సేవాభారతి – ఆంధప్రదేశ్‌

లాక్‌డౌన్‌ ‌కారణంగా ఇబ్బందులుపడుతున్న అన్నార్తులను ఆదుకోవడానికి ‘చేయిచేయి కలుపుదాం.. సేవ చేయ కదులుదాం’ అంటూ ఎందరో దాతల సహాయ, సహకారాలతో ఆంధప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో సేవాభారతి కార్యకర్తలు, సంఘ స్వయంసేవకులు పని చేస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ ప్రాంతాలల్లో ఆహార పంపిణీ, నిత్యావసర సరుకుల కిట్లు, కాయగూరలు, మాస్కులు నిరుపేదలకు అందించారు. విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, ఇతర సిబ్బందికి మజ్జిగ, అరటిపళ్లు, శానిటైజర్లు అందించారు. పారిశుధ్య కార్మికులను కోనసీమలో సుమారు వందమందిని, కాకినాడలో ఇరవై మందిని సన్మానించి నిత్యావసర కిట్లు అందజేశారు. కాకినాడ గంగనాపల్లిలో గల వేద పాఠశాల యాజమాన్యం ప్రతిరోజు వందమందికి ఆహార పొట్లాలు 18 రోజులు అందించారు. కోనసీమలో నల్లా చారిటబుల్‌ ‌ట్రస్ట్ ‌సహకారంతో సుమారు 1500 మందికి నిత్యావసరాల కిట్లు అందచేశారు. అలాగే ప్రతిరోజు కోనసీమలో 250 మందికి కాకినాడలో 200మందికి ఆహార వితరణ కొనసాగుతోంది.

ఆదోని సేవాభారతి అధ్వర్యంలో ఏప్రిల్‌ 11‌న పైకొట్టాలులో ఉంటున్న 85 కుటుంబా లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దిబ్బనకల్లులో ఉంటున్న గర్భిణికి నవీన్‌ ‌కుమార్‌, ‌హాలర్వికి గ్రామానికి చెందిన గర్భిణికి మధు అనే సేవాభారతి కార్యకర్తలు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త దానం చేశారు. ఆదోనిలో మూడు స్థలాలలో 183 రేషన్‌ ‌కిట్స్ ‌వలస కార్మికులకు అందజేశారు. 90 భోజన పాకెట్లను, మాస్కులను విధినిర్వహణలో ఉన్న 6 వేల మంది ప్రభుత్వ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు అందించారు.

సేవాభారతి కార్యకర్తలు కూరగాయల మార్కెట్‌ ‌వద్ద ప్రతి ఒక్కరు మాస్కులు ధరించే విధంగా అవగాహన కల్పించారు. బ్యాంక్‌ల వద్ద భౌతిక దూరం పాటించే విధంగా, అలాగే కొంతమందికి అకౌంట్‌ ‌స్లీప్‌లను రాసి ఇచ్చారు. చాలామంది అయితే మీకు జీతం ఎంత, రోజుకా లేక నేలకా అని అడిగారు. మరికొంత మంది రాసినందుకు డబ్బులు ఇవ్వడానికి వచ్చారు. ట్రాఫిక్‌ ‌పోలీసులకు చెదోడు వాదోడుగా వారితో కలిసి పననిచేశారు. చెక్‌ ‌పోస్ట్‌ల వద్ద కూడా ప్రభుత్వ అధికారులకు సహాయం చేశారు.

ప్రతీరోజు ఉదయం, సాయంత్రం సమయానికి పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు ‘టీ’ ఇచ్చారు. ఒక ఉద్యోగి ‘అయ్యా! మీరు ఎవరో నాకు తేలియదు కానీ రోజు ఉదయం సరియైన సమయానికి టీ అందిస్తున్నారు.. మీకు ధన్యవాదాలు అండీ’ అన్నారు. ‘ఇంకో విషయం మా ఇంట్లో నా భార్య కూడా అంత కరెక్ట్‌గా నాకు ‘టీ’ ఇవ్వదు కాని మీరు మాత్రం నాకు రోజు సమయానికి అందిస్తున్నారు. మిమ్మల్ని ఈ జన్మలో మరిచిపోలేను’ అన్నారు.

మరొకరు ‘రోజు మాకు ‘టీ’ ఇస్తున్నావు. ఒక్క రోజు కూడా డబ్బులు తీసుకోవడం’ లేదు అని జేబులో డబ్బులు పెట్టబోయారు. ‘కనీసం మీ పెట్రోల్‌ ‌ఖర్చులకు అయినా తీసుకోండి’ అన్నారు. కానీ కార్యకర్తలు వాటిని తీసుకొవడానికి నిరాకరించారు.

అమలాపురం :

ఈదరపల్లి జనహిత కార్యాలయం వద్ద సేవాభారతి ఆధ్వర్యంలో సక్షమ్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ శ్రీ‌మన్నారాయణ చేతుల మీదుగా బియ్యం, కందిపప్పు తదితర నిత్యావసర వస్తువులు, కూరగాయలతో కూడిన కిట్లను సుమారు 80మందికి పంపిణీ చేసారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా నిర్మూలనకు సామాజిక దూరమే మేలని చెబుతూ అవగాహన కల్పించారు.

గుంటూరు

గుంటూరు రూరల్‌ ‌జిల్లా దాసరిపాలెం గ్రామంలో సేవాభారతి, సేవ్‌ ‌టెంపుల్స్ ఆధ్వర్యంలో ప్రతిరోజు 200 మందికి మధ్యాహ్నం, చుట్టుపక్కల పరిశ్రమలలో పని చేస్తున్నటువంటి కార్మికులు, ఇతర రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుండి పని కోసం వచ్చి అక్కడే స్థిరపడి వారికి రెండు పూటలా భోజనం అందిస్తున్నారు. మొదట్లో భోజనం వండి పెట్టడానికి ప్రభుత్వం కొన్ని అడ్డంకులు పెట్టిన ప్పటికీ తరువాత సేవాభారతి నుండి లెటర్‌ ‌పంపిన కారణంగా ఈ పని నిరభ్యంతరంగా కొనసాగుతుంది. ఇలాగే చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో నివసించే పేద ప్రజలకు ఇతర రాష్ట్రాల నుంచి కూలి పనుల కోసం వచ్చి గుంటూరు స్పిన్నింగ్‌ ‌మిల్‌లో పని చేస్తున్నటు వంటి ఓబుల్‌నాయుడుపాలెం గ్రామ కార్మికుల కోసం 120 మందికి రేషన్‌, ‌నిత్యావసర సరుకు లను సేవాభారతి కార్యకర్తలు అందచేశారు.

గుంటూరులో ప్రతిరోజు 1400 మందికి భోజనం ప్యాకెట్స్ , ‌ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న రోగుల కోసం, షెల్టర్‌ ‌హోమ్‌ ‌సెంటర్స్‌లో ఉన్నవారికి సాయంత్రం 1400 భోజన ప్యాకెట్లను సంపత్‌నగర్‌లో తయారు చేయించి కార్యకర్తలు అందిస్తున్నారు. దీనితోపాటుగా గుంటూరులో పోలిశెట్టి వారి సహకారంతో 1500 మందికి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కార్మికులకు రేషన్‌ ‌నిత్యావసర సరుకులు ఇచ్చారు. గుంటూరులో ఇమ్యూనిటీ పెంచటం కోసం 10 వేలకు పైగా హోమియో మెడిసిన్‌ (ఆర్సనిక్‌ ఆల్బమ్‌ ‌పిల్లస్) ‌పంపిణీ చేశారు.

చిన్న పనులు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్న పేదవారిని సేవాభారతి కార్యకర్తలు గుర్తించి వారికి ఆర్థికంగానూ, నిత్యావసర సరకులను అందచేసారు. స్వయంసేవక్‌ ఇళ్లలో 5000 మాస్కులు తయారు చేయించి పంచారు. గుంటూరు పట్టణం చుట్టుపక్కల గ్రామాలలో జరుగుతున్న అభ్యాసికల కుటుంబాలకు 150 నిత్యావసర కిట్స్‌లు అందచేసారు.

ప్రకాశం జిల్లా

మార్కపురంలో పేద చెంచు గ్రామాల ప్రజలకు, దోర్నాల వద్ద ఉన్న చెట్టు తాండా, బి.ఎమ్‌.‌సి.కాలనీ, నందిగంగు గూడెం, బందంభావి, చర్లపల్లి గ్రామాలలో 200 మందికి అవసరమైన సరుకులు పంపిణీ చేశారు.

మార్కాపురం పాండురంగస్వామి దేవస్థానం కమిటీ, బీజేపీ కార్యకర్తల సహకారంతో గత 46 రోజులుగా ప్రతి రోజు 300 మంది వైద్య సిబ్బందికి, ప్రభుత్వాసుపత్రిలో ఉన్న రోగులకు భోజనాలు సరఫరా చేశారు. 500 ప్యాకెట్లు పచ్చడి తయారు చేయించి తాండలలో ఉండే గిరిజనులకు ఐటిడిఎ ద్వారా పంచడం జరిగింది. సుమారు 500 మాస్కులు పంచారు.

శ్రీకాకుళం, విజయనగరం :

సేవాభారతి ఆధ్వర్యంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో 65 స్థానాలలో 385 మంది సేవాభారతి కార్యకర్తలు, సంఘ స్వయం సేవకులు పాల్గొన్నారు.

లాక్‌డౌన్‌ ‌ప్రారంభమైన రోజు నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు 450 మంది ఆసుపత్రి సిబ్బందికి, రోగులకు  భోజనం అందిస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ నిరంతరంగా ఈ కార్యక్రమం జరుగు తుంది. శ్రీకాకుళం జిల్లాలో క్వారంటైన్‌లో ఉన్న ఒరిస్సా మత్స్యకారులు 50 మందికి లుంగీలు, టవల్స్, ‌సేవింగ్‌ ‌కిట్స్ అం‌దించారు. విజయ నగరం జిల్లాలో ఉన్న మూడు మత్స్యకార గ్రామాల్లో 50 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

విజయనగరం జిల్లాలో సాలూరు మండలంతో పాటు దగ్గరలో ఉన్న మూడు మండలాలలోని 14 గ్రామాలలో రెండువందల మందికి 15 రోజుల పాటు భోజనం వండి పెట్టారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ, వీరఘట్టం మండలాల్లో 11 గ్రామాలలో తొంభై మందికి నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేశారు. వంద మందికి 12 రోజుల పాటు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో అందాల వలస మండలంలో రెండు వందల ఆహార పొట్లాలు మూడు గ్రామాలలో 15 రోజుల పాటు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు గ్రామాలలో 300 మందికి బట్టలు నిత్యావసర వస్తువులు ఇచ్చి సన్మానించారు. శ్రీకాకుళం జిల్లా తావేరు మండలంలో వంద మందికి ఇరవై రోజుల పాటు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.

ఇచ్చాపురం సోంపేట మండలాల్లో 15 గ్రామాలలో పేదవారికి నిత్యావసర వస్తువులు ఆరువందల కుటుంబాలకు పంపిణీ చేశారు. శ్రీకాకుళం విజయనగరం 16వేల తులసి మొక్కలను పంపిణీ చేశారు. గజపతినగరం మండలంలో ఇరవై రోజులపాటు వంద మందికి ఆహార పొట్లాలు పంపిణి చేశారు. ఈ విధంగా సేవాభారతి కార్యక్రమంలో సంఘ స్వయం సేవకులు ఉద్యమ స్ఫూర్తితో శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో నిరంతరం కృషి చేస్తూ పేదవారికి పారిశుద్ధ్య కార్మికులకు మత్స్య కారులకు వలస కార్మికులకు చేదోడువాదోడుగా ఉంటూ వారిని ఆదుకుంటూ కరోనా మహమ్మారితో పోరాటం చేస్తూ వారిని అక్కున చేర్చుకున్నారు.

విజయవాడ :

విజయవాడలో లాక్‌డౌన్‌ ‌మొదలయినప్పటి నుండి సేవభారతి ద్వారా వలస కూలీలకు, నిమ్న ఆదాయవర్గాల వారికి, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, నిరాశ్రితులు, యాచకులకు నూతన వస్త్రాల కిట్‌ (‌లుంగీ, బనియన్‌, ‌తువ్వాల), ఒంటరి జీవితం గడిపేవారి కొరకు భోజనం ప్యాకెట్లు, పోలీసు వారికి, పారిశుధ్య పని వారికి శానిటైర్‌లు, మాస్కులు గత 45 రోజులుగా ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో సేవాభారతికి సిధార్ధ ఫౌండేషన్‌, ‌పవర్‌ ‌గ్రిడ్‌ ‌కార్పొరేషన్‌ ‌సంస్థలు తమ వంతు సహాయ సహకారాలు అందజేశారు.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram