ప్రశాంతతకు మారుపేరుగా, అందాల నగరంగా పేరున్న విశాఖ అక్రమాలకు, మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుతోంది. ఇప్పటివరకు గంజాయికి పుట్టినిల్లుగా చెప్పుకునే నగరం డ్రగ్స్‌కు కేంద్రంగా మారుతోంది. ఇలాంటి వాటిని నిరోధించవలసిన వారే, మాదకద్రవ్య వ్యాపారులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడమే విచారకరం.

ఆసియాలోనే అందాల నగరంగా పేరున్న విశాఖ ఇప్పుడు అంతర్జాతీయ మత్తు పదార్థాలకు కేంద్రంగా మారింది. నగర శివారు ప్రాంతాలు డ్రగ్స్‌ కేంద్రాలుగా మారిపోయాయి. అనేక ప్రాంతాల నుంచి ఉన్నత చదువుల కోసం వచ్చే యువత డ్రగ్స్‌ బారిన పడి కొట్టుమిట్టాడుతున్నారు. చీకటి పడితే… యువత రోడ్ల పక్కనే మాదక ద్రవ్యాలు తీసుకుంటూ మత్తు యువత మత్తులో మునిగి తేలిపోతున్న సంఘటనలు అనేకం నిత్యం కని పిస్తూనే ఉన్నాయి. డ్రగ్స్‌ మత్తులో నిర్లక్ష్యంగా వాహనాలు నడుపు తుండటంతో అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. తమ పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారిపోతోందని అనేక మంది తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

డ్రగ్స్‌ మాఫియా కోట్లాది రూపాయలు వ్యాపారాలు చేసుకుంటూ యువత జీవితాలను విచ్ఛిన్నం చేస్తోంది. దీనిని నియంత్రించాల్సిన పాలకులే డ్రగ్స్‌ వ్యాపార సంధాన కర్తలుగా మారడం సమాజానికి తీరని అన్యాయమే. విశాఖ రవాణాకు అనువైన ప్రదేశం కావడంతో వాయు, జల, రోడ్డు మార్గాల గుండా తరలిస్తున్న డ్రగ్స్‌ చిల్లర కొట్టుల్లో సైతం విచ్చలవిడిగా లభిస్తున్నాయి. అందుకు తాజాగా విశాఖ పోర్టులో భారీ డ్రగ్స్‌ కంటైనర్‌ లభ్యం కావడమే నిదర్శనం. ఈ డ్రగ్స్‌ కంటైనర్‌ వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉందని పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకోవడం తప్ప డ్రగ్స్‌ రహిత ఆంధ్ర ప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నించకపోవడం బాధాకరం.

కంపెనీ ప్రతినిధులపై కేసు నమోదు

విశాఖపట్నం లాసన్స్‌ కాలనీలోని సంధ్య ఆక్వా ఎక్ప్‌పోర్ట్సు ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ వ్యాపార అవసరాల కోసం ‘డై ఈస్ట్‌’ను ఆర్డర్‌ చేసింది. అందులో డ్రగ్స్‌ కలిపి బ్రెజిల్‌ నుంచి విశాఖపట్నానికి రవాణా చేసినట్టు ఇంటర్‌పోల్‌ నుంచి సమాచారం రావడంతో సీబీఐ అధికారులు అప్రమత్తమయ్యారు. మార్చి 16న విశాఖ పోర్టుకు చేరుకున్న కంటైనర్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢల్లీి నుంచి వచ్చిన నిపుణులు సరకు తెప్పించుకున్న ఆక్వా కంపెనీ ప్రతినిధులను పిలిపించి వారి సమక్షంలోనే కంటెయినర్‌ (నంబర్‌ ఎస్‌ఈఆర్‌ యూ 437538) తెరిచారు. అందులో డ్రై ఈస్ట్‌ తో పాటు డ్రగ్స్‌ కూడా ఉండడంతో స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఆక్వా సంస్థ ప్రతినిధులను ప్రశ్నించగా, తాము ఆక్వాకల్చర్‌ వ్యాపారం చేస్తున్నామని, తొలిసారిగా దీన్ని తెప్పించు కున్నామని అంటున్నారు. సుమారు 25 వేల కిలోల ‘డ్రై ఈస్ట్‌’ కలిపి ఉన్న కొకైన్‌ను స్వాధీనం చేసుక్నుట్టు సీబీఐ అధికారులు వెల్లడిరచారు. ఇన్‌ యాక్టివ్‌ డ్రై ఈస్ట్లో నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ను కలిపినట్టు నిర్ధారించారు. డ్రగ్స్‌ వచ్చిన కంటైనర్‌ను విశాఖలో ఆక్వా ఎగుమతులు, దిగుమతులు చేపట్టే ‘సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ పేరిట బుక్‌ చేసినట్టు సీబీఐ అధికారులు తేల్చారు. ఆ కంపెనీ ప్రతినిధులతోపాటు మరికొందరిపై ఎన్టీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదుచేశారు. ఇందులో అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్‌ ముఠా ప్రమేయం ఉన్నట్టు అనుమాని స్తున్నారు. దర్యాప్తులో మిగిలిన వివరాలను రాబట్టాల్సి ఉందని సీబీఐ అధికారులు తెలిపారు.

రాజకీయ ప్రకంపనలు

విశాఖ పోర్టులో భారీగా పట్టుబడిన డ్రగ్స్‌ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్నికల సమయం కూడా కావడంతో తెదేపా, బీజేపీ, వైసీపీలు పెద్ద ఎత్తున పరస్పర విమర్శలకు దిగు తున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డ్రగ్స్‌ వ్యవహారంతో రాజకీయ పార్టీల పేర్లు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ వ్యవహా రంలో కీలకంగా ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమలో సీబీఐ దాడులు జరిగాయి. కాకినాడలోని ఆ సంస్థ కార్యాలయంలో కూడా తనిఖీలు కొనసాగాయి. పట్టుబడిన సరకుకు ఉన్నతాధికారుల సమక్షంలో మరోసారి పరీక్షలు నిర్వహించడానికి సీబీఐ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

డ్రగ్స్‌ వెనుక ఎవరు…?

సంధ్య అక్వాలో సీబీఐ తనిఖీలు ఇంకా కొనసాగుతుండగానే ఈ రాకెట్‌ వెనుక ఉన్నదెవరు? అన్న అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్‌ పట్టుబడిన విషయం బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే సంధ్య ఆక్వాతో వైసీపీ నాయకత్వానికి ఉన్న సంబంధాలపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి లోకేష్‌లు ఆరోపణలు చేశారు. సంధ్య ఆక్వా యజమానులు వైసీపీ నాయకులుగా చలామణిలో ఉన్న విషయాన్ని దినపత్రికల్లో ఇచ్చిన ప్రకటనలను తెదేపా చూపించి విమర్శించింది.

ఆ తరువాత కాసేపటికే వైసీపీ కూడా ఇదేరకమైన ఆరోపణలు చేసింది. సంధ్య ఆక్వాకు చెందిన కోటయ్య చౌదరికి ఆ కేసులో నేతలకు సన్నిహిత సంబంధాలున్నాయని ఆ పార్టీ పేర్కొంది. సంధ్య అక్వా ఎండీ, ఎన్‌టిఆర్‌ కుటుంబ దూరపు బంధువు కావడంతో చంద్రబాబునాయుడి కుటుం బానికి కూడా సంబంధాలు ఉండటం వల్ల వారికి సంధ్య ఆక్వాతో సంబంధాలున్నాయని వైసీపీ అరోపించింది. ఈ మేరకు కొన్ని ఫోటోలను కూడా వైసీపీ తన పేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల్లో పెట్టింది. ఈ పరస్పర విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తెదేపా, వైసీపీ బృందాలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేసుకున్నారు.

విలువ ఎంత…?

విశాఖ పోర్టులో పట్టుబడిన 25 వేల కిలోల డ్రగ్స్‌ను కొకైన్‌గా సీబీఐ అధికారులు నిర్ధారణ చేసి, ఆ మేరకు రిపోర్టులో కూడా పొందుపరిచారు. దీని విలువను అధికారికంగా ప్రకటించలేదు. అయితే, సుమారుగా రూ.50 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ప్రస్తుతం విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ జెఎన్‌ బక్ష్మి అనే ముంబాయి సంస్థ అధీనంలో ఉంది. ఆ సంస్థకు, సంధ్య ఆక్వాకు మధ్య ఉన్న సంబంధాలేమిటో వెలుగులోకి రాలేదు. కంటైనర్‌ను స్కాన్‌చేసి లోపలి సరుకును నిర్ధా రించాల్సి ఉండగా, ప్రైవేటు వ్యక్తుల అధీనంలో ఉండటంలో అది సాధ్యం కావడం లేదని చెబు తున్నారు.

దేశంలో ప్రైవేటు పోర్టులు డ్రగ్స్‌కు అడ్డాలుగా మారుతున్నాయి. రెండు సంవత్సరాల క్రితం అదాని ముంద్రా పోర్టు నుండి 25 వేల కోట్ల రూపాయల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. విశాఖ పోర్టులో ఈ తరహా వ్యవహారాలు దేశ రక్షణకు హానికరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గంజాయి సరఫరా

ఇటీవలి కాలంలో సాగర మార్గంలో డ్రగ్స్‌ విశాఖకు రావడం ఇదే తొలిసారి. అయితే… ఇప్పటికే రోడ్డు, రైలు మార్గాల్లో వస్తున్న గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు విశాఖ నగరాన్ని చుట్టు ముట్టేశాయి. తరచూ తనిఖీల్లో బయటపడుతున్న గంజాయే దీనికి రుజువు. ఇటీవల దాదాపు 700 కిలోల వరకూ గంజాయి పోలీసులకు చిక్కడం గమనార్హం. భారీ కంటైనర్‌ లారీలో తీసుకువెళ్తున్న దాదాపు 386 కిలోల గంజాయి కొద్దిరోజుల క్రితం. బయటపడిరది. శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు తనిఖీ చేస్తుండగా తప్పించుకునేందుకు వేగంగా వచ్చిన లారీని వెంటాడి ఎట్టకేలకు ఆనందపురం వద్ద పట్టుకున్నారు హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో డ్రగ్స్‌ పట్టుకుంటే, దాని రవాణా మూలాలు విశాఖలో బయటపడుతుండటం విశేషం.

గోవా నుంచి దిగుమతి

ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పంట తగ్గినా… ఒడిశా నుంచి పెద్ద ఎత్తున నగరానికి దిగుమతి అవుతోందంటున్నారు. జాతీయ రహదారితో పాటు ఏజెన్సీ మార్గాల మీదుగా తెచ్చేస్తున్నారు. ప్రధానంగా కోల్‌కతా, కేరళ, హైదరాబాద్‌, ఢల్లీి, రాజస్థాన్‌, హరియాణా, బిహార్‌ వంటి ప్రాంతాలకు చెందిన వ్యాపారులు విశాఖకు వస్తున్నారని సమాచారం. గుట్టుగా ఇక్కడే ఉండి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి.. విశాఖ తెచ్చి.. తరువాత ఆయా ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. నియంత్రణకు నగర శివారులో చెక్‌ పోస్టులు ఏర్పాటుచేసినా.. వీటి అక్రమ రవాణా మాత్రం తగ్గుముఖం పట్టలేదు. ఇటీవల కాలంలో పెద్ద మొత్తంలో గంజాయి పోలీసులు తనిఖీల్లో లభిస్తున్నా కేవలం సమాచారం ఉన్నంత వరకే వీటిని స్వాధీనం చేసుకోగలుగు తున్నారు. సమాచారం అందని సరకు మాత్రం జిల్లా సరిహద్దులు దాటి వెళ్లిపోతోంది. గంజాయిని కొన్ని పార్సిళ్ల కేంద్రాల ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్న తీరు ఇటీవల బయటపడిరది. గోవా నుంచి రహస్యంగా డ్రగ్స్‌ తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తు న్నారు. సమాచారం అందిన మేరకు పోలీసులు ఆయా ముఠాలను పట్టుకుంటున్నారు. మత్తుకలిగించే ఇంజక్షన్ల విక్రయాలు కూడా నగరంలో జోరుగా సాగుతున్నాయి. ఒడిశా, కోల్‌కతాల నుంచి దిగుమతి చేసుకునియువతకు విక్రయిస్తున్నారు. బానిసలుగా మారిన వారే.. తర్వాత వ్యాపారులుగా మారి విక్రయిస్తున్నారు. యువతను మత్తులో ముంచి తమ స్వార్ధ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు డ్రగ్స్‌ను విచ్చలవిడిగా ప్రోత్స హించడాన్ని ప్రతి ఒక్కరూ ఖండిరచాలి.

– వల్లూరు జయప్రకాష్‌ నారాయణ, ఛైర్మన్‌,సెంట్రల్‌ లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ

About Author

By editor

Twitter
Instagram