జాగృతి – సంపాదకీయం
శాలివాహన 1941 – శ్రీ వికారి ఆషాడ బహుళ అష్టమి – 13 జూలై 2020, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌
—————————————————————————————————————————————-

‌ఆపదల వేళ ఆదుకునే వారి కన్నా సలహాలిచ్చే వారే ఎక్కువగా ఎదురవడం లోక సహజం. ప్రపంచ ప్రజలందరి ఆరోగ్యానికి కరోనా ముప్పు వాటిల్లిన వేళ సలహాలు ఇచ్చే వారి ఉధృతి మరిత పెరిగింది. వైద్య ఆరోగ్య పరిశోధకులు, నిపుణుల నుండి చిట్కావైద్యుల దాకా అందరూ శక్తివంచన లేకుండా సలహాలు గుప్పిస్తున్నారు. కరోనా ప్రాణాతకం కావడంతో ఏ పుట్టలో ఏ పాముదో ఎవరి సలహాలో ఏ ప్రయోజనం దాగుందో అని జనం కూడా ప్రతి సలహానూ చెవులు రిక్కిచి వింటుంన్నారు. వినడం తప్పు కాదు. ‘వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్‌’ అని కూడా అన్నారు పెద్దలు.
కరోనా నివారణ గురించి ప్రస్తుతం వినవస్తున్న సలహాల్లో వైరస్‌ని జయించే ఔషధం ఇప్పటికి తమ వద్ద లేదని అలోపతి చేతులెత్తేసింది. సి.విటమిన్‌, ‌బి.కాప్లెక్సు వంటి రోగ నిరోధక ఔషధాలు సూచిచడం వరకే పరిమితమైంది. హోమియో వైద్యులు ఆర్సనిక్‌ ఆల్బ మందును సూచించినా కొందరు వ్యక్తులు, కొన్ని స్వచ్ఛద సంస్థలు, ప్రచారం చేయడమే గాని దానికి ప్రభుత్వాల నుండి మద్దతు కనిపిచం లేదు. కరోనాను ఎదుర్కోగల మరో మార్గం ఆరోగ్యవంతమైన జీవన సరళి మాత్రమే అని అందరూ అంగీకరిస్తున్నారు. పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం, తగినంత బలవర్థకమైన ఆహారాన్ని నియమబద్ధంగా తీసుకోవడం వంటివి జీవనసరళికి చెందినవి.
ఆహార విహారాల విషయంలో మనం ప్రకృతిలోని మిగతా జంతువుల నుండి చాలా దూరం జరిగి, రోగ నిరోధకశక్తిని కోల్పోయినట్లు వైద్య ఆరోగ్య శాస్త్రంలో ప్రకృతి వైద్య నిపుణులైన పరిశోధకుల నిర్ధారణ. భూమ్మీది జంతుజాలంలో కొన్ని ప్రకృతి వెలుగులో ఆహారం స్వీకరించి, రాత్రి విశ్రాంతి, మరికొన్ని చీకట్లో వేటాడి ఆహారం స్వీకరించి, పగలు విశ్రాంతి తీసుకొటున్నాయి. మనుషులు మాత్రమే ఆహార విహారాల విషయంలో రాత్రీ పగలూ తేడా లేకుడా ప్రవర్తిస్తున్నారు. రోగాలతో పాటు ప్రమాదవశాత్తు విరిగిన ఎముకల, గాయాల బాధలకు సైతం జంతువులు ఔషధాలు లేకుడా కేవలం ఉపవశిచి స్వశక్తితో స్వస్థత పొందుతుండగా ప్రతి చిన్న బాధకు, వ్యాధికి సైతం మనుషులు రోజులు, వారాల తరబడి ఔషధాలు స్వీకరించాల్సివస్తున్నది.
పలు రంగాల్లో అభివృద్ధి సాధించినట్లు గర్వపడుతున్న నేటి మానవ జాతి ఆరోగ్యం కోసం ఔషధాలపై ఆధారపడాల్సిన దుస్థితి రోజు రోజుకూ పెరిగి పోవడం విషాదం. ఈ పరిస్థితుల్లోనే ఔషధాల అవసరం లేని ఆరోగ్య పరిరక్షణ చిట్కాలు, విధానాల పట్ల ప్రపంచ వ్యాప్తగా ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. రోగ నిరోధకశక్తిని, ఆరోగ్య రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసే విటమిన్‌ ఎ, ‌సి, ఇ లు లభించే ఆహారం తీసుకోవడం ఉత్తమం అని అంతా గుర్తిస్తున్నారు. సి విటమిన్‌ ‌పుష్కలంగా లభించే చింత, మామిడి, ఉసిరికల నిల్వ పచ్చళ్లు, నిమ్మ, దబ్బ లాంటి పచ్చళ్లు తరచూ తినడం మంచిదని వైద్య ఆరోగ్య నిపుణులు కూడా సెలవిస్తున్నారు. ఆహార నియమంలో పాత చితకాయ పచ్చడి, మూఢనమ్మకం అని ఆధునికులు తోసి పారేసిన భారతీయుల అలవాట్లలోని ఉపవాసం అశం ఇప్పుడు ప్రముఖంగా ప్రచారంలోకి వస్తున్నది.
విరిగిన కాలును ఔషధం లేకుడా కేవలం ఉపవాసంతో కొద్ది రోజుల్లోనే నయం చేసుకున్న జర్మనీలోని ఓ డాక్టరు గారి పిల్లి, తెలుగింటి మంతెన రాజు గారి నెమలి అనుభవాలు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయి. ఎముకలు విరిగినప్పుడు పూర్తి విశ్రాంతితో మంచం దిగకుండా, ఆహారం మానకుండా, ఔషధ సేవనం సాగిస్తూ కూడా కోలుకోడానికి మనకు ఐదారు వారాలు పడుతున్న అనుభవాలు ఉపవాస శక్తిని బలపరుస్తున్నాయి. హిందువుల ఏకాదశి ఉపవాసాన్ని ఆరోగ్య శాస్త్రం రీత్యా ఆటోఫాగీ పేరిట ఆవిష్కరించి నోబెల్‌ ‌బహుమతి పొందిన జపాన్‌ ‌వైద్యుని పరిశోధన వివరాలు కూడా ప్రచారం పొందుతున్నాయి. ఉపవాసం మహిమ, దాని అవసరాన్ని ఇప్పుడు అంతా గుర్తిస్తున్నారు. రోగ చికిత్స, నివారణల్లో మన శరీరానికి గల సహజసిద్ధ శక్తి సామర్థ్యాలు వినియోగంలోకి రావడానికి ఉపవాసం తోడ్పడుతుందని ప్రకృతి వైద్య నిపుణులు, పరిశోధకులు వివరిస్తున్నారు. పూర్తి శిక్షణ పొంది విధులు నిర్వహిస్తున్న రక్షణ, పోలీసు వ్యవస్థల్లోని వారికి యుద్ధం లేకపోయినా అప్పుడప్పుడూ పునశ్చరణ చేయించడం మనందరికీ తెలుసు. మన దేహంలో కూడా అదే విధంగా వ్యాధి కారకాలకు వ్యతిరేకంగా పోరాట దళాలను ప్రేరేపించే ఆరోగ్య రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రాణశక్తికి అవకాశం కల్పిచాలని వైద్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. దేహ రక్షణ వ్యవస్థకు అవకాశం కల్పించేదుకు తాత్కాలికంగా ఔషధ వినియోగాన్ని నిలుపు చేయడం, రోజులో వీలున్నంత సమయం పొట్టకు విశ్రాంతినివ్వడం, రాత్రిపూట తినడం పూర్తిగా మానివేసి ప్రకృతిసిద్ధ జీవనం గడపటం మేలట! అదే నేటి ముఖ్య అవసరమట!

About Author

By editor

Twitter
YOUTUBE