Author: editor

ఎర్ర పెన్ను మళ్లీ విషం కక్కింది!?

మార్కస్‌ను చంపి పుట్టిన మహామేధావులూ… మావో రక్తాన్ని తమ పెన్ను గన్నుల్లో నింపుకొన్న కవులూ.. అబ్రం లింకన్‌ను దిగమ్రింగి ఉద్భవించిన ప్రజాస్వామ్యవాదులూ.. పార్టీ పంచనజేరి సంపాదనకు మరిగిన…

సాలెగూడు

– జాగృతి డెస్క్ గోరక్షణ పేరుతో కొంతమంది, ఒక సమయంలో అజ్ఞానంతో వ్యవహరించారు. కొందరిని చంపారు. ఇది హేయమైన చర్య. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ…

కరోనా కల్లోలంలోనూ చైనా కుత్సిత రాజకీయాలు

– డా।। రామహరిత చైనా కరోనా వైరస్‌ ‌వల్ల ప్రపంచమంతా యుద్ధం వంటి సంక్షోభంలో కూరుకుపోయింది. ఆయుధరహిత యుద్ధంగా విశ్లేషకులు చెప్తున్న ఈ మహమ్మారి పంపిణీ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసింది. ఎంతో మానవ, ఆర్థిక నష్టాన్ని తెచ్చింది. ఈ ప్రమాదకర వైరస్‌ను అదుపుచేయడంలో పూర్తిగా విఫలమైన చైనా అధికారిక సమాచార ఏజెన్సీల ద్వారా తన తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంతోపాటు దౌత్య మార్గంలో ప్రపంచ శక్తిగా మరోసారి గుర్తింపు సాధించాలనుకుంది. చైనా తెచ్చిన ఈ ఆయుధరహిత యుద్ధం ఆ దేశపు విస్తరణవాద విధానం వంటిదే. గుట్టుచప్పుడు కాకుండా భూభాగాలను ఆక్రమించడం, ఆర్థిక వ్యవస్థలను చేజిక్కించుకోవడం వంటి విధానాన్ని చైనా ఎప్పుడు అనుసరిస్తూనే ఉంది. ప్రపంచం దృష్టి తన చర్యలపై పడకుండా ఉండటానికి ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవడం కూడా చైనాకు వెన్నతోపెట్టిన విద్య. తమ పౌరులకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేయడం కోసం ప్రత్యేక సామాజిక మాధ్యమ ప్లాట్‌ ‌ఫామ్‌లు రూపొందించుకోవడం, ప్రత్యేక సెర్చ్ ఇం‌జన్లు వాడుకలోకి తేవడం చైనాకు అలవాటు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ‘చైనా అనుకూల వాతావరణం’ రూపొందించడం కోసం వివిధ దేశాల్లో తమ రాయబార కార్యాలయాల ద్వారాట్విట్టర్‌ ఉద్యమం నడుపుతుంది. ఇప్పుడిప్పుడే ప్రపంచం చైనా చేస్తున్న ఈ గారడీలను తెలుసుకుంటోంది. అయినా చైనా తన ధోరణి మాత్రం మార్చుకోవడం లేదు. చైనా తమ అనుకూల మేధావి వర్గాన్ని ఎలా తయారుచేసుకుంటోంది, వారి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తమ అనుకూల ప్రచారం ఎలా చేసుకుంటోందన్నది విశ్లేషకులకు ఆసక్తికరమైన అధ్యయన విషయం అయింది. ప్రపంచమంతా చైనా కరోనా వైరస్‌తో సతమతమవుతుంటే చైనా నిరంకుశ ప్రభుత్వం తాము వైరస్‌పై ఎలా విజయం సాధించినదీ, ఎలా ప్రజలపై ఆంక్షలు ఎత్తివేసినది పత్రికల ద్వారా ప్రచారం ప్రారంభించింది.…

Twitter
Instagram