సింహంభట్ల సుబ్బారావు, 6300674054
మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి ఉంటుంది. అనుకోని సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మీ సేవలు విస్తృతమవుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. జీవితాశయం నెరవేరుతుంది. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వివాహ యత్నాలు ముమ్మరం చేస్తారు. తరచూ దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు కీలక మార్పులు పొందుతారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలు ఇబ్బందుల నుండి బయటపడతారు. వైద్యులు, క్రీడాకారులకు శుభవార్తా శ్రవణం. 6,7 తేదీల్లో దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అంగారక స్తోత్రాలు పఠించండి.
వృషభం: కృత్తిక, 2,3,4 పాదాలు రోహిణి, మృగశిర 1,2 పాదాలు
చేపట్టిన కార్యక్రమాలు•నిదానంగా సాగుతాయి. ఆదాయ వనరులు సంతృప్తినిస్తాయి. కొన్ని సమస్యల నుంచి ఎట్టకేలకు బయటపడతారు. సేవాకార్యక్రమాలలో మీరూ భాగస్వాములవుతారు. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు దక్కవచ్చు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. కొత్త భాగస్వాములు మీతో కలుస్తారు. ఉద్యోగవర్గాలకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రచయితలు, వైద్యులకు మరింత సానుకూలమైన సమయం.8.9 తేదీల్లో వృథా ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆంజనేయస్వామి అర్చనలు మంచిది.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ముఖ్య కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా తప్పకపోవచ్చు. స్నేహితులతో అకారణంగా వివాదాలు. శారీరక రుగ్మతలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం కోసం మరింత శ్రమిస్తారు. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆప్తులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. భూములు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనల్లో మార్పులు. కళాకారులు, క్రీడాకారులకు ఒత్తిడులు.7,8 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. దత్తస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ ఆశయాలు కొన్ని నెరవేరతాయి. గతంలో నిలిచిపోయిన కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగయత్నాలలో పురోగతి సాధిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులు పెట్టుబడులకు తగినంతగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కొద్దిపాటి ఇంక్రిమెంట్లు ఉత్సాహాన్నిస్తాయి. రాజకీయవేత్తలు పదవుల అన్వేషణలో సఫలం చెందుతారు. రచయితలు, క్రీడాకారులకు ఆహ్వానాలు రాగలవు. 10,11తేదీల్లో అనుకోని ప్రయాణాలు. బంధువిరోధాలు. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆదాయం ఆశించినమేర ఉండి అవసరాలు తీరతాయి. ముఖ్య నిర్ణయాలలో ఆలస్యం చేయరు. ఆలోచనలు స్థిరమైనవిగా ఉంటాయి. శారీరక రుగ్మతలు కొంత తగ్గుతాయి. సోదరులు, స్నేహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. దూరప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి. స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో కొంత సఫలం. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు సంభవం. కళాకారులు ఊహించని అవకాశాలు దక్కించుకుంటారు. రచయితలు, వ్యవసాయదారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. 6,7 తేదీల్లో చర్చల్లో ప్రతిష్ఠంభన, ఆప్తులతో విభేదాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు
ఆదాయ, వ్యయాలు సమానంగా ఉంటాయి. ముఖ్య కార్యక్రమాలు సవ్యంగా పూర్తి కాగల సమయం. ఇంటాబయటా ఎదురులేని పరిస్థితి. సన్నిహితులు, సోదరులతో విభేదాలు తొలగుతాయి. చాకచక్యంగా శత్రువులను సైతం స్నేహితులుగా మార్చుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఇంటి నిర్మాణాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వ్యాపారులు క్రమేపీ లాభాల బాట పడతారు. ఉద్యోగులకు హోదాలు అనుకోని విధంగా దక్కవచ్చు. రాజకీయవేత్తలు సత్తా చాటుకునే సమయం. కళాకారులు, వైద్యులకు ఒత్తిడులు తొలగుతాయి. 7,8 తేదీల్లో ఆరోగ్యసమస్యలు. శ్రమ తప్పదు. శివాష్టకం పఠించండి.
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్నిస్తాయి. వేడుకలకు హాజరవుతారు. పాతబాకీలు వసూలు చేసి అవసరాలు తీర్చుకుంటారు. పెండింగ్లో పడిన కార్యక్రమాలు సైతం పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబసభ్యులను సంప్రదిస్తారు. దైవ కార్యక్రమాలు చేపడతారు. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కొంత అనుకూలస్థితి. పారిశ్రామికవేత్తలకు పురస్కారాలు. కళాకారులు, వైద్యులకు సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది. 9,10 తేదీలలో దుబారా ఖర్చులు. స్వల్ప అస్వస్థత. గణేశాష్టకం పఠించండి.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ
వీరికి క్రమేపీ మరింత అనుకూల సమయం. ఇష్టమైన వ్యక్తులు దగ్గరవుతారు. సోదరులు, సోదరీల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. గృహ నిర్మాణాలు లేదా కొనుగోలులో స్వల్ప అవాంతరాలు. వ్యాపారులు అనుకున్న లాభాల వైపు సాగుతారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు వచ్చే వీలుంది. రాజకీయవేత్తలు మరింత ప్రజాదరణ పొందుతారు. క్రీడాకారులు, పరిశోధకులకు పట్టింది బంగారమే. 5,6 తేదీల్లో కుటుంబంలో ఒత్తిడులు. మానసిక అశాంతి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
రావలసిన సొమ్ము కొంత అంది అవసరాలు తీరతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో మీకంటూ ప్రత్యేక గౌరవం పొందుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ప్రత్యర్థులు స్నేహితులుగా మారి చేయూతనందిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. వ్యాపారులు తమ అనుభవాలతో విస్తరణ యత్నాలు పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలు అనూహ్యమైన విజయాలు సాధిస్తారు. కళాకారులు, రచయితలకు శుభవార్తలు. 6,7 తేదీల్లో స్వల్ప రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
ఆదాయం కంటే ఖర్చులు పెరిగినా తట్టుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. శ్రేయోభిలాషుల శుభవార్తలు అందుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు సకాలంలో తీసుకుని కుటుంబసభ్యులను ఆకట్టుకుంటారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు స్వల్ప లాభాలు అందే అవకాశాలు. ఉద్యోగులకు ఎట్టకేలకు సమస్యలు తీరతాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. కళాకారులు, క్రీడాకారులకు అవకాశాలు ఊహించని రీతిలో లభిస్తాయి. 9,10 తేదీలలో లేనిపోని ఖర్చులు. మనశ్శాంతి లోపిస్తుంది. సూర్యారాధన మంచిది.
కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
కొన్ని కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. రావలసిన బాకీలు కొంతమేర అందే సూచనలు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాల నుంచి ఊరట లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభాలు ఉండవచ్చు. ఆరోగ్యం గతం కంటే కుదుటపడుతుంది. వ్యాపారులకు ఆశించిన విధంగా లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధులు సాఫీగా కొనసాగుతాయి. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం రావచ్చు. క్రీడాకారులు, వ్యవసాయదారులు కొన్ని ప్రయోజనాలు పొందుతారు. 10,11 తేదీల్లో బంధువిరోధాలు. దూరప్రయాణాలు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
మీనం: పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అదనపు ఆదాయంతో మరింత ఉత్సాహంగా సాగుతారు. బంధువులతో వివాదాలు తీరి మరింత దగ్గరవుతారు. కొన్ని సమస్యలు స్వయంగా పరిష్కరించుకుంటారు. మీ ఆలోచనలు అందర్నీ మెప్పిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన వరంగా మారనుంది. వ్యాపారులు గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది. కళాకారులకు పురస్కారాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు,రచయితలు ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. 5,6 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు.శివపంచాక్షరి పఠనం ఉత్తమం.