఫ్రాన్స్(14%), ఇం‌గ్లాండు (13.69%) దేశాలు కరోనాకు బలి కావడంలో కూడా అగ్రగాములుగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు భారత్‌లో మరణాల రేటు తక్కువ కావడానికి కారణాలేమిటి అని ప్రపంచం అంతా భారత్‌ ‌వైపు దృష్టి సారిస్తోంది. ఈ ఘనతను కూడా అల్లోపతి తన ఖాతాలో వేసుకోవాలనే పన్నాగంలో భాగంగా భారత్‌లో ట్రిపుల్‌ ‌యాంటిజెన్‌ ‌టీకాలు, మలేరియా సఫల చికిత్సల కారణంగా భారతీయుల్లో యాటీబాడీస్‌ ‌సంఖ్య పెరిగి కరోనాను అడ్డుకో గలిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. మానవుల్లో తొలుత మనస్సు వ్యాధిగ్రస్తమై ప్రాణశక్తి దుర్బలమైన ఫలితంగా దేహంలో వ్యాధులు ప్రకోపిస్తాయని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆయుర్వేదం ఘోషిస్తోంది. జర్మనీ వైద్యుడైన డా.శామ్యూల్‌ ‌హానిమన్‌ ఆవిష్కరించిన హోమియో వైద్య శాస్త్రం కూడా ప్రాణశక్తి దారితప్పిన ఫలితమే వ్యాధులు అని ఆయుర్వేద ప్రవచనాన్ని నిర్ధారిస్తోంది. అల్లోపతి విఫలమైనా కరోనాను జయించడంలో విశ్వమానవాళి తప్పక విజయం సాధిస్తుంది. ఆ తరువాత ప్రపంచ మానవాళిని సంపూర్ణ ఆరోగ్య సాధన దిశగా నడిపించి చికిత్స దోపిడి నుండి విశ్వమానవాళిని విముక్తం చేసే బాధ్యతను భారత్‌ ‌స్వీకరిచాలి. యోగతో ప్రపంచ మానవాళి మనస్సుకు స్వీయ చికిత్సా విధానం అదించిన ఘనత భారత్‌కు లభించింది. విశ్వమానవాళి సంపూర్ణ ఆరోగ్య సాధనకు ఆయుర్వేదం, హోమియో వంటి సమగ్ర చికిత్సా సిద్ధాంతాలను ఆధునీకరించి ప్రపంచానికి అదించే బాధ్యతను భారతీయులు స్వీకరించాలి!

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram