ఉ‌గ్రవాదాన్ని, మావోయిస్ట్ ‌తీవ్రవాదాన్ని అణచివేసే విషయంలో హోం మంత్రి అమిత్‌షా శపథం చేశారు. దానిని నెరవేర్చి చూపించారు. ఇప్పుడు ఇదే పంథాలో మాదక ద్రవ్యాల మాఫియాను భూస్థాపితం చేస్తామని, 2029 డిసెంబర్‌ 31 ‌నాటికి దేశంలో మాదక ద్రవ్యాలు కనిపించకుండా చేస్తామని శపథం చేశారు. దేశాన్ని ఆయన మాదకద్రవ్యాల బారి నుంచి విముక్తం చేస్తారనడంలో సందేహంలేదు కానీ, ఇందుకు ఆయన భీకర పోరాటాన్నే జరపాల్సి ఉంటుంది. దేశాన్ని మాదక పదార్థాల వ్యాపారం నుంచి, డ్రగ్స్ ‌మాఫియా నుంచి విముక్తం చేయడానికి ఆయన ఇప్పటికే తీవ్రస్థాయిలో పోరాటం సాగిస్తున్నారు. అది మరింత ఊపందుకోబోతోంది. ఆయన పట్టు వదలని విక్రమార్కుడు.

భారతదేశంలోకి ఒక్క గ్రాము మత్తుపదార్థం కూడా ప్రవేశించడానికి వీల్లేదు. ఒక్క గ్రాము కూడా దేశం నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఇచ్చేది లేదు. ఇదీ ప్రస్తుతం ఆయన నినాదం, ఆయన విధానం. ఢిల్లీలో గత సెప్టెంబర్‌ 22‌వ తేదీన జరిగిన వ•డవ నేషనల్‌ ‌యాంటీ నార్కోటిక్స్ ‌టాస్క్ ‌ఫోర్స్ ‌కాన్ఫరెన్స్‌కు ఆయన అధ్యక్షత వహిస్తూ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఆయన 2026-29 సంవత్సరాలకు సంబంధించి ఒక వ్యూహాత్మక ప్రణాళికకు రూపకల్పన చేశారు.

పటిష్ఠమైన వ్యూహం

ఈ ప్రణాళికకు నాలుగు పార్శ్వాలున్నాయి. మొదటిదాని ప్రకారం, ఇంటెలిజెన్స్ ‌వర్గాలను పెంచి, దాదులు నిర్వహింస్తారు. కేవలం దాడులు, స్వాధీనాలతో సరిపెట్టుకోకుండా వాటి వ•లాల్లోకి కూడా వెళతారు. రెండవ వ్యూహం ప్రకారం, మాదకద్రవ్యాల సరఫరా ఆద్యంతాలను కనిపెడతారు. ప్రయోగశాలల పేరుతో మాదక ద్రవ్యాల వినియోగానికి అవకాశాలు కల్పిస్తున్న సంస్థల మీద నిఘా పెట్టడం, కృత్రిమ మత్తు పదార్థాల అంతు తేలుస్తారు.

ఇక వ•డవ వ్యూహం ప్రకారం, దేశంలో ఇప్పటికే పనిచేస్తున్న వ్యసన నిర్మూలన కేంద్రాల సంఖ్యను 1700 నుంచి మరింతగా పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో ఈ మత్తు పదార్థాల వినియోగాన్ని నివారించడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేస్తారు. నాలుగవ వ్యూహం ప్రకారం వివిధ విభాగాల మధ్య సమన్వయం, సహకారం ఏర్పాటు  ప్రారంభం అవుతుంది. సి.బి.ఐ, ఎన్ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌, ‌పోలీస్‌, ‌భద్రతా దళాలు, ఇంటెలిజెన్స్ ‌తదితర సంస్థలు కలిసి పని చేస్తాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఇటువంటి వ్యవస్థలను మరింత పటిష్ఠం చేయడం మొదలవుతుంది. ఇతర దేశాల నుంచి వలస వచ్చే వారి మీద నిఘా పెంచనున్నారు.

దేశంలో ఇప్పటికే వందకు పైగా అంతర్జాతీయ సంస్థలు, అంతర్రాష్ట్ర సంస్థలు మాదక ద్రవ్యాల రవాణా, సరఫరా, వినియోగాల్లో చురుకుగా, క్రియాశీలంగా పనిచేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఇతర దేశాల నుంచి బతుకుతెరువు కోసం వలస వచ్చి భారతదేశంలో డ్రగ్‌ ‌మాఫియాగా అవతరించిన మరో వందకు పైగా ముఠాలను దేశం నుంచి బహిష్కరించడం లేదా భూస్థాపితం చేయడం ప్రారంభం అవుతోంది. దేశంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగానికి అవకాశం లేకుండా చేయడానికి, విద్యార్థులు, ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్‌, ‌సహాయం చేయడానికి లక్షకు పైగా నషాముక్త్ ‌మిత్రాస్‌ ‌పేరుతో స్వచ్ఛంద సేవక దళాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

ముమ్మరంగా దాడులు

మత్తు పదార్థాల రవాణా వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, ప్రత్యేక వేగుల వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా వీటి ఆర్థిక వ•లాలను కనిపెట్టడం, వీటికి ఉన్న డిజిటల్‌ ‌లింకులను గుర్తించడం, డ్రగ్‌ ‌మాఫియాల ఆర్థిక లాభాలు ఎక్కడికి, ఏవిధంగా చేరుతున్నదీ తెలుసుకోవడం వంటివి ప్రారంభం కాబోతున్నాయి. ‘డ్రగ్స్‌రహిత భారతదేశాన్ని సృష్టించడమనే కష్టసాధ్యమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి మేం గత అయిదేళ్లుగా ఒకదాని తర్వాత ఒకటిగా చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. ఇక ఈ మాఫి యాలను తుదముట్టించడానికి దృఢ సంకల్పంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. దేశానికే కాక, ప్రపంచానికంతటికీ మాదక ద్రవ్యాల వినియోగం ఒక పెనుముప్పుగా మారింది. సమష్టి కృషి ద్వారా మేం తప్పకుండా వీటిని మట్టుబెడతాం. మేం 2029 డిసెంబర్‌ 31‌నాటికి దేశంలో దీన్ని పూర్తిగా నిర్మూలించగలమనే నమ్మకంతో ఉన్నాం’ అని అమిత్‌ ‌షా ఈ సమావేశంలో స్పష్టం చేశారు.

దేశాన్ని 2047 నాటికి వికసితభారత్‌గా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యానికి తగ్గట్టుగా యువత సంక్షేమానికి, అభివృద్ధికి ఇప్పటి నుంచి కృషి ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. మత్తు పదార్థాలను నిర్మూలించడమంటే యువత ఆరోగ్యవంతంగా చేయడమేనని కేంద్రం అభిప్రాయ పడుతోంది. మాదకద్రవ్యాల వ్యాపారాన్ని పూర్తిగా నిర్మూలించడానికి మరో వ•డేళ్ల కాలం అవసరమని అమిత్‌ ‌షా కూడా అన్నారు. భారతదేశంలోనే కాక, ప్రపంచంలోనే ఈ మాదకద్రవ్యాల వ్యాపారం లేకుండా చేయాలన్నది తమ అంతిమ లక్ష్యమని, ఉగ్రవాదం మీద సమష్టిగా పోరాటం మాదిరిగానే ఈ డ్రగ్స్ ‌మీద కూడా పోరాటం జరపాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఇక నుంచి ఈ పోరాటానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని కూడా తెలిపారు.

తిరుగులేని ప్రణాళిక

ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని, గడువును, జవాబుదారీతనాన్ని నిర్దేశించుకుంది.. ‘ఇక మనం కార్యశూరులం కావాలి. ఫలితాలను సాధించాలి. ఈ డ్రగ్స్ ‌నెట్‌వర్క్‌ను బద్దలు కొట్టాలి. డ్రగ్స్ ‌వ్యాపారాలకు కఠిన శిక్షలు విధించేలా ప్రభుత్వాలు చట్టాలుచేయాలి’ అని అమిత్‌ ‌షా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల నిరోధక కార్యాచరణ దళం (ఏ.ఎన్‌.‌టి.ఎఫ్‌)‌ను ఇక నుంచి యాంటీ నార్కోటిక్‌ ‌మిషన్‌ ‌కమాండ్‌ ‌పేరుతో వ్యవహరించాలని సూచించారు. మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడానికి పరిమితం కాకూడదని, ఈ నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకలించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన ఆదేశించారు. డ్రగ్స్ ‌ను నిర్మూలించ డానికి జిల్లాలను కేంద్రంగా చేసుకుని పని చేయాలని ఆయన అన్నారు.

వాస్తవానికి దేశంలో ఈ డ్రగ్స్ ‌వ్యాపారం గ్రామాలకు సైతం విస్తరించింది. ఈ మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్న వారి సంఖ్య రాను రానూ పెరుగుతోందే తప్ప తగ్గడంలేదు. దీనికి బానిసలవుతున్న యువతీ యువకుల సంఖ్య పెరుగుతున్న ప్రమాదాన్ని పసికట్టిన కేంద్ర ప్రభుత్వం ఇక దీనిపై ఉక్కుపాదాన్ని మోపదల చుకుంది. మాదక ద్రవ్యాల నిరోధక అధికారులు 2014 నుంచి 2016 వరకు సుమారు 1.18 కిలోగ్రాముల డ్రగ్స్‌ను దేశంలో పట్టుకున్నారు. వీటి విలువ 1.84 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. నార్కోటిక్స్ అధికారులు మొత్తం వ్యాపారంలో 10 శాతాన్ని మించి పట్టుకోలేక పోతున్నారని, ఏటా కనీసం పదివేల కోట్ల రూపాయలకు పైగా దేశంలో డ్రగ్స్ ‌వ్యాపారం జరుగుతోందని నార్కోటిక్స్ ‌విభాగం ఇటీవల వివరించింది.

అంతర్జాతీయ నిఘా

కాగా, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన నషాముక్త్ ‌మిత్రాల సభ్యులు దేశంలోని సుమారు పది లక్షల పాఠశాలలను, కాలేజీలను తరచూ సందర్శిస్తూ, విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్‌తోపాటు, మత్తుపదార్థాల వల్ల కలి•గే అనర్థాలను వివరిస్తున్నారు. ఈ పదార్థాలు ఎక్కడి నుంచి ప్రవేశిస్తున్నాయి, ఎక్కడికి, ఎవరి ద్వారా వెడుతున్నాయి, ఎంత డబ్బును వసూలు చేస్తున్నాయి, చివరికి ఎవరి దగ్గరికి చేరుతున్నాయి వంటి విషయాలను పరిశోధించడానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో విదేశీ నిందితులు పట్టుబడే పక్షంలో వారిని స్వదేశాలకు తరలించి, వారు తిరిగి దేశంలోకి ప్రవేశించకుండా బహిష్కరించడం జరుగుతుంది.

ఇక విదేశాల్లో డ్రగ్స్ ‌వ్యాపారాలు చేస్తూ అక్రమమార్గాల ద్వారా భారత దేశంలోకి వాటిని తరలిస్తున్న వారిని కూడా గుర్తించి వారిపై దేశంలో కేసులు నమోదు చేస్తారు. స్థానిక పోలీసులతో సమన్వయంగా పనిచేసి నార్కోటిక్‌ అధికారులు ఈ వ్యాపారంపై అహర్నిశలు నిఘా పెట్టడం ప్రారంభం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ మాదక ద్రవ్యాల వినియోగంపై చిన్న చిన్న కార్యక్రమాలు రూపొందించి సోషల్‌ ‌మీడియాలో ప్రదర్శించడంతో పాటు, ప్రత్యేకంగా ఒక నార్కోటిక్‌ ‌కంట్రోల్‌ ‌బ్యూరోను ఏర్పాటు చేసి, ఒక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభిం చబోతోంది. ఈ వ్యవస్థ దాదాపు ఒక జాతీయభద్రతా దళం స్థాయిలో పని చేస్తుంది.

జి.రాజశుక
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor