– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

అరవై ఏళ్లపాటు ఆంధప్రదేశ్‌ను పాలించిన కాంగ్రెస్‌, ‌ప్రాంతీయ పార్టీలు అభివృద్ధిని మరచి ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డాయి. అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేయడం ద్వారా మిగతా ప్రాంతాలు వెనుకబడ్డాయి. ఇక రాజకీయ అధికారానికి అర్రులు చాచిన నేతలు వేర్పాటువాదాన్ని ప్రచారం చేసి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి రాష్ట్రాన్ని విడదీశారు. ఇప్పుడు మరల ఆదే కథ రాష్ట్రంలో ప్రారంభమైంది. దీనికి కేంద్ర బిందువు అధికార వైకాపా ప్రభుత్వమే. అధికార వికేంద్రీకరణ పేరుతో అమరావతి రాజధానిని కాదని, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటున్న వైకాపా ప్రభుత్వం ప్రజల మనసుల్లో విషబీజాలు నాటుతోంది. 40 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, ‌తెదేపా, వైకాపా ప్రభుత్వాలు అసలు రాష్ట్రాన్ని అభివృద్ధే చేయలేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వమే. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రాగానే రాష్ట్రానికి 24 గంటలు విద్యుత్‌ ‌సరఫరా చేశారు. విశాఖకు కొత్త రైల్వే జోన్‌ ‌ప్రకటించారు. ఉత్తరాంధ్ర జిల్లాల వేదిక అయిన విశాఖ కేంద్రంగా పలు అభివృద్ధి పనుల పూర్తి, కొన్నిటికి శంకుస్థాపనల నిమిత్తం మోదీ ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు. వడ్లపూడి వ్యాగన్‌ ‌వర్క్ ‌షాప్‌ ‌జాతికి అంకితం చేయనున్నారు. రూ.446 కోట్లతో విశాఖ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులకు, రూ.380 కోట్లతో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.26 వేల కోట్లతో హెచ్‌పీసీఎల్‌ ‌విస్తరణ పనులు ప్రారంభించనున్నారు. గంభీరంలో నిర్మించనున్న ఐఐఎం (వైజాగ్‌) ‌భవనానికి శ్రీకారం చుట్టనున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు (అరకు), విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లిలలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుందాం!

శ్రీకాకుళంలో భారత్‌ ‌మాల ఫేజ్‌-1 ‌కింద ఆనందపురం నుంచి రణస్థలం వరకు రూ.1467 కోట్లతో ఎన్‌హెచ్‌ 16 ‌రహదారికి 6 లైన్లు, రూ.1423 కోట్లతో రణస్థలం నుంచి నర్సన్నపేట వరకు ఎన్‌హెచ్‌-16 ‌రహదారికి 6 లైన్లు, ఎన్‌హెచ్‌-16 ‌రహదారి సామర్థ్యం పెంపుదల, నర్సన్నపేట నుండి ఇచ్ఛాపురం వరకు 562 కోట్ల రూపాయలతో ఎన్‌హెచ్‌-16 ‌రద్దీని తగ్గించడానికి, కనెక్టివిటీని మెరుగుపరచడానికి అభివృద్ధి పనులు చేపట్టారు. అమృత్‌ ‌పథకంలో భాగంగా రూ. 5.43 కోట్లతో 9292 తాగునీటి కుళాయి కనెక్షన్లు, 3 పార్కుల అభివృద్ధి పనులు చేపట్టారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్‌ ఓవర్‌ ‌బ్రిడ్జిలు, రోడ్‌ అం‌డర్‌ ‌బ్రిడ్జిలు రూ. 80 కోట్లకు పైగా అంచనా వ్యయంతో మంజూరు చేశారు. కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్‌ ‌యోజన (అర్బన్‌) ‌కింద 1,08,176 గృహాలు మంజూరయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నుండి 3,18,187 మంది రైతులు ఇప్పుడు పీఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌యోజన లబ్ధిదారులుగా ఉన్నారు. 2015-2019 నుండి జిల్లాలో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ ‌యోజన కింద 100 కిలోమీటర్ల కంటే నిడివి గల గ్రామీణ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి.

పార్వతీపురంలో

పార్వతీపురం మన్యం జిల్లాకు మంజూరైన గిరిజన విశ్వవిద్యాలయాన్ని సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటుచేశారు. భారత్‌ ‌మాల ఫేజ్‌-1 ‌కింద కొత్తగా ఆరు లైన్ల నేషనల్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌హైవే ఎన్‌హెచ్‌-130 ‌సీడీ రూ.3000 కోట్లతో అభివృద్ధి పరుస్తున్నారు. అలాగే జిల్లాలోని ఆలూరు, జక్కువ, కొర్లాం ప్రాంతాల మీదుగా రాయ్‌పూర్‌ ‌నుండి సబ్బవరం వరకు కలిపే రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.17 కోట్లతో గరుగుబిల్లి, సిగడాం, చీపురుపల్లి సెక్షన్లకు రోడ్డు అండర్‌ ‌బ్రిడ్జిలు మంజూరయ్యాయి.

అరకులో

పర్యాటక ప్రాంతంగా ప్రాధాన్యం ఉన్న అరుకు ప్రాంత అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది.  అందులో భాగంగా విశాఖపట్నం-అరుకు రైలుకు విస్తాడామ్‌ ‌కోచ్‌లను అనుసంధానం చేసింది. గిరిజన ప్రాంత స్వాతంత్య్ర సమరయోధుల సంస్మరణార్థం లంబ సింగిలో ఒక గిరిజన మ్యూజియం మంజూర య్యింది. కొత్తవలస-గోరఖ్‌పూర్‌ ‌రైల్వే లైనును 1414 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పరుస్తున్నారు. అలాగే కరకవలస-సిమిలిగూడ మధ్యలో రైల్వే లైన్‌లో అండర్‌ ‌బ్రిడ్జిలు, నిర్ణీత ఎత్తులోని సబ్‌ ‌వేలను 2.5 కోట్ల వ్యయంతో నిర్మించారు. ముఖ్యంగా పాడేరులో కొత్త వైద్య కళాశాల మంజూరైంది. ఈ కళాశాల ఏర్పాటుకు అయ్యే వ్యయంలో కేంద్ర ప్రభుత్వమే 60 శాతం వ్యయం భరిస్తుంది.

విజయనగరంలో

విజయనగరం పార్లమెంట్‌ ‌జిల్లా పరిధిలోని వివిధ రైల్వే స్టేషన్లలో 12 కోట్లరూపాయల వ్యయంతో ఫుట్‌ ఓవర్‌ ‌బ్రిడ్జిల నిర్మాణం జరిగింది. అలాగే 94 కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు రోడ్‌ ఓవర్‌ ‌బ్రిడ్జిల నిర్మాణం, 51.41 కోట్ల వ్యయంతో 18 రోడ్‌ అం‌డర్‌ ‌బ్రిడ్జిల నిర్మాణం జరిగింది. విజయనగరం-సంబల్‌పూర్‌ ‌మధ్య రూ.379 కోట్లతో చేపట్టిన 264 కిలోమీటర్ల రైల్వేలైన్‌ ‌డబ్లింగ్‌ ‌పనులు కొనసాగు తున్నాయి. అలాగే రూ.3883 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్తవలస-కొరాపుట్‌ ‌మధ్య 189 కిలో మీటర్ల రైల్వే లైన్‌ ‌డబ్లింగ్‌ ‌పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. కొత్తవలస-విజయనగరం మధ్య 34.7 కిలోమీటర్ల మేరకు 285 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన మూడో రైల్వే లైన్‌ ‌పనులు పూర్తయ్యాయి. అలాగే 2325 కోట్ల రూపాయల వ్యయంతో విజయనగరం-టీట్లాఘడ్‌ ‌మధ్య 264 కిలోమీటర్ల నిడివిలో మూడో రైల్వే లైన్‌ ‌నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన (అర్బన్‌) ‌కింద విజయనగరం జిల్లాకు 1,21,789 ఇళ్లు మంజూరయ్యాయి. ఈ జిల్లా నుంచి 2,59,316 మంది సోదరులు పీఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌యోజన కింద లబ్ధిని పొందుతున్నారు. 150 కిలోమీటర్లకు పైగా నిడివి గల గ్రామీణ రహదారులు ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ ‌యోజన కింద అభి వృద్ధికి నోచుకున్నాయి. అలాగే అటల్‌ ‌మిషన్‌ ‌ఫర్‌ ‌రిజువెనేషన్‌ అం‌డ్‌ అర్బన్‌ ‌ట్రాన్స్ఫర్మేషన్‌ (అమృత్‌) ‌పథకం కింద పట్టణ ప్రజానీకానికి 19,639 తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశారు.

అనకాపల్లిలో

అనకాపల్లి పార్లమెంట్‌ ‌జిల్లాను తీసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపులు పూర్తి చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇండి యన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌పెట్రోలియం అండ్‌ ఎనర్జీ సబ్బవరంలో ఏర్పాటవుతుంది. భారత్‌ ‌మాల ఫేజ్‌-1 ‌కింద రూ.2527 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అనకాపల్లి- పెందుర్తి-ఆనందపురం రహ దారి సెక్షన్లోని 6 లైన్ల రహదారి పనులు పూర్తిస్థా యిలో పురోగతిలో ఉన్నాయి. నర్సీపట్నం, చోడవరం మీదుగా 230 కి.మీ. చింతపల్లి-గండిగూడెం రహదారి అభివృద్ధిలో ఉంది. అనకాపల్లి, నర్సీపట్నం, నర్సింగపల్లి, గుల్లిపాడులో రూ.6.5 కోట్ల అంచనాతో ఫుట్‌ ఓవర్‌ ‌బ్రిడ్జిలు, రూ.77.08 కోట్లతో రోడ్‌ ఓవర్‌ ‌బ్రిడ్జిల (ఆర్‌ఓబీ) నిర్మాణం ఎలమంచిలి నర్సింగపల్లి, బయ్యవరం-అనకాపల్లిలో కొనసాగుతున్నాయి. దువ్వాడ-విజయవాడ మధ్య రూ.4483 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 335 కి.మీ. మూడో రైల్వే లైన్‌ ‌పనులు పురోగతిలో ఉన్నాయి.

విశాఖపట్నంలో

ప్రధానిగా నరేంద్ర మోదీ 2014లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విశాఖపట్నానికి కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ప్రాజెక్టులు కేటాయిం చింది. స్మార్ట్ ‌సిటీస్‌ ‌పోగ్రామ్‌కు ఎంపికైన మొదటి నగరం విశాఖపట్నం. స్మార్ట్ ‌సిటీ పథకం కింద ఈ నగరానికి కోట్లాది రూపాయలతో 62 ప్రాజెక్టులు కేటాయించారు. పిలిగ్రిమేజ్‌ ‌రీజునెవేషన్‌ అం‌డ్‌ ‌స్పిరిట్యువల్‌ ఆగ్‌మెంటేషన్‌ ‌డ్రైవ్‌ (‌ప్రసాద్‌) అనే కేంద్ర ప్రభుత్వ పథకం కింద సింహాచలం దేవాలయ అభివృద్ధికి రూ.53 కోట్లు కేటాయించారు. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ ఎస్‌) ‌కింద వెల్‌నెస్‌ ‌సెంటర్‌, 400 ‌పడకల ఈఎన్‌టీ ఆస్పత్రి, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), ‌మెడ్‌ ‌టెక్‌ ‌పార్క్, ‌సొసైటీ ఫర్‌ అప్లయిడ్‌ ‌మైక్రో ఎలక్ట్రానిక్స్ అం‌డ్‌ ఇం‌జినీరింగ్‌ ‌రీసెర్చ్ (‌సమీర్‌), ‌గంభీరం వద్ద ఎక్స్‌పోర్ట్ ఇన్‌స్పెక్షన్‌ ‌కౌన్సిల్‌ ‌టెస్టింగ్‌ ‌ల్యాబ్‌ (ఈఐసీ), హిందూస్థాన్‌ ‌పెట్రోలియం కార్పొరేషన్‌ (‌హెచ్‌పీసీఎల్‌) ‌రిఫైనరీ సామర్థ్య ఏడాదికి 15 మిలియన్‌ ‌టన్నులకు పెంపు, విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్‌ ‌కారిడార్‌లో భాగంగా ఈస్ట్ ‌కోస్ట్ ఎకనామిక్‌ ‌కారిడార్‌ ‌ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి శ్రీకారం, విశాఖపట్నం పోర్టు రోడ్డును నాలుగు లైన్లుగా అభివృద్ధి పరిచింది. అంతేకాదు, విశాఖ పట్నం విమానాశ్రయంలోని అంతర్జాతీయ, దేశీయ సరకు రవాణా టెర్మినల్‌ అభివృద్ధి, విశాఖపట్నం జిల్లా వడ్లపూడిలో ఓవర్‌ ‌హాలింగ్‌ ‌వర్క్ ‌షాప్‌, ‌డీజిల్‌, ఎలక్ట్రికల్‌ ‌లోకో షెడ్ల ఏర్పాటు, విశాఖపట్నం ఓడరేవు, నగరాన్ని మౌలిక వసతుల పరంగా అంతర్జాతీయ స్థాయిలో ఐఎస్‌ఆర్‌ ‌ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి, విశాఖపట్నం నుంచి ప్రత్యేక రైళ్లు, కాంకర్‌ ‌మల్టీ మోడల్‌ ‌లాజిస్టిక్‌ ‌పార్క్ (ఎంఎంఎల్‌పీ) వంటి అభివృద్ధి పనులకూ కేంద్రం నిధులు కేటాయించింది. దశాబ్దాల నాటి ఉత్తరాంధ్ర వాసుల కల, ప్రత్యేక రైల్వే జోన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెరవేర్చారు. విశాఖపట్నం రైల్వే జోన్‌ను ఈస్ట్ ‌కోస్ట్ ‌రైల్వే జోన్‌ ‌పేరుతో ఏర్పాటు చేశారు. విశాఖపట్నం నగరంలోని పేద ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన (అర్బన్‌) ‌కింద 58,000 ఇళ్ల నిర్మాణానికి 963 కోట్ల రూపాయలు మంజూరు చేశారు.

About Author

By editor

Twitter
Instagram