1947: దేశ విభజన, శరణార్థుల సంక్షోభం
దేశ విభజన సందర్భంగా పంజాబ్, బెంగాల్‌లలో తలెత్తిన హింసకు సర్వం కోల్పోయిన శరణార్థులకు సహాయక శిబిరాలను స్వయంసేవకులు ఏర్పాటు చేశారు. వారికి రక్షణ కల్పించడంతోబాటు ఆహారం, వస్త్రాలు, వైద్య సాయం అందించారు. ఆరఎసఎస్ రికార్డుల ప్రకారం వేలాదిగా సహాయక శిబిరాలను నిర్వహించారు.
1947-48: కశ్మీర్ విలీనం
అక్టోబర్, 1947లో ఆరఎసఎస్ సర్‌సంఘచాలక్ ఎం.ఎస్.గోల్వాల్కర్ మహారాజా హరిసింగ్‌ను కలిసి, కశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేయాలని కోరారు. ఆ తర్వాత జరిగిన సంఘర్షణ సమయంలో సహాయక కార్యకలాపాలలో స్వయంసేవకులు పాల్గొన్నారు.
1950: అస్సాంలో భూకంపం, వరదలు
అస్సాంలో సంభవించిన వినాశకరమైన భూకంపం వరదల సమయంలో, బాధితులకు సహాయక చర్యలను స్వయంసేవకులు చేపట్టారు.
1950: తూర్పు పాకిస్థాన్ నుంచి శరణార్థులు
భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు పాకిస్థాన్ నుండి వస్తున్న హిందూ శరణార్థులకు సహాయ సహకారాలు అందించేందుకు ‘వాస్తుహార సహాయతా సమితి’ని ఆరఎసఎస్ ఏర్పాటు చేసింది.
1962: భారత్-చైనా యుద్ధం
చైనా దురాక్రమణ సమయంలో, దానిని అడ్డుకోవడంలో భారత ప్రభుత్వానికి సంస్థాగత మద్దతును ఆరఎసఎస్ అందించింది. అదే కాలంలో పౌర సహాయక కార్యక్రమాలలో స్వయంసేవకుల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగింది.
1965: భారత్-పాకిస్థాన్ యుద్ధం
అఖిలపక్ష సమావేశానికి ఆరఎసఎస్ సర్‌సంఘచాలక్ ఎంఎస్ గోల్వాల్కర్‌ను ప్రధానమంత్రి లాల్‌బహదూర్ శాస్త్రి ఆహ్వానించారు. సమావేశంలో ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని గురూజీ హామీ ఇచ్చారు. 22 రోజుల పాటు ఢిల్లీలో ట్రాఫిక్ నిర్వహణలో స్వయంసేవకులు సాయపడ్డారు. రక్తదాన కార్యక్రమాలను చేపట్టారు.
1971: భారత్-పాక్ యుద్ధం, బాంగ్లాదేశ్ శరణార్థుల సంక్షోభం
యుద్ధం, పెద్ద ఎత్తున శరణార్థుల రాకతో ఏర్పడిన సంక్షోభ సమయంలో, సామాజిక, సహాయక కార్యక్రమాలలో ఆరఎసఎస్, సంఘ పరివార్‌కు అనుబంధంగా ఉన్న సంస్థలు పాల్గొన్నాయి.
1975-77: అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)
అత్యవసర పరిస్థితి కారణంగా ఆరఎసఎస్ నిషేధానికి గురైంది. వేలాది మంది స్వయంసేవకులు, అగ్ర నాయకులు జైలు పాలయ్యారు. మరికొందరు నిరసన ఉద్యమంలో భాగంగా రహస్యంగా (అండర్‌గ్రౌండ్‌లో) పనిచేశారు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా సాగిన ‘లోక్ సంఘర్ష్ సమితి’ ప్రచారంతో ఆరఎసఎస్‌కు ముడిపడింది.
1977: ఆంధ్రప్రదేశ్‌లో తుపాను
ఆంధ్రప్రదేశ్ దివి సీమలో వినాశకరమైన తుపాను తర్వాత స్వయంసేవకులు సహాయక చర్యలలో పాల్గొన్నారు. బాధిత కుటుంబాలకు పెద్ద మొత్తంలో దుస్తులు, గృహోపకరణాలను పంపిణీ చేశారు.
1984: సిక్కు వ్యతిరేక అల్లర్లు
వందలాది సిక్కు కుటుంబాలకు స్వయంసేవకులు తమ ఇళ్లలో రక్షణ కల్పించారు. అదే సమయంలో ఢిల్లీ, ఇతర ప్రభావిత ప్రాంతాలలో సహాయక శిబిరాలు, సహాయక కార్యక్రమాలు చేపట్టారు.
1990: కశ్మీరి హిందువుల వలస
కశ్మీరీ హిందువుల సామూహిక వలసల తర్వాత, జమ్మూ ఇతర ప్రాంతాలలో స్వయంసేవకులు ఏకమయ్యారు. సహాయక శిబిరాలు, సహాయక వ్యవస్థలు, జమ్మూ కశ్మీర్ సహాయతా సమితిని ఏర్పాటు చేయడంలో సాయపడ్డారు.
1996: చర్ఖీ దాద్రి విమాన ప్రమాదం
భారతదేశపు అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఒకటైన చర్ఖీ దాద్రి ఘటన తర్వాత, తక్షణ సహాయక చర్యలలో స్వయంసేవకులు పాల్గొన్నారు.
1999: ఒడిశాలో సూపర్ తుపాను
వినాశకరమైన ఒడిశా సూపర్ తుపాను తర్వాత, సహాయక, పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాలలో ఆరఎసఎస్, దాని ప్రేరణతో పనిచేసే సంస్థలు విస్తృతంగా పాల్గొన్నాయి.
2001: గుజరాత్‌లో భూకంపం
భుజ్ భూకంపం తర్వాత, సహాయక చర్యలు, సహాయక శిబిరాలు, ఆహార పంపిణీ, దీర్ఘకాలిక పునరావాస పనులలో స్వయంసేవకులు, సంఘ ప్రేరణతో పనిచేసే సంస్థలు పాలుపంచుకున్నాయి.
2004: సునామీ విలయం
అండమాన్, నికోబార్‌లలో భారత సైన్యం, అధికార యంత్రాంగం చేపట్టిన భారీ సహాయక చర్యలతో పాటు, సునామీ ప్రభావిత ప్రాంతాలలో సహాయక పునరావాస కార్యక్రమాలలో ఆరఎసఎస్ ప్రేరణతో పనిచేసే సంస్థలు, స్వయంసేవకులు పాల్గొన్నారు.
2013: ఉత్తరాఖండ్‌లో విపత్తు
సహాయక చర్యలలో ఆరఎసఎస్, సేవాభారతి కార్యకర్తలు పాల్గొన్నారు; చిక్కుకుపోయిన యాత్రికులకు, ప్రభావిత కుటుంబాలకు ఆహారం, ఆశ్రయం, పునరావాసం కల్పించడంలో సాయపడ్డారు.
2014: జమ్మూ, కశ్మీర్‌లో వరదలు
సెప్టెంబర్, 2014లో వచ్చిన భారీ వరదలు జమ్మూకశ్మీర్‌లోని అనేక ప్రాంతాలను ముంచెత్తాయి, దీనివల్ల వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకుపోయారు. స్వయంసేవకులు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితులకు ఆహారం, మందులు, ఇతర సాయాన్ని అందించారు.
2019: ఒడిశాలో ఫని తుపాను
మే, 2019లో అత్యంత తీవ్రమైన ‘ఫని’ తుఫాను ఒడిశాపై విరుచుకుపడినప్పుడు, ఆరఎసఎస్ స్వయంసేవకులు, దాని ప్రేరణతో పనిచేసే సేవా సంస్థలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యలు ,పునరావాస పనులలో పాల్గొన్నాయి. ఈ చర్యల్లో ఆహారం, నిత్యావసరాల పంపిణీతో పాటు, తీరప్రాంత ఒడిశాలో భారీ విధ్వంసానికి గురైన ప్రజలకు సహాయం అందించడం వంటివి ఉన్నాయి.
2020-21: కోవిడ్-19 మహమ్మారి
దేశవ్యాప్త లాక్‌డౌన్, కోవిడ్ తదుపరి దశల సమయంలో, ఆహార పంపిణీ, వలస కార్మికులకు సాయం, మాస్కుల పంపిణీ, వైద్య సాయం, సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఆరఎసఎస్, దాని ప్రేరణతో పనిచేసే సంస్థలు స్వయంసేవకులను సమీకరించాయి.
2024: వయనాడ్‌లో విపత్తు
జూలై 30, 2024న కేరళం, వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన తర్వాత, ప్రభావిత గ్రామాలలో సహాయక చర్యలు, తదుపరి పునరావాస కార్యక్రమాలలో స్వయంసేవకులు పాల్గొన్నారు.
2025: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం
జూన్ 12, 2025న అహ్మదాబాద్‌లోని బి.జె. మెడికల్ కాలేజీ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం (AI171) కూలిపోయినప్పుడు, ప్రమాద స్థలంలో సహాయక చర్యలలో స్వయంసేవకులు పాలుపంచుకున్నారు.
2025: పంజాబ్‌లో వరదలు
వరద ప్రభావిత గ్రామాలలో ఆహారం, మందులు, ఇతర అత్యవసర సహాయాన్ని అందించడం సహా విస్తృతమైన సేవా కార్యక్రమాలను ఆరఎసఎస్ పంజాబ్, సేవా భారతి స్వచ్ఛంద కార్యకర్తలు చేపట్టారు.
2025: హిమాచల్‌ప్రదేశ్‌లో విపత్తు
తీవ్రమైన వరదలు, అకాల భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులను హిమాచల్‌ప్రదేశ్ ఎదుర్కొంటున్న తరుణంలో, హిమాలయ ప్రాంతంలోని ఆయా ప్రాంతాలలో చేపట్టిన సహాయక కార్యక్రమాల్లో సంఘ్, అనుబంధ సంస్థలు కూడా పాల్గొన్నాయి.
2026: అసోంలో వరదలు
వరదల సమయంలో, ఆరఎసఎస్, దాని ప్రేరణతో పనిచేసే రాష్ట్రీయ సేవా భారతి, భారతీయ కిసాన్ సంఘ్, నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆరోగ్య భారతి వంటివి సహాయక, పునరావాస కార్యక్రమాలలో పాల్గొన్నాయి. సహాయక చర్యలు, ఆహార పంపిణీ, వైద్య శిబిరాల ద్వారా వరద బాధితులైన 40,000కు పైగా కుటుంబాలకు దాదాపు 2,000 మంది స్వయంసేవకులు అండగా నిలిచారు.