అసలు మతమనేదే మత్తుమందు లాంటిదని భావించే కమ్యూనిస్టులు, వారికి తోడు స్వలింగసంపర్కులు, ఫెమినిస్టులు కలిసి… దైవ నిందకు మొండెం నుంచి తలను వేరు చేయడమే శిక్ష అని విశ్వసించే మతం… స్వలింగ సంపర్కుల కాళ్లు, చేతులు తీసివేసే మతం, ట్రాన్స్‌జెండర్లను మేడల మీద నుంచి మిద్దెల మీద నుంచి విసిరేసే మతం.. మహిళలకు స్వేచ్ఛే ఉండదని భావించి వారిని బురఖాలకు పరిమితం చేసే మతమైన ఇస్లామ్‌ను విశ్వసించే ఇస్లామిస్టులతో కలిసి.. అమెరికాలోని  యూనివర్సిటీలలో పాలస్తీనాకు అనుకూలంగా, ఇజ్రాయె ల్‌కు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలు, సృష్టిస్తున్న గందరగోళం ప్రపంచాన్ని నిశ్చేష్టులను చేయడం విచిత్రం కాదు. సైద్ధాంతికంగా పరస్పర విరుద్ధమైన, విపరీత భావజాలం కలిగిన శక్తులు చేతులు కలిపితే సమాజంలో ఏర్పడేది అరాచకమేనన్నది యుఎస్‌కు అనుభవమైంది. నిన్నటివరకూ, మానవ హక్కులు, వాక్‌ ‌స్వాతంత్య్రంపై ప్రపంచానికి ఉపన్యాసాలు ఇచ్చిన అమెరికా ప్రభుత్వం, నేడు తన నట్టింట్లో జరుగుతున్న ఆ నిరసనలపై ఉక్కుపాదం మోపి, అరెస్టులు చేయడం ఆ దేశపు ద్వంద్వ వైఖరిని ప్రపంచం ఎదుట బట్టబయలు చేసింది.

పాలస్తీనా, ఇజ్రాయెల్‌ ‌యుద్ధంతో అమెరికాకు ప్రత్యక్ష సంబంధం ఏమీలేదు. ఇజ్రాయెల్‌ ‌మిత్రదేశం కనుక దానికి మద్దతుగా నిలబడ్డదనుకుంటే పొర పాటే. పెట్టుబడిదారీ దేశమైన అమెరికాలో ఉన్న కుబేరులలో తొంభై శాతంమంది యూదులే. ఆర్ధిక వ్యవస్థకు ఊపిర్లు ఊదేవారు. అందుకే, తాను ప్రపంచానికి ఇచ్చే ఉపన్యాసాలను పక్కకు పెట్టి మరీ ఈ నిరసనలను యుఎస్‌ అణిచేస్తున్నదన్నది.

యుఎస్‌ ‌వర్సిటీల్లో సమస్య ఎప్పుడు ప్రారంభమైంది?

సున్నీ ఇస్లామిస్టు తీవ్రవాద సంస్థ హమాస్‌, ‌మరొక నాలుగు ఇతర పాలస్తీనా తీవ్రవాద గ్రూపులతో కలిసి అక్టోబర్‌ 7‌వ తేదీని ‘ఆపరేషన్‌ అల్‌ అక్సా స్టార్మ్’ ‌పేరుతో ఇజ్రాయెల్‌పై మిలటరీ స్థాయి తీవ్రవాద దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 1200మంది ఇజ్రాయెలీలు, విదేశీయులు మరణించగా, సుమారు 240మందిని ఇజ్రాయెల్‌ ‌నుంచి గాజాకు బందీలుగా ఈ తీవ్రవాదులు పట్టుకుపోయారు. దీనితో ఆగ్రహించిన ఇజ్రాయెల్‌ ‌హమాస్‌ను నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేసి, గాజాపై దాడులు ప్రారంభించింది. అప్పటి నుంచి 34,596మంది పాలస్తీనా పౌరులు మరణించారని హమాస్‌ ‌పాలనా యంత్రాంగం చెబుతోంది.

ఈ నేపథ్యంలో, అమెరికాలోని యూనివర్సిటీలు అన్నింటిలో ఇజ్రాయెల్‌కు, యూదులకు వ్యతిరేకంగా ఆ రోజు నుంచే తీవ్ర చర్చలు, విభేదాలు, హింస ప్రారంభమయ్యాయి. అమెరికాలో విశిష్టమైనవిగా చెప్పుకునే 30 యూనివర్సిటీ క్యాంపస్‌లలో నిరసన కారులను చెదరగొట్టేందుకు వారిపై బ్యాటన్లను, టేజర్లను ప్రయోగించి 2000మందికిపైగా నిరసన చేస్తున్న విద్యార్ధులను, ఇతరులను పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. వీరిలో భారతీయులు, భారతీయ సంతతికి చెందిన వారు ఉండడం ఆందోళన కలిగించే విషయం. కాగా, అరెస్టు అయిన వారిలో విద్యార్ధులు కాని వారు కూడా ఉండడం ఈ నిరసనల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని, లక్ష్యాన్ని ప్రశ్నించేలా చేస్తోంది. కొలంబియా వర్సిటీలోని హామిల్టన్‌ ‌హాల్‌పై దాడి చేసి, పోలీసులు నిర్బంధం లోకి తీసుకున్నవారిలో 30శాతంమంది తమ విద్యార్ధులే కాదని వర్సిటీ అధికారులు చెప్పడం గమనార్హం. ఈ ఘటనలతో మానవహక్కులు, వాక్‌స్వాతంత్య్ర ప్రతిపాదకుడిగా చెప్పుకుంటూ అందరిపై పెత్తనం చేసే అమెరికా ఇమేజ్‌పై మబ్బులు కమ్ముకుంటున్నాయి. అందరికీ చెప్పే నీతులు తాను ఆచరించకపోవడంతో దాని విశ్వసనీయతే ప్రశ్నార్ధకం అవుతోంది.

పాలస్తీనా అనుకూల వైఖరికి ఎప్పుడో విత్తనాలు పడ్డాయా?

గత ఏడాది అక్టోబర్‌ 7‌వ తేదీన ఇజ్రాయెలీలపై హమాస్‌ ‌దాడి చేసిన కొద్ది గంటల నుంచే అమెరికన్‌ ‌యూనివర్సిటీలలో ఉత్సాహం వెల్లివిరిసింది. విద్యార్ధులు పాలస్తీనాను సమర్ధిస్తూ, యూదులకు వ్యతిరేకంగా జరిగిన హింసపై సంబరాలు జరుపుకోవడం, అక్కడి యూనివర్సిటీల మానవత్వం, సమ్మిళితత్వం అన్న ఆదర్శాలపై ప్రశ్నలు తలెత్తాలా చేశాయి. పాలస్తీనా చేపట్టిన మిస్సైల్‌, ‌భూమిపై దాడులకు స్పందనగా ఇజ్రాయెల్‌ ‌చేపట్టిన దాడులను మొదటగా హార్వార్డ్ ‌యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, జార్జ్‌టౌన్‌ ‌యూనివర్సిటీలలో ఉన్న పాలస్తీనా అనుకూల సిబ్బంది, విద్యార్ధులు ఖండించి ఆందోళనలు ప్రారంభించారు. దీనితోపాటుగా యూదు విద్యార్ధులను, అధ్యాపకులను, ఇజ్రాయెలీ మద్దతుదారులను వేధించడం, బెదిరించడం మొదలైంది. తర్వాత నెలల్లో దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు అన్నింటి నుంచీ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికన్‌ ‌విశ్వవిద్యాలయ ఆవరణలలో యూదుల పట్ల వ్యతిరేకత, ద్వేషం తీవ్రమయ్యాయి.

కాంగ్రెస్‌ ‌విచారణలు

యూదులకు వ్యతిరేకంగా కాల్పనిక కథనాలు

పశ్చిమాసియాలో ఈ ఘటనలు వెలుగులోకి రావడం నడుమ యుఎస్‌ ‌యూనివర్సిటీలలో యూదులకు వ్యతిరేక కథనాలు, ప్రచారాలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే యూదు విద్యార్ధులను, ఇజ్రాయెల్‌ ‌మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుంటున్న విషయంలో తగిన చర్యల కోసం డిమాండ్లు పెరిగాయి. నిధులలో కోత, ఆంక్షలు అన్నవి యూదు వ్యతిరేక, యూదులు మెజారిటీగా ఉన్న ఇజ్రాయెల్‌ ‌వ్యతిరేక భావనలకు ఆజ్యం పోయడంతో, ఈ ఘటనలను రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు నాజీ పార్టీ అధికారంలోకి రావడం, హోలోకాస్ట్ ‌జరిగిన కాలమైన 1930ల్లో జర్మనీలో జరిగిన యూదు వ్యతిరేక ర్యాలీలతో పోలుస్తూ, ఇజ్రాయెల్‌ ‌ప్రధాని నెతన్యాహూ తీవ్రంగా ఖండించారు.

తాజా పరిణామాలు

గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన విచారణకు కొనసాగింపుగా ఏప్రిల్‌ 17‌వ తేదీన జరిగిన కాంగ్రెస్‌ ‌విచారణతో యుఎస్‌ ‌యూనివర్సిటీలలో విస్ఫోట నంలా నిరసనలు పెరిగాయి. అంతకు ముందు జరిగిన విచారణ అనంతరం, హార్వార్డ్, ‌పెన్సిల్వేనియా అధ్యక్షుల రాజీనామాల సహా చెప్పుకోదగిన పరిణామాలే సంభవించాయి. ఏప్రిల్‌లో జరిగిన విచారణకు కొలంబియా యూనివర్సిటీ అధ్యక్షురాలు నెమాత్‌ ‌షఫీక్‌ను వివరణ ఇచ్చేందుకు పిలిచారు. న్యూయార్క్ ‌కేంద్రంగా ఉన్న కొలంబియా సహా అమెరికాలో రాజకీయంగా అత్యంత చురుకుగా ఉండే యూనివర్సిటీలలో యూదు వ్యతిరేక కార్యకలాపాల వ్యాప్తిని దర్యాప్తు చేసే లక్ష్యంతో రిపబ్లికన్‌ ‌శాసనసభ్యులు ఈ విచారణకు నాయకత్వం వహించారు. చిత్రమైన విషయం ఏమిటంటే, అమెరికాలోనే అతిపెద్ద యూదు విద్యార్ధుల సంస్థ కలిగిన, ఆరోగ్యవంతమైన మధ్య ప్రాచ్య పోగ్రాం, చెప్పుకోదగిన సంఖ్యలో ఆరబ్‌ ‌ముస్లిం జనాభా, టెల్‌ అవీవ్‌ ‌యూనివర్సిటీతో రెండు డిగ్రీల పోగ్రాం కలిగిన కొలంబియా యూనివర్సిటీ ఈ యూదు వ్యతిరేక చర్చలకు కూడలి కావడం. 1960ల్లో విద్యార్ధుల చైతన్యానికి సంకేతంగా నిలిచిన చరిత్ర కలిగిన ఈ విశ్వ విద్యాలయం- ప్రస్తుతం యుఎస్‌ ‌యూనివర్సిటీల సంక్షోభంలో తన పాత్రను విస్తరింపచేసింది. కాగా, అంతకుముందు జరిగిన విచారణల నుంచి సంకేతాలను అందుకున్న షఫీక్‌, ‌ముందుగానే తయారై వచ్చి శాసనసభ్యులు వినాలను కున్న మాటలు చెప్పడంతో ఆమెకు విద్యార్ధులనుంచి తిరుగుబాటు ఎదురైంది. అమె అధికారాన్ని ధిక్కరించి విద్యార్ధులు విశ్వవిద్యాలయం ఆవరణలో పాలస్తీనా అనుకూల శిబిరాలను లేదా విముక్తి జోన్లను ఏర్పాటు చేశారు.

నిరసనలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

కేవలం యూనివర్సిటీ విద్యార్ధులే కాదు, దాని పరిధిలో, సమీపంలో ఉన్న కాలేజీలు కూడా ఈ నిరసనల్లో పాల్గొంటున్నాయి. ఇంత భారీ ఎత్తున నిరసనలు నిర్వహించేందుకు, టెంట్లు వేసుకొని అక్కడే గడిపేందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పైగా, అమెరికావ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో జరుగుతున్న నిరసనలలో భాగంగా వేసిన టెంట్లన్నీ ఒకేరకమైనవి కావడం గమనార్హం. దీని ద్వారానే ఈ ఉద్యమం నడిచేందుకు బయటి నుంచి నిధులు అందుతున్నాయనే విషయం అర్థమవుతుంది. ఇటువంటి అరాచక కార్యకలాపా లను ప్రోత్సహించి, దేశాలలో గందరగోళాలు సృష్టిస్తారని పేరుపొందిన అరాచకవాదులైన జార్జ్ ‌సోరోస్‌, ‌రాకెఫెల్లర్‌ ‌బ్రదర్స్ ‌ఫండ్‌, ‌ప్రెట్‌ ఎ ‌మాంగే వంటి కార్పొరేట్లతో పాటు గా అదృశ్యంగా ఇరాన్‌, ‌చైనా హస్తాలు కూడా ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. ఈ ప్రభావాలు కొన్ని కథనాలను బలపరచి, కొన్నింటి నోరుమూయించి, లక్ష్యిత యాక్టివిజమ్‌ ‌దిశగా వాదనను నడిపిస్తాయి. ఇది అమెరికా ప్రజాస్వామిక సూత్రాలకు పునాదిగా ఉన్న విలువలను బలహీన పరచేందుకు ధనం, రాజకీయాలు, విద్య మధ్య ఆదానప్రదానాలతో భారీ వ్యవస్థాగత సమస్యకు ప్రతీకగా కనిపిస్తుంది. అందుకే, ఈ క్యాంపస్‌లలో కేవలం పాలస్తీనా అనుకూల గొంతుకే వినిపిస్తోంది కానీ, మిగిలిన వాదనలు వినిపించడం లేదు. ఈ కారణంగా యూదు విద్యార్ధులే కాదు, ఇతర మైనార్టీ గ్రూపుల హక్కులు, భద్రతకు ముప్పు పెరిగిపోతోంది.

ఇంతకీ పాలస్తీనా చరిత్ర ఏమిటి?

ఈ ఉద్యమాల్లో పాల్గొంటున్న విద్యార్ధులు, విద్యావేత్తలు సహా పాలస్తీనా అనే ప్రాంతం అనాదిగా ఉన్నదని, దానిని యూదులు అక్రమించి పాలస్తీనియ న్లను నిర్వాసితులను చేశారన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంత వాస్తవముందో చూద్దాం… మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఒట్టమాన్‌ ‌సామ్రాజ్యం కుప్పకూలిన అనంతరం మధ్య, పశ్చిమ ఆసియా ప్రాంతంలో గల ఈ ప్రదేశాన్ని పాలస్తీనా అనే పేరుతో బ్రిటిష్‌ ‌పాలించింది. ఈ పాలస్తీనా జీవితకాలం నాలుగైదు దశాబ్దాలు మాత్రమే. అందుకే, ఈ ప్రాంత చరిత్రను తరచి చూస్తే మనకు పాలస్తీనా అన్న పేరు కలిగిన సామ్రాజ్యం కనిపించదు.

ఆధునిక ఇజ్రాయెల్‌ అవతరణ

రెండువేల ఏళ్లకుపైగా గల చరిత్ర పొడవునా యూదులు, అరబ్బులు ఈ ప్రాంతంలో సహజీవనమే చేశారు. కాగా, రెండవ ప్రపంచ యుద్ధానంతరం బ్రిటిష్‌ ‌సామ్రాజ్యం పతనం కావడంతో పాలస్తీనా ప్రాంతంలో దాని పాలనకు ముగింపు పలుకుతూ 29 నవంబర్‌ 1947‌లో ఐక్యరాజ్య సమితి తీర్మానం 181 (విభజన తీర్మానం- దానిని యూదు, అరబ్‌ ‌ప్రాంతాలుగా విభజించే)ను ఆమోదించింది. అనంతరం మే 14,1948లో బ్రిటిష్‌ ‌పాలన అంతమైన వెంటనే ఇజ్రాయెల్‌ ‌రాష్ట్రం ఏర్పాటును ఆమోదించింది. ఆ రకంగా అదే రోజున ఇజ్రాయెల్‌ ‌ప్రత్యేక దేశంగా అవతరించింది. దీనిని ఆ రోజే నాటి అమెరికాకు అధ్యక్షుడు హారీ ఎస్‌ ‌ట్రూమెన్‌ ‌గుర్తిస్తున్నట్టుగా ప్రకటించారు. అప్పటి నుంచీ చుట్టూ అరబ్బు, ముస్లిం దేశాల ముప్పుతో, తీవ్రవాదంతో ఇజ్రాయెల్‌ ‌యుద్ధం చేస్తూ వస్తున్నది. ఇజ్రాయెల్‌ ఏర్పడిన వెంటనే పొరుగుదేశాలతో జరిగిన తొలి ఆరబ్‌- ఇ‌జ్రాయెలీ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతంలో నివసిస్తున్న ఆరబ్‌లు నిర్వాసితులయ్యారు, పెద్ద సంఖ్యలో ఇజ్రాయెలీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన అనంతరం అంత పెద్దస్థాయిలో జరిగిన ఘటన అక్టోబర్‌ 7, 2023‌న ప్రారంభమై, కొనసాగుతోంది.

ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ ‌తర్వాత యూదులు అధికంగా నివసించే యుఎస్‌లో నిరసనలు ప్రారంభం అయ్యాయి. ఎలా అయినా యూదులను నిర్వీర్యులను చేయాలన్న లక్ష్యంతో సాగుతున్న ఈ నిరసనలు, హింసకు నిధులు ఇచ్చి ఆజ్యం పోస్తున్నది యూదు అయిన సోరోస్‌ ‌కావడం నమ్మలేని విషయం.

ఇక భారత్‌ ‌వంటి దేశాలలో మానవ హక్కుల ఉల్లంఘనలను పట్టి చూపడంలో ముందుండే యుఎస్‌ ‌ప్రభుత్వం, స్వంత ఇంట్లో యూదు వ్యతిరేకత, జాతిపరమైన వివక్ష/ అన్యాయాలు నుంచి వాక్‌ ‌స్వాతంత్య్రాన్ని అణచివేసేవరకు అనేక సవాళ్లతో పోరాడుతోంది. ఎదుటివారికి చెప్పడం, తాను ఆచరించడం మధ్యగల ద్వంద్వత్వం అన్నది అమెరికా దౌత్య వైఖరిని బలహీనపరచడమే కాక యుఎస్‌ ‌కప•త్వాన్ని బట్టబయలు చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, అమెరికా ఒక కీలకమైన కాం మలు పును ఎదుర్కొంటున్నది. ఇతరులను వేలెత్తి చూపే ముందు తన విద్యా సంస్థలు, విస్తృతమైన సామాజిక నిర్మితుల మధ్య ఉన్న వైరుధ్యాలను పరిష్కరిం చేందుకు ఆమెరికా లోతైన, తీవ్రమైన ఆత్మపరిశీలన చేసుకోవలసి ఉందన్నది వాస్తవం.

నీల

About Author

By editor

Twitter
YOUTUBE